బుధవారం, సెప్టెంబర్ 14, 2011

BLOG HIT

బ్లాగ్ హిట్లు పెరగాలంటే ?


బ్లాగ్ లు హిట్లు అవుతాయి మరికొన్ని ఎంత బాగా రాసినా ఫట్ మంటాయి వాటికి గల కారణాలు ఏమిటి ? మన బ్లాగ్ కూడా హిట్ అవ్వాలి అంతే ఏమి చెయ్యాలి ?


లోడింగ్ టైం :- 
మన బ్లాగ్ URL మీద క్లిక్ చేసిన వెంటనే బ్లాగ్ ఓపెన్ అవ్వాలి , అలా కాకుండా స్లోగా ఓపెన్ అవుతుంటే చిరాకు పుడుతుంది , దీనికోసం కౌంటర్ విడ్జెట్లు , యానిమేటెడ్ లు , అనవసర లోగోలు తీసేయ్యాలి. సాధారణం గా రెండు సెకన్లలో ఓపెన్ అవ్వాలి , అంతకన్నా స్లోగా ఓపెన్ అవుతుంటే కష్టం.
 
టెంప్లేట్ :- 
మన బ్లాగ్ హిట్ అవ్వడానికి కొన్ని కారణాలలో ఒకటి టెంప్లేట్ . అదేమిటి రాసేపోస్ట్ కాదా అని అడగకండి ఎందుకంటే మొదట మన బ్లాగ్లో కి రాగానే చూసేది పోస్ట్ కాదు టెంప్లేట్.
ఈ టెంప్లేట్ ఎలా ఉండాలి అంటే- చాలా సాధారణం గా , ఎటువంటి ఆర్భాటాలు లేకుండా , లైట్ కలర్స్ తో , కౌంటర్ విడ్జెట్ లు లేకుండా ఉండాలి. 
బ్లాగ్ టైటిల్ : 
బ్లాగ్ టైటిల్, ట్యాగ్ చాలా సింపుల్ గా , సరదాగా , చూస్తె నవ్వు వొచ్చేలాగా ఉండాలి .
ప్రొఫైల్ :
ప్రొఫైల్ అంటే మన గురించి మనం చెప్పుకునేది. గొప్పలు చెప్పుకోకూడదు. చాలా సాధారణం గా ఉండాలి. నేను లచ్చలు లచ్చలు సంపాదించా అని చెప్పకూడదు .  అదే మాటని " నేను ఎంత ఎత్తుకి ఎదిగినా నెల మీదే నడుస్తా , అని చెప్పాలి ( ముక్కుతోనే గాలి పీలుస్తా అని చెప్పినట్లుగా).
మన ఫోటో కూడా అమాయకంగా ఉండాలి . 
ఒకేరమైన భావాలు కలవాళ్ళు  ఒక సమూహం గా ఏర్పడతారు . అందుకే నేను సాధారణ వ్యక్తిని అని చెప్పుకోవాలి . అప్పుడు సాధారణ మాస్తాత్వాలు ఉన్నవాళ్ళు అందరూ ఒక గ్రూప్ ఏర్పడతారు. అదే నేను కోటీశ్వరుడిని అంటే మిమ్మల్ని దూరం ఉంచుతారు.
పోస్ట్లు:
మనం రాసే పోస్ట్లు చాలా సాధారణం అంశాలు అయి ఉండాలి.  రాజకీయాల మీద రాస్తే మహిళా బ్లాగర్ లు రారు. ఛందస్సు వ్యాకరణం మీద రాస్తే యువ బ్లాగర్ లు రారు.  అందుకని ఒకే మూస కొట్టుడుతో కాకుండా అప్పుడప్పుడు రాజకీయాల మీద , వంటల మీద పద్యా మీద , వ్యకరనాలమీద రాయాలి . 
టైటిల్ పోస్ట్ :- 
పోస్ట్ యొక్క టైటిలే చూడగానే ఆహ్వానిన్చేతట్లుగా ఉండాలి. కొంచెం ఆసక్తి దాయకంగా , సరదాగా ఉండాలి . ఇందులో వివాదాస్పద పోస్ట్ టైటిల్ ఉంటె హిట్లు పెరుగుతాయి. కానీ పోస్ట్ మాత్రం సరదాగా సాగాలి  
మనం పెట్టె కామెంట్స్  ;
ఇతరుల బ్లాగ్లలో మనం పెట్టె కామెంట్స్ చాలా సరదాగా ఉండాలి . బ్లాగ్ రచయతతో ఏకీభవించాలి ( మనదే మొదటి కామెంట్ అయితే)
ఒకవేళ మనది మొదటి కామెంట్ కాకపొతే మనకన్నా ముందు రాసిన వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో మనం కూడా అటువైపే వెళ్ళాలి. అంటే మెజారిటీ వర్గాలతో కలవాలి. వారితో ఏకీభవించాలి.   ఎత్తిపరిస్తితులలోనూ మనం వివాదాస్పదం గా కామెంట్ రాయకూడదు. అందరితోనూ ఏకీభవించాలి .
మన కొచ్చే కామెంట్స్ :
మన బ్లాగ్ హిట్టు అవ్వాలని మనః స్పూర్తిగా కోరుకుంటే అజ్నాతల చేత కామెంట్స్ రాయిన్చుకోవాలి . అజ్న్నతలతో రాయించుకున్నా పర్లేదు మోడరేషన్ ఉన్నా పర్లేదు . ఎందుకంటే మనం వివాదాస్పదం గా రాయం కాబట్టి 
కామెంట్ కొట్టంగానే పబ్లిష్ అయిపోవాలి.
మనకి కామెంట్ రాసినవాల్లందరికీ మనం రుణ పడిపోవాలి. వినయ విదేయలతో తిరిగి కృతజ్ఞతలు చెప్పాలి.  మనం ఎలాగూ వివాదాస్పదం గ రాయం కాబట్టి మనకి వచ్చే కామెంట్స్ కూడా సరదాగా నే ఉంటాయి , కానీ ఎవరన్న మనతో విభేదిస్తే మాత్రం మనం "నాకు తెలియదు  మాస్టారు , మీ వల్ల ఒక మంచి విషయం తెలిసింది" అని అనాలి.

స్టాట్ కౌంటర్లు, గూగుల్ అనలిటిక్స్  ఉపయోగించకూడదు, ఒకవేళ ఉపయోగిస్తే ఆ విషయం చెప్పకూడదు, చెప్తే బ్లాగర్ లు కామెంట్స్ రాయరు ( వాళ్ళ IP అడ్రస్ లు తెలిసిపోతాయి అని) 
జూనియర్లు సీనియర్ల బ్లాగ్ లలో కామెంట్స్ రాయాలి 
ఒకవేళ సీనియర్లు జూనియర్ల బ్లాగ్ లో కామెంట్ రాస్తే దానిని మహా ప్రసాదం గా భావించాలి. వారు చేసిన సూచనలను తూచా తప్పక పాటించాలి. అంతే కానీ సీనియర్లని వేధించకూడదు.    ఎందుకంటే రేపు మనం సీనియర్లు అవుతాం కాబట్టి. 
గ్రూప్స్;
మనం ఒక గ్రూప్ ఏర్పరుచుకోవాలి. లేదా ఒక వెల్ ఎస్టాబ్లిషిడ్ గ్రూప్ లో జేరాలి. వాళ్ళ మిత్రులని మన మిత్రులు గా భావించాలి. ఆ గ్రూప్ శత్రువులని మన శత్రువులు గా భావించాలి 
Misc .
మనం అన్ని బ్లాగ్లు ఫాలో అయిపోవాలి. ( నేను గూగుల్ రీడర్ ద్వారా చాలా దాదాపు అన్నీ బ్లాగ్లని ఫాలో అవుతుంటాను. అందుకే అన్నీ బ్లాగ్ లలో కామెంట్స్ రాస్తుంటాను)
ఇన్ని చెపుతున్నావ్ నువ్వు ఎందుకు పాటించవు  అని అడగకండి నేను నా మనసు ని చంపుకుని రాజీ పడను. ( ఉద్యోగం పీకిస్తా అని బెదిరిస్తే తప్ప ఇంకెప్పుడూ రాజీ పడను)
ఈ పోస్ట్ లో అన్నీ రుచులు ఉన్నాయి తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు (మొదట తీపి -చివర్లో చేదు  ) ఎవరికి కావలిసిన రుచిని వారు ఆస్వాదించండి.  
మీ అందరి బ్లాగ్ లు హిట్లు కావాలని కోరుకుంటున్నా 

మనం హిట్లు ఫట్లు అని చూసుకుంటే బ్లాగ్ లు సరిగ్గా రాయలేం
సాధారణం గా ఒక బ్లాగ్ కి 250 హిట్లు వస్తాయి ( ఎందుకంటే రెగ్యులర్ గా బ్లాగ్ లు చదివేవారు అంటే కాబటి )
అంతకనా హిట్లు పెరుగాయి అంటే అది కామెంట్స్ ప్రభావం.
అదే సరదాగా రాయకుండా వ్యంగం తోనో వెటకారం తోనో కెలుకుడు గానో పోస్ట్ రాస్తే ఇంకా ఎక్కువ హిట్లు వస్తాయ్
కాని ఆ పోస్ట్ ని ఎక్కువమంది చదవరు. మరి కౌంట్ ఎలా పెరుగుతుంది అంటే కామెంట్ రాసినవాల్లె మళ్ళి మళ్ళి వచ్చి చూస్తారు కాబట్టి.
మన బ్లాగ్ కి ఎన్ని హిట్లు వచ్చాయి అని చూడటం కన్నా "ఎంత సేపు చదివారు " అన్నదే ముక్ష్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి