బుధవారం, సెప్టెంబర్ 28, 2011

సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..


సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి