బుధవారం, సెప్టెంబర్ 28, 2011

ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది?


ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది?

మాష్టర్ సి.వి.వి. భ్రిక్త రహిత తారక రాజయోగం

ఆది బ్రహ్మ తత్వంలో ఘనీభవించిన శీతలత్వం ఉంది.దానిలోనే సర్వ పూర్ణతత్వములు గుప్తంగా ఉండును.వాటినే ‘‘హిడ్డెన్స్’’అనవచ్చును. ఈ హిడ్డెన్ లో ఏర్పడ్డ ఒక స్థితిని ‘‘హింట్’’ అనగా ఒక సూచన.ఈ హిడెన్స్ ఎక్కడి నుండి పనిచేస్తున్నదో దానిని ‘‘పిట్యూటరి’’ అన్నారు.ఈ పిట్యుటరి అనేది బ్రహ్మండముల సృష్టి జరుగుతున్న స్థలం లేదా బ్రహ్మీ స్థితి.ఈ సృష్టి యావత్తు బిందువులో ప్రారంభమూ నిలిచినది.ప్రతి అండములో ఆకాశము కలదు. ఆకాశము అంటే స్పేస్.అది సంకోచ వ్యాకోచముల వలన
కలుగుతుంది.అతి చిన్నదైన స్థితిలో అది శ్వాన్ , పూర్ణ విస్తరణ తరువాత అదే బ్రహ్మండములక విరాటు రూపము అగుచున్నది.ఈ సంకోచ , వ్యాకోచముల వలన శ్వాస ఏర్పడుతుంది.ఆదితత్వం నుండి ఈ శ్వాస లోకాలోకాలకు బహిర్గతమైనప్పడు నిశ్వాసము అవుతుంది.ఉచ్చాస్వము ద్వార అంతర్గతమైనప్పడు గుప్తం అవుతుంది.ఈ ఉచ్చ్వాస్వ ,నిశ్వాసములో ఉన్నదే ప్రాణము.ఇదియే సృష్టికి ఆధారము.అనంత ప్రాణము విస్తరించి బహిర్గతమై లోకాలోకములను సృష్టిస్తుంది.ఈ ప్రాణమునకు మూల స్థానము ఆది బ్రహ్మ తత్త్వమే.
ఆ బ్రహ్మతత్త్వమే అనేక లోకాల నిండా అనేక రూపాల్లో ,దేహాల్లో పనిచేయుచున్నది.మాష్టరు గారు మొదట చేసిన ప్రయోగాల్లో ప్రయత్నించి సపలమైంది ఈ ప్రాణ విషయంలోనే.
ఒక చతుర్ముఖ బ్రహ్మ సంకల్పం వలన ఈ సృష్టి యేర్పడింది.ఈ సృష్టి గ్రహాలు,నక్షత్రాలు,పితృదేవ మరియు దేవ వర్గాలపైన అదారపడి ఉంది.వీరిలో వేటికి పరిపూర్ణత్వం లేనందువలన ఈ సృష్టికి పరిపూర్ణత రాలేదు.ఈ చతర్ముఖ బ్రహ్మకూడ మహా పకృతిలోని భాగమే.మార్పు అనేదే లయము.మార్పు అనేదే పున: సృష్టి.మార్పు అనేదే లోకాలోకాలకు,కాల ప్రమాణమునకు కారణం.ఆది స్థితిలో ఉన్న పూర్ణత్త్వం మనకు సంక్రమించడంలేదు. ఈ సృష్టికి మూలమైన కేంద్రస్థానం ఆదిశక్తి.కాని అది బ్రహ్మకాదు. ఆదిశక్తికి మూలం ఆదిబ్రహ్మ తత్వం. సృష్టిలో పూర్ణత్వం రావాలంటే ఆదిశక్తి(పకృతి)నుండి కాక
ఆది బ్రహ్మతత్త్వం(పురుష)కు మూల కేంద్రం మారాలి.
సృష్టి ఏర్పాటు : 1)ఇక్కల్డ్ -పరమ శీతలమైన ఘన స్థితి (2) అక్కల్డ్ -వేడి-దీంతో శీతల ఘన స్థితి నుండి ద్రవరూపంలోకి మారుతుంది (3) గ్యాస్ ఏయిర్ -అలా ద్రవమైంది వాయురూపంలో నిలుస్తుంది(4) స్పిరిట్ -అనంత వాయుతత్వం నుండి ఖండికలై,త్రుంపులై ఒక పరిమిత విస్తిర్ణం కల్గిన స్పిరిట్ అవుతుంది.
(5) బిందు(స్పిరిట్ సంకోచ స్థితిలో బిందువు అవుతుంది (6) అణువు -ఈ బిందువు ఘనిభవించి ఆరవ స్థితి అగు అణువు అగుచున్నది.(7) పరమాణువు - ఈ అణువు బద్దలై ఏడవ స్థిత ఐన అనేక పరమాణువులు అగుచున్నది.(8) జీవ- ఈ పరమాణువులు ఇంకా సూక్షములై ప్రాణస్థితిని పొంది ఎనిమిదవ స్థితి అగు జీవులు అగుచున్నవి.
ఆది బ్రహ్మ స్థితినుండి బయలుదేరింది ఆది ప్రకృతిస్థితిలోకి రావడం ప్రథమ సృష్టి.ఇది వరుసగా
1)ప్రవేశ , 2) వ్యాపక 3) గతి 4) కిరణ 5) ఆరోగ్య 6) భ్రిక్త 7) రహిత అను ఏడు స్థితుల్లో జరిగింది.సృష్టి ఒకసారిగా
ఏర్పడలేదు.ఈ అనంత తత్త్వంను ఒక అనంతమైన స్పేస్ గా తీసుకుంట అటువంటి అనంతములు ఆదిలో అనంతంగా కలవు.ఈ చర్య కాల ప్రమాణికానికి అందేది కాదు.కాలము అనేది స్థలం తోనే ఎర్పడ్డది.అంటే స్పేస్,టైమ్ రెండు ఒకేసారి ఏర్పడ్డవి.ఆది బ్రహ్మ తత్త్వం నుండి సగుణ బ్రహ్మతత్వానికి (భౌతిక ప్రపంచం) వచ్చులోపల ఒక ఖాళి ఏర్పడి ఈ సృష్టికి ఆ ఆదికి మద్యన ఒక అడ్డం లేదా ఒక కందకంగా యేర్పడింది.దీనినే నిర్గుణము అన్నారు.ఈ సృష్టిలో ఏది కూడ నిర్గుణమును దాటిలేదు.అందుకే ఆదినుండి వచ్చిన మాష్టరు గారు ఆది బ్రహ్మతత్త్వంలో ఒక కేంద్రంను నిర్మించి అక్కడి నుండి నిర్గుణ తత్త్వంకు ఒక వంతెనను నిర్మించినారు.
మనం చూస్తున్న గ్రహములు,నక్షత్రాలు,అన్ని ఒక అండములో వున్నవి.ప్రతి అండములో కూడ ఒక చతురస్రము కలదు.వ్యాసంకు పైన ఒక త్రిభుజము,కింద ఒక త్రిభుజము కలిసి చతురస్రము అవుతుంది.పైనుంచి కింది వరకు 14 లెవల్స్ ఏర్పడగా క్రింద ఉన్న ఏడులోకములలో 6వదగు బుద్దిక్ లెవల్ నుండి ఈ సృష్టి జరుగుచున్నది.దీన్నంతా ఒక వృత్తంలో అమరిస్తే మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది.పైనుండి కిందివరకు ఇటువంటి వృత్తములు 100 వరకు ఉన్నాయి. ప్రతి వృత్తంలో చతురస్రంల కలదు.దీనినే విరాట్ అంటారు. ప్రస్తుత సృష్టి అంతా ఒక మహావిశ్వంలోని 6వ విరాట్ లో బుద్దిక్ లెవల్ లో జరుగుచున్నది.ప్రస్థుత సృష్టికి మూలము ఫ్రణవము.అనగా ‘‘ఓం’’.ఈ బుద్దిక్ లెవల్ లోని విరాటులన్నింటిలో సృష్టి పూర్తయినచో బుద్దిక్ లెవల్ పూర్తి అవుతుంది.ఆతరువాత మెంటల్ లెవల్లో సృష్టి ప్రారంభం అవుతుంది.ఇటువంటి మహా విశ్వములు ఇప్పటికి 84 జరిగినవి.ఈ 84 మహా విశ్వముల అధిపతులను బ్రహ్మలు అనవచ్చును.ఇపుడు వారందరు వారికై ఏర్పరిచిన స్థానాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇలాగే ఈ మహా విశ్వములన్ని కుండలినీలుగా కూడా చెప్పబడ్డాయి.ప్రస్తుత సృష్టి నాల్గవది.దీనికి పూర్వం ధాతు,వృక్ష,జంతు వర్గములు ఏర్పడినవి.ప్రతి పరమాణువుకు ప్రథమ దశ ఒక బిందువు అని అనుకొంటె దానికి కేంద్రము ,పరిధి రెండు వుండును.ఈ బిందువును నిలువుగను ,అడ్డంగాను విభజిస్తే అది నాలగు భాగములగుచున్నది.మొదటి భాగము యొక్క ప్రధమ స్థితిలో ఏం ఉండదు.కాని అది కూడ ఒక సూక్ష్మ బిందు స్థితియే.బిందువు వెంట బిందువు పరిదిరేఖలో పయనించిన తిరిగి ప్రధమస్థితికి చేరదు.ఎందుకంటే బిందువు దానికి వృత్తాకారము ఇచ్చిఉన్నది.ఆ ప్రథమ బిందువును లేక పాయింటును ఆ పరిధిలేని చివరి పాయింటును తాకుచూ పోవునే కాని దానిలోనికి జోరబడలేదు.కనుక అక్కడ్నుండి ఆ చివరి బిందువు టాన్జెంటుగా పైకిపోవునే కాని ఈ పాయింటునుగాని,దాని కేంద్రమునుగాని చేరలేదు.ఆ రెండు పాయింట్లు కలిసిన చోట మనము సత్యం అనే దానికి వూహించిన , ఆ సత్యము టాన్ జెంట్ గా పోయి మోషన్ అనగా చలనమును యేర్పురుచునుగాని మరోరకంగా కాదు.ఆ పాయింటు దగ్గర యేర్పడిన చలనమును ట్రూత్ మోషన్ అందురు.ఈ చలనము ఈథరులో జరుగుచున్నది.ఇది ఈధర్ ను చీల్చుకునిలైనుగాపోతుంది.పోను పోను ఈ చలనములో సత్యం తగ్గిపోయి మాయగా మారతున్నది.అందుకే ఆది బ్రహ్మతత్త్వంనుండి విడిపడిందేది తిరిగి ఆ స్థానము చేరలేదు.ప్రకృతిలో భాగముగనే వుండిపోయింది.

1 కామెంట్‌: