కంప్యూటర్ గురించి కనీస పరిజ్ఞానం అందించాలనే నా ఈ ప్రయత్నం. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగ పడినా నా ఈ శ్రమకు తగిన ఫలితం దక్కింది అనుకుంటాను. నా ఈ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆశిస్తూ....
డెస్క్ టాప్ కంప్యూటర్(Desktop Computer) గురించి తెలుసుకుందాం.
దాని పేరునిబట్టి అది బల్ల మీద పెట్టుకునే కంప్యూటర్ అని అర్ధం అవుతుంది. దీనిని మనం ఇళ్ళలోనూ ఇంటర్నెట్ సెంటర్ లలోను చూడవచ్చు. వివిధ రకాల డెస్క్ టాప్ కంప్యూటర్లను మనం ఇక్కడ చూద్దాం.
సరిగ్గా గమనించినట్లైతే ఇందులో నాలుగు(04) ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి.
1.మోనిటర్ (Monitor):మన కంటికి కనిపించేది, కొంచెం తెలిసినట్లు అనిపించేది (టీవీ లాగా కనిపిస్తున్న)మోనిటర్.తెలుగులో అయితే తెర అనుకోవచ్చు.కంప్యూటర్ అనే ఈ బ్రహ్మ పదార్ధం లోపల ఏమి జరుగుతుందనేది చూడటానికి మాత్రమే అది ఉపయోగ పడుతుంది.
మరి కంప్యూటర్ కి టివి కి తేడా చూపించగల ముఖ్యమైన భాగం ఎక్కడ ఉంది? మొదటి బొమ్మలో ఎడమ ప్రక్కన, రెండవ బొమ్మలో కుడి ప్రక్కన ఉన్న డబ్బా లాంటి ఆకారమే ఆ ముఖ్యమైన భాగం. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ కంప్యూటర్ ప్రాణం అంతా ఆ డబ్బాలోనే ఉంటుంది. దానినే CPU అంటారు. మరి ఆ మూడవ బొమ్మలో ఆ డబ్బా ఏమైనట్లు? అలాంటి డెస్క్ టాప్ లు ఈ మధ్యనే కొత్తగా తాయారు చేస్తున్నారు. వాటిలో ఆ CPU అనే భాగం తెర (Monitor) వెనుక ఉండి అన్ని పనులను నడిపిస్తుంది.
2.Keyboard: టైపు రైటర్ మీద ఉన్నట్లుగా అక్షరాలు ఉన్న ఒక చెక్క బల్లలాంటి వస్తువు; దానిని కీ బోర్డు అంటారు. కంప్యూటర్ కి నోరు చెవులు లేవు కాబట్టి దానికి అర్ధం అయ్యే లాగా చెప్పాలి అంటే ఈ కీ బోర్డు అవసరం అవుతుంది. మనం ఎలాగైతే మూగ, చెవిటి వారికి అర్ధం అవటానికి కాగితం మీద వ్రాసి చూపిస్తామో అలాగే కంప్యూటర్ కి అర్ధం అయ్యేలాగా చెప్పాలి అంటే కీ బోర్డు మీద టైపు చేసి చూపించాలి. మరి మనం మూగ చెవిటి వారితో మాట్లాడాలి అంటే సైగలు చేస్తాం కదా అని అడగవచ్చు. కను సైగలను కూడా అర్ధం చేసుకుని అడిగిన పనులను చేసే కంపూటర్లు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ లోపుగా ప్రస్తుతం ఉన్న కంపూటర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
3.Mouse:అతి చిన్న అర చేతిలో ఇమిడి పోయే వస్తువు Mouse (మౌస్). Mouse అంటే చుంచు ఎలుక అని అర్ధం. దాని ఆకారాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని సైగలతో చెప్పగల్గిన విషయాలను ఈ Mouse ని అటు ఇటు కదిలించటం ద్వారా చూపించ వచ్చన్నమాట. అంతే కాకుండా ఈ మౌస్ తో ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెయ్యవచ్చు.
4.CPU : ని విశదీకరిస్తే సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ (Central Processing Unit). అనగా కేంద్రీయ నియంత్రణ విభాగము. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే ఒకే చోట ఉండి అన్నిటిని శాసించగల మహారాజు అన్న మాట. CPU లోపల ఏమి దాగి ఉందో తెలుసుకోవటానికి ముందు దాని బాహ్య స్వరూపాన్ని గురించి మరింత విపులంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ CPUలు రెండు ఆకారాలలో తయారవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం.
CPU ముందు భాగం...
మొదటి రకం CPU ని Tower టైపు CPU అంటారు. ఎందుకంటే ఇది గోపురం లాగా నిలువుగా ఉంటుంది ఉంటుంది కాబట్టి. రెండవ రకం CPU ని Flat టైపు CPU అంటారు, ఎందుకంటే ఇది భూసమాంతరంగా ఉంటుంది కాబట్టి. సాధారణంగా మనం Tower టైపు CPU లను చూస్తుంటాము. ఏ రకమైన CPU కి అయినా సాధారణంగా బయటకు కనిపించే భాగాలను చూద్దాం.
ఇక్కడ 1.మొదటిది Optical డ్రైవ్; అంటే మనం సినిమాలు చూడటానికి ఉపయోగించే CD/DVD లను పెట్టటానికి ఉపయోగిస్తాము. 2.రెండవది Eject బటన్; అంటే ఆప్టికల్ డ్రైవ్ ని తెరవటానికి ఉపయోగపడే బటన్.దీనిలో CD/DVD లను ఈ విధంగా పై వైపు గా పెడతారు. వెనుకకు తిప్పి మాత్రం పెట్టకండి.
ఈ CD/DVD డ్రైవ్ ని ఇంకా పరిశీలనగా గమనిస్తే చిన్న సూది బెజ్జమంత రంధ్రం కూడా కనిపిస్తుంది.CD/DVD,డ్రైవ్ లోపల ఇరుక్కుపోతే దానిని Eject(ఎజెక్ట్)చెయ్యటానికి (బయటకు తియ్యటానికి)ఈ రంధ్రం లో ఏదైనా సూదిని గుచ్చితే సరిపోతుంది. ఆ ఇరుక్కున్న CD/DVD తనంతట తానే బయటకు వస్తుంది.
ఇక పోతే మొదటి పటంలో
3.మూడవ భాగం అదనపు CD/DVD డ్రైవ్ ని పెట్టుకోవటానికి ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశం. 4.నాల్గవ భాగం Floppy (ఫ్లాపీ) డ్రైవ్.
ఈ CD/DVD లు రాక పూర్వం పాటలు పద్యాలు లాంటి ఏ సమాచారాన్నైనా భద్రపరచటానికి వాటిని ఉపయోగించే వారు. ఈ ఫ్లాపీ డ్రైవ్ ముందు వెనుక భాగాలు ఈ క్రింద చూపించిన విధంగా ఉంటాయి.
మొదటి పటంలో చివరి భాగం ఈ ఫ్లాపీ డ్రైవ్ Eject బటన్. ఫ్లాపీని ఈ విధంగా ముందు భాగం పైకి ఉండే విధంగా డ్రైవ్ లో ఉంచాలి.
CPU ముందు భాగంలో ఇంకా క్రిందకు వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది.
CPU ని ON చెయ్యటానికి పైనున్న POWER బటన్ ని ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో CPU నిస్తేజమైనప్పుడు (HANG); పవర్ OFF చేసి మరలా ON చేస్తే సరిగా పని చేస్తుంది. అలాంటి సందర్భాలలో POWER బటన్ రెండు సార్లు ఉపయోగించకుండా ఒక్క సారి నొక్కితేనే OFF మరియు ON అయ్యే విధంగా RESET బటన్ ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని కంప్యూటర్లలో ఈ RESET బటన్ ఉండటం లేదు. అలాంటి సందర్భాలలో POWER బటన్ నే రెండు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. సరిగా గమనించినట్లైతే POWER బటన్ కన్నా RESET బటన్ చిన్నదిగా ఉంటుంది.దాని క్రింద H.D.D. అని వ్రాసి ఉన్నది ఎర్ర రంగు LED లైటు. ఇది CPU లోపల HARD DISK వాడకంలో ఉన్నప్పుడు వెలుగుతుంది.
ఇంకా క్రింద కుడి వైపు ఎడమ వైపు ఒకేలాగా ఉన్న రెండు రంధ్రాలు ఉన్నాయి. వాటిని USB SLOTs అంటారు. అవి USB KEY లేక PEN DRIVE ని పెట్టేందుకు ఉపయోగిస్తారు. ఈ PEN DRIVE లు కూడా CD, DVD లాగానే పాటలు సినిమాలు ఇతర సమాచారాన్ని నిల్వ చేసుకోవటానికి ఉపయోగిస్తారు. అవి ఈ క్రింద చూపించిన విధంగా ఉంటాయి.
చివరి రకం PEN DRIVE లను ఉపయోగించేటప్పుడు ఏ దిశలో పెడుతున్నమనేది గమనించాలి. మొత్తం మీద USB SLOT లో ఉన్న లోహపు గీతలు PEN DRIVE మీద ఉన్న లోహపు గీతలతో అనుసంధానంలోకి రావాలి.
ఇక మధ్యలో ఉన్న ఎరుపు, ఆకు పచ్చ రంగు రంధ్రాలలో హెడ్ ఫోన్ పెట్టటానికి వాడతారు.
ఒక వేళ రంగులు మార్పుగా ఉన్నప్పటికీ CPU మీద ఉన్న చిహ్నాల ఆధారంగా HEADPHONE JACK (పిన్ను) మరియు MICROPHONE JACK లను ఎక్కడ ఉంచాలో గుర్తించవచ్చు. ఇలాంటివే మరొక రెండు కానీ మూడు కానీ CPU వెనుక భాగంలో కూడా ఉంటాయి.ఇప్పుడు కొత్తగా వస్తున్న కంప్యూటర్లలో సెల్ ఫోన్ మరియు కెమెరాలలో ఉపయోగించే మెమరీ కార్డులను ఉపయోగించేందుకు కూడా స్థానం కల్పించబడింది.
ఇక్కడ పైన ఉన్న నాలుగు స్థానాలు వివిధ రకాలైన మెమరీ కార్డులను ఉంచేందుకుగాను ఇవ్వబడ్డాయి.ఇక పోతే చివరిగా CPU ముందు భాగంలో ఉండే అన్ని భాగాల గురించి తెలుసుకున్నాం కానీ ఆయా కంపెనీలను బట్టి విడి భాగాల స్థానాలు మారే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇది గమనించండి.
ఇక్కడ CD డ్రైవ్, PEN డ్రైవ్, HARD డ్రైవ్, FLOPPY డ్రైవ్, HEADPHONE జాక్, MICROPHONE జాక్, లాంటి అనేక ఆంగ్ల పదాలను నేరుగా ఉపయోగించటం జరిగింది. ఎందుకంటే వాటి సమానార్ధక తెలుగు పదాల కంటే అవే పదాలు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. కాబట్టి తడబాటు చెందకుండా ఆయా పదాలను గుర్తు పెట్టుకుని, ఉపయోగించే ప్రయత్నం చెయ్యండి.
CPU వెనుక భాగం...
CPU వెనుక ఏ ఏ PORTలు (ద్వారాలు) ఉంటాయో చూద్దాం. ఇందులో పైన ఉన్న భాగాన్ని SMPS అనగా(Switch Mode Power Supply)అంటారు.CPU లోని అన్ని భాగాలకు దేనికి తగినంత శక్తిని దానికి సరఫరా చెయ్యటమే దీని పని.
ఈ SMPS లు క్రింద చూపిన విధంగా రెండు(02) ఆకారాలలో తయారుఅవుతున్నాయి.

మొదటి రకంలో ఒక స్విచ్ మరియు పవర్ కేబుల్ input మాత్రమే ఉన్నాయి. దానికి ఈ క్రింద చూపిన cables లో మొదటి దానిని ఉపయోగించి స్విచ్ బోర్డు కి కలుపుతారు.

ఈ SMPS క్రింద CPU ని ఇతర ఉపకరణాలతో కలిపే PORT లు ఉన్నాయి. అవేమిటో మరింత దగ్గరగా చూద్దాం.

ఇక్కడ అన్నిటికన్నా పైన ఎడమ వైపు వంగపండు రంగులో ఉన్న పోర్ట్, KEYBOARD ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. దాని ప్రక్కన ఉన్న ఆకు పచ్చ రంగు పోర్ట్ Mouse ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఈ రెండిటిని PS2 పోర్టులు అంటారు.

సరిగ్గా గమనించినట్లైతే Mouse, Keyboard ల ప్లగ్ లు ఒకవైపు చదునుగా ఉంటాయి. ఆ చదునుగా ఉండే వైపు కుడి ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆయా Plug లు socket లోకి వెళ్తాయి. ఈ దిశను సరిగా గమనించక పోయినట్లయితే Keyboard, Mouse పనికిరాని విధంగానష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎటువంటి బలప్రయోగం చెయ్యకుండాసరైన దిశలో మాత్రమే చొప్పించండి.
ఆ తరువాత ఉన్నవి USB PORTS. కొన్ని Keyboard లు Mouse లు ఇలాంటి USB ports తో క్రింద చూపిన విధంగా ఉంటాయి.
ఆ తరువాత ఉన్నది SERIAL COMMUCATION PORT. పూర్వ కాలపు Cell Phone లు ఈ PORT ల ద్వారానే కంప్యూటర్ కి కలిపేవారు. ప్రస్తుతం వస్తున్న cell phone లు కెమెరాలు USB PORT ద్వారా కంప్యూటర్ కి కలుపబడుతున్నాయి.

దాని పక్కనే కుడి వైపు 25 పిన్నులతో ఉన్న PORT ని parallel PORT అంటారు. దీనిని పూర్వకాలపు ప్రింటర్ లను connect చెయ్యటానికి ఉపయోగించేవారు.
ఈ USB PORT లకు కుడి ప్రక్కన Ethernet LAN Port ఉన్నది. ఇది BSNL/SIFI లాంటి తీగ (Cable)తో కూడిన INTERNET ను connect చెయ్యటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా LAN Cable ఈ విధంగా ఉంటుంది.

పై బొమ్మలో విధంగా LAN Cable కి ఒక నొక్కు ఉంటుంది. దీని వలన ఈ కేబుల్ ని CONNECT చేసేటప్పుడు 'టక్' మని చిన్న శబ్దం వస్తుంది. అలాగే దానిని బయటకు తీసేటప్పుడు ఆ నొక్కు భాగాన్ని దగ్గరకు నొక్కి బయటకు తీయాలి. లేకపోతే అది విరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి.
USB PORT లకు క్రింద మూడు రంధ్రాలతో SOUND PORTS ఉంటాయి. ఇందులో మొదట ఎరుపు రంగులో ఉన్నది MICROPHONE JACK. అనగా మనం మాట్లాడే మాటలను Record చెయ్యటానికి ఉపయోగపడుతుంది. రెండవది ఆకుపచ్చ రంగులో ఉన్నది AUDIO OUT JACK. అనగా CPU నుంచి వచ్చే శబ్దాలను SPEAKERS కు పంపేందుకు ఉపయోగపడుతుంది. ఇక మూడవది LINE IN JACK. ఇది RADIO, TV లాంటి వాటి నుంచి వచ్చే శబ్దాలను CPU లోకి పంపి RECORD చేసేందుకు ఉపయోగపడుతుంది.
అధునాతన CPU లలో మరికొన్ని అదనపు PORT లు కూడా వస్తున్నాయి. అవేమిటో కూడా చూద్దాం.

ఇందులో Mouse కొరకు PS2 PORT బదులుగా USB PORT లు ఉన్నాయి. serial , parallel PORT లకు బదులుగా అధునాతన HDMI మరియు OPTICAL SPDIF PORT లు ఉన్నాయి. సాధారణ VGA PORT కు అదనంగా దాని ఎడమ ప్రక్క DVI PORT కూడా ఉన్నది. పై మూడింటిని మనం LCD TV మరియు PROJECTOR లకు connect చెయ్యటానికి ఉపయోగిస్తాము. వీటిని గురించిన పూర్తి వివరాలు ముందు ముందు తెలుసుకుందాము. ఇంక చివరిగా MICROPHONE (గులాబి రంగు), LINE అవుట్ (ఆకుపచ్చ), LINE ఇన్ (నీలం) లతో పాటుగా వాటి పైన మరొక మూడు పోర్టులు SIDE SPEAKER (ఊదా రంగు), REAR SPEAKER (నలుపు రంగు) SUB-WOOFER (పసుపు రంగు) జాక్ లు కూడా ఉన్నాయి.

మరి ఈ CD/DVD డ్రైవ్ యేవిధంగా ఉంటుందో చూద్దాం.

మనం ఒక మంచి కారు కొని దేశ రాజధానికి ప్రయానమవుతున్నాం అనుకుందాం. రాజధాని కాబట్టి దానిని చేరుకోవటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. మొదటిది హైవే (ప్రధాన రహదారి) అయితే మరొకటి సాధారణ మార్గం.

మరి ఇక్కడ ఉన్న అన్ని PCI slot లు ఒకే విధంగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటే, అవే slots; VGA card కి, AUDIO card కి, LAN card కి ఒకే విధంగా ఎలా పని చేస్తాయి అనే అనుమానం రావచ్చును.

దానికి కుడి అంచున ఉన్న గోధుమ రంగు భాగాన్ని PCI slot లో అమర్చటానికి ఉపయోగిస్తారు. క్రింది వైపు ఉన్న VGA port మరియు DVI port లు CPU నుంచి బయటకు వస్తాయి. అనగా మనం ఒక vga card ని కనుక ఈ PCI slot లో ఉంచినట్లయితే motherboard మీద నిర్మితమై cpu వెనుకనున్న vga పోర్ట్ పని చెయ్యటం మానివేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన vga card మాత్రమే ముందుగా processor ద్వారా గుర్తింప బడుతుంది.
మొదటి రకంలో ఒక స్విచ్ మరియు పవర్ కేబుల్ input మాత్రమే ఉన్నాయి. దానికి ఈ క్రింద చూపిన cables లో మొదటి దానిని ఉపయోగించి స్విచ్ బోర్డు కి కలుపుతారు.
ఇక రెండవ రకం SMPS లో స్విచ్ కి బదులుగా మరొక POWER OUTPUT PORT అదనంగా ఉన్నది. దీనినుంచి Monitor కి Power ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. దీని కోసం పైన చూపించిన రెండవ కేబుల్ ని ఉపయోగిస్తారు. ఈ రెండవ రకం SMPS లు ఈ మధ్య కాలంలో అంత విరివిగా వాడకంలో లేవు.
ఇక్కడ అన్నిటికన్నా పైన ఎడమ వైపు వంగపండు రంగులో ఉన్న పోర్ట్, KEYBOARD ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. దాని ప్రక్కన ఉన్న ఆకు పచ్చ రంగు పోర్ట్ Mouse ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఈ రెండిటిని PS2 పోర్టులు అంటారు.
సరిగ్గా గమనించినట్లైతే Mouse, Keyboard ల ప్లగ్ లు ఒకవైపు చదునుగా ఉంటాయి. ఆ చదునుగా ఉండే వైపు కుడి ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆయా Plug లు socket లోకి వెళ్తాయి. ఈ దిశను సరిగా గమనించక పోయినట్లయితే Keyboard, Mouse పనికిరాని విధంగానష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎటువంటి బలప్రయోగం చెయ్యకుండాసరైన దిశలో మాత్రమే చొప్పించండి.
ఆ తరువాత ఉన్నవి USB PORTS. కొన్ని Keyboard లు Mouse లు ఇలాంటి USB ports తో క్రింద చూపిన విధంగా ఉంటాయి.
వీటిని ఈ keyboard లు Mouse లు connect చెయ్యటానికి మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే ఖాళీగా వదిలెయ్యాలి. PEN DRIVE లు connect చెయ్యటానికి ఉపయోగపడే PORT లు వేరే ఉన్నాయి.
ఆ తరువాత ఉన్నది SERIAL COMMUCATION PORT. పూర్వ కాలపు Cell Phone లు ఈ PORT ల ద్వారానే కంప్యూటర్ కి కలిపేవారు. ప్రస్తుతం వస్తున్న cell phone లు కెమెరాలు USB PORT ద్వారా కంప్యూటర్ కి కలుపబడుతున్నాయి.
దాని పక్కనే కుడి వైపు 25 పిన్నులతో ఉన్న PORT ని parallel PORT అంటారు. దీనిని పూర్వకాలపు ప్రింటర్ లను connect చెయ్యటానికి ఉపయోగించేవారు.
Serial PORT క్రింద ఉన్నది VGA PORT. ఇది Monitor ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది.ఈ VGA PORT క్రింద మరికొన్ని USB PORT లు ఉన్నాయి. వీటిని PEN DRIVE లు మొదలైన వాటిని connect చెయ్యటానికి ఉపయోగించవచ్చు.
ఈ USB PORT లకు కుడి ప్రక్కన Ethernet LAN Port ఉన్నది. ఇది BSNL/SIFI లాంటి తీగ (Cable)తో కూడిన INTERNET ను connect చెయ్యటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా LAN Cable ఈ విధంగా ఉంటుంది.
పై బొమ్మలో విధంగా LAN Cable కి ఒక నొక్కు ఉంటుంది. దీని వలన ఈ కేబుల్ ని CONNECT చేసేటప్పుడు 'టక్' మని చిన్న శబ్దం వస్తుంది. అలాగే దానిని బయటకు తీసేటప్పుడు ఆ నొక్కు భాగాన్ని దగ్గరకు నొక్కి బయటకు తీయాలి. లేకపోతే అది విరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి.
USB PORT లకు క్రింద మూడు రంధ్రాలతో SOUND PORTS ఉంటాయి. ఇందులో మొదట ఎరుపు రంగులో ఉన్నది MICROPHONE JACK. అనగా మనం మాట్లాడే మాటలను Record చెయ్యటానికి ఉపయోగపడుతుంది. రెండవది ఆకుపచ్చ రంగులో ఉన్నది AUDIO OUT JACK. అనగా CPU నుంచి వచ్చే శబ్దాలను SPEAKERS కు పంపేందుకు ఉపయోగపడుతుంది. ఇక మూడవది LINE IN JACK. ఇది RADIO, TV లాంటి వాటి నుంచి వచ్చే శబ్దాలను CPU లోకి పంపి RECORD చేసేందుకు ఉపయోగపడుతుంది.
అధునాతన CPU లలో మరికొన్ని అదనపు PORT లు కూడా వస్తున్నాయి. అవేమిటో కూడా చూద్దాం.
ఇందులో Mouse కొరకు PS2 PORT బదులుగా USB PORT లు ఉన్నాయి. serial , parallel PORT లకు బదులుగా అధునాతన HDMI మరియు OPTICAL SPDIF PORT లు ఉన్నాయి. సాధారణ VGA PORT కు అదనంగా దాని ఎడమ ప్రక్క DVI PORT కూడా ఉన్నది. పై మూడింటిని మనం LCD TV మరియు PROJECTOR లకు connect చెయ్యటానికి ఉపయోగిస్తాము. వీటిని గురించిన పూర్తి వివరాలు ముందు ముందు తెలుసుకుందాము. ఇంక చివరిగా MICROPHONE (గులాబి రంగు), LINE అవుట్ (ఆకుపచ్చ), LINE ఇన్ (నీలం) లతో పాటుగా వాటి పైన మరొక మూడు పోర్టులు SIDE SPEAKER (ఊదా రంగు), REAR SPEAKER (నలుపు రంగు) SUB-WOOFER (పసుపు రంగు) జాక్ లు కూడా ఉన్నాయి.
CPU లోపల ఏముంది
ఈ పటంలో కనిపించే 5వ భాగం CD/DVD ప్లేయర్. ఇది మనం చూసే సినిమా CD, DVD లను ప్లే చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇందులోకొత్తగా వస్తున్న మార్పు ఏమంటే BLU-RAY డిస్క్. మనకు తెలిసినంత వరకు సాధారణంగా CD లో అయితే ఒక్క సినిమా అదే DVD లో ఐనట్లైతే 5-6 సినిమాలు పడతాయి. ఇక్కడ CD అంటే compact disk, మరియు DVD అంటే digital video disk. మరి ఈblu ray డిస్క్ విషయానికి వస్తే ఇందులో 25GB అనగా 35 సినిమాలు పడతాయి.
ఈ blu Ray డిస్క్ చూడటానికి సాధారణ DVD లాగానే ఉన్నది. మరి అందులో అంత ఎక్కువ సమాచారాన్ని ఎలా నిల్వ చేసుకోగల్గుతుంది అనే అనుమానం కలుగవచ్చు. DVD కి BLU RAY డిస్క్ కి ముఖ్యమైన తేడా ఆ డిస్క్ లో కాక అందులో సమాచారాన్ని వ్రాసే విధానంలో ఉంది.
Ex:మనం స్కెచ్ పెన్ తో అక్షరాలను వ్రాస్తే అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే మామూలు పెన్ తో వ్రాస్తే అది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఈ క్రింద చూపిన విధంగా...
Ex:మనం స్కెచ్ పెన్ తో అక్షరాలను వ్రాస్తే అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే మామూలు పెన్ తో వ్రాస్తే అది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఈ క్రింద చూపిన విధంగా...
అదే విధంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో DVD లో కన్నా దగ్గరగా సమాచారాన్ని వ్రాసే వ్యవస్థను తయారు చేసారు. మరి అంత దగ్గరగా వ్రాసినప్పుడు తట్టుకునే విధంగా blu ray డిస్క్ ను DVD కన్నా ఎక్కువ సాంద్రత (density)తో తయారు చేసారు. ఈ blu ray డిస్క్ ఇంకా అంత ప్రాచుర్యం లోకి రాలేదు.
ఈ విధంగా ఈ CD/DVD డ్రైవ్ లకు కూడా ఒక power కేబుల్ మరియు ఒక DATA కేబుల్ ఉంటాయి. ఆ నలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉన్నది POWER CABLE. ఆ రెండవది DATA కేబుల్. గమనించినట్లైతే దీనికి కూడా IDE మరియు SATA అని రెండు రకాల connections ఉన్నాయి. mothebard మీద హార్డ్ డిస్క్ ను ఎక్కడైతే కలుపుతామో ఈ DVD Drive ను కూడా అవే socket లలో కలుపవచ్చు. అందుకే motherboard మీద ఒకటి కన్నా ఎక్కువ sockets ఉంటాయి.
MOTHERBOARD:motherboard మీద అంతటి ప్రాధాన్యత సంతరించుకోని అతి ముఖ్యమైన భాగం PCI SLOT. PCI ని విస్తరిస్తే Peripheral Component Interconnect అవుతుంది. అనగా CPU కి, బాహ్యంగా అనుసంధానం చేసే భాగాలకి మధ్య వారధి అని అర్ధం చెప్పుకోవచ్చును. కంప్యూటర్ ప్రధాన భాగాలను పక్కన పెడితే మనకు అవసరమైన అదనపు భాగాలను connect చెయ్యటానికి దీనిని ఉపయోగిస్తారు. మరి అసలు అదనపు భాగాలు ఎందుకు అవసరం అవుతాయి, ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం.
మనం ఒక మంచి కారు కొని దేశ రాజధానికి ప్రయానమవుతున్నాం అనుకుందాం. రాజధాని కాబట్టి దానిని చేరుకోవటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. మొదటిది హైవే (ప్రధాన రహదారి) అయితే మరొకటి సాధారణ మార్గం.
మరి మన కారు యొక్క పూర్తి వేగాన్ని చూడాలి అంటే మనం తప్పని సరిగా ప్రధాన రహదారిలోనే ప్రయాణం చెయ్యాలి.
అలాగే మనం CPU వెనుక భాగాన్ని గమనించినట్లైతే అక్కడ ఉన్న LAN port కానీ VGA పోర్ట్ కానీ, AUDIO ports కానీ ప్రస్తుతం వస్తున్న అధునాతన పరికరాల వేగంతో పని చెయ్యక పోవచ్చును. అలాగని వాటిని మార్చాలి అంటే మొత్తం motherboard ని మార్చాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ PCI slots ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ PCI slots పూర్తి స్థాయి bus నిడివితో motherboard కి కలుపబడి ఉంటాయి. (ఇక్కడ bus అంటే కంప్యూటర్ లో సమాచారం ప్రయాణించే మార్గము. అంతే కానీ వాహనం కాదు. గమనించ గలరు.)అనగా ఆయా అధునాతన పరికరాల పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తాయి.
మరి ఇక్కడ ఉన్న అన్ని PCI slot లు ఒకే విధంగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటే, అవే slots; VGA card కి, AUDIO card కి, LAN card కి ఒకే విధంగా ఎలా పని చేస్తాయి అనే అనుమానం రావచ్చును.
(ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నవి PCI slot లు.) మనకు ఎలాగైతే ఎడ్ల బండి, సైకిలు, స్కూటరు, కారు, లారీ వంటి వివిధ వాహనాలు వచినప్పటికి రోడ్డు మాత్రం ఒకటే ఉన్నదో అదే విధంగా వివిధ పరికరాలు ఉన్నప్పటికీ ఈ PCI slots మాత్రం ఒకే విధంగా ఉండేలాగా నిర్మించబడ్డాయి. అంటే ఇవి ఒక విధంగా processor ని చేరుకోవటానికి ఒక దగ్గర మార్గం మాత్రమే అంతే కానీ ఒక పరికరం కాదు గమనించ గలరు. ఈ PCI slots ద్వారా పూర్తి వేగంతో CPU వెనుక ఉండే port ల కన్నా ముందుగా processor ని చేరి ఉపయోగింప బడతాయి. ఉదాహరణకు vga card ని గమనిద్దాం. అది ఈ విధంగా ఉంటుంది.
దానికి కుడి అంచున ఉన్న గోధుమ రంగు భాగాన్ని PCI slot లో అమర్చటానికి ఉపయోగిస్తారు. క్రింది వైపు ఉన్న VGA port మరియు DVI port లు CPU నుంచి బయటకు వస్తాయి. అనగా మనం ఒక vga card ని కనుక ఈ PCI slot లో ఉంచినట్లయితే motherboard మీద నిర్మితమై cpu వెనుకనున్న vga పోర్ట్ పని చెయ్యటం మానివేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన vga card మాత్రమే ముందుగా processor ద్వారా గుర్తింప బడుతుంది.
ప్రస్తుతం ఈ PCI slots లో వచ్చిన అధునాతన విప్లవం PCI express. దీని ద్వారా ఒకే సారి రెండు మూడు vga card లను అధిక వేగంతో పనిచేయించ వచ్చును. ఈ vga card లు అధునాతన LCD tv లకు LED tv లకు కంప్యూటర్ ని అనుసంధానం చెయ్యటానికి ఉపయోగపడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి