బుధవారం, సెప్టెంబర్ 28, 2011

సూక్షశరీర ప్రయాణం

సూక్షశరీర ప్రయాణం

సూక్షశరీర యానం
సూక్షశరీరం అంటే శరీరం ఏమిటి ?
మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని ఆదారం చేసుకుంటుంది.ఆధునిక మనిషి కంటికి కనపడని ఏ విషయాన్ని నమ్మని పరిస్థితుల్లో భౌతిక శరీరాన్ని విడిచి పెట్టి సూక్షశరీరం ద్వార ఎక్కడెక్కడో తిరిగిరావచ్చు అంటే నమ్మడం చాల కష్టం.
సరైన హేతువాదం అంటే దేన్ని నమ్మకపోవడం కాదు.ఒక విషయం నిరూపణకు సిద్దంగా ఉన్నప్పుడు కూడా దాన్ని పరిశోధించిక ఊరికే కొట్టిపడేయడం సరైన హేతువాదం అనిపించుకోదు. ప్రతి ఒక్కరు సాధన ద్వార తమ తమ భౌతిక శరీరాలను వదిలిపెట్టి సూక్ష శరీర యానం చేయవచ్చు అనేది వాస్తవం.
మీలో నిజమైన పట్టుదల ఉంటే మీరే స్వయంగా పరిక్షించుకుని చూడండి.కాని సాధనకు ముందే ఒకే విషయం గుర్తుంచుకోండి.ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్ కోర్సు,ఒక రోగి శరీరాన్ని కొసి పరిక్షించడానికి మెడిసిన్ కోర్సు ఎలాగైతే ఓ నాలుగేళ్ళు చదివి,సాధనచేసి మాత్రమే అందులో ఉత్తీర్ణులవుతున్నారో ,అలాగే ఈ సూక్ష్మ శరీర ప్రయాణానికి తగిన కాల వ్యవది సాధన కోసం వెచ్చించాల్సి వస్తుంది.ఎంతకాలం అనేది మీ యోగ్యత,నమ్మకం,సాధన మీద ఆధారపడి ఉంటుంది.
సాధన : ముందుగా అసలు సూక్షశరీర యానం అనగానే మీకో ఆలోచన వచ్చి ఉంటుంది. మీ ఆలోచన ప్రవాహం మీకో నమ్మకాన్ని ఏర్పరిచి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.మీకా నమ్మకం లేకుంటే ఇక్కడి వరకు చదువుకుంటూ వచ్చేవారే కాదు. కాబట్టి అసలు ఆలోచన గురించి ఆలోచించండి. ఆలోచనను ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటారో ,అది అక్కడే ఉంటుంది.
మీ ఆలోచనను సూక్షశరీరయానం మీద పెట్టండి.
ఇక సాధన మొదలు పెట్టండి.ముందు ఎవరు ఎలాంటి విఘ్నాలు కల్గించని ఏకాంత ప్రదేశం చూసుకుని ఒంటరిగా బెడ్ రూమ్ లో పడుకోండి.మీరు సూక్షశరీర యానం చేయగలరు అని సంపూర్ణంగా ముందుగా నమ్మకం ఏర్పరుచుకోండి.ఎంతో అద్భుతమైన సూక్షశరీరయానానికి మీరు సిద్దపడుతున్నందుకు టెన్షన్ పడకుండా పూర్తి విశ్రాంతిగా మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని సేదతీరండి.మీ ఆలోచననను ఇక ఒక విషయం మీద పూర్తిగా కేంద్రీకరించండి.మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మంగా ఉన్న మరో శరీరం విడిపడుతున్నట్ల పూర్తి ద్యాసను అక్కడే ఉంచి ఆలోచించండి.మీకు ఆ ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏది మీ మనసులో రాకూడదు.మీ ధ్యాసను అక్కడే ఉంచి మీరు నెమ్మదిగా సూక్షశరీరం ద్వార బయటపడుతున్నట్లు ఆలోచిస్తూనే ఉండండి.అసలు ఇలా సూక్షశరీరయానం సాధ్యమేనా కాదా,ఇది ఊరికే టైమ్ వేస్ట్ ప్రయోగం అని,రోజులో జరిగిన మరేవో ఆలోచనలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కునిలా మాటిమాటికి మీ ఆలోచనలు పక్కదారిలో వెళ్ళిన మీ అసలు లక్ష్యంపైనే కేంద్రీకరించండి. నిముషాలు గడుస్తూనే ఉంటాయి.మీలో నుండి ఎలాంటి సూక్షశరీరం బయట పడడంలేదని అప్పుడే నిరాశ పుట్టిందా? మీ సాధనలో కెల్లా అతిముఖ్యమైన అవరోధం ఇదే..ఓ కరాటే,కుంగ్ ఫూ,బాక్సింగ్ లాంటి సాధనలు చేస్తుండగా మీరెప్పుడైనా చూసారా.శరీరం హూనం అవుతుంటుంది.ఒంట్లో చమట దారలై కారిపోతుంటుంది.శరీరంలో నొప్పులు పెచ్చరిల్లుతుంటాయి.ఊపిరితిత్తులు కొలుములై మండుతుంటాయి.బతికుంటే బలుసాకు తినవచ్చు ఈ సాధన ఇంతటితో ఆపేద్దాం అనిపిస్తుంది. అలా ఓ నాలుగేళ్ళు సాధన చేసి శరీరం వజ్రకాయమైతే తప్ప ఓ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకుంటాం.
అలాంటి సాధనతో పోలిస్తే ఈ సూక్షశరీరయాన సాధన ఎంతో సులభం..కావల్సిన మొదటి అర్హత అల్లా విసుగేసి మద్యలోనే వదిలిపెట్టకుండా ఉండడం..ఇది చదివిన వాళ్ళు నూటికి 90 శాతం మంది ఇలా చదివి ఓహో మనిషికి సూక్షశరీరం అనేది కూడా ఒకటుందా...దాంతో భౌతిక శరీరాన్ని వీడి ప్రయాణం కూడా చేయవచ్చా అని అలా చదివి ఇలా ఊరుకుంటారు,తరువాత ఎప్పడో సాధన చేద్దామని(ఆ తరువాత అనేది ఎన్నేళ్ళు గడిచాక కూడా అలాగే ఉండడం వారినే ఆశ్చర్యపరుస్తుంది).మిగిలిన పదిశాతం సాధన మొదలు పెట్టి
దాంట్లో 8 శాతం ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమే మరిచిపోతుంటారు.మిగిలిన 2 శాతం మాత్రమే సీరియస్ గా సాధనచేస్తారు.వారిలో 1శాతం తొందరలోనే సూక్షశరీర ప్రయాణం చేసే స్థితి ఖచ్చితంగా వస్తుంది.మిగితా 1 శాతంకు కాల పరిపక్వత మీద సిద్దిస్తుంది.
ఇంకో నమ్మలేని నిజం ఏమంటే మీరంతా సూక్షశరీరయానం చేసిన చేయకున్న ప్రతి ఒక్కరు సూక్షశరీర స్పర్శను,అనుభూతిని ఏదో ఒకనాడు పొందినవారే.ఎలాగంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఉన్నట్లుండి ఒళ్ళంతా జలదరించినట్లు శరీరం ఉలిక్కిపడడం ఎన్నడో ఒకరోజు అనుభూతి చెందే ఉంటారు.అదే సందేహం లేకుండా సూక్షశరీర అనుభూతే. మీరు నిద్రపొతున్నప్పుడు మీ భౌతిక శరీరం నుండి విడిబడి బయటపడడానికో ,సర్ధకుపోవడానికో సూక్షశరీరం చేసే ప్రయత్నమే ఒళ్ళ జలదరించే అనుభూతి.మరొక వాస్తవం మనం కలలు అని చెప్పుకునేవి సూక్షశరీర ప్రయాణాలే. మీరు చేసే సూక్షశరీర ప్రయాణాలు మొదట్లో నిద్రపోయిన తరువాత జరుగుతాయి.కాని కలకు సూక్షశరీర ప్రయాణానికి మీకు సృష్టమైన తేడా తెలుస్తుంది.మీరు సాధనలో అత్యున్నత స్థితికి చేరినప్పుడు భౌతికి శరీరం సృహలో ఉండగానే మీరు సూక్ష శరీర ప్రయాణం చేయగలుగుతారు.
మీరు సాధన చేస్తున్నప్పడు కూడా ఇలాగే మీ భౌతిక శరీరం నుండి సూక్షశరీరం బయటపడే సమయంలో ఓ కుదుపు ఏర్పడుతుంది.అదే లక్ష్యంగా సాధనపెట్టుకుని సాధన మొదలు పెట్టండి.

మీ సాధన పలించిన రోజున మీకు సూక్షశరీర ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ శరీరం నుండి మీరు బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున చిన్నగా బయట విహరించడం మొదలుపెట్టండి.ఆస్ర్టోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత భారరహిత స్థితిని పొందినట్లు మీ సూక్షశరీరం కూడా భార రహిత స్థితలోనే ఉంటుంది.మీ భౌతిక శరీరాన్ని వదిలి మీరున్న గదిలో అటు ఇటు కదలడం మొదలుపెట్టండి.మీ శరీరం నుండి సూక్షశరీరంగా బయటపడితే మీ భౌతిక శరీరం ఓ మృత శరీరంలా కనపడవచ్చు.కాని అది సజీవమే.మీ భౌతిక శరీరం,సూక్షశరీరం అనుసంధానంగా ఓ సిల్వర్ కార్డ్ నిరంతరం లింక్ గా ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనుసంధానంగా మీరు సూక్షశరీరంతో ఎంత దూరాలైనా వెళ్ళవచ్చును.
మీరు గదిలోనుండి అటు ఇటు భార రహిత స్థితిలో ఎగరండి.మీ గదిలోని వస్తువులని ముట్టకోండి.మీకు విశ్వాసం పెరిగిన రోజున గది నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టండి.బయటి భౌతిక ప్రపంచంలో మాదిరిగానే కనపడుతుంది.మరికొన్ని ఉజ్వల కాంతులు దర్శనమిస్తాయి.ఇంటి చుట్టుపక్కలా ,పక్కవీదీలోకి,పక్క ఊళ్ళోకి వెళ్ళివస్తూ ఉండండి..క్రమంగా మరింత దూర దూరాలకు వెళుగలుగుతారు.
హాలివుడ్ సినిమా ‘హాలోమాన్’లో మాదిరిగా ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు.కాని సినిమాలోని ఇన్విసబుల్ మాన్ కు మాదిరి ఆలోచనలు మీకుంటే మీరు సూక్షశరీర యానం ఏనాటికి చేయలేరు.మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మ కలిపిస్తాడు.
మీరు సూక్షశరీరంతో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాల దగ్గరకు,
పాస్ పోర్టు ,వీసా అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకు తిరిగిరావచ్చు.మీ స్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ సూక్షశరీరాన్ని భౌతిక శరీరంతో అనుసంధానించే సిల్వర్ కార్డ్ వెండితీగలా సాగుతూ వస్తునే ఉంటుంది.వెనుకటి రోజుల్లో ఈ సూక్షశరీర ప్రయాణాలు అందరు చేయగలిగే శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి...మీరు ఒక సారి సూక్షశరీర ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు ఒక శుభ ముహూర్తం చూసుకుని , ఈ సాధన మొదలుపెట్టండి

5 ఏప్రిల్ 2009

పదోవంతు దానం చేయండి,అది పదింతలై తిరిగివస్తుంది.

నిత్య జీవితంలో మనకంతా శుభమే జరుగాలని ఆశిస్తాం.ఆర్ధికంగా,ఆరోగ్యంగా,మానసికంగా బాగుండాలని తాపత్రాయపడుతాం.మనల్ని కాపాడే దేవుడు ఒకరు ఉండాలని,మన యేగ క్షేమాలు చూడాలని మనుషులుగా సహజంగానే ఆశిస్తుంటాము.మనం బాగుండడానికి అలా ఆశించడం న్యాయ బద్దమే.కాని మన తరుపున మిగితా ప్రపంచానికి ఏం చేస్తున్నామనేది అతి ముఖ్యమైన విషయం. మనకు సహాయం లబించాలని ఆశించే ముందు, పకృతి ధర్మం ప్రకారం మనం ముందే ప్రపంచానికి సహాయం చేయాల్సి ఉంటుంది. మీ సంపాదనలో పదోవంతును ఇతరులకు,అవసరార్ధులకు దానం చేయడం మొదలుపెట్టండి.
దానం అనగానే అందరికి డబ్బు రూపంలో దానం చేయడమే గుర్తుకు వస్తుంది.ఆదునిక ప్రపంచంలో మారక వస్తువుగా డబ్బే ఉండడంతో,డబ్బుతో దేన్నయినా కొనుగోలు చేసే శక్తి ఉండడంతో అంతా డబ్బుగురించే ఆలోచిస్తుంటారు.దానం డబ్బురూపంలోనే చేయాల్సిన పనిలేదు. వస్తువులని,మీకు నైపుణ్యం ఉన్న విషయాల్లో సహాయం కూడా చేయవచ్చును. ఏరూపంలో సహాయం చేసిన కూడా అది హృదయపూర్వకంగా చేసినప్పుడే పలితం ఉంటుంది.
దానం గురించి పశ్చిమ దేశాల్లో చాలా చెడ్డ అభిప్రాయం ఉంది.ఇంకొకళ్ళ నుంచి సహాయం ఆర్ధించడం పెద్ద అవమానంగా అక్కడ భావిస్తారు.కాని అది సరైనది కాదు.ఏ మనిషికూడా చనిపోయిన తరువాత తనతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు.భూమి మీద నేర్చుకున్న విధ్య, జీవిత అనుభవాల సారాంశాన్ని మాత్రమే తీసుకుపోగలడు.
చేసే దానం సంతోషంగా మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.అప్పుడే మనకు స్వీకరించే అర్హత కలుగుతుంది.వెనుకటి రోజుల్లో ఈ పదోవంతు దానం అనేది దైవిక ఆజ్ఞగా ఉండేది.టెన్త్ అనే ఇంగ్లీష్ పదమె టిత్ గా మారింది.ఇతరులకు మీరు చేసే సహాయం అది ఇతరులకన్నా మీకే ఎక్కువగా ఉపయోగపడుతుంది.నీటి మీదికి వదిలిపెట్టిన బ్రెడ్ ముక్క పదిరెట్లై తిరిగివస్తుంది అనేది ప్రకృతి సూత్రం.మీ జీవితంలో దానం చేయడం అనేదాన్ని ఒక భాగంగా మార్చుకోండి.సహాయం చేస్తేనే సహాయం లబిస్తుందని మర్చిపోకండి.చేసిన సహాయం ఎప్పుడు తిరిగివస్తుందా అని మాత్రం ఎదురుచూడకండి,అది వచ్చేరోజు,తప్పక తిరిగివస్తdi

సత్యం అంటే?మనస్సు మాయాజాలానికి విరుగుడు సంభవించేదంతా కలగా తలపోయడం

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి

సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..

జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

1 ఏప్రిల్ 2009

జీవితం ఒక అనుభవం.....

ఈ భూమి మీద జీవాతానికి అర్థం ఏమిటి? అంతులేని బాధల్ని,కష్టాల్ని అనుభవించడానికేనా అని అనుకోని మనిషే ఉండడు.జీవులు శరీరం లేకుండా ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నాశనం అంటూ ఏనాటికి ఉండదు.ఆత్మ ఓ అనుభవాన్ని పోందడానికే ఓ మాంస నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది.ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద.దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలు నేర్చుకుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి