గురువారం, సెప్టెంబర్ 15, 2011

తల్లి

  1. తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు
  2. తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?తల్లికి కానివాడు దాదికవునా?తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?తల్లే రోసిన దాది రోయదా?
  3. తల్లి కడుపులో చొరకముందు దయ్యాలదేవత,భూమిలో పుట్టిన తరువాత యమదేవత
  4. తల్లికి కాకపోతే తిళ్ళీకకు(దీపానికి) దణ్ణం పెట్టమన్నారు
  5. తల్లికి కొట్టరా వసంతం అన్నట్లు
  6. తల్లికి తగిన బిడ్డ ,ఇంటికి తగిన పందిరి
  7. తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్ప సమానం
  8. తల్లికి వంచ గలిగిన ,పిల్లకు బొక్క(ఎముక) కలుగుతుంది
  9. తల్లికొద్దీ బొల్లి కోడె
  10. తల్లి గండము పిల్ల గండమూ ఉందిగానీ మధ్యలో మంత్రసాని గండం ఉందా?
  11. తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా
  12. తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?
  13. తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదౌతుందా?
  14. తల్లి గుణము కూతురే బయట పెడుతుంది
  15. తల్లి చచ్చినా మేనమామ ఉంటే చాలు
  16. తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానం
  17. తల్లి చస్తే కడుపు పెద్ద,తలలుమాస్తే కొప్పు పెద్ద
  18. తల్లి చస్తే తరంబాసె,తండ్రి చస్తే ఋణం బాసె
  19. తల్లి చస్తే నాలుక చచ్చినట్లు,తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
  20. తల్లి చాలు పిల్లకు తప్పుతుందా?
  21. తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు,భార్య మెడలో పూసలు బందుగులకు(భోగాలకు)
  22. తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు
  23. తల్లి చేలో మేస్తే , దూడ గట్టున మేస్తుందా?
  24. తల్లి తర్పణానికే తక్కువైతే,పినతల్లికి పిండ ప్రధానమట
  25. తలిదండ్రి లేని బాల తన నాధునే కోరును
  26. తలిదండ్రులు అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొరవే
  27. తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం
  28. తల్లి దైవము తండ్రి ధనము
  29. తల్లిని చూచి పిల్లను,పాడిని చూచి బర్రెను కొనాలి
  30. తల్లిని తిట్టకురా నీయమ్మనాయాలా అన్నట్లు
  31. తల్లిని నమ్మినవాడు,ధరణిని నమ్మినవాడు చెడడు
  32. తల్లిని బట్టి పిల్ల,విత్తునుబట్టి పంట,నూలును బట్టి గుడ్డ
  33. తల్లి పాలు దూడ చెబుతుంది
  34. తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట
  35. తల్లిపిల్ల వన్నెకాదు,వండిపెట్టదిక్కులేదు
  36. తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
  37. తల్లిపెంచాలి ధరణిపెంచాలిగాని పెరవారు పెంచుతారా?
  38. తల్లి మాటలేగానీ పెట్టుమాత్రం పినతల్లిది(సవతితల్లిది)
  39. తల్లి ముఖం చూడని బిడ్డ వాన ముఖం చూడని పైరు
  40. తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
  41. తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?డిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
  42. తల్లిలేని పిల్ల ఉల్లిలేని కూర
  43. తల్లి విషం పెళ్ళాం బెల్లం
  44. తల్లి లేని పిల్లలు అల్లులేని తీగలు
  45. తల్లిలేనిపిల్ల దయ్యాలపాలు
  46. తల్లీబిడ్డా ఒకటైనా నోరూ కడుపూ వేరు

  1. అమ్మ కడుపు చూస్తుంది,ఆలు వీపు (జేబు) చూస్తుంది
  2. అమ్మకడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్ళే
  3. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  4. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు
  5. అమ్మ తాపెట్టా పెట్టదు,అడుక్కొని తినా తిననివ్వదు
  6. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు,తగుదునని తగవు తీర్చవచ్చాడు
  7. అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు
  8. అమ్మకళ గుమ్మంలోనే తెలుస్తుంది
  9. అమ్మ గూటికి అయ్య కాటికి
  10. అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా?
  11. అమ్మదగ్గర కిందపడుకున్నా ఒకటే,అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే
  12. అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు
  13. అమ్మ దాసర్లకు,అయ్య జంగాలకు
  14. అమ్మను తిడతావేమిరా లంజకొడుకా అన్నాడట
  15. అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా?
  16. అమ్మయినా అడగందే పెట్టదు
  17. అమ్మ రాకాసి,ఆలు భూకాసి
  18. అమ్మా అని పిలవని నోరు కుమ్మరి మను ద్రవ్విన గుంట
  19. అమ్మా నొప్పులెత్తుతున్నప్పుడు నన్ను లేపవే అంటే అలగా పడుకో బిడ్డా ఊటగా నొప్పులెత్తుకుంటే ఊరెల్లా నీవే లేపుతావు అన్నదట
  20. అమ్మా నీ అల్లుడొచ్చాడే అంటే నన్నేమి చేస్తాడమ్మా నిన్నే తీసికెళ్తాడు అందట
  21. అమ్మా పెట్టేవి నాలుగూ పెందలాడే పెట్టవే ,దూడ గడ్డికి పోవాల అన్నాడట
  22. అమ్మా బాబు పిచ్చిగానీ ,నాకు చదువు వస్తుందా?
  23. అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి