బుధవారం, సెప్టెంబర్ 28, 2011

సమస్యలతో రాజీపడితే విఫలం ఖాయం

సమస్యలు లేనిదేవరికీ కానీ అందరూ సమస్యలను చూసి భయపడటం లేదు. అయితే అధిక శాతం సమస్యలకు ఎదురొడ్డలేక ఓడిపోతుండగా, అతి తక్కువ మంది మాత్రమే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తున్నారు. లెక్కకు మిక్కిలి సమస్యలు ఎదురైనప్పుడు, కొంతమంది కేవలం చిరునవ్వుతో ఆ సమస్యలనుంచి బయటపడే మార్గం కోసం అన్వేస్తుంటారు. మరికొంతమంది మాత్రం సమస్యలకు తమ జీవితాన్ని అప్పగించి చోద్యం చూస్తుంటారు. అసలు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవటమే అసలైన తరుణోపాయం.

కొన్నిసార్లు తీవ్ర సమస్యలు ఎదురై, మనిషిని తల్లక్రిందులు చేసి విరక్తికి గురిచేస్తాయి. అలాంటప్పుడే మనకు ఇలాంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడిన వ్యక్తుల స్ఫురణ వస్తుంటుంది. ఒక్కసారిగా పేదరికంలో పడిపోవటం, ఆప్తులు మరణించడం వంటి కష్టాలు పెద్ద సమస్యలు. అయితే కొంతమంది ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా గుండె దిటవు చేసుకుని సమస్యల నుంచి బయటపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్యలతో రాజీపడిపోయే ప్రతి వ్యక్తి జీవితంలో అన్ని రంగాలలో విఫలమవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి