మంగళవారం, సెప్టెంబర్ 27, 2011

సమాచార హక్కు చట్టం, 2005




అధ్యాయం - 1
ప్రాథమిక అంశాలు

1. (1) సమాచార హక్కు చట్టం, 2005గా దీన్ని వ్యవహరించవచ్చు

(2) జమ్ముకాశ్మీర్ మినహా మిగిలిన దేశమంతటికీ  చట్టం వర్తిస్తుంది (సెక్షన్లు)

(3)  చట్టానికి చట్ట రూపం వచ్చిన 120  రోజునుంచి మిగతా నిబంధనలు అమల్లోకి వస్తాయి.

2. సందర్భానుసారం చట్టంలో మార్పులు రాకుంటే తప్ప,

(సముచిత ప్రభుత్వం అంటే?

(1) కేంద్రంకేంద్రపాలిత ప్రభుత్వాలు స్థాపించిననెలకొ్ల్పిననియంత్రణలో ఉన్నసదరు ప్రభుత్వాల నుంచిప్రత్యక్ష్యంగానోపరోక్షంగానో నిధులు అందుకుంటున్న అధికార యంత్రాంగాలురాష్ట్ర ప్రభుత్వం

(2) అలాగే రాష్ట్రప్రభుత్వ అధికార యంత్రాంగాలురాష్ట్రప్రభుత్వం

(బిసెక్షన్ 12 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది.

(సిసెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారిసబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్రసహాయ సమాచార అధికారులు నియమితులవుతారు.

(డిసెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (3) కింద ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్లునియమితులవుతారు.

() ‘సమర్ధాధికారి’ అంటే?

(1) లోక్ సభరాష్ట్రాలురాష్ట్ర శాసనసభకేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు సంబంధించిన స్పీకర్లు,రాజ్యసభరాష్ట్ర విధాన మండళ్లకు సంబంధిత ఛైర్మన్లు

(2) సుప్రీంకోర్టుకు భారత ప్రధాన న్యాయమూర్తి

(3) హైకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తి,

(4) రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయిన ఇతర యంత్రాంగాలకు రాష్ట్రపతి లేక గవర్నర్

(5) రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్

(ఎఫ్) ‘సమాచారం అంటే’ ?

రికార్డులుపత్రాలుమెమోలు-మెయిళ్ళుఅభిప్రాయాలుసలహాలుపత్రికా ప్రకటనలుసర్య్కులర్లు,ఉత్తర్వులులాగ్ బుక్స్కాంట్రాక్టులునివేదికలుపేపర్లుశాంపిళ్లుమోడళ్ళుడేటా సహా ఎలక్ట్రానిక్స్రూపంతో పాటు  రూపంలో అయినా ఉన్న సమాచారం అమల్లో ఉన్న మరో చట్ట ప్రకారం  ప్రైవేటు సంస్థనుంచి అయిన ప్రభుత్వ యంత్రాంగం రాబట్టగల సమాచారం.

(జి) ‘నిర్ణీత’ అనగా  చట్టం నియమాల ప్రకారం ప్రభుత్వం గానీసమర్దాధికారి గానీ నిర్ణయించిన విధంగా

(హెచ్) ‘అధికార యంత్రాంగం’ అంటే?

రాజ్యాంగం కింద లేదా రాజ్యాంగం ద్వారా

బిపార్లమెంట్ రూపొందించిన  చట్ట ప్రకారమైనా

సిరాష్ట్రశాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం

డిసముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లేదా ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటయిన ప్రభుత్వస్వపరిపాలన సంస్థలు.

(1) సముచిత ప్రభుత్వ సొంతనియంత్రణలో ఉన్న ఎక్కువ నిధులు

(2) సముచిత ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా/పరోక్షంగా నిధులు పొందుతున్న ప్రభుత్వేతర సంస్థలు.

() ‘రికార్డు అంటే?

(ఏదైనా పత్రంరాతప్రతిఫైలు

(బిఏదైనా మైక్రో ఫిల్ముమైక్రోఫిష్ పత్రం

(సిమైక్రోఫిల్ముల నుంచి తీసిన చిత్రాలు

(డికంప్యూటర్ మరేదైనా పరికరం నుంచి వచ్చే సమాచారం

(జె) ‘సమాచార హక్కు’ అంటే  అధికార యంత్రాంగం నియంత్రణలో ఉన్న సమాచారాన్ని అయినా  చట్టప్రకారం పొందగలగడం.

(1) పనులనూపత్రాలనూరికార్డులను తనిఖీ చేసే హక్కు

(2) రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని రాసుకోవడంవాటి నకళ్లుసర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం

(3) సాగ్రికి సంబంధించిన సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం

(4) డిస్కులుప్లాపీలువీడియో కాసెట్లు రూపంలోమరో విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నసమాచారాన్ని పొందడంఅలాంటి సమాచారం కంప్యూటర్లోగానీమరో పరికరంలో గానీ నిక్షిప్తమై ఉంటేప్రింట్లు తీసుకోవడం.

కెసెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది.

(ఎల్సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (3) ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్లునియమితులవుతారు.

(ఎమ్సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద రాష్ట్ర పౌర సమాచార అధికారిసబ్ సెక్షన్ (2) ప్రకారం రాష్ట్రసహాయ సమాచార అధికారులు నియమితులవుతారు.

(ఎన్మూడో పక్షం అంటే అధికార యంత్రాంగంసమాచారం అడిగే పౌరుడు కాక ఇతర వ్యక్తులు.

అధ్యాయం - 2
సమాచార హక్కుఅధికార యంత్రాంగాల విధులు

3.  చట్టంలోని నిబంధనల ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది.

4. (1) ప్రతి అధికార యంత్రాంగమూ

(తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలుపద సూచికలతో హక్కు అమలయ్యేందుకు వీలుగానిర్వహించాలిఅన్ని రికార్డుల్లో నుంచి కంప్యూటర్లో భద్రపరచదగిన ప్రతి సమాచారాన్ని వనరుల లభ్యతపైఆదారపడిసహేతుక కాలపరిమితి లోపు దేశవ్యాప్త నెట్ వర్క్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.

(బిచట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా కింది వాటిని ప్రచురించాలి.

(1) సంబంధిత అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలుపనులువిధులు

(2) దాని అధికారులుఉద్యోగులుకున్న అధికారులువిధులు

(3) పర్యవేక్షణజవాబుదారీతనానికి సంబంధించిన మార్పులునిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు,

(4) విధుల నిర్వహణలో పాటించే పద్ధతులు

(5) దాని దగ్గరలో నియంత్రణలో ఉన్నలేదా కార్యనిర్వహణలో దాని ఉద్యోగులు పాటించే నియమనిబంధనలుఆదేశాలుమాన్యువల్రికార్డులూ,

(6) దాని దగ్గర / నియంత్రణలో ఉన్న పత్రాల రకరకాలకు సంబంధించిన ప్రకటన.

(7) విధానాల రూపకల్నన/వాటి అమలుకుపౌరులతో సంప్రదింపులు జరిపేందుకు/వారి ప్రాతినిధ్యంస్వీకరించేందుకు ఏదైనా పద్దతి ఉంటే...సంబంధిత వివరాలు

(8) దానిలో భాగంగా గానీసలహాలు ఇచ్చేందుకు గానీ ఇద్దరుఅంతకుమించి సభ్యులతో బోర్డులు,కౌన్సిళ్లుఇతర సంస్థలు ఏర్పాటై ఉంటే వాటి వివరాల ప్రకటనవీటన్నింటి సమావేశాలకు ప్రజలనుఅనుమతిస్తున్నదీ లేనిదీ  సమావేశాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయో లేదో..

(9) దాని అధికారులుఉద్యోగుల సమాచార సంపుటం(పేరుహోదా)

(10) దాని అధికారులుఉద్యోగులు పొందే నెలవారీ జితంనిబంధనల ప్రకారం ఉన్న పరిహార చెల్లింపువ్యవస్థ వివరాలు

(11) అన్ని ప్రణాళికలుప్రతిపాదిత వ్యయాలుజరిపిన చెల్లింపుల వివరాలువిడిగా పేర్కొంటూదాని కిందఉన్న అన్ని ఏజెన్సీలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు

(12) రాయితీ పథకాల అమలు తీరువాటికి కేటాయించిన నిధులు పథకాల లబ్దిదారుల వివరాలు

(13) మంజూరు చేసే రాయితీలుపర్మిట్లుఅనుమతులుపొందిన వారి వివరాలు.

(14) అందుబాటులో ఉన్న/నియంత్రణలో ఉన్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్స్ రూపంలో ఉంటే... వివరాలుపొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు.

(15) ప్రజల కోసం ఏదైనా గ్రంథాలయ పనివేళలుసమాచారం పొందేందుకు ప్రజలకున్న సదుపాయాలవివరాలు

(16) పౌర సమాచార అధికారుల పేర్లుహోదాలుఇతర వివరాలు

(17) నిర్ణయించిన తీరుగా ఇతర సమాచారం ఏదైనా తర్వాత ఏడాదికోసారి  సమాచారం అంతటినీసరిచేసి కొత్తగా ఇవ్వడం

(సిముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు గానీప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలనుప్రకటించేటప్పుడు గానీ వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.

(డిపాలనాపరమైన/అర్థన్యాయ (క్వాసీ జ్యూడీషియల్నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వాటికారణాలను వివరించాలి.

(2) సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (బినిర్ధేశిస్తున్న విధంగాసమాచారాన్ని పొందడానికి వీలైనంత తక్కువగాప్రజలు  చట్టాన్ని ఆశ్రయించకుండా చూడటానికి...వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఎవరూ కోరకుండానేఅధికార యంత్రాంగం ఇంటర్నెట్తో సహా వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అందించేందుకు కృషిచేయాలి.

(3) సబ్ సెక్షన్ (1) నిర్ధేశిస్తున్న విధంగా వ్యవహరించేటప్పుడుప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగాఅందుబాటులో ఉండే రూపంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలి.

(4) అన్ని రకాల సమాచారాలను వ్యాప్తి చేసేటప్పుడు...ఉచితంగా లేదా ఎంత చౌకగా  పని చేయగలం,స్థానిక భాష వ్యాప్తికి స్థానికంగా బాగా ఉపకరించే పద్ధతులుసమాచారం వీలైనంతలో ఎలక్ట్రానిక్ రూపంలోకేంద్ర పౌర సమాచార అధికారికి/రాష్ట్ర పౌర సమాచార అధికారికి అందుబాటులో ఉండటం/ప్రసార మాధ్యమాలవ్యయంప్రచురణ వ్యయం అందుబాటులో ఉండటం వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

వివరణ : సబ్ సెక్షన్లు (3), (4) కు సంబంధించి వ్యాప్తి చేయడం అంటే నోటీసు బోర్డులువార్తా పత్రికలు,బహిరంగ ప్రకటనలుమీడియా ప్రసారాలుఇంటర్నెట్/అధికార యంత్రాంగం కార్యాలయాలను తనిఖీచేయడం సహా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం.

(5) 1.  చట్టం అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోగా ప్రతి అధికార యంత్రాంగం దరఖాస్తుదారులకుసమాచారం అందజేయడానికి అన్ని పాలనా యూనిట్లుకార్యాలయాల్లో అవసరమైన సంఖ్యలో కేంద్ర/రాష్ట్రపౌర సమాచార అధికారులను నియమించాలి.

2.  చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోగా సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలకు విరుద్ధం కానిరీతిలో ప్రతి అధికార యంత్రాంగమూ ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో/జిల్లా విభాగాల స్థాయిలో సమాచారంకోరుతూ వచ్చే దరఖాస్తులు/అప్పీళ్లను స్వీకరించడానికి ఒకరిని కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార సహాయఅధికారిగా నియమించాలిస్వీకరించిన వాటిని వారు వెంటనే కేంద్రరాష్ట్ర పౌర సమాచార అధికారికి/సెక్షన్19లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దిష్టపరిచిన సీనియర్ అధికారికికేంద్రసమాచార కమిషన్ కు /రాష్ర్టసమాచార కమిషన్ కు పంపాలిసమాచారం ఇచ్చేందుకు సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్ణయించినకాలపరిమితికి అయిదు రోజులు కలపాలి.

3. సమాచారాన్ని కోరుతూ వచ్చిన ప్రతి అభ్యర్ధననూ ప్రతి కేంద్ర/రాష్ట్ర పౌర సహకారాన్నైనా కేంద్ర/రాష్ట్ర పౌరసమాచార అధికారి కోరవచ్చు.

(6) 1.  చట్టం కింద సమాచారాన్ని కోరదల్చుకున్న వారు ఆంగ్లం/హిందీ/స్థానిక అధికార భాషలోరాతపూర్వకంగాఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుంతోపాటు తమ అభ్యర్ధనను కింద తెలిపిన వారికి పంపాలి.

(కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారికి / సంబంధిత అధికార యంత్రాంగానికి

(బితాము కోరుకున్న సమాచారం వివరాలను రాతపూర్వకంగా కేంద్ర/రాష్ట్ర సహాయ పౌర సమాచారఅధికారకి పౌరుడు ఇవ్వలేని పక్షంలో మౌఖికంగా వారు చేసిన అభ్యర్ధనను రాసేందుకు యుక్తమైనసాయాన్నంతా కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి అందించాలి.

2. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారులెవరైనా అందుకు గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదు.తనకు కబురు చేసేందుకు వీలుగా చిరునామా తప్ప మరే ఇతర వ్యక్తిగతమైన వివరాలను కూడాసమర్పించనక్కర్లేదు.

3. ఒక సమాచారం కోసం అధికార యంత్రాంగానికి ఒక దరఖాస్తు అందినప్పుడు

(1)  సమాచారం మరో అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడులేక

(2)  సమాచారం మరో అధికార యంత్రాంగం పనులకు ఎక్కువగా సంబంధించినదైనప్పుడుదరఖాస్తుఅందుకున్న అధికార యంత్రాంగం  దరఖాస్తును గానీరెండవ అధికార యంత్రాంగానికి సంబంధించినభాగాన్ని గానీ వారికి పంపి...అలా పంపిన విషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి దరఖాస్తునుపంపడం వీలైనంత తొందరగా జరగాలిఅది దరఖాస్తు అందుకున్న నాటి నుంచి అయిదు రోజులలోపూర్తవ్వాలి.

(7) 1 సెక్షన్ 6 కింద సమాచారం కోరుతూ దరఖాస్తు అందినప్పుడు సెక్షన్ 5 (2), సెక్షన్ 6 (3) ప్రకారంవీలైనంత తొందరగాదరఖాస్తు అందిన 30 రోజుల్లోగా కేంద్రరాష్ట్ర పౌర సమాచార అధికారి సమాచారంఅందించాలిలేదా సెక్షన్ 8,9 నిర్దేశిస్తున్న కారణాల వల్ల దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి.దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ‘వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు’ సంబంధించినదయితే దరఖాస్తు అందిన48 గంటల్లో సమాచారం ఇవ్వాలి.

2. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాలపరిమితిలోపు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి సమాచార అధికారిసమాచారం కోరుతూ వచ్చిన దరఖాస్తుపై తన నిర్ణయం చేయకపోతే.. దరఖాస్తును వారు తిరస్కరించినట్లే.

3. సమాచారాన్ని అందించడానికి అయ్యే ఖర్చుకు మరికొంత రుసుం వసూలు చేయాలని కేంద్ర/రాష్ట్ర పౌరసమాచార అధికారి నిర్ణయిస్తే... రుసుంను చెల్లించాలని చెబుతూ దరఖాస్తుదారునికి కబురు చేయాలి.అందులో.....

(సమాచారం అందించేందుకు చెల్లించాల్సిన మరికొంత రుసుం వివరాలుండాలిసబ్ సెక్షన్ (1) కిందమరికొంత రుసుం లెక్కింపు విధానం చెప్పి  మొత్తాన్ని జమ చేయాలని కోరాలికబురు పంపిన రోజునుంచి రుసుం జమ అయ్యేవరకు పట్టిన వ్యవధిని సబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న 30 రోజుల కాలపరిమితి నుంచిమినహాయించాలి.

(బిరుసుంకు సంబంధించిన నిర్ణయంసమాచారం అందించే పద్ధతిపునఃపరిశీలనను కోరేందుకుదరఖాస్తుదారుకు ఉన్న హక్కుదాని కాలపరిమితిఅందుకు అనుసరించాల్సిన విధానాలుఎవరి ముందుఅప్పీలు చేయాలో తెలియజేయాలి.

4.  చట్టం కింద ఒక రికార్డును/అందులో భాగాన్ని అంగవైకల్యం కలిగినదరఖాస్తుదారుడికి చూపించాల్సి వచ్చినపుడు.. వ్యక్తి సమాచారాన్ని పొందేవిధంగాతనిఖీ చేసుకునేందుకు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి తగిన సాయం చేయాలి.

5. సమాచారాన్ని అచ్చు రూపంలోనోఎలక్ట్రానిక్ రూపంలోనో అందించాల్సినప్పుడు దానికి నిర్ణయించినరుసుంను సబ్ సెక్షన్లు (1), (5) ప్రకారం సహేతకంగా ఉండాలిసముచిత ప్రభుత్వం నిర్ణయించిన దానిప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకూడదు.

6. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాల పరిమితిలోపు సమాచారం ఇవ్వడంలో అధికార యంత్రాంగంవిఫలమైతే సబ్ సెక్షన్ (5)తో నిమిత్తం లేకుండా  సమాచారాన్ని ఉచితంగా అందించాలి.

7. సబ్ సెక్షన్ (1) కింద కేంద్రరాష్ట్ర పౌర సమాచార అధికారి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 11కింద మూడో పక్షం సమర్పించిన వాదనను పరిగణనలోకి తీసుకోవాలి.

8. సబ్ సెక్షన్ (1) కింద ఒక దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో దరఖాస్తుదారునకు  కింది విషయాలనుకేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి తెలియజేయాలి.

(1) దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు

(2) తిరస్కరణపై అప్పీలు చేసుకోవడానికి ఉన్న కాలపరిమితి.

(3) అప్పీలు విచారించే అధికారి వివరాలు

9. అధికార యంత్రాంగం వనరులు చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చయ్యే సందర్భంలోనూ రికార్డు భద్రత,రక్షణ ప్రమాదంలో పడుతుందన్న సందర్భంలో తప్ప దరఖాస్తుదారు అడిగిన రూపంలోనే సమాచారంఇవ్వాలి.

8. (1)  చట్టంతో సంబంధం లేకుండా  కింది సమాచారాలను పౌరులకు అందించనక్కర్లేదు.

(భారతదేశ సార్వభౌమాధికారంసమగ్రతలపై ప్రభావం చూపించే సమాచారందేశ భద్రతవ్యూహాత్మక,వైజ్ఞానికఆర్థిక ప్రయోజనాలపైవిదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారంఏదైనానేరాన్ని ప్రేరేపించే సమాచారం.

(బిఏదైనా న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఏదైనా సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని ఆదేశించే ఉంటేఅలాంటి సమాచారంసమాచార ప్రకటన కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందనుకుంటే అలాంటి సమాచారం

(సిపార్లమెంట్రాష్ట్ర శాసనసభ హక్కులను ఉల్లంఘించే రీతిలో ఉన్న సమాచారం.

(డివాణిజ్యపరమైన గోప్యతవ్యాపార రహస్యాలుమేథోసంపత్తికి సంబంధించిన సమాచారంసమాచారవెల్లడి వల్ల పోటీ రంగంలో మూడో పక్షానికి హాని కలిగే సందర్భంలో  సమాచారంవిశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా  తరహా సమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలోదానిని కూడా వెల్లడించవచ్చు.

(విశ్వాసబద్ధమైన సంబంధం రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారంవిశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా  తరహా సమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలోదానిని వెల్లడించవచ్చు.

(ఎఫ్ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాసబద్ధంగా అందిన సమాచారం.

(జి వ్యక్తి ప్రాణానికైనా /భౌతిక భద్రతకైనా హాని కలిగించే సమాచారంచట్టాలఅమలుకుభద్రతా ప్రయోజనాలను ఉద్దేశించి గోప్యంగా సమాచారంఅందించిన/సాయపడిన వారి గుర్తిపునకు దారితీసే సమాచారం.

(హెచ్దర్యాప్తు ప్రక్రియనూనేరస్థులను పట్టుకునేందుకూప్రాసిక్యూట్ చేసేందుకూ అవరోధాలు కల్పించేసమాచారం.

(మంత్రిమండలికార్యదర్శులుఇతర అధికారుల మాలోచనల సహా కేబినెట్ పత్రాలుమంత్రిమండలితీసుకున్ననిర్ణయాలనుఅందుకు గల కారణాలను నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని విషయం పూర్తిగా ముగిసిన తర్వాతే వెల్లడి చేయాలి సెక్షన్ లో నిర్ధేశించిన మినహాయింపుల కిందకువచ్చే సమాచారాన్ని మాత్రం వెల్లడి చేయరాదు.

(జెప్రజా కార్యకలాపాలుప్రజా ప్రయోజనాలతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారంవ్యక్తుల వ్యక్తిగతజీవితంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించే సమాచారంవిశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా  తరహాసమాచారాల వెల్లడి సబబేనని కేంద్రరాష్ట్ర పౌర సమాచార అధికారి/అప్పిలేట్ అధికారి భావిస్తే సమాచారాలను కూడా వెల్లడించవచ్చుపార్లమెంటుకు/రాష్ట్ర శాసనసభకు అందించదగిన  సమాచారాన్నిఅయినా  వ్యక్తికైనా ఇవ్వవచ్చు.

(2) అధికార రహస్యాల చట్టం, 1923తో/సబ్ సెక్షన్ (1) ప్రకారం ఇవ్వదగిన మినహాయింపులతో ఎలాంటిసంబంధం లేకుండారక్షిత ప్రయోజనాలకు కలిగే హాని కన్నా..ప్రజా ప్రయోజనాలకు కలిగే మేలే ఎక్కువనిఅధికార యంత్రాంగం భావిస్తే  సమాచారాన్ని తెలియజేయవచ్చు.

(3) సబ్ సెక్షన్ (1) లోని క్లాజులు (), (సి), (లోని నిబంధనలకు సంబంధించి సెక్షన్ 6 కిందసమాచారం కోసం దరఖాస్తు అందిన రోజుకు 20 ఏళ్ల ముందు సంబంధించిన సమాచారాన్ని అయినాదరఖాస్తుదారునికి ఇవ్వవచ్చు రోజు నుంచి  20 ఏళ్ల గడువును లెక్కించాలన్న ప్రశ్న తలెత్తినపుడుకేంద్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అవుతుంది చట్టంలో నిర్దేశించిన అప్పీళ్ల అవకాశం దీనికి కూడావర్తిస్తుంది.

(9) సమాచారం అందించడం వల్ల రాజ్యానికి చెందింది కాకుండా ఒక వ్యక్తికి చెందిన కాపీరైట్ ఉల్లంఘన జరిగేపక్షంలో అలాంటి సమాచారం కోసం వచ్చిన దరఖాస్తును సెక్షన్-8లోని నిబంధనలకు భంగం కలగకుండానేకేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి తిరస్కరించవచ్చు.

(10) (1) వెల్లడి చేయడానికి మినహాయింపు ఉన్న సమాచారం అనే కారణంతో ఒక దరఖాస్తునుతిరస్కరించినపుడు  చట్టంలోని నిబంధనలతో సంబంధం లేకుండామినహాయింపు పొందిన సమాచారంకాక  రికార్డులో ఉన్న ఇతర సమాచారాన్ని విడదీసి ఇవ్వగలిగే అవకాశం ఉంటే ఇవ్వాలి.

(2) సబ్ సెక్షన్ (1) కింద రికార్డులోని కొద్ది భాగాన్నే వెల్లడి చేయాలని నిర్ణయించినపుడు దరఖాస్తుదారుకి కింది విషయాలు వివరిస్తూ కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి నోటీసు ఇవ్వాలి.

(కోరిన రికార్డల్లో వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని విడదీసి మిగతా భాగాన్ని మాత్రమేఇస్తున్న విషయం.

(బి నిర్ణయానికి గల కారణాలునిర్ణయానికి ముందు పరిశీలనలో వెల్లడి అయిన అంశాలువాటికిసంబంధించిన విషయాలు.

(సినిర్ణయం తీసుకున్న వ్యక్తి పేరుహోదా

(డి వ్యక్తి నిర్ణయించిన రుసుం వివరాలుదరఖాస్తుదారు చెల్లించాల్సిన రుసుం వివరాలు.

(నిర్ణయాన్ని పునఃపరిశీలించమని కోరేందుకు దరఖాస్తుదారుకి ఉన్న హక్కులువసూలు చేసే రుసుంవివరాలుపునఃపరిశీలన కోరే మార్గాలుపద్ధతిఅందుకు గల కాలపరిమితిసెక్షన్ (1) కిందనియమితులైన సీనియర్ అధికారి/కేంద్ర/రాష్ట్ర సమాచార వివరాలు, ఇతర వివరాలు.

(11) (1) తనకు చెందినఅందించిన సమాచారం గోప్యమని మూడో పక్షం భావిస్తున్నప్పుడు చట్టం కిందఅలాంటి సమాచారాన్ని వెల్లడి చేయాలని కేంద్ర/రాష్ట్ర సమాచార అధికారి నిర్ణయిస్తే ...దరఖాస్తు అందినఅయిదు రోజుల్లోగా  విషయాన్ని రాతపూర్వకంగా సంబంధిత మూడో పక్షానికి తెలియజేయాలి.దరఖాస్తుదారుడు కోరిన రికార్డు/సమాచారం అందులో కొద్ది భాగం వెల్లడించాలని భావిస్తున్నట్లుపేర్కొంటూ...అలా వెల్లడి చేయవచ్చో లేదో మౌఖికంగా గానీలిఖితపూర్వకంగా గానీ దాఖలు చేయాలని నోటీసులో మూడో పక్షాన్ని కోరాలిసమాచారాన్ని వెల్లడించాలనే నిర్ణయం తీసుకునే ముందు మూడో పక్షంచేసిన దాఖలును పరిగణనలోకి తీసుకోవాలిచట్టం పరిరక్షిస్తున్న వాణిజ్యవ్యాపార రహస్యాలనుమినహాయించి..సమాచారాన్ని వెల్లడిస్తే మూడో పక్షానికి కలిగే హానికన్నా ప్రజా ప్రయోజనాలకు కలిగే మేలేఎక్కువని భావిస్తే  సమాచారాన్ని వెల్లడించవచ్చు.

(2) సబ్ సెక్షన్ (1) కింద మూడో పక్షానికి నోటీసు ఇచ్చినపుడు ... నోటీసు అందిన నాటి నుంచిపదిరోజుల్లోగా సమాచార వెల్లడి ప్రతిపాదనపై తమ వాదనను దాఖలు చేసుకునేందుకు  మూడో పక్షానికిఅవకాశం ఇవ్వాలి.

(3) సెక్షన్ 6 కింద సమాచారం కోరిన దరఖాస్తు అందినపుడుసబ్ సెక్షన్ (2) కింద తమ వాదననువినిపించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత దరఖాస్తు అందిన నాటి నుంచి 40 రోజుల్లోపు సెక్షన్ (2) కిందతమ వాదనను వినపించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత దరఖాస్తు అందిన నాటి నుంచి 40 రోజుల్లోపుసెక్షన్ (7) లోని నిబంధనలతో పని లేకుండా సమాచారాన్నిరికార్డులను, అందులో భాగాన్ని వెల్లడిచేయాలా...వద్దాని నిర్ణయించినోటీసు ద్వారా తమ నిర్ణయాన్ని మూడో పక్షానికి తెలపాలి.

(4) సబ్ సెక్షన్ (3) మూడో పక్షానికి ఇచ్చిన నోటీసులోని నిర్ణయంపైసెక్షన్ 19 ప్రకారం అప్పీలుకువెళ్లేందుకు దరఖాస్తుదారునికి హక్కు ఉందని కూడా తెలపాలి.

అధ్యాయం - 3
కేంద్ర సమాచార కమిషన్

12. (1)  చట్టం కింద సంక్రమించిన అధికారులను వినియోగించేందుకుఅప్పగించిన బాధ్యతలనునిర్వహించేందుకు అధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సమాచార కమిషన్ అనే సంస్థను ప్రభుత్వంస్థాపిస్తుంది.

(2) కమిషన్లో...

(ప్రధాన సమాచార కమిషనర్

(బిపదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో కేంద్ర సమాచార కమిషనర్లు

(3) ఒక కమిటీ సిఫారసు మేరకు ప్రధాన సమాచార కమిషనర్ నుకేంద్ర సమాచార కమిషనర్లను రాష్ట్రపతినియమిస్తారు కమిటీలో..

(1) ప్రధానమంత్రికమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.

(2) లోక్ సభలో ప్రతిపక్షనేత

(3) ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర క్యాబినేట్ మంత్రి.

వివరణ లోక్ సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతిపెద్ద పార్టీనాయకుణ్ని ప్రతిపక్ష నేతగా పరిగణిస్తారు

(4) కేంద్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణదిశానిర్దేశంనిర్వహణ అధికారాలు ప్రధానసమాచార కమిషనర్ కు సంక్రమిస్తాయి అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్ కు కేంద్రసమాచార కమిషనర్లు సాయపడతారు చట్టం కింద స్వతంత్ర ప్రతిపత్తిలో మరే అధికారానికి లోబడకుండాకేంద్ర సమాచార కమిషన్ వినియోగించే అన్ని అధికారాలనూనిర్వహించే అన్ని పనులనూ కేంద్ర సమాచారకమిషనర్ వినియోగించవచ్చునిర్వహించవచ్చు.

(5) ప్రధాన కమిషనర్సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలివారికి విషయపరిజ్ఞానంచట్టంశాస్త్ర సాంకేతిక రంగాలుసామాజిక సేవమేనేజ్ మెంట్జర్నలిజంప్రసార మాధ్యమాలు,కార్యనిర్వహణపరిపాలనలో అనుభవం ఉండాలి.

(6) ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్లు పార్లమెంట్ సభ్యులు గానీ రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల శాసనసభ్యులుగానీ అయి ఉండరాదుఆర్థికంగా లాభం చేకూరే  ఇతర పదవిలోనూ ఉండరాదు. రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండకూడదు ఇతర వ్యాపారాన్ని గానీవృత్తిని గాని నిర్వహించరాదు.

(7) కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుందికేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగాఆమోదం పొందిన తర్వాత కేంద్ర సమాచార కమిషన్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలునెలకొల్పవచ్చు.

13. (1) ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్లపాటు ప్రధాన సమాచార కమిషనర్ పదవిలోఉంటారుప్రధాన సమాచార కమిషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు వచ్చినతర్వాత  సమాచార కమిషనర్ కూడా పదవిలో ఉండేందుకు వీల్లేదు.

(2) ప్రతి సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు /65 ఏళ్ల వయస్సు వచ్చేవరకూఏది ముందయితే అంతవరకూ పదవిలో ఉంటారుపదవీ విరమణ తర్వాత పునర్నియామకానికి అవకాశంలేదు సబ్ సెక్షన్ కింద పదవీ విరమణ చేసే  సమాచార కమిషసర్కు అయినా సెక్షన్ 12, సబ్ సెక్షన్(3) లో నిర్దేశించిన విధంగా ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులయ్యే అర్హత ఉంటుందిఅలా ప్రధానసమాచార కమిషనర్గా నియమితులైన వ్యక్తి  రెండు పదవుల్లోనూ కలపి అయిదేళ్లకు మించి పదవిలోఉండరాదు.

(3) ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు రాష్ట్రపతి ఎదుటగానీపనికోసం రాష్ట్రపతి నియమించిన మరో వ్యక్తి ముందుగానీ మొదటి షెడ్యూల్లో తెలిపిన విధంగాప్రమాణస్వీకారం చేయాలి.

(4) ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషసర్ ఎప్పుడైనా స్వదస్తూరితో లేఖ రాయడంతో రాష్ట్రపతికిరాజీనామా సమర్పించవచ్చుసెక్షన్ 14లో నిర్దేశించిన రీతిలో ప్రధాన సమాచార కమిషనర్ నుసమాచారకమిషనర్ నూ పదవి నుంచి తొలగించవచ్చు.

(5) వేతనాలుఅలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు :

(ప్రధాన సమాచార కమిషనర్ కు ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సమానంగా ఉంటాయి.

(బిసమాచార కమిషనర్ కు ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయిప్రధాన సమాచార కమిషనర్,సమాచార కమిషనర్ నియమితులైన సమయంలోగతంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి సర్వీసు పింఛనుతీసుకుంటున్నట్లయితే (వికలాంగులుగాయపడిన వారికి ఇచ్చే పించను కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసంమార్పించుకున్న పింఛనుగ్రాట్యుటీ మినహా ఇతర పదవీ విరమణ లాభాలతో సమానమైన పింఛనుమొత్తాన్ని వేతనం నుంచి మినహాయిస్తారుప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్లు తమనియామక సమయంలోగతంలో కేంద్రరాష్ట్ర చట్టాల కింద ఏర్పాటైన కార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ/కేంద్రలేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని/నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలతో చేసిన సర్వీసుకు లబ్దిపొందుతున్నట్లయితే  లబ్దికి సమానమైన పింఛను మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారుప్రధానసమాచార కమిషనర్సమాచార కమిషనర్ల నియామకం తర్వాత వారి వేతనాలుఅలవెన్సులుసర్వీసునియమ నిబంధనల విషయంలో నిర్ణీత పద్ధతిలో వ్యవహరిస్తారు.

14. (1) నిరూపిత అనుచిత ప్రవర్తనఅశక్తత కారణాలతో సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి ప్రధానసమాచార కమిషనర్నులేక  సమాచార కమిషనర్ ను అయినా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవినుంచి తొలగించవచ్చురాష్ట్రపతి సూచనమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తతకారణంతో ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్ను పదవి నుంచి తొలగించవచ్చని చెప్పినతర్వాత రాష్ట్రపతి  ఉత్తర్వును జారీ చేయాలి

(2) సబ్ సెక్షన్ (1) కింద ప్రధాన కమిషనర్/సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టు సూచించినతర్వాత విచారణ జరుగుతున్న సమయంలో...అది ముగిసి కోర్టు నివేదిక వచ్చి ఉత్తర్వులు జారీచేసేంతవరకు సదరు కమిషనర్ ను రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చుఅవసరం లేకుంటే కార్యాలయంలోకిప్రవేశించకుండా నిషేదించవచ్చు.

(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా ప్రధాన సమాచార కమిషనర్ ను / సమాచారకమిషనర్ను  కింది కారణాలతో తన ఉత్తర్వుల ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

(దివాళా తీసినట్లు నిరూపితమయితే..

(బిఏదైనా నేర నిరూపణ జరిగి నేరం నీతి బాహ్యమని రాష్ట్రపతి భావించినపుడు,

(సిఆర్థికలాభం కోసం పదవిలో ఉన్నప్పుడు తన విధి నిర్వహణలో సంబంధం లేని ఇతర పనులుచేసినపుడు,

(డిశారీరకంగా/మానసికంగా పదవిలో కొనసాగడానికి పనికిరారని రాష్ట్రపతి భావించినప్పుడు

(తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూఇతరత్రాప్రయోజనాలను పొందినప్పుడు

(4) కేంద్ర ప్రభుత్వం/దాని తరుపున చేసుకున్న  ఒప్పందంకాంట్రాక్టులోనయినా ప్రధాన సమాచారకమిషనర్/సమాచార కమిషనర్ అయినా  తరహాలోనైనా ఆసక్తి చూపించినాకల్పించుకున్నాసబ్ సెక్షన్(1)లో పేర్కొన్న అనుచిత ప్రవర్తన కిందకు వస్తుందిఏదైనా ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు, ఆదాయాలు,రాబడుల్లో సభ్యుడిగా కాక మరో విధంగా పాలు పంచుకున్నా...అనుచిత ప్రవర్తనే అవుతుంది.

అధ్యాయం - 4
రాష్ట్ర సమాచార కమిషన్

15. (1)  చట్టం కింద సంక్రమించిన అధికారాలను వినియోగించేందుకుఅప్పగించిన బాధ్యతలనునిర్వహించేందుకు అధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా ....సమాచార కమిషన్ అనే సంస్థను రాష్ట్రప్రభుత్వంస్థాపిస్తుంది.

(2) కమిషన్లో...

(రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్

(బిపదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమిషనర్లు

(3) ఒక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్నురాష్ట్ర సమాచార కమిషనర్లనుగవర్నర్ నియమిస్తారు కమిటీలో...

(1) ముఖ్యమంత్రికమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.

(2) శాసనసభలో ప్రతిపక్ష నేత

(3) ముఖ్యమంత్రి నామినేట్ చేసే ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి.

(వివరణ : శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతి పెద్ద పార్టీనాయకుణ్ని ప్రతిపక్ష నేతగా పరిగణిస్తారు.)

(4) రాష్ట్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణదిశానిర్దేశంనిర్వహణ అధికారాలు రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్ కు సంక్రమిస్తాయి అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్కు రాష్ట్ర సమాచార కమిషనర్లు సాయపడతారు చట్టం కింద స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికిలోబడకుండా రాష్ట్ర సమాచార కమిషన్ వినియోగించవచ్చునిర్వహించవచ్చు.

(5) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి.వారికి విషయ పరిజ్ఞానంచట్టంశాస్త్త సాంకేతిక రంగాలుసామాజిక సేవమేనేజ్ మెంట్జర్నలిజంప్రసారమాధ్యమాలుకార్యనిర్వహణపరిపాలనలో అనుభవం ఉండాలి.

(6) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషసర్సమాచార కమిషనర్లు పార్లమెంట్ సభ్యులుగానీ రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల శాసనసభ సభ్యులుగానీ అయి ఉండరాదుఆర్థికంగా లాభం చేకూరే  ఇతర పదవిలోనూఉండరాదు రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండకూడదు ఇతర వ్యపారాన్ని గానీఇతర వృత్తిని గానీనిర్వహించరాదు.

(7) రాష్ట్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం  రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్లో ప్రకటించిన చోటఏర్పాటవుతుందిరాష్ట్రప్రభుత్వం నుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రసమాచార కమిషన్రాష్ట్రం ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.

16. (1) ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్ల పాటు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ పదవిలోఉంటారురాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు వచ్చినతర్వాత  రాష్ర్ట సమాచార కమిషన్ కూడా పదవిలో ఉండేందుకు వీల్లేదు.

(2) ప్రతి రాష్ట్ర సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు/65 ఏళ్ల వయస్సువచ్చేవరకూ ఏది ముందయితే అంతవరకూ పదవిలో ఉంటారుపదవీ విరమణ తర్వాతపునర్నియామకానికి అవకాశం లేదు.  సబ్ సెక్షన్ కింద పదవీ విరమణ చేసే  రాష్ట్ర సమాచార కమిషనర్అయినా సెక్షన్ (3)లో నిర్దేశించిన విధంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యే అర్హతఉంటుందిఅలా ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులైన వ్యక్తి  రెండు పదవుల్లోనూ కలిపిఅయిదేళ్లకు మించి పదవిలో ఉండరాదు.

(3) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు గవర్నర్ఎదుటగానీ పని కోసం గవర్నర్ నియమించిన మరో వ్యక్తి ముందు గానీ మొదటి షెడ్యూల్లో తెలిపినవిధంగా ప్రమాణ స్వీకారం చేయాలి.

(4) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్ ఎప్పుడైనా స్వదస్తూరితో లేఖ రాయడంతోగవర్నర్కు రాజీనామా సమర్పించవచ్చుసెక్షన్ 14లో నిర్దేశించిన రీతిలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను/సమాచార కమిషనర్ నూ పదవి నుంచి తొలగింవచ్చు.

(5) వేతనాలుఅలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు :

(రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయి.

(బిరాష్ట్ర సమాచార కమిషనర్ కు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానంగా ఉంటాయిరాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్సమాచార కమిషనర్ గా నియమితులైన సమయంలోగతంలో కేంద్రరాష్ట్రప్రభుత్వాల నుంచి సర్వీసు పింఛను తీసుకుంటున్నట్లయితే (వికలాంగులుగాయపడిన వారి ఇచ్చే పింఛనుకాకుండాఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పింఛనుగ్రాట్యుటీ మినహా ఇతర పదవీ విరమణలాభాలతో సమానమైన పంఛను మొత్తాన్ని వేతనం నుంచి మినహాయిస్తారురాష్ట్ర ప్రధాన సమాచారకమిషనర్సమాచార కమిషనర్లు తమ నియామక సమయంలోగతంలోకేంద్రం/రాష్ర చట్టాల కిందఏర్పాటైన కార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూకేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని/నియంత్రణలోనిప్రభుత్వ కంపెనీలలో చేసిన సర్వీసుకు లబ్ది పొందుతున్నట్లయితే... లబ్దికి సమానమైన పింఛనుమొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారురాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్లనియామకం తర్వాత వారి వేతనాలుఅలవెన్సులుసర్వీసు నిబంధనల విషయంలో నిర్ణీత పద్ధతిలోవ్యవహరిస్తారు.

17. (1) నిరూపిత అనుచిత ప్రవర్తనఅశక్తత కారణాలతో సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి రాష్ర్టప్రధాన సమాచార కమిషనర్ నూలేక  రాష్ట్ర సమాచార కమిషనర్ను అయినా ఒక్క గవర్నర్ ఉత్తర్వుద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చుగవర్నర్ సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపిఅనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్ నుపదవి నుంచి తొలగించవచ్చని చెప్పిన తర్వాత గవర్నర్  ఉత్తర్వు జారీ చేయాలి.

(2) సబ్ సెక్షన్ (1) కింద రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్ పై విచారణకుసుప్రీంకోర్టుకు సూచించిన తర్వాత విచారణ జరుగుతున్న సమయంలో....అది ముగిసి కోర్టు నివేదికవచ్చి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సదరు కమిషనర్ను గవర్నర్ సస్పెండ్ చేయవచ్చుఅవసరంఅనుకుంటే కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు.

(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను/సమాచార కమిషనర్ను  కింది కారణాలతో తన ఉత్తర్వులు ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

(దివాళా తీసినట్లు నిరూపితమైతే

(బి) ఆర్థిక లాభం కోసం పదవిలో ఉన్నప్పుడు తన విధి నిర్వహణతో సంబంధం లేని ఇతర పనులుచేసినప్పుడు

(సిఏదైనా నేర నిరూపణ జరిగి,  నేరం నీతి బాహ్యమని గవర్నర్ భావించినప్పుడు

(డిశారీరకంగా/మానసికంగా దుర్భరులై పదవిలో కొనసాగడానికి పనికిరాదని గవర్నర్ భావించినప్పుడు

(తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రాప్రయోజనాలను పొందినప్పుడు

(4) కేంద్ర ప్రభుత్వం/దాని తరపున చేసుకున్న  ఒప్పందంకాంట్రాక్టులోనయినా రాష్ట్ర ప్రధాన సమాచారకమిషనర్రాష్ట్ర సమాచార కమిషనర్ అయినా  తరహాలోనయినా ఆసక్తి చూపించినాకల్పించుకున్నాసబ్ సెక్షన్ (1) లో పేర్కొన్న అనుచిత ప్రవర్తన కిందకు వస్తుందిఏదైనా ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు,ఆదాయాలురాబడుల్లో సభ్యుడిగా కాక మరో విధంగా పాలు పంచుకున్నా..అనుచిత ప్రవర్తనే అవుతుంది.కంపెనీ లాభాలుఆదాయాలురాబడులలో సభ్యుడిగా కాక మరో విధంగా పాలుపంచుకున్న సందర్భంలోకూడా అనుచిత ప్రవర్తన కిందకు వస్తుంది.

అధ్యాయం - 5
సమాచార కమిషన్ల అధికారాలు, విధులు అప్పీలుజరిమానాలు

18. (1)  చట్టంలోని నిబంధనలకు లోబడి  వ్యక్తి అయినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్రసమాచార కమిషన్ లేక రాష్ర్ట సమాచార కమిషన్ విధి ఫిర్యాదుల సందర్భాలు :

(కేంద్ర ప్రజా సమాచార అధికారి / రాష్ట్ర ప్రజా సమాచార అధికారి నియామకం జరగని కారణంగాసమాచారం కోసం అభ్యర్ధన అందించలేని పక్షంలోకేంద్ర ప్రజా సమాచార సహాయ అధికారి లేక రాష్ట్ర ప్రజాసమాచార సహాయ అధికారి సమాచారం కోసం వచ్చిన దరఖాస్తునోఅప్పీలునో స్వీకరించకుండాదీనినికేంద్ర పౌర సమాచార అదికారి రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (1) పేర్కొన్నసీనియర్ అదికారి కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్కు పంపిన పక్షంలో (బి చట్టం కిందఅభ్యర్థించిన సమాచారాన్ని అందించేందుకు నిరాకరించినప్పుడు

(సి చట్టం కింద సమాచారం కోసం ఇచ్చిన అభ్యర్ధనకు నిర్దేశించిన కాలపరిమితిలొగా జవాబు రానిపక్షంలో

(డిసమాచారం కోసం చెల్లించాల్సి వచ్చిన రుసుము సహేతుకంగా లేదని దరఖాస్తుదారు భావిస్తే

( చట్టం కింద తనకు అసంపూర్తిగాతప్పుదోవ పట్టించే విధంగాతప్పుడు సమాచారం అందించారనిదరఖాస్తుదారు భావించినప్పుడు

(ఎఫ్ చట్టం కింద సమాచారాన్ని కోరడంరికార్డులను అందుబాటులో ఉంచడానికి సంబంధించిన మరేఇతర విషయాలలోనైనా

(2) ఫిర్యాదును విచారించేందుకు తగిన కారణాలు ఉన్నాయని కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచారకమిషన్ భావించిన పక్షంలో దానిపై విచారణకు ఆదేశించవచ్చు.

(3)  సెక్షన్ కింద  విషయంలోనైనా విచారణ జరిపేటప్పుడు కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచారకమిషన్ కు సివిల్ ప్రొసిజర్ కోడ్, 1908 కింద  దావానయినా విచారించేప్పుడు సివిల్ కోర్టుకు ఎలాంటిఅధికారాలు ఉంటాయో  కింది వాటికి సంబంధించి అలాంటి అధికారాలు ఉంటాయి.

(వ్యక్తులకు సమన్లు జారీ చేసిన వారిు హాజరు అయ్యేటట్లు చేయడంమౌఖికంగా లిఖిత పూర్వకంగావారు సాక్ష్యం ఇచ్చేట్లు చేయడంపత్రాలు ఇతర వస్తువులను సమర్పించేట్లు చేయడం.

(బిపత్రాలు వెలికితీసీ తనిఖీ చేయడం

(సిఅఫిడవిట్ రూపంలో వాంగ్మూలం స్వీకరించడం

(డి కోర్టు కార్యాలయం నుంచి అయినా ప్రభుత్వ రికార్డులులేక వాటి కాపీలను తెప్పించడం.

(సాక్ష్యులను విచారించేందుకు పత్రాలు పరిశీలించేందుకు సమన్లు జారీ చేయడం

(ఎఫ్నిర్ణయించిన విధంగా మరే ఇతర విషయమైనా

(4) పార్లమెంట్ లేక రాష్ట్ర శాసనసభలు చేసిన  ఇతర చట్టంలోని నిబంధనలు అడ్డుగా ఉన్నప్పటికీకేంద్రసమాచార కమిషన్ లేక రాష్ర్ట సమాచార కమిషన్  చట్టం కింద ఒక ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నసందర్భంలోఅధికార యంత్రాంగం నియంత్రణలో ఉండి  చట్టం వర్తించే  రికార్డునయినా పరిశీలించవచ్చు.అలాంటి రికార్డులను  కారణంతోనయినా సమాచార కమిషన్ ముందు ఉంచకపోవడం కుదరదు.

(19) (1) సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (3) లోని క్లాజు ()లో నిర్దేశించిన కాలపరిమితిలోగాజవాబు దొరకని వ్యక్తి ఎవరైనాలేక కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారితీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారైనా  కాలపరిమితి ముగింపు తరువాత లేక నిర్ణయం అందినతరువాత 30 రోజులలోగా అప్పీలు చేసుకోవచ్చుకేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచారఅధికారికిసంబంధిత అధికార యంత్రాంగంలో సీనియర్ హోదాలో ఉన్న అధికారికి  అప్పీలునునివేదించాలి. 30 రోజుల గడువు ముగిసిన తర్వాత అప్పీలు వచ్చిన సందర్భంలో  ఆలస్యానికి తగినకారణాలు ఉన్నాయని  సీనియర్ అధికారి భావించిన పక్షంలో  అప్పీలును స్వీకరించవచ్చు.

(2) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 11 కింద తృతీయ పక్షానికిచెందిన సమాచారాన్ని వెల్లడి చేయాలని నిర్ణయించిన సందర్భంలో  నిర్ణయంపై అప్పీలు చేయాలనితృతీయ పక్షం భావించినట్లయితే  నిర్ణయం వెలువడిన 30 రోజులలోగా అప్పీలు చేయాలి.

(3) సబ్ సెక్షన్ (1) కింద వచ్చిన నిర్ణయంపై రెండవసారి అప్పీలు చేయదలిస్తే  నిర్ణయం తీసుకునిఉండాల్సిన తేదీ నుంచి కానీ నిర్ణయం అందిన రోజు నుంచి కానీ 90 రోజులలోగా కేంద్ర సమాచార కమిషన్లేక రాష్ట్ర సమాచార కమిషన్ ముందు అప్పీలుకు వెళ్లవచ్చు. 90 రోజుల గడువు దాటి రెండవ అప్పీలువచ్చిన సందర్భంలో  ఆలస్యానికి తగిన కారణం ఉందని కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచారకమిషన్ భావించిన పక్షంలో దానిని స్వీకరించవచ్చు.

(4) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయంపై వచ్చిన అప్పీలు తృతీయపక్షానికి చెందిన సమాచారానికి సంబంధించినదయితే కేంద్ర సమాచార కమిషన లేక రాష్ట్ర సమాచారకమిషన్  తృతీయ పక్షానికి తమ వాదన వినిపించుకునేందుకు తగిన అవకాశం ఇవ్వాలి.

(5)  అప్పీలు విచారణలోనయినా అభ్యర్ధనను తిరస్కరించడం న్యాయబద్దమేనని నిరూపించాల్సిన బాధ్యత తిరస్కరించి అధికార యంత్రాంగంపైనే ఉంటుంది.

(6) సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (2) కింద వచ్చిన అప్పీళ్ళను అవి అందిన తర్వాత 30 రోజులలోగాపరిష్కరించాలి కాలపరిమితి పొడిగించాల్సి వస్తే అప్పీలు దాఖలయిన నాటి నుంచి మొత్తం 45రోజులలోగా అప్పీలును పరిష్కరించాలి పొడిగింపునకు గల కారణాలను రాతపూర్వకంగా నమోదుచేయాలి.

(7) కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ వెలువరించిన నిర్ణయాలకు తప్పనిసరిగా అందరూకట్టుబడాలి.

(8) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు  కింది నిర్ణయాధికారాలు ఉన్నాయి :

( చట్టంలోని నిబంధనలు అమలు జరిపేందుకు అవసరమైన ఏవైనా చర్యలు తీసుకోవాల్సిందిగాఅదేశించడం చర్యలలో  కిందివి కూడా భాగాలు :

(1) ఎవరైనా కోరిన పక్షంలో ఒక ప్రత్యేకమైన రూపంలో సమాచారం అందుబాటులో ఉంచడం

(2) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిని నియమించడం

(3) నిర్దిష్టమైన సమాచారాన్ని లేక కొన్ని విభాగాల సమాచారాన్ని ప్రచురించడం

(4) రికార్డుల నిర్వహణమేనేజ్ మెంట్విధ్వంసానికి సంబంధించి అనుసరిస్తున్న పద్ధతులలో కొన్నిఅవసరమైన మార్పులు చేయడం.

(5) అధికార యంత్రాంగంలోని అధికారులకు సమాచార హక్కుపై శిక్షణ ఇచ్చే సదుపాయాలను హెచ్చించడం.

(6) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ ‘(1) క్లాజు (బిఅమలుపై వార్షక నివేదిక రూపొందించడం.

(బిఫిర్యాదులను కలిగిన నష్టాన్ని కానీ ఇతర కష్టాన్ని కానీ పరిహారం ద్వారా పూడ్చాల్సిందిగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించడం.

(సి చట్టంలో నిర్దేశించిన విధంగా జరిమానాలు విధించడం

(డిదరఖాస్తును తిరస్కరించడం

(9) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ తన నిర్ణయాన్నిఅప్పీలు అవకాశం ఉంటే వివరాలతో సహా ఫిర్యాదుదారుకూఅధికార యంత్రాంగానికి నోటీసు ద్వారా తెలియపరచాలి.

(10) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ అప్పీలు విచారణను నిర్ణీత పద్ధతిలోజరపవచ్చు

(20) (1) ఫిర్యాదుపై లేక అప్పీలుపై కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయంతీసుకునే సమయంలోకేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైన కారణంలేకుండా దరఖాస్తును స్వీకరించలేదని భావించినాతగిన కారణం లేకుండా సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1)కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు సమాచారం అందించలేదని భావించినాసమాచారం కోసం అభ్యర్ధననుదురుద్దేశంతో తిరస్కరించారని భావించినాలేక తెలిసి కూడా తప్పుడుఅసంపూర్తి తప్పుదోవబట్టించేసమాచారం అందించారని భావించినాఅభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినామరేవిధంగానయినా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా దరఖాస్తును స్వీకరించేంతవరకు లేకసమాచారం అందించేంతవరకు రోజుకు 250 రూపాయలు చొప్పున జరిమానా విధించే ముందు కేంద్ర పౌరసమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది.

(2) ఫిర్యాదుపై లేక అప్పీలుపై నిర్ణయం తీసుకునే సమయంలోకేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌరసమాచార అధికారి సరైన కారణం లేకుండా పదే పదే దరఖాస్తును స్వీకరించలేదనిలేక సెక్షన్ 7 లోని సబ్సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు సమాచారాన్ని అందించలేదని కేంద్ర సమాచార కమిషన్ లేకరాష్ట సమాచార కమిషన్ భావించిన పక్షంలోలేక సమాచారం కోసం అభ్యర్ధనను దురుద్దేశంతోతిరస్కరించారని భావించినాలేక తెలిసికూడా తప్పుడుఅసంపూర్తి తప్పుదోవ పట్టించే సమాచారంఅందించారని భావించినాఅభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినామరే విధంగానయినా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా  కేంద్ర పౌర సమాచార అధికారి లే్క రాష్ట్ర పౌరసమాచార అధికారిపై వారికి వర్తించే సర్వీసు నిబంధనల కింద క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా సిఫారసుచేయాలి.

అధ్యాయం - 6
ఇతర నిబంధనలు

21.  చట్టం కింద లేక  చట్టం కింద రూపొందిన రూల్స్ కింద నుంచి చేస్తున్నానన్న నమ్మకంతో ఎవరేంచేసినాచేసేందుకు ఉద్దేశించినా అందుకు వారిపై ఎలాంటి దావాలు వేయడంప్రాసిక్యూట్ చేయడం,చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.

22. అధికార రహస్యాల చట్టం, 1923 అమలులో ఉన్న మరేదైనా చట్టంలేక మరేదైనా చట్టం వల్లఅమలులో ఉన్న పత్రంలో  చట్టంతో పొసగని అంశాలు ఎలాంటివి ఉన్నప్పటికీ  చట్టంలోని నిబంధనలుఅమలులో ఉంటాయి.

23.  చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను గానీదరఖాస్తునున గానీఇతరవిచారణలను గానీ  న్యాయస్థానం చేపట్టరాదు చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆదేశాలను ప్రశ్నించడం కుదరద.

24. (1) రెండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇంటిలిజెన్స్భద్రతా సంస్థలకు,  సంస్థలు ప్రభుత్వానికి సమర్పించేఎలాంటి సమాచారానికీ  చట్టం వర్తించదుఅవినీతి ఆరోపణలుమానవహక్కుల ఉల్లంఘనలకుసంబంధించిన సమాచారం కోరినప్పుడు కేంద్ర సమాచార కమిషన్ ఆమోదం తర్వాత అభ్యర్ధన అందిన దగ్గరనుంచి 45 రోజులలోగాసెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండాసమాచారం అందించాల్సిఉంటుంది.

(2) కేంద్ర ప్రభుత్వం తాను నెలకొల్పిన మరో ఇంటిలిజెన్స్ లేక భద్రతా సంస్థనుఅధికార గెజిట్లో ప్రచురించడంద్వారారెండవ షెడ్యూల్లో చేర్చవచ్చుఅలాగే ఇప్పటికే అందులో ఉన్న ఏదైనా సంస్థను తొలగించవచ్చు.అలాంటి నోటిఫికేషన్ ప్రచురించగానే ఒక సంస్థ షెడ్యల్ లో చేరినట్టుగానో లేక తొలగిపోయినట్లుగానో లెక్క.

(3) సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ నూ పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి.

(4) రాష్ర్టప్ఱభుత్వం నెలకొల్పిన ఇంటలజెన్స్భద్రతాసంస్థలకు  చట్టం వర్తించదుఇంటిలిజెన్స్,భద్రతాసంస్థలను రాష్ట్రప్రభుత్వం అధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారాపేర్కొన వచ్చుఅవినీతిఆరోపణలకు సంబంధించిన సమాచారం అయినప్పుడు  సబ్ సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది.మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అయితేరాష్ట్ర సమాచార కమిషన్ ఆమోదంపొందిన తర్వాతసెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లే్కుండాఅభ్యర్థన అందిన నాటి నుంచి 45రోజులలోగా  సమాచారం అందించాల్సి ఉంటుంది.

(5) సబ్ సెక్షన్ (4) కింద జారీచేసిన ప్రతి నోటిఫికేషన్ నూ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.

25. (1) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితేఅంత త్వరగా ప్రతి ఏడాది ఆఖరులో  చట్టంలోని నిబంధనల అమలుపై ఒక నివేదిక రూపొందించి దానికాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి.

(2)  సెక్షన్ కింద నివేదిక రూపొందించడం కోసం ప్రతి మంత్రిత్వశాఖ లేక డిపార్ట్ మెంటు తమ పరిధిలోనిఅధికార యంత్రాంగాలకు సంబంధించిన సమాచారం సేకరించి కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచారకమిషన్ కు సమర్పించాలి.  తరహా సమాచారం సమర్పించడంరికార్డులను నిర్వహించడం కోసంఅవసరమైన అన్ని అంశిాలను పాటించాలి.

(3) ప్రతి నివేదికలో  సంవత్సరానికి సంబంధించి  కింది అంశాలు ఉండాలి :

(ప్రతి అధికార యంత్రాంగానికి వచ్చిన అభ్యర్ధుల సంఖ్య

(బిదరఖాస్తుదారులకు సమాచారం అందివ్వకూడదన్న నిర్ణయాల సంఖ్య  చట్టంలో  నిర్ణయాలకుప్రాతిపదికగా ఉన్న నిబంధనల వివరాలుఎన్నిసార్లు  నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చింది

(సికేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు అందిన అప్పీళ్ళ సంఖ్య  అప్పీళ్ల వివరాలు, అప్పీళ్ల ఫలితాలు.

(డి చట్టం అమలుకు సంబంధించి  అధికారిపైన అయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే వివరాలు.

( చట్టం కింద ప్రతి అధికార యంత్రాంగం వసూలు చేసిన రుసుముల వివరాలు.

(ఎఫ్ చట్టం స్ఫూర్తినీ , ఉద్దేశాలనూ అమలులో పెట్టేందుకు అధికార యంత్రాంగాల తరపున ఏదైనా కృషిజరిగి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవ సమాచారం.

(జిఏదైనా ఒక ప్రత్యేకమైన అధికార యంత్రాంగానికి సంబంధించిన సిఫార్సులతో సహా సంస్కరణలకుసంబంధించిన సిఫారసులు చట్టం లేక సమాచార హక్కును అమలులోకి తీసుకురావడానికి ఉపకరించేమరే చట్టం అయినావాటి అభివృద్ధివికాసంఆధునీకరణసంస్కరణసవరణలకు సంబంధించినసిఫార్సులు.

(4) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఏడాది ఆఖరులో ఆచరణలో ఎంత త్వరగా సాధ్యంఅయితే అంత త్వరగా పార్లమెంటు ఉభయసభల ముందు లేక రాష్ట్రాలలో రెండు సభలు ఉంటే రెండు సభలముందులేక విధానసభ ఒకటే ఉంటే  సభ ముందు ఉంచాలి.

(5) ఒక అధికార యంత్రాంగం  చట్టం కింద తన విధులు నిర్వహించడం  చట్టం నిబంధనలకూస్ఫూర్తికీఅనుగుణంగా లేదని కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో విధానాలు అందుకు అనుగుణంగా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యలను  అధికార యంత్రాంగానికిసిఫారసు చేయవచ్చు.

26. (1) ఆర్థిక వనరులుఇతర వనరులు అందుబాటులో ఉన్నంతమేరకు సముచిత ప్రభుత్వం కిందిచర్యలు చేపట్టాలి?

( చట్టంలో నిర్ధేశించిన హక్కులను వినియోగించుకునే విషయంలో ప్రజలుముఖ్యంగా అణగారినవర్గాల ప్రజల అవగాహనను పెంపొందించడం కోసం కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం.

(బిక్లాజ్ ()లో పేర్కొన్న కార్యక్రమంలో పాలుపంచుకోవడంఅలాంటి కార్యక్రమాలు తామే చేపట్టడం కోసంఅధికార యంత్రాంగాలను ప్రోత్సహించడం.


(సితమ కార్యకలాపాల గురించి అదికార యంత్రాంగాలు సరైన సమయంలోసమర్థవంతంగా, ఖచ్చితమైనసమాచారాన్ని ప్రజలకు అందించేట్లు చూడడం.

(డికేంద్ర పౌర సమాచార అధికారులు లేక రాష్ట్ర పౌర సమాచార అధికారులకు శిక్షణ ఇవ్వడంఅధికారయంత్రాంగాలు ఉపయోగించుకోవడం కోసం శిక్షణా సామాగ్రిని రూపొందించడం.

(2)  చట్టం కింద సంక్రమించిన హక్కులను వినియోగించుకోదలచిన  వ్యక్తికి అయినా అవసరమయ్యేసమాచారంతోతేలికగా అర్థంవ అయ్యే రీతిలో ఒక గైడ్ను సముచిత ప్రభుత్వం చట్టం అమలులోకి వచ్చినతర్వాత 18 నెలలులోగా అధికార భాషలో ముద్రించాలి.

(3) సముచిత ప్రభుత్వంఅవసరమైన పక్షంలోసబ్ సెక్షన్ (2) లో సూచించిన మార్గదర్శక సూత్రాలనుఎప్పటికప్పుడు సవరించి ప్రచురించవచ్చుసబ్ సెక్షన్ (2) సాధారణ లక్షణాలకు భంగం వాటిల్లని రీతిలో కింది విషయాలపై మార్గదర్శక సూత్రాలను ప్రచురించవచ్చు.

( చట్టం లక్ష్యాలు

(బిసెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద ప్రతి అధికార యంత్రాంగంలో నియమితులైన కేంద్ర పౌర సమాచారఅధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి చిరునామాఫోన్ నంబరుఫ్యాక్స్ నంబరుదొరికిన పక్షంలో-మెయిల్ అడ్రస్.

(సికేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి సమాచారం కోసం అభ్యర్ధన అందించేవిధానంరూపం,

(డి చట్టం ప్రకారం ఒక అధికార యంత్రాంగంలోని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర అధికారినుంచి దరఖాస్తుదారుకు అందే సహాయం అధికారుల విధులు.

(కేంద్ర సమాచారం కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి అందగల సహాయం.

(ఎఫ్ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు చట్టం నిర్దేశిస్తున్న విధులకు సంబంధించి ఏదన్నాజరిగినాఏదన్నా జరగకపోయినాసమాచార కమిషన్ కు అప్పీలు చేసుకోవడంతో సహా చట్టంలో ఉన్నఅన్ని పరిష్కార మార్గాలు.

(జిసెక్షన్ 4 ప్రకారం వివిధ విభాగాల రికార్డులను స్వచ్ఛందంగా వెల్లడి చేయడానికి సంబంధించిననిబంధనలు

(హెచ్సమాచారం అందుబాటు కోసం చెల్లించాల్సిన రుసుము నోటీసులు.

( చట్టం ప్రకారం సమాచారం అందుబాటు కోసం ఏవైనా రూల్స్ రూపొందించినాసర్క్యులర్లు జారీచేసినా వాటి వివరాలు.

(4) సముచిత ప్రభుత్వంఅవసరం అయిన పక్షంలోతప్ననిసరిగా మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడుసవరించి ప్రచురించాలి.

27. (1)  చట్టంలోని నిబంధనలు అయలు చేయడం కోసం కేంద్రప్రభుత్వం అధికార గెజిట్లో ప్రచురించడంద్వారా నియమాలు రూపొందించవచ్చు.

(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో  కింది విషయాలన్నింటికీ లేక వాటిలోకొన్నిటికి సంబంధించి నియమాలు రూపొందించవచ్చు. (సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తిచేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకూ అయ్యే ఖర్చు ధర.

(బిసెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము

(సిసెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) , (5) కింద చెల్లించాల్సిన రుసుము.

(డిసెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (7) ప్రకారంసెక్షన్ 16 లోని సబ్ సెక్షన్ (6) ప్రకారం అధికారులకూ,

ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలుఅలవెన్సులువారి సర్వీసు నిబంధనలు.

(సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (10) ప్రకారం అప్పీళ్లపై విచారణకు కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్రసమాచార కమిషన్ అవలంబించవలసిన పద్ధతి.

(ఎఫ్నిర్ణీత పద్ధతిలో నిర్ణయించవలసిన మరే విషయమయినా.

28. (1)  చట్టంలోని నిబంధనలను అమలు చేయడం కోసం అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా సమర్థఅధికారి నియమాలు రపొందించవచ్చు.

(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో  కింది విషయాలన్నింటికీలేక వాటిలోకొన్నిటికి సంబంధించి రూల్స్ రూపొందించవచ్చు :

(సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తి చేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకు అయ్యేఖర్చు ధర.

(బిసెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము.

(సిసెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము.

(డినిర్ణీత పద్దతిలో నిర్ణయించవలసిన మరే విషయంలో

29. (1)  చట్టం కింద చేసిన ప్రతి రూల్ నూ  వెంటనే కేంద్రప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల ముందు, 30 రోజులపాటు ఒక సమావేశం తర్వాత రెండవ సమావేశం ముగిసే ముందులేక ముందు చెప్పిన వరుససమావేశాలు ముగిసే ముందు ఉభయసభలు ఒక రూల్ ను సవరించాలనీలేక అసలు  రూల్ఉండకూడదని కానీ నిర్ణయించిన పక్షంలో  రూల్  నిర్ణయం ప్రకారం సవరించిన రూపంలోఅమలవుతుందిలేక రద్దయిపోతుందిఅయితే  విధమైన సవరణగానీరద్దు గానీ  రూల్ కిందఅంతకుముందు చేసిన పనులపై ప్రభావం చూపించరాదు.

(2)  చట్టం కింద చేసిన ప్రతి నిబంధననునోటిఫై చేసిన వెంటనే రాష్ట్రప్రభుత్వం విధానసభ ముందుఉంచాలి.

30. (1)  చట్టంలోని నిబంధనల అమలుకు ఎలాంటి అవరోధం ఎదురయినా కేంద్రప్రభుత్వం  చట్టంలోనినిబంధనలకు విరుద్ధం కాని రీతిలో  అవరోధాలను తొలగించేందుకు అవసరమనిపించిన రీతిలో అధికారిగెజిట్లో ఉత్తర్వులను ప్రచురించడం ద్వారా తగిన నిబంధనలను రూపొందించవచ్చు చట్టం అమలులోకివచ్చిన నాటి నుంచీ రెండేళ్ల తర్వాత  రకమైన ఉత్తర్వులను ప్రచురించేందుకు వీలులేదు.

(2)  సెక్షన్ కింద ప్రచురించిన ప్రతి ఉత్తర్వును పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి.

31. సమాచార స్వేచ్ఛ చట్టం, 2002 దీనితో రద్దయిపోయింది.

మొదటి షెడ్యూలు
(సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (3) చూడండి)

ప్రధాన సమాచార కమిషనర్సమాచార కమిషనర్రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్రాష్ట్ర సమాచారకమిషనర్ స్వీకరించాల్సిన పదవీ ప్రమాణంప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్గానియమితులైన...అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసిచట్ట ప్రకారం ఏర్పాటయిన భారత రాజ్యాంగానికినిజమైన విశ్వాసంభక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటాననిభారత సార్వభౌమాధికారంసమగ్రతను పరిరక్షిస్తాననినాకు సాధ్యమైనంతవరకు విచక్షణతోవిజ్ఞానంతోవిశ్వాసంగా భయపక్షపాతదురభిప్రాయరహితంగాపదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

రెండో షెడ్యూల్
సెక్షన్ 21 చూడండి
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్భద్రతా సంస్థలు

1. ఇంటలిజెన్స్ బ్యూరో

2. క్యాబినెట్ సెక్రటేరియల లోని రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)

3. రెవిన్యూ ఇంటలిజెన్స్ డైరక్టరేట్

4. సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో

5. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్

6. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో

7. ఏవియేషన్ రీసెర్చి సెంటర్

8. స్పెషల్ ప్రాంటియర్ ఫోర్స్

9. సరిహద్దు భద్రతాదళం

10. కేంద్ర రిజర్వు పోలీసు బలగం

11. ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్

12. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం

13. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్

14. అస్సాం రైఫిల్స్

15. స్పెషల్ సర్వీస్ బ్యూరో

16. స్నెషల్ బ్రాంచ్ (సిఐడిఅండమాన్నికోబార్

17. క్రైం బ్రాంచి సిఐడి - సిబిదాద్రానగర్ హావేలీ

18. స్పెషల్ బ్రాంచిలక్షద్వీప్ పోలీస్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి