గురువారం, నవంబర్ 17, 2011

Text embroidery on cloth : Photoshop tutorial in Telugu



Make realistic embroidery text effect using Photoshop - Tutorial in Telugu

హాయ్ ఫ్రెండ్స్, ఫోటోషాప్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ వున్న వాళ్లు మరియు ఫోటోషాప్ డెప్త్ చూడాలనుకొనే వాళ్లు తప్పని సరిగా ఈ ట్యుటోరియల్ ను ఫాలో అయి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ప్రాక్టీస్ చేసేటపుడు ఏ స్టెప్ దగ్గరైనా మీకు సందేహం కలిగితే ఆ ఫైల్ ను సేవ్ చేస్కొని, ఆ స్టెప్ నం ను తెలియజేస్తూ ఇక్కడ రిప్లై ఇవ్వగలరు. హై రెజెల్యూషన్ ఇమేజిలను ఒరిజినల్ సైజ్ లో చూడటానికి ఆ ఇమేజి పైన ఉన్న Image had been scaled down. Click this bar to view full image అనే టెక్స్ట్ లింక్ ను క్లిక్ చేయండి. ఇక ఈ ట్యుటోరియల్ లో ఒక క్లాత్ మీద ఎంబ్రాయిడరీ మిషన్ తో లెటర్స్ ను స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ ను కేవలం ఫోటోషాప్ ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మీరు స్టిచ్చింగ్ టైప్ బ్రష్ లను తయారు చేస్కోవలసి ఉంటుంది. లేదా క్రింద ఆటాచ్ చేసిన రెడీ మేడ్ బ్రష్ లను డౌన్లోడ్ చేస్కొని, బ్రష్ ప్యాలెట్ లోకి ఈ బ్రషెస్ ను లోడ్ చేయండి. మరి ట్యుటోరియల్ ఫాలో అవుదామా ? అయితే స్టెప్ 1 కి వచ్చేయండి.

text embroidery on cloth

1. File >> New ను క్లిక్ చేసి కొత్త పేజీని క్రియేట్ చేయండి. Layers ప్యాలెట్ లో Background లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి లేయర్ నేమ్ Cloth గా మార్చి OK బటన్ ను క్లిక్ చేయండి.
Image has been scaled down 33% . Click this bar to view full image (887x345).
text embroidery on cloth


2. Layers ప్యాలెట్ లో Cloth లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.
text embroidery on cloth

3. Layer Style ప్రాపర్టీస్ లో Pattern Overlay మీద క్లిక్ చేసి క్రింది స్క్రీన్ షాట్ లో చూపిన స్టెప్స్ ఫాలో అవండి. ఇపుడు కొత్తగా Patterns2 స్టైల్స్ ప్యాటెర్న్స్ లైబ్రెరీలోకి లోడ్ అవుతాయి.
text embroidery on cloth

4. కొత్తగా లోడ్ అయిన ప్యాటర్న్స్ లో Denim ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.
text embroidery on cloth

5. Foreground Color ను బ్లాక్ గా మార్చండి. లేదా కీ బోర్డ్ లో D ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా డీపాల్ట్ Foreground కలర్ బ్లాక్ అవుతుంది. తర్వాత Type టూల్ ను క్లిక్ చేసి కాన్వాస్ మీద మీకు కావలసిన టైటిల్ ను టైప్ చేయండి.
text embroidery on cloth

6. వెంటనే టైటిల్ మీద రైట్ క్లిక్ చేసి Create Work Path ను క్లిక్ చేయండి.
text embroidery on cloth
ఇపుడు టెక్స్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
Image has been scaled down 25% . Click this bar to view full image (794x87).
text embroidery on cloth


7. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ ను క్రియేట్ చేయండి. ఈ లేయర్ ను stiches గా రీనేమ్ చేయండి.
Image has been scaled down 33% . Click this bar to view full image (887x345).
text embroidery on cloth

8. కీబోర్డ్ లో F5 ను ప్రెస్ చేసి బ్రష్ ప్యాలెట్ లో Brush Tip Shape ను క్లిక్ చేసి, మొదట మీరు లోడ్ చేసిన స్టిచ్చింగ్ బ్రషెస్ లో క్రింద చూపిన (16) బ్రష్ ను సెలెక్ట్ చేయండి. తర్వాత 17, 18 లలో ఉన్న విధంగా సెట్టింగ్స్ చేయండి. వెంటనే Shape Dynamics ను క్లిక్ చేసి క్రింది రెండవ పటంలో (19)లో చూపిన సెట్టింగ్స్ చేయండి.
text embroidery on cloth

text embroidery on cloth
9. టూల్స్ లో Pen టూల్ ను క్లిక్ చేసి, టెక్స్ట్ చుట్టూ కనిపిస్తున్న పాత్ మీద రైట్ క్లిక్ చేసి Stroke Path ను క్లిక్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.
text embroidery on cloth
ఇపుడు టెక్స్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
Image has been scaled down 24% . Click this bar to view full image (786x97).
text embroidery on cloth

10. ఇంతకు ముందు క్రియేట్ చేసిన stiches లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.
text embroidery on cloth
11. Layer Style ప్రాపర్టీస్ లో Drop Shadow మరియు Bevel and Emboss లను క్రింది రెండ్ ఫిగర్స్ ను ఫాలో అయి సెట్టింగ్స్ చేయండి.
text embroidery on cloth

text embroidery on cloth

12. మొదట క్రియేట్ చేసి Cloth లేయర్ ను సెలెక్ట్ చేసి, Create New Fill or Adjustment Layer (31) ని క్లిక్ చేసి Hue/Saturation (32) ని క్లిక్ చేయండి.
text embroidery on cloth

13. Hue/Saturation అడ్జస్ట్ మెంట్ ప్రాపర్టీస్ లో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.
text embroidery on cloth
14. Type టూల్ నుపయోగించి టాగ్ లైన్ ను టైప్ చేయండి.
text embroidery on cloth

15. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ ను క్రియేట్ చేయండి. తర్వాత Pen టూల్ నుపయోగించి ట్యాగ్ లైన్ కోసం టైప్ చేసిన లెటర్స్ వెంట పాత్ క్రియేట్ చేయండి.
text embroidery on cloth

16. ఇపుడు ట్యాగ్ లైన్ టెక్స్ట్ లేయర్ ను డెలిట్ చేయండి. ఇపడు పాత్ లేయర్ ను సెలక్ట్ చేయండి.
Image has been scaled down 24% . Click this bar to view full image (785x240).
text embroidery on cloth


17. కీ బోర్డ్ లో F5 ను ప్రెస్ చేసి బ్రష్ ప్యాలెట్ లో క్రింద చూపిన బ్రష్ ను సెలెక్ట్ చేసి మిగిలిన సెట్టింగ్స్ చేయండి.
text embroidery on cloth

18. Pen టూల్ ను క్లిక్ చేసి పాత్ మీద రైట్ క్లిక్ చేసి, Stroke path మీద క్లిక్ చేసి OK బటన్ ను ప్రెస్ చేయండి.
Image has been scaled down 22% . Click this bar to view full image (768x286).
text embroidery on cloth

ఇపుడు పాత్ మీద కూడా స్టిచెస్ క్రియేట్ అయి క్రింది విధంగా కనిపిస్తుంది. టైటిల్ మధ్యలో బ్లూ కలర్ స్టిచెస్ కొరకు క్రింది ఆటాచ్ మెంట్ లోని Psd source ను డౌన్లోడ్ చేస్కొని చూడగలరు.
Image has been scaled down 25% . Click this bar to view full image (793x247).
text embroidery on cloth


Attached File(s)
.zip  stich_brushes.zip (Size: 4.74 KB / Downloads: 97)
.zip  psd_source.zip (Size: 456.38 KB / Downloads: 133)


R

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి