బుధవారం, సెప్టెంబర్ 14, 2011

NET WORKING

నెట్వర్కింగ్ అనగా ఏమిటి?

నెట్వర్క్ (Network) అంటే:   రెండు లేక అంత కన్నా ఎక్కువ పరికరాలు కంప్యూటర్లు  ఒక మాధ్యమం ద్వార అనుసందానించబడితే దానినే  నెట్వర్క్ అంటాము.
నెట్వర్కింగ్ (Networking) అంటే :నెట్వర్క్ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే ప్రక్రియ

లక్ష్యం:
ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
క్లైంట్-సర్వర్(Client-Server):
 సర్వర్(Server)  అంటే వడ్డించేది, క్లైంట్(Client) అంటే అడిగేది. సర్వర్ లోపల, దానిలో ఉన్న సర్వీసులు, డేటా వగైరా వంటి వాటిని, అడిగిన వారికి అందిచే విధానాలను కూడా పొందుపరుస్తారు. 
Ex:మీరు గూగుల్ పేజిలో శోధన పదాలను టైపు చేసి శోధించమని పంపినప్పుడు, మీరు ఒక సర్వీసుని అభ్యర్థిస్తున్నారు – శోధన సర్వీసుని. ఆ సర్వీసు ని మనకు అందించడానికి గూగుల్ సర్వర్ మీద దానికి కావాల్సిన ప్రోగ్రాం లు ఉంటాయి, మనం శోధించినప్పుడు ఆ పదాలు ఆయా ప్రోగ్రామ్లకు చేరి, ఆ ప్రోగ్రామ్లు వాటి కార్యాన్ని కాస్తా నిర్వహించి, మనకు ఒక పేజి రూపంలో సమాధానం పంపుతాయి. 
ఇక్కడ క్లైంట్ వేషం వేసింది మనం ఉపయోగించిన బ్రౌజరు/విహారిణి. కొన్ని కొన్ని వేళల్లో, ఏ అప్లికేషను ఐనా క్లైంట్ వేషం వెయ్యొచ్చు. ఉదాహరణకి, గూగుల్ టాక్ కూడా ఒక క్లైంట్ అప్లికేషనే.
. పీర్ టు పీర్(Peer to Peer):
             
            పీర్ అంటే ఒక కంప్యూటర్/పరికరం. ప్రతి కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ కి అనుసంధానం ఉంటుంది. అన్ని కంపూటర్లు ఒకే స్థాయిలో పని చేస్తాయి. క్లైంట్-సర్వర్ లా లాగ ఒకటి అడగడం, ఇంకొకటి వడ్డించడం కాకుండా, ఇందులో అన్నీ అడిగే వీలూ, అలాగే అన్నీ వడ్డించే వీలూ ఉంటాయి
Ex: మీ స్నేహితులందరి దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒకరి దగ్గరున్నవి ఇంకొకరి దగ్గర లేవు. కానీ అన్ని ఫైల్స్ అందరికి అవసరమే అనుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి కంప్యూటర్ ఒక సర్వర్ లా పని చేయాలి, అలాగే క్లైంట్ లా కూడా పనిచేయాలి. ఎందుకంటే మిగతావారి దగ్గరున్న అన్ని ఫైళ్లని ఒకరు అందుకునే వీలుండాలి, వారి దగ్గరున్న ఫైళ్లు అందరికి పంచే వీలుండాలి. ఇలాంటి ఆర్కిటెక్చర్ నే పీర్-టు-పీర్ ఆర్కిటెక్చర్ అంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి