బుధవారం, సెప్టెంబర్ 14, 2011

ఆసనమూ ముఖ్యమే

ఆసనమూ ముఖ్యమే


ఫూజ చేసే సమయంలో నేలమీద కూర్చుని పూజ చేయకూడదని పెద్దలంటారు. పూజ, వ్రతాలు, నోములు ధ్యానం, స్తోత్రాదులు చేసేటపుడు భగవంతునికి ఎదురుగా ఆసనం మీద ఆసీనులు కావాలంటారు. ఉచితాసనం పైన కూర్చునే ధార్మిక కార్యాలు చేయాలని బ్రహ్మాండపురాణం చెప్తోంది. ఆసనం లేకుండా చేసే పూజ దైవకార్యాలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వవని శ్రాస్తంచెప్తోంది.
ఇలా ఉచితాసనం అంటే ఎటువంటి ఆసనం ఉండాలన్నధర్మసందేహానికి సమాధానం బ్రహ్మాండపురాణమే వివరాలను అందిస్తోంది. దేవాలయాల్లో పూజారులు నేలపైన ఒకవేళ నేలపై కూర్చుని పూజచేసినట్లు అయితే వారికి కష్టాలు, మానసికవేదన, చిత్త్భమ్రబాధలు, దుఃఖాలు కలుగుతాయట. అందుకనే వారు జింకచర్మం, పులిచర్మం లాంటివి ఆసనాలుగా ఉపయోగిస్తారు. రాతి మీద కూర్చుని పూజచేస్తే అనారోగ్యాలు కలుగుతాయి. చెక్కపైన కూర్చుని చేస్తే దురదృష్టం సంపద నష్టం లాంటివి కలుగుతాయి. గడ్డిపైన కూర్చుని పూజచేస్తే ఇతరులనుంచి అవహేళన, అమర్యాద కలుగుతాయి. వెదురు చాపపై కూర్చుని పూజించడం కూడా దారిద్య్రానికి గురౌతారు. బట్టపైన కూర్చుని పూజచేస్తే హాని కలుగుతుంది. ప్రత్యేకంగా పూజకోసమే తయారుచేసుకొన్న పుల్లల చాపపైన కూర్చుని చేసే అదృష్టం, సంపదవృద్ధి కలుగుతాయి. ఏకాగ్రత కలుగుతుంది. కాని ఈ చాపపైన కూర్చునే భోజనాదులు చేయడం లాంటి కార్యాలు చేయకూడదు. కృష్ణజింకచర్మం పైన కూర్చుని పూజ చేయడం సర్వ శ్రేష్ఠం అంటారు. తివాచి పైన కూర్చుని కూడా పూజ చేయవచ్చు. దీన్ని కూడా పవిత్రంగానే భద్రపరుచుకోవాలి. అలానే ఎరుపు రంగు కంబళిపైన కూడా కూర్చుని పూజచేయవచ్చు.దీన్ని బట్టి పూజ చేసేందుకు మనసు తో పాటుగా ఆసనం కూడా కావాల్సిందే. సుఖాసనంలోనే భగవంతుని నామాన్ని స్థిరంగా మననం చేయవచ్చుగదా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి