గురువారం, అక్టోబర్ 06, 2011

కన్ను


కన్ను

మానవుని కన్ను
కన్ను (Eye) కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం. ఇవి మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం. మానవునికి ముఖంలోరెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి మనుషులలో కెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతాయి.
వివిధ జీవులలో నిర్మాణాత్మకంగా పది వేరువేరు డిజైన్లలో కళ్ళుంటాయి. వీనిలో 96% జంతు జాతులలో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది.[1] ప్రతిబింబాన్ని స్పస్టంగా చూపించే కళ్ళునిడేరియామొలస్కాకార్డేటాఅనెలిడా మరియు ఆర్థ్రోపోడా జీవులలో కనిపిస్తాయి.[2]
జీవులన్నింటిలోకెల్లా సరళమైన కళ్ళు సూక్ష్మజీవులలో ఉంటాయి. ఇవి పరిసరాలలో కాంతి ఉనికి గుర్తించి వెలుగు చీకటి ల మధ్య భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి. వీటి ఆధారంగా జీవ వలయాలు (Circadian rhythm) నిర్దేశించబడతాయి. క్లిష్టమైన జీవులలోని కళ్ళు రెటినాలోని కణాల ద్వారా సమాచారం మెదడుకు చేరUNU.

[మార్చు]మానవుని కన్ను నిర్మాణం

కళ్ళు మెదడుకు కిటికీలు

కళ్ళు మెదడు కంటే ముందే ప్రమాదాన్ని పసిగడితాయని తేలింది. అంటే, మెదడు సాయం లేకుండానే కళ్లలోని కొన్ని కణాలు ప్రమాదాన్ని పసిగడతాయని వెల్లడైంది.ఈ కణాలు మెదడు సాయం లేకుండానే ప్రమాదం గురించి హెచ్చరిస్తాయని స్విట్జర్లాండ్‌లోని బయోమెడికల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పరిణామక్రమంలో శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ తరహా వ్యవస్థ కళ్లలో అభివృద్ధి చెంది ఉండవచ్చని వారి అంచనా.http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/14national9

[మార్చు]బయోనిక్ కన్ను

'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్ను(Bionic eye) ని అమెరికాలోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చిన కెమెరా, వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారా రెటీనా మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొంది దృశ్యనాడి ద్వారా ఆ సమాచారాన్నిమెదడుకు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
Eye
Eye-diagram no circles border.svg
]
1:posterior chamber 2:ora serrata 3:ciliary muscle 4:ciliary zonules 5:canal of Schlemm6:pupil 7:anterior chamber 8:cornea 9:iris 10:lens cortex 11:lens nucleus 12:ciliary process13:conjunctiva 14:inferior oblique muscle15:inferior rectus muscle 16:medial rectus muscle 17:retinal arteries and veins 18:optic disc19:dura mater 20:central retinal artery 21:central retinal vein 22:optic nerve 23:vorticose vein24:bulbar sheath 25:macula 26:fovea 27:sclera28:choroid 29:superior rectus muscle 30:retina

కంటిజబ్బులు

కంటి జాగ్రత్తలు

కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చదివేటపుడు
  • పుస్తకము 30 సెం.మీ. దూరము లో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి . కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది.
టెలివిజన్ చూస్తున్నప్పుడు
  • ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు.
  • టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
  • చూసేటపుడు మనకు టీ.వీ. కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
  • చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు
  • కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది.
  • రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మధ్యలో విరామము ఇవ్వాలి.
  • కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు.
  • మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.
బండి నడిపేటప్పుడు
  • బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
  • రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి ,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.
కొన్ని కంటి వ్యాయామాలు
  • తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
  • తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను,అపసవ్య దిశ లోనూ,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
  • తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
  • తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.

[మార్చు]నేత్రదానం

ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి కార్నియాలు (నల్లగుడ్డ) అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్‌ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు. హెచ్‌.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్‌(కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్‌ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
  • నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
  • వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
  • ఆరు గంటల లోపు నేత్రాలను మృతిచెందిన వ్యక్తి నుంచి తీసుకోవాల్సి ఉంది.
  • సమాచారం తెలియగానే సంబంధిత ఆసుపత్రుల వైద్యుల బృందం అక్కడికి చేరుకుంటుంది.
  • అప్పటివరకు మృతుని నల్లగుడ్డు ఎండిపోకుండా చూడాలి. కళ్ళు రెండు మూసి తడిగుడ్డ పెట్టడం మంచిది. తలకింద తలగడపెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడాలి. ఫ్యాన్‌ వేయకూడదు. ఏసీ సౌకర్యం ఉంటే ఆ గదిలో ఉంచవచ్చు.
  • మృతిచెందిన వ్యక్తి నుంచి సేకరించిన కార్నియాలను అవసరమైన వ్యక్తులకు 72 గంటల లోపు ఏర్పాటు చేయాలి. పెద్ద ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నచోట నాలుగు రోజులు వరకు నిల్వ చేయవచ్చు.


చెవి


వెలుపలి చెవి

వెలుపలి చెవి
Gray907.png
బయటి మరియు మధ్య చెవి, opened from the front. Right side.
Gray904.png
చెవి డొప్ప. Lateral surface.
గ్రే'స్subject #229 1033
MeSHExternal+Ear
వెలుపలి చెవి లేదా బాహ్య చెవి (External ear) కర్ణబేరి త్వచానికి వెలుపలిగా ఉండే చెవి నిర్మాణం. బాహ్య శ్రవణ నాళం మరియు చెవి డొప్పదీనిలోకి వస్తాయి. ఇవి శబ్ద తరంగాలను బయటి నుండి సేకరించి కర్ణబేరి మీద కేంద్రికరిస్తుంది. ఈ భాగం శబ్దపు 3000 Hz తరంగదైర్ఘ్యం సామర్ధ్యాన్ని 30- to 100-రెట్లు ద్విగుణీకృతం చేస్తుంది. మనం సాధరణంగా వినగలిగే శబ్దం కూడా ఈ ప్రాంతంలొనే ఉంటుంది.

[మార్చు]చెవి డొప్ప

బయటకు కనిపించే చెవి డొప్ప శబ్ద తరంగాలను బయటి నుండి సేకరించి కేంద్రీకరిస్తుంది. దీనిమధ్యలో మృదులాస్థిని కలిగి వుండి బయట ఉపకళా కణజాలంతో కప్పబడి ఉంటుంది. చాలా క్షీరదాలలో చెవిడొప్పను కదిలించ గలిగి ఉండి శబ్ద తరంగాల వైపు దీనిని తిప్పడానికి అవకాశం కల్పిస్తుంది. మనుషులు ఈ విధంగా కదిలించలేరు.

[మార్చు]బాహ్య శ్రవణ నాళం

చెవి డొప్ప సేకరించిన శబ్ద తరంగాలు ఈ నాళం లోనికి ప్రవేశిస్తాయి. సరళమైన దీని నిర్మాణం ఈ తరంగాలను మధ్య చెవిలోనికి పంపిస్తుంది.

EAR--STRUCTURE

దస్త్రం:HumanEar.jpg

శనివారం, అక్టోబర్ 01, 2011

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లె న్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది.
అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్‌ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్‌ కె.ఎస్‌. పార్ధసారధి వెల్లడించారు.
సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్‌ ప్రభా వాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగా లువిపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు. శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్‌ ఆఫ్‌ రేడి యోలాజికల్‌ ప్రొటెక్షన్‌ (ఐసిఆర్‌పి) గాగుల్స్‌ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.
రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.

కంటిని కాపాడుకోండి…


కంటిని కాపాడుకోండి…

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లెన్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది.

అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్‌ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్‌ కె.ఎస్‌. పార్ధసారధి వెల్లడించారు.
సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్‌ ప్రభా వాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగా లువిపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు.

శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్‌ ఆఫ్‌ రేడి యోలాజికల్‌ ప్రొటెక్షన్‌ (ఐసిఆర్‌పి) గాగుల్స్‌ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.
రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.

మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు


మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో వివరించిన అర్ధావభేదం (తల సగభాగంలో నొప్పి), అనంతవాతం (తరచూ తలనొప్పి తిరగబెడుతుండటం) అనే వ్యాధుల వర్ణన మైగ్రెయిన్ వ్యాధి లక్షణాలతో సరిపోతుంది.
కారణాలు
మైగ్రెయిన్ తలనొప్పికి స్పష్టమైన కారణాలు తెలియవు. అయితే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు మొదలైనవాటిని కొన్నిటిని వైద్య శాస్తవ్రేత్తలు కారణాలుగా భావిస్తున్నారు. ఆయుర్వేదంలో ‘అసాత్మేంద్రియార్థ సంయోగం’ అనేదాన్ని ఒక ప్రధాన హేతువుగా చెప్పారు. చూపు, రుచి, వాసన, స్పర్శ వంటి జ్ఞానేంద్రియ విధులు అసహజమైన రీతిలో జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది. వీటిని గమనించి తగినచర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ తగ్గించుకోవచ్చు’.
మైగ్రెయిన్ బయటపడడానికి ముందు తలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ముందుగా శరీరాంతర్గతమైన లేదా వాతావరణపరమైన అంశం ప్రేరకంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ దీనికి ప్రతిస్పందించి విద్యుదావేశాన్ని మెదడంతా పరుచుకునేలా చేస్తుంది. విద్యుత్ చర్యవల్ల మెదడులోని కణజాలాలు కొన్నిరకాల జీవరసాయనాలను విడుదల చేస్తాయి. వీటివల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి పటిష్టతను కోల్పోతాయి. వీటి గోడల నుండి ప్రేరకపదార్థాలు తప్పించుకొని మెదడు అడుగుకు చేరుకొని అక్కడ ఉండే నొప్పిగ్రాహక కేంద్రాలను చేరుకొని తలనొప్పికి కారణమవుతాయి. ఇది మైగ్రెయిన్ ప్రాప్తించే విధానాన్ని తెలిపే ఒక ప్రతిపాదిత సిద్ధాంతం (హైపోథిసిస్).
లక్షణాలు
మైగ్రెయిన్ తలనొప్పి సాధారణంగా మూడు దశలుగా వస్తుంటుంది. మొదటిది హెచ్చరిక దశ. రెండవది ఆరా లేక పూర్వరూపదశ. మూడవది పూర్తిస్థాయి రూపదశ.
మొదటిదశ మైగ్రెయిన్‌కు ముందు హెచ్చరికపూర్వకమైన లక్షణాలతో మొదలవుతుంది. మానసిక స్థితిలోను, మూడ్‌లోను మార్పు రావటం, నీరసం, కడుపుబ్బరింపు, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ఆవలింతలు, ఆహారపదార్థాలపట్ల మితిమీరిన వ్యామోహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పికి కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
రెండవ దశ ఆరా. ఇది మైగ్రెయిన్‌కు ముందు పూర్వరూపాలతో కనిపించే స్థితి. దీని లక్షణాలు పావుగంట నుంచి అరగంట వరకూ కొనసాగుతాయి. కళ్ళముందు మెరుపులు మెరిసినట్లు ఉండటం, తాత్కాలికంగాను, పాక్షికంగాను చూపు కోల్పోవటం, మాట్లాడలేకపోవటం, కాళ్ళూ చేతుల్లో బలహీనత ప్రాప్తించటం, ముఖంలోనూ, చేతుల్లోనూ తిమ్మిర్లుగానూ అవిశ్రాంతంగానూ, ఆరాటంగాను అనిపించటం, అయోమయం ఆవహించటం ఇవన్నీ మైగ్రెయిన్‌కు ముందు కనిపించే లక్షణాలు.
అలా కనిపించడం మొదలైన తరువాత, దాదాపు గంట వ్యవధిలో అసలైన మైగ్రెయిన్ లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. మైగ్రెయిన్‌లో సాధారణంగా తలలో ఒక పక్కనే నొప్పి వస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అర్ధావభేదం అంటారు. కొన్ని సందర్భాల్లో రెండు పక్కలా రావచ్చు. తలనొప్పి తీవ్రాతి తీవ్రంగా వస్తుంది. నొప్పి లక్షణం పొడుస్తున్నట్లూ (థ్రాబింగ్) ఉబుకుతున్నట్లూ (పల్లేటింగ్) ఉంటుంది. కదలికతో తలనొప్పి ఎక్కువవుతుంది. అనుబంధ లక్షణాలుగా వాంతులు, వికారం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీళ్ల విరేచనాలు కూడా కావచ్చు. కాంతినీ శబ్దాలనూ సహించలేకపోవటం మైగ్రెయిన్ ప్రధాన లక్షణం. కండరాల నొప్పులు, సలుపులు ఉంటాయి. తల తిరుగుతున్నట్లూ కళ్లు తిరిగి పడిపోతున్నట్లూ అనిపిస్తుంది.
ఉపశయ, అనుపశయాలు
కొన్నిరకాల ఆహార పదార్థాలు. మైగ్రెయిన్ ఎక్కువ చేస్తాయి. వీటిని ఎవరికి వారు గుర్తించుకుని వాటికి దూరంగా ఉండాలి. మెడిటేషన్, మొక్కలను పెంచటం, వ్యాయామం, నడక, మసాజ్, ఆటలు, సంగీతం, పెంపుడు జంతువులతో గడపటం, లలితకళలు – ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహకరిస్తాయి. కొంతమంది నిద్రలో పళ్ళు నూరటం, దవడకండరాలను బిగించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటంవల్ల కండరాలు బిగుసుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది. రిలాక్సేషన్ ప్రక్రియల ద్వారా ఈ అలవాటు నుంచి క్రమంగా బయటపడాలి. గాఢమైన వాసనలను పీల్చకూడదు. ముఖ్యంగా పర్‌ఫ్యూమ్స్, సెంట్లు, అత్తర్లు వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాల నుంచీ దూరంగా ఉండాలి.
సాధారణంగా మైగ్రెయిన్ వచ్చి తగ్గిన తరువాత రక్తంలో చక్కెర మోతాదు తగ్గిపోయి నీరసం వస్తుంటుంది.
ఆయుర్వేద చికిత్స, సూచనలు
తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో ఐస్ నీళ్ళతో తడిపిన చల్లని గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటను ప్రయోగించాలి. దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. తలనొప్పి మొదలైన వెంటనే ఒక చీకటి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మహాచందనాది తైలం వంటివాటితో తలను, కణతలను, అరికాళ్ళను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నిద్రపోవటానికి ప్రయత్నించాలి.
మైగ్రెయిన్‌లో నస్యకర్మవల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది. లక్షణ తీవ్రత, ప్రాబల్యాలను బట్టి సరైన ఔషధ సిద్ధతైలాన్ని నిర్ణయించి ముక్కుద్వారా ప్రయోగించటం నస్యకర్మలోని ప్రధాన ప్రక్రియ. దీనివల్ల తలలోని దోషాలు సమస్థితిలోకి వచ్చి నొప్పి తగ్గుతుంది.
ధార చికిత్స కూడా తలనొప్పి తగ్గుతుంది. మానసిక వత్తిడి ఎదురైనప్పుడు చాలా మందికి నుదురు ప్రాంతంలో చెమట పడుతుంది. కొంతమంది టెన్షన్ తగ్గించుకోవడానికి గాని, ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి గాని నుదురు రుద్దుకుంటారు. దీనినిబట్టి నుదురు అనేది టెన్షన్‌ని బయట పడేసేందుకు తోడ్పడే ముఖ్యమైన ప్రదేశమని మనకు అర్థమవుతుంది. ఆయుర్వేద ‘ధరా చికిత్స’తో ఈ ప్రదేశాన్ని శక్తివంతం చేయవచ్చు. ఔషధ సిద్ధ తైలాన్ని నుదురుమీద ధారగా పడేలా చేయటం దీనిలో ప్రధాన ప్రక్రియ. ఈ చికిత్స మైగ్రెయిన్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా వచ్చే సైకోసొమాటిక్ వ్యాధుల్లో అత్యంత ఉపయోగకారి.
మైగ్రెయిన్‌లో సువర్ణ సూర్తావర్తి, సూతశేకరరసం, దశమూలారిష్టం, గోదంతి భస్మం, ప్రవాళపిష్టి, గుడూచి సత్వం వంటి ఔషధాలు అనేకం నమ్మకంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాను అనుసరించి వాడుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
గృహచికిత్సలు:
తిప్పతీగ స్వరసాన్ని రెండు చెంచాలు మోతాదుగా, తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. అలాగే, ఆవు నెయ్యిలో కుంకుమ పువ్వును వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చాలి. నుదురుకు, కణతలకు చందన లేపాన్ని (మంచి గంధం పేస్టును) రాసుకోవాలి.

చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు, నోటి దుర్వాసన, నోటి సంబంధ వ్యాదులు



నవ్వు ఒక వరం. హాయిగా నవ్వేవారికి ఎలాంటి రుగ్మతలు రావు అని ఒక నమ్మకం. కానీ కొందరు వివిధ కారణాలతో హాయిగా నవ్వలేకపోతారు. ఇలా పదిమందితో నవ్వుతూ మనస్ఫూర్తిగా నోరు విప్పలేకపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానమైనది నోటి దుర్వాసన. కొందరికి తమ నోటి నుంచి దుర్వాసన వెలువడుతున్న విషయమే తెలియదు. మరికొందరికి దుర్వాసన వస్తున్నట్లు తెలిసినా ఏం చేస్తే అది పోతుందో తెలియదు. ఈ రెండు అంశాలతో పాటు, నోటి దుర్వాసనను నివారించుకోనే మార్గాలపై అవగాహన కోసం ఈ కథనం. చదివితే… తాజా శ్వాసతో అందరూ దగ్గరవుతారు.

నోటి దుర్వాసనను వైద్యపరిభాషలో హాలిటోసిస్ అంటారు. హాలిటస్ అనే లాటిన్ పదానికి అర్థం శ్వాస. దీనితో పాటు రుగ్మతను సూచించే పదం… ఒసిన్‌ను జత చేసినప్పుడు అది హాలిటోసిస్ అవుతుంది. దంత సమస్యలకు సంబంధించినంతవరకు దంతక్షయం, చిగుళ్ల వ్యాధుల తర్వాత నోటి దుర్వాసనే అతి పెద్దదైన, ప్రధానమైన సమస్య.
పగటి వేళల్లో ఆహారం తీసుకోడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి… ఇలా అనేక కారణాలతో మనం నోటిని అనేకసార్లు తెరుస్తూ ఉంటాం. దాంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. కాబట్టి రాత్రివేళ తగింత ఆక్సిజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి వెలువడే దుర్వాసన మరింత ఎక్కువగా, ఇబ్బందికరంగా ఉంటుంది. దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని, నోటిని నీటితో బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఆ దుర్వాసన దీర్ఘకాలికమైన సమస్యగా పరిణమిస్తుంటుంది.
కారణాలు:
నోటి దుర్వాసనకు కారణాలలో దాదాపు 90 శాతం నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటివి తినడం, మద్యం, పొగతాగడం, స్థూలకాయం కూడా నోటి దుర్వాసనకు సంబంధించిన కారణాల్లో ఒకటి. ఇవేగాక నోరు మొదలుకొని, ఆహార నాళం వరకు అనేక సమస్యలు నోటిదుర్వాసనకు కారణమవుతుంటాయి.
నోరు:
మన నోటిలో సుమారు ఆరు వందల రకాలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. వీటి ప్రోటీన్స్ – అమైనోయాసిడ్స్‌గా విఛిన్నమయ్యే సమయంలో దుర్వాసన వెలువడుతుంది.
నోటిలోని ఇతర భాగాలు కూడా దుర్వాసన వెలువడటానికి కారణమవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, దంతాలు విరిగిపోయి ఉండటం, దంతాల మధ్య సందులు, కట్టుడుపళ్లు మొదలైనవి కూడా దుర్వాసనకు కారణం.
నాలుక:
నోటి దుర్వాసనకు కారణాలలో అతి ముఖ్యమైనది నాలుకను శుభ్రం చేసుకోకపోవడం. నాలుకపై ఉండే బ్యాక్టీరియా దుర్వాసనను, కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. నోటి దుర్వాసన కేసుల్లో అత్యధికం ఈ కోవకు చెందినవే. నాలుక కింది భాగంలో చాలా బ్యాక్టీరియా నివాసం ఉంటాయి. నాలుకలోని ఈ భాగం కొంత పొడిగా ఉండటం, నాలుక పైభాగాన్ని శుభ్రం చేసుకున్నంతగా ఈ భాగాన్ని శుభ్రం చేసుకోకపోవడంతో ఇక్కడ ఆవాసం ఉన్న బ్యాక్టీరియా అక్కడ స్థిరంగా ఉండిపోతాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఈ బ్యాక్టీరియాకు పోషకాలుగా ఉపకరిస్తాయి. దాంతో ఇవి మరింతగా అభివృద్ధి చెందిన నోటి దుర్వాసనకు దోహదం చేస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన మరింత తీవ్రం అవుతుంది. నాలుకను శుభ్రం చేసుకుంటే దుర్వాసనను చాలామట్టుకు నివారించవచ్చు. దీనికోసం నాలుకను నాలుకబద్దతో శుభ్రం చేసుకోవడం, మౌత్‌వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.
చిగుళ్ల వ్యాధులు:
చిగుళ్ల వ్యాధులు తీవ్రమైన నోటి దుర్వాసనకు కారణమవుతాయి. చిగుళ్లు వ్యాధిగ్రస్తం కావడం, నోటిలో పుండ్లు రావడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
దంతాలు:
దంతాలు విరిగిపోయి ఉన్నా, పళ్ల మధ్య ఖాళీలు ఉన్నా మనం తీసుకునే ఆహారం అక్కడ చిక్కుకుపోతుంది. దాన్ని సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అది కుళ్లడం మొదలయి, బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు సోకడమే కాకుండా, దంతమూలం వరకూ దంతాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో దంతక్షయం, ఏది నమలాలన్నా నొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. వాటితోపాటు నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది.
కృత్రిమ దంతాలు:కృత్రిమ దంతాలు అమర్చుకున్నవారిలో నోటి దుర్వాసన తరచూ కనిపించే సమస్య. ముఖ్యంగా తీసిపెట్టుకునే కట్టుడు పళ్లు అమర్చుకున్నవారిలో ఈ సమస్య ఎక్కువ. కట్టుడు పళ్లను రాత్రివేళల్లో తీసి వైద్యలు సూచించిన విధంగా భద్రపరచుకోవడం, వాటిని ఉపయోగించే ముందు, తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండటం అవసరం.
ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు:
శరీరంలోని ఇతర అవయవాలకు సోకే ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఉదాహరణకు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. అలాగే టాన్సిల్స్ సమస్య వచ్చినప్పుడు, జీర్ణకోశంలో ఎసిడిటీ పెరిగి అక్కడి వాయువులు ఆహారనాళం నుంచి పైకి ఎగదన్నుతున్నప్పుడు (గాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ – జీఈఆర్‌డీ) నోటి నుంచి దుర్వాసన వెలువడే అవకాశాలు ఎక్కువ. అలాగే దీర్ఘకాలికంగా కాలేయం దెబ్బతిన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన రావచ్చు. ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం (షుగర్) వంటి రుగ్మతలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన కనిపించే అవకాశాలు ఉన్నాయి.
నోటి దుర్వాసన సమస్య ఉన్న వ్యక్తికి అది తెలియకపోవచ్చు. కానీ సంభాషించేవారు దూరంగా జరుగుతుంటే దాన్ని గుర్తించి తగిన నివారణ, చికిత్స చేయించుకోవాలి.
నివారణ:
పతిరోజూ ఉదయం, రాత్రి… రెండుమార్లు పళ్లు తోముకోండి.
బషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి.
చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి.
కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, మధుమేహం లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.
చికిత్స:

నోటి దుర్వాసనకు సరైన కారణాన్ని కనుగొని దానికి చికిత్స తీసుకోవాలి. ఉదాహరణకు దంతాలు విరిగిపోయి, ఆ సందుల మధ్య ఆహారపు ముక్కలు చేరి, అవి దుర్వాసనకు కారణమైతే డెంటిస్ట్‌ను సంప్రదించి ఫిల్లింగ్ చేయించుకోవాలి. దంతాలపై పాచి పేరుకుని గారలా మారితే బ్రషింగ్‌తో సులభంగా పోదు. దానికి దంతవైద్యులను సంప్రదించి స్కేలింగ్ వంటి చికిత్స పొందాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఉన్నప్పుడు తగిన మందులు వాడాలి. చిగుళ్ల వ్యాధులు ఉన్నప్పుడు ఇప్పుడు లేజర్ వంటి అత్యాధునిక ప్రక్రియల ద్వారా వాటికి చికిత్స చేయడానికి వీలు ఉంది. ఒకవేళ దంతమూలాలకు ఇన్ఫెక్షన్ సోకితే రూట్‌కెనాల్ వంటి చికిత్సలు, లేజర్ చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయి.