గురువారం, నవంబర్ 17, 2011

Photoshop Tools - part1



ఫోటోషాప్ లో అత్యంత కీలకమైనది టూల్ బాక్స్.. ఈ టూల్ బాక్స్ లోని ప్రతీ టూల్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇమేజి ఎడిటింగ్ లో ఒక్కొక్క టూల్ ను ఒక్కొక్క అవసరానికి ఉపయోగిస్తారు.
[Image: 1444gg9.jpg]
టూల్ బాక్స్ లోని టూల్స్ లో కొన్ని టూల్స్ ఇంటర్నల్ టూల్స్ ను కలిగి ఉంటాయి. వాటిని ఉపయోగించాలంటే, టూల్ యొక్క Right Down Corner లో ఉన్న చిన్న పాయింట్ మీద లెఫ్ట్ బటన్ ను అలాగే నొక్కి ఉంచితే ఆ టూల్ లోపల ఉన్న మరికొన్న టూల్స్ బయటికి వస్తాయి.
[Image: m8iw60.gif]
ఈ ట్యుటోరియల్ ఫోటోషాప్ లోని టూల్స్ మరియు వాటి ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రతీ టూల్ ను ట్యుటోరియల్ లో చెప్పిన విధంగా ఉపయోగించి చూడండి. అపుడే మీకు ఆ టూల్ యొక్క ప్రాముఖ్యత ఫీడ్ అయిపోతుంది.

[Image: 2zpkvvp.jpg] 1. Rectangular Marquee tool: ఈ టూల్ ను పయోగించి ఒక ఇమేజ్ లో చతురస్రాకారంలో కాని దీర్ఘ చతురస్రాకారములో కాని సెలెక్ట్ చేయవచ్చు.
Example:
[Image: k2gvv9.jpg]

ఇలా సెలెక్షెన్ చేసిన తర్వాత ఈ సెలెక్షెన్ లో కొంత భాగాన్ని, తీసివేయడం, యాడ్ చేయడం లాంటివి కూడా చేయవచ్చు. వెరీ సింపుల్. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్షెన్ లోపలి భాగాన ఎంతవరకు తీసివేయాలనుకుంటున్నారో అంతవరకు Alt బటన్ ను ప్రెస్ చేసి మళ్లీ సెలెక్ట్ చేయండి. ఒక వేళ extra selection యాడ్ చేయాలనుకుంటే Shift బటన్ ను ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. ఇలాగే ప్రతి సెలెక్షన్ టూల్ తో కూడా subtraction, Addition చేయవచ్చు...
Example:

సెలెక్షన్ లో కొంత భాగాన్ని తీసివేసినపుడు ఈ క్రింది విధంగా ఉంటుంది.
[Image: oj2e08.jpg]

సెలెక్షన్ లో కొంత భాగాన్ని యాడ్ చేసినపుడు ఈ క్రింది విధంగా ఉంటుంది.
[Image: w9io46.jpg]

[Image: 208e6nb.jpg] 2. Elliptical Marquee Tool: ఈ టూల్ నుపయోగించి ఒక ఇమేజ్ లో వృత్తాకారంలో సెలెక్ట్ చేయవచ్చు.

Example:
[Image: 350l8d2.jpg]

[Image: 2ue1kow.jpg] 3.Lasso Tool: ఈ టూల్ నుపయోగించి ఇమేజ్ లో ఏ భాగాన్ని ఏ ఆకారంలోనైనా సెలెక్ట్ చేయవచ్చు...(పైన చెప్పుకున్న టూల్స్ తో అయితే చతురస్రాకారంగా గాని, వృత్తాకారంగా గాని సెలెక్ట్ చేయగలము)దీన్ని ఉపయోగించాలంటే మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయాల్సిందే.
Example:
[Image: 6g9080.jpg]

[Image: i5zp5f.jpg] 4. Polygonal Lasso Tool: ఈ టూల్ తో మనకు కావలసిన షేప్ లో సులభంగా select చేయవచ్చు. దీన్ని ఉపయోగించాలంటే మౌస్ క్లిక్ లతో సెలెక్షన్ లాక్ చేస్కుంటూ చేయవచ్చు. అంటే ఒక సారి లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత రెండవ సారి ఎక్కడైతే క్లిక్ చేస్తారో ఆ రెండు క్లిక్స్ మధ్య సెలెక్షన్ లాక్ అయిపోతుంది.
Example:
[Image: 2vteddk.jpg]

[Image: 332qqmh.jpg] 5. Magnetic Lasso Tool: ఈ టూల్ ఇమేజ్ లోని అబ్జెక్ట్ యొక్క ఎడ్జ్ లను ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తుంది. దీన్ని ఉపయోగించాలంటే మౌస్ లో ఏ బటన్ క్లిక్ చేయనవసరంలేదు..స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక్క సారి క్లిక్ చేస్తే చాలు. తర్వాత మౌస్ ను అబ్జెక్ట్ యొక్క ఎడ్జ్ వెంట మూవ్ చేస్తుంటే చాలు..ఆటేమేటిక్ గా సెలెక్షన్ ఏర్పడుతుంది.
Example:
[Image: 2j9pac.jpg]

[Image: mahi_sig.jpg]


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి