శనివారం, ఆగస్టు 04, 2012

computer viruses







కంప్యూటర్లను ఉపయోగించి, అనేక పనులను సక్రమంగా నిర్వహించాలంటే, వాటికి ఎటువంటి అంతరాయం కలుగకూడదు. కాని కంప్యూటర్‌ వైరస్‌లు, కంప్యూటర్లను సక్రమంగా పనిచేయకుండా నిలిపివేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్లు ఏదో ఒక విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. 1970 నుంచే ఈ వైరస్‌ల బెడద మొదలైంది. సిఐహెచ్‌, మెలిసా, ఐలవ్‌యూ... వంటి అనేక వైరస్‌లు ఇటీవల కాలంలో కోట్ల రూపాయల నష్టాన్ని కల్గించాయి. ముఖ్యంగా ఇవి హార్డ్‌వేర్‌ కాంపొనెంట్స్‌ను పాడు చేయడంతోపాటు కీలకమైన డేటాను కూడా పాడు చేస్తున్నాయి. దీంతో నేడు ప్రపంచవ్యాప్తంగా నెట్‌ ద్వారా లేదా ఇతర సాధనాల ద్వారా వైరస్‌లు ఎక్కువగా వ్యాపించి అధిక నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. పిసి యూజర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా వైరస్‌ల గురించి తెలుసుకుని అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం.


                                 ఒక పద్ధతి ప్రకారం రాసిన నియమాల సమూహాన్ని ప్రోగ్రాం అంటారు. కొన్ని ప్రోగ్రామ్‌లు మాత్రం కంప్యూటర్లను, పనిచేయకుండా నిలిపేస్తాయి. అదే విధంగా డేటా, ప్రోగ్రాంలను కూడా నాశనం చేస్తాయి. ఇటువంటి ప్రోగ్రాంలనే కంప్యూటర్‌ వైరస్‌లని పిలుస్తారు. ఈ ప్రోగ్రాంలు కంప్యూటర్‌లోకి ప్రవేశించిన తర్వాత వాటంతట అవే వేగంగా వ్యాప్తి చెందుతాయి. తద్వారా కంప్యూటర్‌లోని మొత్తం సమాచారం, అనేక ప్రోగ్రాంలు (లేక) సాఫ్ట్‌వేర్లు తుడిచి పెట్టుకుపోతాయి. అయితే ఇటీవల వస్తున్న వైరస్‌లు చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి. వీటి లక్ష్యం ఒక డేటా, ప్రోగ్రాంలే కాకుండా, హార్డ్‌డిస్కులు కూడా సాధారణంగా వైరస్‌ ఎక్సిక్యూటబల్‌ ప్రోగ్రాంకు ఎటాచ్‌ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే యూజర్‌ మెమరీ నుంచి ఎగ్జిక్యూటబుల్‌ ప్రోగ్రాంను ఎక్సిక్యూట్‌ చేస్తాడో, వెంటనే ఆ ప్రోగ్రాంతో పాటు వైరస్‌ కూడా యాక్టివేట్‌ అవుతుంది. ఆ తర్వాత వైరస్‌ను గుర్తించే లోపునే, కంప్యూటర్‌ మొత్తం దానికై అదే కాపీ అయి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

వైరస్‌ ... ఎలా? ఎందుకు?

                                 ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వైరస్‌లను తయారు చేస్తున్నారు. అయితే ఈ వైరస్‌లు ఎలా వ్యాప్తి చెందుతాయో, తెలుసుకుందాం. వైరస్‌ సోకిన ప్రోగ్రాం, డేటా మెమరీలోకి లోడ్‌ అయి ఉంటే, అది అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రాంలు, డేటా మెమరీ నుంచి రిమూవబుల్‌ డిస్క్‌ అంటే ఫ్లాపీ డిస్క్‌, సి.డిలు... మొదలగు వాటిలోకి కాపీ చేస్తుంటారు. ఇటువంటి డిస్క్‌లను వేరొక కంప్యూటర్లలో ఉపయోగించడం ద్వారా వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. వైరస్‌ల వ్యాప్తికి నెట్‌వర్క్‌లు అంటే ల్యాన్‌ (లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌), వ్యాన్‌ (వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌), బి.బి.యస్‌ (బులెటిన్‌ బోర్డ్‌ సిస్టం)... వంటివి ముఖ్య సాధనాలుగా మారాయి. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ ద్వారా కూడా వేగంగా వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. ఎప్పుడైతే ఒక కంప్యూటర్‌లోని వైరస్‌ సోకిన ప్రోగ్రాంలు లేక డేటా నెట్‌వర్క్‌ సిస్టంలోకి ప్రవేశిస్తాయో, వెంటనే ఒక కంప్యూటర్‌ నుంచి వేరొక కంప్యూటర్‌కు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు కంప్యూటర్‌ యూజర్‌ ఇంటర్‌నెట్‌ నుంచి వైరస్‌ సోకిన ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే, వైరస్‌ అతని కంప్యూటర్‌లోకి కూడా ప్రవేశిస్తుంది. అదే విధంగా మోడెమ్‌ను ఉపయోగించి ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్‌, రిసీవ్‌ చేసుకోవడం ద్వారా కూడా వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. ఒక విధంగా చెప్పాలంటే, వైరస్‌లను నిరోధించడానికి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎప్పుడైనా ప్రవేశించేందుకు అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదట్లో చట్ట వ్యతిరేకంగా వాడే సాఫ్ట్‌వేర్‌లను నిరోధించేందుకు ఈ వైరస్‌లను తయారు చేసేవారని పలువురు నిపుణులు అభిప్రాయపడేవారు. మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, నేటి వైరస్‌ సృష్టికర్తల ముఖ్య ఉద్దేశ్యం, తాము సృష్టించిన వైరస్‌ల వలన కలిగే నష్టాలను చూసి ఆనందాన్ని పొందడమే!

బూట్‌ వైరస్‌
వైరస్‌లు వ్యాప్తిచెందే విధాన్ని బట్టి, వివిధ రకాలుగా విభజించారు. వైరస్‌లలోని పలు రకాలలో బూట్‌ వైరస్‌ ఒకటి. ఈ రకం వైరస్‌లు ఫ్లాపీడిస్క్‌ బూట్‌ రికార్డు లేక హార్డ్‌వేర్‌ డిస్క్‌లోని మాస్టర్‌ బూట్‌ రికార్డ్‌కు సోకుతాయి. ఇందులోకి ప్రవేశించిన తర్వాత బూట్‌ రికార్డ్‌ ప్రోగ్రాంను, వైరస్‌ అక్కడి నుంచి తొలగించడం కానీ, ఒవర్‌ రైట్‌ చేయడం కానీ చేస్తుంది. బూట్‌ వైరస్‌లు బూటింగ్‌ సమయంలో కంప్యూటర్‌ మెమరీలోకి లోడ్‌ అవుతాయి. ఫార్మ్‌, డిస్క్‌ కిల్లర్‌, స్టోన్‌ వైరస్‌... మొదలైనవాటిని ఈ రకం వైరస్‌కు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ప్రోగ్రాం వైరస్‌లు
ప్రోగ్రాం వైరస్‌లు ప్రోగ్రాంలో ప్రవేశించి వ్యాప్తి చెందుతాయి. ఈ రకం వైరస్‌లు .bఱఅ,.షశీఎ,.వఞవ,.శీఙశ్రీ,.సతీఙ,.రyర మొదలగు ఎక్స్‌టెన్షన్స్‌ను కలిగిన ప్రోగ్రాం ఫైల్స్‌కు సోకుతాయి. మెమరీలో నిల్వ చేసిన ఈ ప్రోగ్రామ్స్‌ ఎక్సిక్యూట్‌ అయినప్పుడు, వీటితోపాటు వుండే వైరస్‌లు కూడా యాక్టివేట్‌ అయి హార్డ్‌వేర్‌ డిస్క్‌లోని ఫైల్స్‌కు వ్యాప్తిచెంది వాటిని నాశనం చేస్తాయి. సండే, కాస్‌కేడ్‌ మొదలైన వాటిని ఈ రకం వైరస్‌లుగా చెప్పవచ్చు.
మల్టీ పార్‌టైట్‌ వైరస్‌లు
బూట్‌ వైరస్‌ మరియు ప్రోగ్రాం వైరస్‌లు కలవగా ఏర్పడిన కొత్త వైరస్‌ ఈ మల్టీ పార్‌టైట్‌ వైరస్‌. ఈ రకం వైరస్‌ ముందుగా ప్రోగ్రాం ఫైల్స్‌కు సోకుతుంది. వైరస్‌ సోకిన ప్రోగ్రామ్‌ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్‌ అవుతుందో, అప్పుడు ఈ వైరస్‌లు బూట్‌ రికార్డుకు కూడా వ్యాప్తి చెందుతాయి. ఆ తర్వాత కంప్యూటర్‌ను బూట్‌ చేసినప్పుడు బూట్‌ రికార్డ్‌లోని వైరస్‌ మెమరీలోకి లోడ్‌ అయి డిస్క్‌లోని ప్రోగ్రాం ఫైల్స్‌కు వ్యాప్తి చెందుతుంది. ఇనవేడర్‌, ఫ్లిప్‌, టిక్విల్లా, మొదలైన వాటిని మల్టీ పార్‌టైట్‌ వైరస్‌లకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
స్టీల్త్‌ వైరస్‌లు
ఇటువంటి వైరస్‌లను స్కాన్‌ చేసి కనిపెట్టడం కష్టమే! ఈ రకం వైరస్‌లు స్కానింగ్‌ సమయంలో కనపడకుండా, కొన్ని రకాల టెక్నిక్స్‌ను ఉపయోగించి తప్పించుకుంటాయి. వైరస్‌ల కోసం డిస్క్‌ హెడ్‌ రీడ్‌ చేసే సమయంలో దానిని రీడైరెక్టు చేస్తాయి. అంటే డిస్క్‌ హెడ్‌ ఈ వైరస్‌లున్న సెక్టార్‌ను స్కాన్‌ చేయకుండా వేరే సెక్టర్‌ను స్కాన్‌ చేస్తుంది. ఇంకా ఇవి డైరెక్టరీ లిస్టింగ్‌లో ఉండే ఫైల్‌ సైజ్‌ను మార్చివేస్తాయి. దీని కారణంగా వీటిని స్కాన్‌ చేసి కనుగొనడం కష్టమే! ప్రోడోజోషి, వేలే మొదలైనవన్నీ ఈ రకం వైరస్‌లే.
పాలీమార్ఫిక్‌ వైరస్‌లు
ఈరకం వైరస్‌లు వాటి కోడ్స్‌ను వివిధ రకాల పద్ధతులలో మార్చుకొని ఉంటాయి. కంప్యూటర్లకు సోకినప్పుడు, వివిధ సమయాలలో వివిధ రూపాలను కలిగి ఉంటాయి. అందువలన ఇటువంటి వైరస్‌లను కనుగొని తొలగించడం కష్టమే ఇన్‌వాలంటరీ, స్టిమ్‌లేట్‌, కాస్‌కేడ్‌, ఈవిల్‌ వైరస్‌ 101... మొదలైనవి ఈ రకం వైరస్‌లే.
మాక్రో వైరస్‌లు
డాక్యుమెంట్‌ లేక టెంప్‌లెట్స్‌లోని మాక్రోస్‌కు ఈ వైరస్‌ సోకుతుంది. స్ప్రెడ్‌షీట్‌ లేదా వర్డ్‌ ప్రాసెసర్‌ డాక్యుమెంట్‌ను తెరిచినప్పుడు ఈ వైరస్‌ యాక్టివేట్‌ అయి నార్మల్‌ డాట్‌ అనే ఫైల్‌లోకి చేరుతుంది. ఓపెన్‌ చేసే ప్రతి డాక్యుమెంట్‌ డాక్యుమెంట్‌ సెట్టింగ్స్‌ కోసం నార్మల్‌ డాట్‌ ఫైల్‌ను కలుస్తుంది. దీంతో డాక్యుమెంట్‌కు ఈ వైరస్‌ సుళువుగా చేరుతుంది. డిఎమ్‌వి న్యూక్లియర్‌, వర్డ్‌ కాన్సెప్ట్స్‌... మొదలైనవన్నీ మాక్రో వైరస్‌లే.


వైరస్‌ లక్షణాలు
కంప్యూటర్‌ను ఉపయోగించే ముందు లేక ఉపయోగించేటప్పుడు ఈ కింది సమస్యలు ఎదురైతే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రోగ్రాంలు లోడ్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మెమరీ సంబంధిత ఆపరేషన్స్‌ నెమ్మదిగా రన్‌ అవుతాయి. డిస్క్‌ స్పేస్‌, ఫైల్‌ సైజ్‌ పెరుగుతుంది. అదే విధంగా ఫైళ్లు తయారు చేసిన తేదీలు తారుమారవుతాయి. ఫ్లాపీ డిస్క్‌, హార్డ్‌డిస్క్‌లు సరిగా పనిచేయవు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, డిస్క్‌లోని పార్టీషన్‌ టేబుల్‌ కనుగొనడంలో విఫలమౌతుంది. దీంతో కంప్యూటర్‌ బూట్‌కాదు. రైట్‌ ప్రొటెక్టు ఎర్రర్స్‌ సందర్భం లేకుండా వేస్తాయి. హార్డ్‌ డిస్క్‌లోని ఫైల్స్‌ తుడిచిపెట్టుకుపోతాయి. ఫైళ్లను వెతికి పట్టుకోవడం కష్టం.

డైరెక్టరీ లిస్టింగ్‌లో ఫైల్స్‌ నేమ్స్‌ కొత్త క్యారెక్టర్స్‌ కలిగి ఉంటాయి. కొత్త కొత్త, మెసేజ్‌లు స్క్రీన్‌పైన డాక్యుమెంట్స్‌లోనూ డిస్‌ప్లే అవుతాయి. అదే విధంగా కొత్త గ్రాఫిక్స్‌ కూడా డిస్‌ప్లే అవుతాయి. ప్రోగ్రామ్స్‌ కోడ్‌ కరప్ట్‌ అవుతుంది. దీంతో ప్రోగ్రాంలు పనిచేయకుండా నిలిచిపోతాయి. కంప్యూటర్‌ కూడా పనిచేయదు. డాక్యుమెంట్‌ లేక డేటా ఫైల్స్‌లోని టెక్ట్స్‌పై, కొన్ని రకాల క్యారెక్టర్స్‌ ఓవర్‌ రైట్‌ అవుతాయి. ఫైల్స్‌ను కాపీ చేయకుండానే కాపీ అయినట్టు సమాచారం వస్తుంది.
మీ సిస్టమ్‌లో వైరస్‌ ఉందా?
సిస్టంలో వైరస్‌ ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడే పది(10) మార్గాలు కింది విధంగా ఉన్నాయి.
-ప్రోగ్రామ్స్‌ లోడ్‌ కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే మెమరీ సంబంధిత ఆపరేషన్లు నెమ్మదిగా పని చేస్తాయి.
-డిస్క్‌ స్పేస్‌ను ఉపయోగించిన దానికంటే ఎక్కువగా కన్పిస్తుంది. ఫైల్‌ సైజ్‌లు కూడా పెరిగినట్టు కన్పిస్తాయి.
-డైరెక్టరీలోని ఫైల్‌ నేమ్స్‌ డేట్స్‌, మారటం, ఫైల్స్‌ కరప్ట్‌ కావటం జరుగుతుంది.
-ఫ్లాపీ డిస్క్‌, హార్డ్‌ డిస్క్‌ సైజ్‌ మారటం, ఫైల్స్‌ కరప్ట్‌ కావటం జరుగుతుంది.
-విండోస్‌ కంట్రోల్‌ ప్యానెల్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ పనిచేయకుండా నిలిచిపోతాయి. సాధారణంగా వైరస్‌ సోకిన సందర్భాలలో ఈ ఫైల్స్‌ ఓపెన్‌ చేసినప్పటికీ ఓపెన్‌ కావు.
-ఫైల్‌నేమ్స్‌ లిస్ట్‌ చేయబడిన డైరెక్టరీలో కొత్త క్యారెక్టర్స్‌ కన్పిస్తాయి. డిస్క్‌లోని డేటా ఏరియాలో వైరస్‌ నిల్వ అయే ఫైల్‌ మాదిరిగా కన్పిస్తుంది. దీంతో వైరస్‌ లేదనే భావన రావటం సహజం.
-కొత్త కొత్త మెసేజ్‌లు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
-మెసేజ్‌లే కాకుండా ఎప్పుడూ చూడని గ్రాఫిక్స్‌ కూడా డిస్‌ప్లే అవుతాయి.
-కొన్ని రకాల ప్రోగ్రామ్స్‌ కోడ్‌ను కరప్ట్‌ చేయడం వలన ప్రోగ్రామ్స్‌ పనిచేయవు.
-జంక్‌ క్యారెక్టర్స్‌ డాక్యుమెంట్‌ లేదా డేటా ఫైళ్లలోని టెక్ట్స్‌పై ఓవర్‌రైట్‌ అయి ఉంటాయి. తద్వారా డేటాను రీడ్‌ చేసే అవకాశం ఉండదు. ఈ విధంగా పైకారణాలను బట్టి వైరస్‌ సిస్టంలో ఉందని గ్రహించగలం.
వైరస్‌ నివారణ కోసం...
ఇతర కంప్యూటర్లపై ఫ్లాపీడిస్క్‌లను ఉపయోగించేటపుడు వైరస్‌ చెక్‌ చేసుకోవాలి.
బూటింగ్‌ సమయంలో ఫ్లాపీడిస్క్‌లను డ్రైవ్స్‌లో ఉంచకుడా తీసివేయాలి. ఒకవేళ ఫ్లాపీతోనే బూటింగ్‌ చేయాల్సి ఉంటే, స్టార్టప్‌ లేదా రెస్క్యూ డిస్క్‌లను ఉపయోగించాలి.
పైరేటేడ్‌ సాఫ్ట్‌వేర్‌ సిడిల నుంచి వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సాధారణంగా సిడిలలో డేటాను రైట్‌ చేసే సమయంలో వైరస్‌ చెక్‌ చేసి రైట్‌ చేస్తారు. ఒక్కసారి సిడి రామ్‌లలో డేటాను రైట్‌ చేసిన తర్వాత పలుమార్లు రీడ్‌ చేస్తారు. సిడి రామ్‌లలోకి ఒకసారి రైట్‌ చేసిన తర్వాత మళ్ళీ రైట్‌ చేయలేం. కావున వైరస్‌ సిడిరోమ్‌లను ఏ సిస్టంలో ఉపయోగించినప్పటికీ ప్రవేశించదు.
ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే ఫైల్స్‌ను గమనించాలి. ముఖ్యంగా గేమ్స్‌, ఫ్రీవేర్స్‌, స్క్రీన్‌సేవర్స్‌... మొదలైనవి.
ప్రతినెల యాంటీ వైరస్‌ సాఫ్టవేర్‌ను అప్‌డేట్‌ చేయటం ఉత్తమం. దీనివలన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ శక్తివంతంగా తయారయ్యే వైరస్‌ను కనుగొని నిర్మూలిస్తుంది.
వారానికి ఒక్కసారి మొత్తం హార్డ్‌డిస్క్‌ను స్కాన్‌ చేయాలి.
రెస్క్యూ డిస్క్‌ను తయారుచేసి ఉంచుకోవటం ఎంతైనా అవసరం.
అనుమానిత ఫైల్స్‌ను గుర్తించటం కోసం వాచ్‌గార్డ్‌ ప్రోగ్రామ్స్‌ (మానిటర్స్‌ అనిపిలుస్తారు)ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
ఆపరేటింగ్‌ సిస్టంను సిద్ధంగా ఉంచుకోవటం ద్వారా వైరస్‌ సంభవించినపుడు, హార్డ్‌డిస్క్‌ను ఫార్మాట్‌ చేసి, ఆపరేటింగ్‌ సిస్టంను రీ ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి