బుధవారం, సెప్టెంబర్ 28, 2011

శని మహర్దశ


శని మహర్దశ

వింశోత్తరీ దశా విధానంలో శని దశ 19సంవత్సరాలు ఉంటుందిఅతి పెద్ద దశ అయినశుక్ర దశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ.సామాన్యంగా శని దశ అంటే మనకు భయంఉంటుందిఅది చాలా వరకూ నిజమేదశకాలంలోమనకు కలిగే ఫలితాలు మూడువిధాలుగా ఉంటాయి.

ఒకటి: గ్రహముల యొక్క సహజకారకత్వములను బట్టి వచ్చే ఫలితాలురీతిలోశని భగవానునికి గలసహజకరకత్వములు చూద్దాముసహజజ్యోతిశ్చక్రములో (Natural Zodiac) ఈయనకు 10,11 స్థానములుఅయినమకరం కుంభం స్వక్షేత్రములుకనుక కర్మలాభ స్థానములకారకత్వములు ఈయనకు ఉంటాయిఅనుభవించాల్సినకర్మనుఅనుభవింప జేయటంఇవ్వ వలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు.ఈయన యొక్క సహజ లక్షణాలైనబద్ధకంసోమరితనంపనులు కాకపోవటంనిరాశా నిస్పృహలునరాలఎముకల రోగాలుపెద్దల మరణాలు,చికాకులుఅంగ వైకల్యం కలగటంఏక్సిడేంట్లు కావటం మొదలైనవిజరుగుతాయిచర రాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశసాధారణంగా అనేక బాధలను ఇస్తుందిఆయా బాధలు  19 ఏళ్ళలో శనిగోచార రీత్యాసంచరించే స్థానాలను బట్టి ( మేషం ఒకటో స్థానం గా తీసుకునిచూడగాఉంటాయి. దశ అంతర్దశాలలో కూడా గ్రహముల సహజ కారకత్వములు పరిగణన లోకి తీసుకోవాలి.

ఉదాహరణకు శని దశలో కుజ అంతర్దశ వచ్చినపుడు జ్వరాలు, దెబ్బలు తగలటం, రక్త దర్శనం, ఆస్పత్రి పాలు కావటం, సోదరులకు హాని మొదలైనవి కనిపిస్తుంటాయి. ఇది సహజ కారకత్వములు మరియుసహజజ్యోతిశ్చక్ర విధానం బట్టి అంచనా వేసే పద్దతి.

రెండు: జాతక చక్ర రీత్యా లగ్న చంద్రుల్లో బలవత్తరమైన స్థానమును బట్టి,శని కి కలిగిన ఆదిపత్యములుఆయన ఉన్నఇంటిని బట్టి రెండవ స్థాయిఫలితములు ఉంటాయిశని నుంచి అంతర్దశా నాథుడైన గ్రహము యొక్కస్థితిని బట్టి గ్రహము ఉన్న స్థానము మరియు కారకత్వములను బట్టిఫలితములు ఊహించాలి. దశా నాదునికి అంతర్దశా నాధుడు 6,8,12 స్థానములలో ఉంటే మంచి జరుగదు. కోణ స్థితిలో ఉంటే ( అనగా ఒకదానికొకటి 5/9 ), అది కూడా అవి మిత్ర గ్రహాలై ఉంటే మంచి జరుగుతుంది. శత్రు గ్రహాలైతే కొంత మంచి కొంత చెడు జరుగుతుంది. కేంద్ర స్థితిలో (4/10 ) ఉంటే ఆ యా పనులు నిదానంగా పూర్తి అవుతాయి. లేదా పరస్పర శత్రు గ్రహాలైతే పనులు జరుగవు. కారకత్వాలు దెబ్బ తింటాయి.

మూడు: గోచార రీత్యాజనన కాల చంద్ర స్థితికి శని ప్రస్తుతం సంచారంచేస్తున్న ఇంటిని బట్టి ఫలితములు ఉంటాయిఇందులో ముఖ్యముగాచూడవలసినదిఏలినాటి శనిఅర్ధాస్తమ శనిఅష్టమ శని. లగ్న చంద్రునికి12,1,2 స్థానాలలోశని సంచారమే ఏలినాటి శనిశని సంచారం ఒక్కొక్కరాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది కనుక  మూడు స్థానాలకుకలిపిఏడున్నర ఏళ్ళు ఉంటుంది.

స్థూలంగా వీటి ఫలితాలు ఏమనగా
12 లో సంచరిస్తున్నపుడు అనవసర ఖర్చులురోగాలుఆస్పత్రి లో చేరటం,నిరాశఆధ్యాత్మిక చింతన పెరగటంఎడమ కంటికి రోగంతల్లి మరణంపనీ కలిశి రాకత్రిప్పట పెట్టటం ఉంటాయి.

ఇక చంద్రుని మీదికి వచ్చినపుడుమానసిక ఆందోళనభయంతల్లికి ప్రాణగండం లేకమరణంమాత్రు సంబంధ బంధువుల మరణాలుభార్యకు ఆరోగ్యభంగంచేసే వృత్తిలో ఆటంకాలుచికాకులుతనఆరోగ్యం దెబ్బ తినటంజరుగుతాయి.

ఇక రెండవ స్థానంలో కొచ్చినపుడు కుటుంబ చికాకులుకుడి కంటికి రోగం,అతివాగుడు వల్ల ప్రమాదాలులేక మాట్లాడ వలసిన చోట మాట రాకపోవటంభోజన సౌఖ్యం కొరతజీర్ణాశయ బాధలుకుటుంబంలో మరణాలుఉంటాయికనుకనే ఏలినాటి శని అంటే జనులలో భయం ఉంటుంది.

ఇక అర్తాస్తమ శని జరుగు తున్నపుడు విద్య లో ఆటంకాలుగుండెజబ్బులుప్రయాణంలో ప్రమాదాలుతల్లి మరణం మొదలైనవిఉంటాయి.చివరిదైన అష్టమ శని జరిగే టపుడుపనులు సర్వ నాశనం కావటంప్రతిపనిలోనూ నష్టంస్వ మరణంకోర్టు చిక్కులుప్రత్యర్థుల దాడులుదీర్ఘరోగాలు మొద లైనవి ఉంటాయి.

 మూడు విధములైన ఫలితములను బేరీజు ( Correlate) చేసి ఫలితాలైతే మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయో అవి చాలా వరకూ జరుగుతాయిఅని చెప్ప వచ్చుఇదంతా వినటానికి కొంత సులువుగా ఉన్నప్పటికీఆచరణలో చాలా కష్టం గా ఉంటుంది.

ఉదాహరణకి  జాతకానికైనా సహజ కారకత్వాలు మారవుకానిఆధిపత్యాలు మారుతాయితరువాత శని ఉన్న స్థితిని బట్టి కొందరికి ఉచ్ఛ(Exalted) గానూకొందరికి నీచ (Debilitated) గానూకొన్ని సార్లు వక్రి(Retrograde ) గానూకొన్ని సార్లు అతి బలహీనుడు గానూకొన్ని సార్లుఅస్తన్గతుడు (Combust) గానూఉండవచ్చు. కనుక పాజిటివ్ మరియు నెగటివ్ ఫలితాలను ను కూలంకషంగా బేరీజు వేసి మొత్తం ఫలితాన్ని అంచనా వేయవలసి ఉంటుంది.

మొత్తం మీదసహజ కారకత్వములుఆధిపత్యములుదశ అన్తర్దశలు,గోచారముఇంకా సూక్ష్మం గా చూడాలంటే అష్టవర్గ బలము విచారించి చెబితేఫలితములు చాలావరకు సరిపోతాయికాని శని భగవానుని సహజకారకత్వములుమంచివి కాదు గనుక ఎంత మంచి చేసినా చివరకు మళ్ళీచెడు జరుగుతుందిదీనినే లోకంలో శని పైకి లేపి కిందపడేస్తాడు అనివాడుక భాషలో అంటారు.NTR జాతకంలో రాజయోగాన్ని ఇచ్చినట్లే ఇచ్చిచివరకు అటువంటి పరిస్ధితి కలిగించి అటువంటి మరణం కలిగింది కూడా శనిప్రభావమే


చివరిగా ఒక్క విషయం స్పష్టం గా చెప్పాలి. శని దశ వేరు, ఏలినాటి శని వేరు. ఈ రెంటికీ తేడా ఉన్నది. శని మహా దశపైన చెప్పినట్లు 19 ఏళ్ళు ఉంటుంది. అది కొందరికి చిన్న తనంలో రావచ్చు కొందరికి మధ్య వయస్స్సులో మరికొందరికి ముసలి తనంలో రావచ్చు. కొందరికి అసలు రాక పోవచ్చు.

ఏలినాటి శని అనేది శని గ్రహము గోచార రీత్యా జనన కాల చంద్రుని దగ్గరకు వచ్చిన ఏడున్నర ఏళ్ళు కాలం. ఈ రెండూ ఒకటి కాదు. భేదం ఉన్నది. ఒకటి జనన కాల నక్షత్రాన్ని బట్టి లెక్క వేశే దశ. ఇంకొకటి గ్రహముల సంచారం బట్టి వచ్చేటటువంటి స్థితి. 

శని
 దశ ఒక జాతకానికి చెడు చేసేదిగా ఉండి, ఆ దశలో ఏలినాటి శని వస్తే ఆ జాతకుడుపడే బాధలు ఆ దేవుని కెరుక. ఇట్టి స్థితి మధ్య వయసులో లేదా ముసలి తనంలో వస్తే పరలోక ప్రాప్తి తధ్యం. చాలామంది బాధలు భరించలేక ఆత్మ హత్యలు చేసుకోవటం కూడా ఇటువంటి కాలంలోనే జరుగుతుంది.
కొన్ని ఉదాహరణ జాతకాలతో చూస్తె బాగా అర్థం అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి