ఆదివారం, సెప్టెంబర్ 25, 2011

కంప్యూటర్లు కరెంటు ఆదా


కంప్యూటర్లు కరెంటు ఆదా

 కంప్యూటర్లు మన జీవితాలతో ఎంతగా పెనవేసుకుపోయాయోఅందరికీ తెలిసిందే. ఇళ్ళల్లో వుండే కంప్యూటర్ల దగ్గర నుండి చిన్నా పెద్ద ఆఫీసుల వరకు దేశవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు వినియోగంలో వున్నాయి. వీటికి అయ్యే విద్యుత్‌ను లెక్కిస్తే గుండె గుభేలుమనకతప్పదు. అయినప్పటికి విద్యుత్‌ వినియోగం ఆదా చేయడంలో ఎల్లెడలా అశ్రద్ధ పెద్దఎత్తున కొనసాగుతూనే వుంది. కొన్ని ఆఫీసుల్లో కంప్యూటర్లను వాడకపోయినప్పటికీ అవి ఆన్‌ చేసే వుంటాయి. దీనివల్ల జరిగే విద్యుత్‌ నష్టాన్ని ఆ కంప్యూటర్‌ వినియోగదారు కానీ, ఆయా సంస్థల మేనేజ్‌మెంట్లు గానీ అంతగా పట్టించుకోవు. తద్వారా జరిగే విద్యుత్‌ నష్టం అపారం. కంప్యూటర్లకు వినియోగించే విద్యుత్‌లో సగం వరకు వృధా అవుతోందని ఒక అంచనా. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వృధా అవుతోన్న విద్యుత్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.
సాధారణంగా ఒక కంప్యూటర్ (ల్యాప్ టాప్‌లు మినహా) 300 వాట్ల కరెంటును వాడుకుంటుంది. అంటే దాదాపుగా 8 ట్యూబ్ లైట్లను వాడినంత విద్యుత్తు వాడుతుంది. అంటే యూనిట్టుకు మూడు రూపాయల చొప్పున నెలకు 540 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్ ముందు కూర్చోన్న సమయంలో మానిటర్ అపేసి ఉంచటం వల్ల కర్చు చేసే విద్యుత్తులో సగానికి సగం అదా చేయవచ్చు. 

ఒక సర్వే ప్రకారం తేలిందేంటంటే డెస్క్‌టాప్‌(Desktop) పి.సిలలో వాడే విద్యుత్‌లో సుమారు 70%-80% వరకు మనం ఆదా చేయవచ్చు. ఆ చిట్కాలేవో చూద్దాం...

1. కంప్యూటర్‌ ఉపయోగించనప్పుడు మానిటర్‌ స్విచ్‌ ఆఫ్‌(Switch Off)  చేయడం.
2 మానిటర్‌ స్క్రీన్‌ బ్రైట్నెస్‌ను(Brightness)  వీలైనంత మేర తగ్గించడం.
3 కంప్యూటర్లో పవర్‌ మేనేజ్‌మెంట్‌(Power Management) ఫీచర్‌ని ఆన్‌ చేయడం. ప్రస్తుతం లభ్యమయ్యే కంప్యూటర్లో దాదాపుగా పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఫీచర్‌ ఉంటోంది. దానిని సరిగ్గా కాన్ఫిగర్‌ చేయడం ద్వారా మన కంప్యూటర్‌ ఉపయోగంలో లేనప్పుడు దానంతట అదే ఆగిపోవడం లేదంటే కేవలం మోనిటర్‌ ఒక్కటే స్విచ్‌-ఆఫ్‌ కావడం జరుగుతుంది.
Def: Standby reduces the power consumption of your computer by cutting power to hardware components that you are not using. Standby can cut power to peripheral devices, your monitor, even your hard drive, but maintains power to your computer's memory so you don't lose your work.

5.మీరు ఆఫీసు కి వెళ్ళాకనో, లేక ఇంట్లో  సిస్టం ఆన్ చేసాక...  మీ పని ముగిసాక మీరు ఇంకా ఆఫీసు, ఇంట్లో నో ఉన్నట్లయితే మీ సిస్టాన్ని షట్ డౌన్ చెయ్యకుండా Stand By లో ఉంచండి.ఇలా చెయ్యటం వల్ల ప్రతి సారి  On/Off  చెయ్యాల్సిన అవసరం ఉండదు.విద్యుత్తు కొంత వాడకాన్ని తగ్గించిన వారిమీ అవుతాము.

6.స్టాండ్ బై(Stand By) లో ఉంచడం వల్ల గంటకు కేవలం 3 (మూడు) వాట్ల విద్యుత్ ని మాత్రమే వాడుకుంటుంది. ఆలాగే వూరి కే  సిస్టం  On/Off చేస్తే మీ హార్డ్ డిస్క్ మన్నిక తగ్గుతుంది. గీతలు పడే అవకాశం ఎక్కువ.హార్డ్ డిస్క్ లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండి, అవన్నీ సిస్టం ఆన్ చేసినప్పుడు రన్ అయ్యేవి అయితే మీ సిస్టం వాడకానికి / సిద్ధం అవటానికి కొంత సమయం పడుతుంది.అంటే System Load అవడానికి  టైం తీసుకుంటుంది
స్టాండ్ బై లో ఉంచటం వల్ల ఆన్ చేసిన వెంటనే అన్ని ప్రోగ్రామ్స్ ని రన్ చేసి వాడుకోవచ్చును.
7..మీ మోనిటర్ CRT అయితే విద్యుత్ వినియోగం ఎక్కువే,. LCD అయితే తక్కువ విద్యుత్ వాడుకుంటుంది.Stand By లో ఉంచడం వల్ల CRT మోనిటర్ ని UPS మీదనూ, Inverter మీద సులభముగా వాడుకోవచ్చును 
8.How to put your computer on standby automatically :

 Step 1 :Select  Start button then select  Control Panel.
Step 2 :Select  Power Options.
Step 3: On the Power Schemes tab, under Power schemes,  down arrow and then select the power scheme that you want to use.
Under Settings for power scheme, you can review System standby settings and adjust them if you prefer.

ఉదాహరణకు:ఒక కంప్యూటర్‌ను స్టాండ్‌బైలో ఉంచడం వల్ల గంటకు కేవలం మూడు వాట్ల విద్యుత్‌ మాత్రమే వాడుకుంటుంది. అంటే 333గంటలు స్టాండ్‌ బై లో ఉంచితే కేవలం ఒక యూనిట్‌ విద్యుత్‌ మాత్రమే వినియోగం అవుతుంది.

9. కొత్త కంప్యూటర్లు కొనేముందు అవి తప్పని సరిగా ఎనర్జి-స్టార్‌ 4.0 కంప్లైంట్‌ ఉండేలా చూసుకోవడం.

10. ర్యామ్‌(RAM) తక్కువగా ఉన్నప్పుడు మోనిటర్‌ మీద రకరకాల థీమ్స్‌(Themes) పెట్టుకోవడం వల్ల మోనిటర్‌పై భారం పడుతుంది. తద్వారా విద్యుత్‌ వినియోగం కూడా ఎక్కువగానే అవుతుంది. మోనిటర్‌ స్క్రీన్‌ను బ్లాక్‌లో పెట్టుకోవడం వల్ల విద్యుత్‌ ఆదా అవడంతోపాటు కంటికి కూడా ఇబ్బంది కలిగించదు. సిస్టం మీదున్న ఐకాన్స్‌ని కూడా తేలికగా గుర్తించగలుగుతాం. మోనిటర్‌ జీవిత కాలం కూడా పెరుగుతుంది.రోజంతా ఆన్‌లో ఉంచినప్పుడు, మీరు 4 గంటలు వాడితే మిగిలిన 20 గంటలు కరెంటు వృధా అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి