శనివారం, సెప్టెంబర్ 24, 2011

మొటిమ,కోరింత దగ్గు


మొటిమ

(మొటిమలు నుండి దారిమార్పు చెందింది)
నుదురు మీద మొటిమలు.
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి.యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా గుద్దును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.

విషయ సూచిక

 [దాచు]

[మార్చు]మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు

  • మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
  • ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
  • వంశపారంపర్యము (కొంతవరకు)
  • ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం

[మార్చు]జాగ్రత్తలు

  • ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
  • జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
  • ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
  • మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.
  • గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.

[మార్చు]వైద్యం

శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు. పెద్ద మొటిమలు వున్నవాళ్ళు - 1. క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment) 2. డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి. 3.మచ్చలు పోవడానికి అలొ వెరా తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.

కోరింత దగ్గు

కోరింత దగ్గు వర్గీకరణ & బయటి వనరులు
ICD-10A37.
ICD-9033
DiseasesDB1523
MedlinePlus001561
eMedicineemerg/394 ped/1778

విషయ సూచిక

 [దాచు]

[మార్చు]కోరింత దగ్గు

ఇది చిన్న పిల్లలలో శ్వాసమార్గాన్ని బాధించే సాలక్రామిక రోగం. తెరలు-తెరలుగా దగ్గువస్తుంది. బొర్డ్‌టెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మ క్రిమివల్ల ఈవ్యాధి వస్తుంది. ఇది ఏ వయస్సులోనైనా రావచ్చు కాని, ఇది ఏడాది లోపు పసి పిల్లలకి వస్తే బాగా ఉధృతంగా వస్తుంది.

[మార్చు]వ్యాధి లక్షణాలు

ముందు జలుబుజ్వరం వస్తాయి. 7 నుంచి 10 రోజులు దాకా జ్వరం రావచ్చు. సాధారణంగా జలుబు చేస్తే రోగి నాలుగు లేక ఐదు రోజులు మాత్రమే బాధపడతాడు కాని ఈ జలుబు అలా కాకుండా అంతకంతకు హెచ్చుతూ, దగ్గు ఆరంభమవుతుంది. పొడి దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి. తెరలు తెరలుగా దగ్గు వస్తుంది. దగ్గు వచ్చినప్పుడు మొహం ఎర్రబడుతుంది. వెంట వెంటనే వచ్చే దగ్గు తెరల వల్ల రోగి గొంతులో ' ఉహ్ ఉహ్ .. ' అనే ఒక రకమైన ధ్వని వెలువడుతుంది. దగ్గువచ్చిన తర్వాత బిడ్డ వేగంగా గాలి పీల్చుకున్నప్పడు ఈ శబ్దం ఏర్పడుతుంది. డోకువచ్చి ముక్కు వెంట నోటివెంట నురుగునురుగుగా స్రావం వస్తుంది.కొన్ని సార్లు గాలి పీల్చడానికి వీలుపడక ముఖం నీలంగా మారిపోతుంది. నోరు తెరచుకోవడం, నాలిక బైట పడడం, కనుగ్రుడ్లు బైటికి పొడుచుకు రావడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడూ, రోగం మరీ తీవ్రం అయినప్పుడూ అంగ ప్రకంపనలు (convulsions) కూడా కనిపించవచ్చు. తెరలు తెరలుగా దగ్గు వచ్చినప్పుడు, డోకువచ్చి, తిన్న ఆహారం అంతా వెళ్ళిపోతుంది శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అప్పుడు బిడ్డ బక్క చిక్కిపోతుంది. కొన్నిసార్లు దగ్గినప్పుడు, ముక్కులో నుంచి చెవులలోనుంచి రక్తం రావచ్చు.

[మార్చు]నిరోధక విధానం

3,4 మాసాల వయస్సులో ఆరంభించి ఒక మాసం వ్యవధితో మూడు ఇంజెక్షనులు ఇవ్వాలి. ఈ రోగం రాకుండా పెర్టసిస్,డిఫ్తీరియాటెటనస్ వాక్సిన్‌లతో కలిపి మూడు వాక్సిన్ (DPT triple antigen) ల రూపంలో ఇస్తే, రోగ నిరోధక శక్తి బాగా ఏర్పడుతుంది. బిడ్డకు వ్యాధి సోకిన తర్వాత ఈ వాక్సిన్ ఇచ్చి ప్రయోజనం లేదు. కోరింత దగ్గు రాగానే, బాగా గాలి వచ్చే గదిలో శయ్యావిశ్రాంతి (bed rest) ఇవ్వాలి. తక్కిన పిల్లలను దగ్గరికి రానివ్వకూడదు. నోటివెంటా, ముక్కు వెంటా వచ్చే స్రావాలను కాగితంలోనో, పాతగుడ్డతోనో సేకరించి తగులపెట్టెయ్యాలి. ఈ జబ్బుతో బాధ పడుతున్న బిడ్డ ఉపయోగించే దుస్తులూ, పాత్రలూ, వస్తువులూ తక్కిన బిడ్డలు వాడరాదు.


చికిత్స

దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు . దగ్గు తగ్గుముఖం పట్టడానికి వైద్యుని సలహామేరకు ఏదైనా మందు ఇవ్వవచ్చు. వాంతి చేసుకోవడం వల్ల బలం తగ్గినప్పుడు కొద్దికొద్దిగా పుష్టికరమైన ఆహారం ఇస్తూ, బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి