మంగళవారం, నవంబర్ 15, 2011

లినక్స్ వాడాలనుకొనే వారికి ఓ చక్కటి అవకాశం


లినక్స్ వాడాలనుకొనే వారికి ఓ చక్కటి అవకాశం


Featured Image
టెక్ సేతు లినక్స్
గవేష్
టెక్ సేతు
లక్ష్యం: 
మనలో విండోస్ వాడేవారే ఎక్కువ…. చాలా మంది లినక్స్ వాడే ప్రయత్నాలు చేసే ఉంటారు, కానీ ఇంస్టాల్ చెయ్యటం తెలియకో, లేక వాడటం కష్టమయ్యో, లేక తమకు ఇష్టమైన సాఫ్ట్వేర్ దొరకకో లినక్స్ వాడటం మానేసి విండోస్ వైపు మళ్ళి ఉంటారు. మరి కొందరు ఈ పేరే వినుండకపోవచ్చు. విన్నా ప్రయత్నించకపోయుండవచ్చు. మీరు పై వాటిలో ఏ కోవకు చెందినా లేక లైనక్స్ వాడేవారే అయినా, ఇదే మీకు అద్భుత అవకాశం. విండోస్ వాడేవారికి అనుగుణంగా, సామన్యంగా వాడే దాదాపు అన్ని సాఫ్ట్వేర్లతో, ఇంస్టాల్ చేసుకోవటానికీ మరియూ వాడటానికీ కావలసిన అవసరమైన ఇంస్ట్రక్షన్‌ లతో కూడి ఉన్న లినక్స్. క్రింద ఇవ్వబడిన టోరెంట్ సాయంతో డౌంలోడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ లేదా ఇక్కడ ఇవ్వబడిన టోరెంట్ల నుండి డౌంలోడ్ చేసుకోగలరు..
టోరెంట్లు డౌంలోడ్ చేయటం ఏలా, ఇది చూడండి.
ఎందుకు వాడవచ్చు :
1. ఉచితంగా లభిస్తుంది, ఎలా వాడినా అడిగేవాళ్ళు ఉండరు.
2. వైరస్లు ఉండవు.
3. దీనిని ఇంస్టాల్ చెయ్యగానే కావలసిన సాఫ్ట్వేర్లు కూడా ఇంస్టాల్ ఐపోతాయి, ఇవి కూడా ఉచితమే, ఇస్టమొచ్చినట్టు వాడవచ్చు.
4. రాను రానూ performance తగ్గటమంటూ ఉండదు, ఇంటర్నెట్ ఉంటే updates ఉన్నప్పుడంతా performance పెంచుకోవచ్చు.
5. సెక్యూరిటీ ఆపదలు ఉండవు, ఎందుకంటే దీని కోసం వ్రాసిన కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది, కావున అది ఎం చేస్తుందో చూసిన వారందరికీ తెలిసిపోతుంది, తప్పులుంటే ఎవరైనా సరిదిద్దే అవకాశం కూడా ఉంది.
6. కమాండ్ లైన్ ద్వారా ఏ పనినైనా చేయవచ్చు. సాదారణ వాడుకరికైతే కమాండ్ లైన్ అవసరం ఉండదు.
7. ఇక అసలు విషయం గ్రాఫిక్స్. ఈ క్రింది అంకెలను క్లిక్ చేసి చిత్రాలని చూస్తే మీకే అర్థమౌతుంది.

1 2 3 4 5
డౌంలోడ్ చేసిన తరువాత?
1. డౌంలోడ్ చేయగానే ఒక 2GB iso ఫైల్ వస్తుంది. ఇది ఎక్కువ సమయం పట్టినప్పటికీ చాలా ఉపయోగకరమైనది.
2. దీనిని DVDలోకి బూటబుల్ ఫార్మాట్లో బర్న్  చేసుకోవాలి.
3. కంప్యూటర్ను రీస్టార్ట్  చేసి ఈ DVDని ట్రేలో పెట్టాలి. ఐదు ఆప్షన్ లు వస్తాయి, అందులో మొదటి దాన్ని ఎంచుకోండి. పూర్తిగా బూట్ ఐన తరువాత డెస్క్ టాప్ మీదనే ఉన్న Instructionsఅనే ఫోల్డర్ నుండి pdf ఫైల్ ను వాడుకొని ఇంస్టాల్ చేసేయవచ్చు.
4. పూర్తిగా ఇంస్టాల్ చేసాక రీస్టార్ట్ చెయ్యండి. ఇప్పుడు, మీ అవసరాన్ని బట్టి విండోస్ లోకైనా లేక లినక్స్ లో కైనా బూట్ చేసుకోవచ్చు.
5. అద్భుతమైన గ్రాఫిక్స్ కోసం డెస్క్టాప్ మీద ఉన్న Instructionsను వాడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి