బుధవారం, సెప్టెంబర్ 14, 2011

COMPUTER NETWORKING

Computer Network --- కంప్యూటర్ నెట్వర్క్

నెట్‌వర్క్ లోని వివిధ పరికరాలు 
1. ల్యాన్ కేబుల్(LAN cable),2. నిక్ (NIC),3. హబ్(HUB),
4. స్విచ్(Switch),5. రూటర్(Router) ,6.బ్రిడ్జ్(Bridge)

1.ల్యాన్ కేబుల్:

    • క్యాట్ – 3 కేబుల్ ని సాధారణ డేటాని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 10 Mbps వేగముతో డేటాని పంపవచ్చును
    • క్యాట్ – 5 కేబుల్ ని సాధారణ డేటా మరియు ధ్వని సమాచారాన్ని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 100 Mbps వేగముతో డేటాని పంపవచ్చును.
    • క్యాట్ – 5E కేబుల్ ని సాధారణ డేటా మరియు ధ్వని సమాచారాన్ని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 1000 Mbps వేగముతో డేటాని పంపవచ్చును .
    • ఇది మనం కంప్యూటర్లను నెట్‌వర్క్ తో అనుసంధానించటం కోసం వాడుతాము. ఇది ట్విస్టెడ్ పైర్ క్యాట్ – 3. లేదా క్యాట్ – 5 రకం కేబుల్.
    • ఈ కేబుల్ ని కంప్యూటర్ కి RJ-45 కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేస్తాము.
    • క్యాట్ కేబుల్ లో ముఖ్యంగా మూడు రకాలను వాడుతున్నాము అవి.

2.నిక్ (NIC):


ఇది మన కంప్యూటర్ లో ఉండే నెట్వర్క్ కార్డు. (మాక్ అడ్రస్ ల అధారంగా) రెండు కంప్యూటర్ల మధ్య అనుసంధానానికి ఉపయోగపడుతుంది. మనం మామూలుగా ఇంటర్నెట్ కనెక్షన్ కి కూడా ఇదే వాడతాము.

3.హబ్:


నెట్‌వర్క్ లోని పరికరాలను (కంప్యూటర్లు , ప్రింటర్లు) ని అనుసంధానించటానికి హబ్  ని వాడుతాము. హబ్ లలో మన అవసరాన్ని బట్టి 6 ,8 ,16 ,24 పరికరాలను ఒకే సారి అనుసంధానించవచ్చు. ఈ హబ్ లు చేసే పనల్లా వచ్చిన డేటా ప్యాకెట్లు అన్నిటిని వచ్చిన దారి తప్పితే మిగతా దారులన్నిటికి నకలు చేసి పంపిచేయడమే. అయితే ఇందులో కొన్ని ఇంటెల్లిజెంట్ హబ్ లు అని ఉన్నాయి. అవి కాస్త బిన్నంగా, వచ్చిన డేటా ప్యాకెట్ల అడ్రస్లు చూసి తగిన గమ్యానికి చేరుస్తాయి.

4.బ్రిడ్జ్:

హబ్ చేయని బ్రిడ్జ్ చేసే పనల్లా, వచ్చిన డేటా ప్యాకెట్ ని పరిశీలించి పంపాలా వద్దా అని చెక్ చేయడమే. ఒక నెట్వర్క్ లో రెండూ సెగ్మెంట్లు ఉన్నాయనుకుందాం. ఆ రెండూ సెగ్మెంట్లు పెద్దగా డేటా ని పంపుకోవు కానీ, కనెక్టయి మాత్రం ఉండాలి. ఒకవేళ ఈ రెండూ సెగ్మెంట్లు హబ్ తో అనుసందానించబడితే ఏ కంప్యూటర్ ఏ కంప్యూటర్ కి డేటా పంపించిన ఆ డేటా అనవసరంగా అన్నీ కంప్యూటర్లకి పంపించబడుతుంది. అది వృదా కదా? అందుకే బ్రిడ్జ్ వాడటం. ఇదేం చేస్తుందంటే ఒక నెట్వర్క్ ని రెండూ సేగ్మేంట్ల లా విడగొట్టి, పంపిన ప్యాకెట్ లో ఉన్న అడ్రస్ అవతలి సెగ్మెంట్ లో ఉంటేనే ఆ ప్యాకెట్ అవతలి సెగ్మెంట్ కి చేరవేస్తుంది, లేదా వెళ్ళనియ్యదు. అందుకే బ్రిడ్జ్ కి రెండే పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఇన్కమింగ్, ఇంకోటి ఔట్గోయింగ్.

 

 

5.స్విచ్:

స్విచ్ ని కూడా నెట్‌వర్క్ లోని పరికరాలను అనుసంధానించటానికి వాడుతాము. స్విచ్ లలో మన అవసరాన్ని బట్టి 4 ,8 ,16 ,24 పరికరాలను ఒకే సారి అనుసంధానించవచ్చు.  స్విచ్ కూడా బ్రిడ్జ్ లానే పని చేస్తుంది కానీ ఒక చిన్న తేడా ఉంది, బ్రిడ్జ్ లో రెండే పోర్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అదే స్విచ్ లో చాలా వుంటాయ్. అంటే రెండే సెగ్మెంట్లు కాకుండా మల్టిపుల్ సెగ్మెంట్లు ఉండవచ్చన్నమాట.

6.రూటర్:

స్విచ్ కి రూటర్ కి ముఖ్య బేదం – స్విచ్ మాక్ అడ్రస్ అధారంగా పనిచేస్తుంది, రూటర్ ఐపీ అడ్రస్ల అధారంగా పనిచేస్తుంది. రూటర్ ని మనం రెండు వేరు వేరు నెట్‌వర్క్ లను అనుసంధానించటానికి వాడుతాము. రూటర్ తనకు వచ్చిన డేటాని పరిశీలించిన తర్వాతే మరొక నెట్‌వర్క్ కి పంపిస్తుంది. సాధారణంగా రూటర్ ని రెండు ల్యాన్ లని అనుసంధానించడానికి వాడుతాము . రూటర్ ని  మన ల్యాన్ ని ఇంటెర్నెట్కి అనుసంధానించటానికి కూడా వాడుతాము. ఇంట్లో మనకు ఎక్కువ కంప్యూటర్లు ఉంటే వాటన్నిటికి ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ తీస్కుంటే, వాటిని ఒక లాన్ లా భావించి ఒక రూటర్ సాయంతో వాటన్నిటికి ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా నెట్ సదుపాయం కుదర్చవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి