ఆదివారం, సెప్టెంబర్ 25, 2011

మీ ఇన్‌బాక్స్‌ స్పామ్ (SPAM) ‌ మెయిల్స్‌ (Mails) తో నిండుతోందా?


మీ ఇన్‌బాక్స్‌ స్పామ్ (SPAM) ‌ మెయిల్స్‌ (Mails) తో నిండుతోందా?

Email spam, also known as junk email or unsolicited bulk email (UBE), is a subset ofspam that involves nearly identical messages sent to numerous recipients by email 
మీ ఇమెయిల్‌ 'ఇన్‌బాక్స్‌' మొత్తం కొత్త మెసేజ్‌లతో నిండిపోతోందా? ఆ మెయిల్స్‌ మీకు తెలిసినవారినుంచి వచ్చినవి కావా? మీరు వాటిని క్లిక్‌ చేస్తే వాటిలో ఉన్న 'సబ్జక్ట్‌ లైన్స్‌' మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లు గుర్తించారా? వాణిజ్య ప్రకటనలు లేక తప్పుదోవ పట్టించే సమాచారం ద్వారా మీరు ఆ లింకులపై క్లిక్‌ చేస్తే వేరే వెబ్‌సైట్లలోకి ప్రవేశించే విధంగా అవి వున్నాయా? అయితే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. విచిత్రం ఏమిటంటే కొన్నిసార్లు మీ క్రెడిట్‌ కార్డ్‌ (Credit Cards)డిటైల్స్‌ లేక 'ఇ-బే'(e-Bay) పాస్‌వర్డ్‌ అడుగుతూ, చూడ్డానికి నిజమైన వాటిలాగానే అనిపిస్తాయి. కానీ నిజానికి అవి మీ వ్యక్తిగత, ఆర్థికపరమైన విషయాలను దొంగిలించడానికి ఉద్దేశించినవి కావచ్చు. అటువంటి సమయంలో ఏం చేయాలి?

1.సాధారణంగా ఇమెయిల్స్‌లో మనకు పరిచయంలేని మెయిల్‌ ఐడీల నుండి ఇమెయిల్స్‌ రావడం జరుగుతూనే వుంటుంది. ఒక్కోసారి ఇటువంటి అవాంఛిత మెయిల్స్‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ బెడద ఎక్కువగా వుంటుంది. వీటితో పాటు స్పామ్‌ మెయిల్స్‌ కూడా మన ఇన్‌బాక్స్‌ను నింపేస్తుంటాయి. ఈ స్పామ్‌ మెయిల్స్‌ సాధారణంగా ఆర్థిక సంబంధమైన విషయాలపై ఆధారపడినవిగా ఉంటాయి. 
2.స్పామ్‌ మెయిల్‌కు మరో పేరు 'అవాంఛిత వాణిజ్య సంబంధ ఇమెయిల్‌'. ఈ స్పామర్లు వేల సంఖ్యలో కొన్ని సమయాల్లో మిలియన్ల సంఖ్యలో ఇమెయిల్స్‌ పంపుతుంటారు. వీటి ద్వారా వారు వినియోగదారులను తమ వస్తువులు కొనేలా ప్రేరేపిస్తారు. ద్వారా ఈ స్పామర్లు అమాయకులైన ఇమెయిల్‌ వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సంబంధమైన వివరాలను సంగ్రహిస్తారు.

3.మెయిల్‌ ఐడీ ఎవరికీ ఇవ్వలేదు... అయినా ఈ అవాంఛిత మెయిల్స్‌ ఎందుకొస్తున్నాయో తెలియక తలలు పట్టుకోవాల్సి వస్తుంటుంది. ఎక్కువ మంది తమ ఇమెయిల్‌ అడ్రస్‌లను చాలాకాలంగా ఉపయోగిస్తుండడం వల్ల కూడా ఈ స్పామ్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. ఎంత ఎక్కువ కాలం ఒకే ఇమెయిల్‌ ఉపయోగిస్తారో అంత ఎక్కువగా స్పామ్‌ మెయిల్స్‌ ఆ అడ్రస్‌కు వస్తుంటాయి. స్పామర్లు వెబ్‌సైట్ల నుంచి గ్రహించడం ద్వారా ఇమెయిల్‌ అడ్రస్‌ల లిస్ట్‌లను తయారు చేస్తారు.
4.ఒకసారి స్పామ్‌ మెయిల్స్‌ రావడం ప్రారంభమైన తర్వాత వాటిని నివారించడమన్నది ఎప్పటికీ జరగని పని. ఇటువంటి అవాంఛిత మెయిల్స్‌ రాకుండా వుండాలంటే- మనకు పరిచయంలేని వ్యక్తులకు, వ్యాపార సంబంధ కార్యకలాపాలకు ఇమెయిల్‌ అడ్రస్‌ ఇవ్వకూడదు. మీ ఐడీలను ఏ వెబ్‌సైట్‌లలోనూ వుంచకూడదు. ఇతరులను కూడా మీ అడ్రస్‌ను వాటిలో పెట్టనివ్వకూడదు. ఉచిత ఇమెయిల్‌ సర్వీసులు అందించే యాహూ మెయిల్‌, హాట్‌ మెయిల్‌ మొదలగు వాటిలో కొంతమంది తాత్కాలిక ఇమెయిల్‌ అకౌంట్లను ఒకటి కన్నా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇటువంటి వారు తమ అసలు ఇమెయిల్‌ అడ్రస్‌ను పూర్తిగా తనకు తెలిసిన వారికి మరియు అవసరమైన వారికి మాత్రమే ఇచ్చి మిగిలిన అకౌంట్లను ఇతరులకు నిస్సంకోచంగా ఇస్తారు. 

5.ఒకవేళ ఈ ఐడీల ద్వారా స్పామ్‌ మెయిల్స్‌ రావడం మొదలు పెడితే మరో కొత్త ఐడీ క్రియేట్‌ చేసుకొని పాతదాన్ని వదిలేస్తారు. అంతేకాకుండా వేర్వేరు లావాదేవీలకు వేర్వేరు ఇమెయిల్‌ ఐడీలు ఉపయోగించే వారు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, వ్యాపార సంబంధమైన వ్యక్తులకు వేర్వేరుగా ఇటువంటి తాత్కాలిక ఇమెయిల్‌ అడ్రస్‌లు ఇవ్వడం వలన మీకు స్పామ్‌ మెయిల్‌ వచ్చినపుడు అది ఎవరు పంపివుంటారో ఊహించే అవకాశం వుంటుంది.
స్పామ్‌(SPAM) నుంచి తప్పించుకునే ఉపాయాలు
* మీ ఇమెయిల్‌ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్‌లో ఉంచకండి. ఒకవేళ మీ ఇమెయిల్‌ అడ్రస్‌ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్‌లో పెట్టండి.
* స్పామర్లు గూగుల్‌ వంటి వెబ్‌సెర్చ్‌ ఇంజన్‌లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్‌ అడ్రస్‌ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి.
* చాలా రకాల ISP ఉచిత ఇమెయిల్‌ అడ్రస్‌లను ఇస్తున్నాయి. అందులో మీరు రెండు ఇమెయిల్‌ అడ్రస్‌లను క్రియేట్‌ చేసుకొని a)ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు. b)రెండవ దాన్ని న్యూస్‌ లెటర్‌లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్‌ చేయడానికి మరియు ఇతర పబ్లిక్‌ లొకేషన్ల కోసం వినియోగించుకోండి.
* చాలా ISP ఉచితంగా 'స్పామ్‌' ఫిల్టరింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిని తప్పక ఉపయోగించండి. అయినా మీకు వచ్చే స్పామ్స్‌ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి.
* న్యూస్‌ గ్రూప్‌ పోస్టింగులకు సమాధానాలు రాసేటప్పుడు ఇమెయిల్‌ ఐడీలను దానికి అనుసంధానించి పంపకండి.
* వెబ్‌ఫామ్‌లను నింపుతున్నపుడు ఆ సైట్‌ ప్రైవసీ పాలసీని తప్పని సరిగా చెక్‌ చేయండి. ఆ సైట్‌ మీ మెయిల్‌ అడ్రస్‌లను ఇతర కంపెనీలకు అమ్మడం కానీ లేక ఇవ్వడం /పంపడం కానీ చేస్తుందేమో పరిశీలించిన తర్వాతనే దాన్ని పూర్తి చేయండి.
* మీకు వచ్చే స్పామ్‌ మెయిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించకండి. ఒకవేళ మీరు సమాధాన మిచ్చినట్లయితే, మీ మెయిల్‌ ఐడీలను తన మెయిలింగ్‌ లిస్ట్‌ నుంచి తొలగించమని రిక్వెస్ట్‌ చేయండి.
* మీ సిస్టమ్‌లోని యాంటీ-వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయ్యేలా చూసుకోండి. ఎన్నో వైరస్‌లు, ట్రోజాన్‌లు మీ హార్డ్‌డిస్క్‌ను ఇమెయిల్‌ అడ్రస్‌ల కోసం వెదుకుతూ ఉంటాయి. మీరు మీ సిస్టం యొక్క యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా మీ సహచరుల ఇమెయిల్‌ అడ్రస్‌లు స్పామ్‌ బారినపడకుండా కాపాడండి.
* మీ అకౌంట్‌ వివరాలు అందజేస్తే తప్ప గుర్తించనటువంటి మెయిల్‌ అభ్యర్థనలకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిస్పందించకండి. మీ బ్యాంకు, క్రెడిట్‌ కార్డు కంపెనీ, ఇ-బే, పేపాల్‌ మొదలయిన వాటిలో మీ అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు వారివద్దే ఉంటాయి. వాటిని తిరిగి అడిగే అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా కలవడంగానీ, ఫోన్‌ ద్వారా గానీ సంప్రదించాలి.
* మీ లాగ్‌ ఇన్‌ వివరాలను ఇతరులెవ్వరికీ ఎటువంటి పరిస్థితులలోనూ ఇవ్వకండి.
పైన తెలిపిన జాగ్రత్తలను తీసుకోవడంతోపాటు అవసరాన్ని బట్టి సైబర్‌ సెల్‌ వంటి వాటిని ఆశ్రయించడం ఒక మార్గమైతే, ఆయా మెయిల్‌ ఐడిల నుండి వచ్చే మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవడం మరోమార్గం. ఉన్నంతలో ఇది మంచి మార్గంగా అందరూ భావిస్తారు. అయితే ఇది ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నదే సమస్య. రెగ్యులర్‌గా మెయిల్స్‌తో తలమునకలై వుండేవారు కూడా ఈ అవాంఛిత మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకుంటూవుంటారే గాని శాశ్వత పరిష్కారంవైపు ఆలోచించరు. జిమెయిల్‌లోనే వున్న ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ను ఉపయోగించి చికాకు కలిగించే మెయిల్‌ ఐడిల నుండి వచ్చే మెసేజ్‌లు వాటంతటవే డిలీట్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

జిమెయిల్స్ (Gmail)  సెట్టింగ్స్‌లోని ఫిల్టర్స్‌ను ఎలా వుపయోగించుకోవాలో చూడండి. (డింగ్‌ బిట్స్‌ వాడదాం)
1. జిమెయిల్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత 'సెట్టింగ్స్‌ (Settings)' అనే బటన్‌ ని క్లిక్‌ చేయాలి.
2. ఆ తర్వాత వచ్చే విండోలో కనిపించే సెట్టింగ్స్‌ మెనూలో నాల్గవ ఆప్షన్‌ 'ఫిల్టర్స్‌'(Filters). ఈ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
3. ఇప్పుడు వచ్చే స్క్రీన్‌లో కనిపించే Create a new filter అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
4. ఇప్పుడు Create a Filter కు సంబంధించిన ఆప్షన్‌తో ఒక స్క్రీన్‌ వస్తుంది. అందులో 'ఫ్రం' (From) అనే బాక్సులో మీరు ఏ మెయిల్‌ ఐడి నుండి వచ్చే మెసేజ్‌లను వాటంతటవే డిలీటయ్యేలా సెట్‌ చెయ్యాలనుకుంటున్నామో ఆ మెయిల్‌ అడ్రస్‌ని టైప్‌ చెయ్యాలి. దీని కిందనే వున్న 'సబ్జెక్ట్‌'(Subject) ఫీల్డ్‌లో ఏదైనా నిర్దిష్టమైన పదం/వాక్యం 'సబ్జెక్ట్‌ లైన్‌'లో వున్న మెయిల్స్‌కి మాత్రమే ఆ ఫిల్టర్‌ అప్లై చెయ్యబడేలా లేదా అటాచ్‌మెంట్లు వున్న మెయిల్స్‌కు మాత్రమే ఫిల్టర్‌ అప్లై అయ్యేలా టైప్‌ చేయాలి. ఇలా మీ అవసరాన్ని బట్టి పలు సెట్టింగులు ఎంచుకోవచ్చు. ఆ తర్వాత Next Step అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.
5. ఇప్పుడు ''ఆ మెయిల్‌ ఐడి నుండి వచ్చిన మెయిల్‌ మెసేజ్‌లను చూపడంతోపాటు వాటిని ఏం చెయ్యమంటారో తెలపండి'' అంటూ ఓ స్క్రీన్‌ వస్తుంది. అందులో వరుసగా కొన్ని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో Delete it ‌ అనే బటన్‌పై టిక్‌ పెట్టి, దాని కిందనే వున్న Create Filter బటన్‌ క్లిక్‌ చేయాలి.
6. ఒకవేళ మనం డిలీట్‌ చేయాలనుకుంటున్న మెయిల్‌ ఐడి నుండి గతంలో వచ్చిన మెసేజ్‌లు ఏమైనా మన 'ఇన్‌బాక్స్‌'లో వుంటే, పనిలోపనిగా వాటిని కూడా డిలీట్‌ చెయ్యాలంటే, పైన చెప్పినట్లుగా  బటన్‌పై ప్రెస్‌ చేసే ముందే క్రియేట్‌ ఫిల్టర్‌ పక్కనే వున్న Also apply filter to conversations బటన్‌పై టిక్‌ చెయ్యండి. ఇక్కడ మనం డిలీట్‌ చేయాలనుకున్న మెయిల్‌ ఐడీ నుండి వచ్చిన మెయిల్స్‌ సంఖ్యనుకూడా చూపుతుంది. ఆ తర్వాత Create Filter అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.ఇలా ఫిల్టర్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత ఇకపై ఆ మెయిల్‌ ఐడి నుండి వచ్చే ప్రతీ మెసేజ్‌ దానంతట అదే డిలీట్‌ చెయ్యబడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి