మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

BLOG TRAFFIC SOURCE

మీ బ్లాగు ట్రాఫిక్ సోర్సు తెలుసుకోవాలి అనుకుంటున్నారా

మీ బ్లాగులోకి వస్తున్న ట్రాఫిక్ సోర్సు వివరాలు అనగా సంకలిని నుండి వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు, అలాగే గూగుల్ లో యే పదాలు టైప్ చేయడం వల్ల మీ బ్లాగ్ లోకి సందర్శకులు వస్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్దతి కన్నా రెండవ పద్దతి చాలా సులువు అయినా మీకు రెండూ చెబుతాను. :
%%%%%%%%%%%
ముందుగా మీరు http://www.google.com/analytics ఈలింక్ ని నొక్కాలి. ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ ఉంటే సరే సరి లేదంటే కొత్తది తయారు చేసుకోండి . మీ గూగుల్ అకౌంట్ రెడీ అయ్యాక అక్కడ ACCESS ANALYTICS అన్న మీట నొక్కండి . అక్కడ ఐడి, పాస్ వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈ క్రింది ఇమేజ్ లో ఉన చోటుకి చేరుతారు.


పై ఇమేజ్ లో sign up అన్న మీట నొక్కండి ఇప్పుడు మీరు క్రింది ఇమేజ్ ఉన్న చోటుకి చేరుతారు .


అక్కడ మీ బ్లాగు లింక్ ఇచ్చి క్రింద మీ పేరు , మీరు ఉన్న దేశం సమయం వివరాలు ఇచ్చి continue అన్న దాని మీద నొక్కండి. ఇప్పుడు మీరు కింది ఇమేజ్ ఉన్న దగ్గర చేరుతారు. అక్కడ మీ పేరు , మీరు ఉన్న దేశం సరిగా ఇచ్చి మరలా continue అన్న బటన్ నొక్కండి.
ఇప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండీషన్స్ అగ్రిమెంట్ ని ఓకే చేయాల్సి ఉంటుంది . కింది ఇమేజ్ లో చూపిన లాగా Yes, I agree to the above terms and conditions. అని ఉన చోట టిక్ పెట్టి కింద create new account అన్న బటన్ నొక్కండి.


ఇప్పుడు మీరు క్రింది ఇమేజ్ లో ఉన్న చోటుకి చేరుతారు అక్కడ మీకు లభించే code తీసుకెళ్ళి మీ బ్లాగులో html గాడ్జెట్ లో పెట్టండి. అదెలా పెట్టాలో చెప్పనక్కర్లేదనుకుంటా :P . తర్వాత అక్కడ save& finish బటన్ నొక్కడం ద్వారా మీరు సైట్ లోకి ప్రవేశిస్తారు.

24 గంటల తర్వాత మీరు మీ ట్రాఫిక్ సోర్స్ క్రింది విధంగా చూచుకోవచ్చు .నేను కొత్త (బ్లాగు) సామెతలు అనే పోస్టు రాసిన జులై 5 న నా బ్లాగ్ ట్రాఫిక్ సోర్సు క్రింది ఇమేజి లో మీరు గమనించ వచ్చు.


పై ఇమేజ్ లో view report అన్న చోట నొక్కండి. తర్వాత క్రింది ఇమేజ్ లో ఎడమ వైపు ఉన్న మెనూ లో Traffic Sources అన్న చోట నొక్కండి. కుడి చేతివైపు మీకు యే డేట్ నుండి యే డేట్ వరకు కావాలో కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.




ఇప్పుడు మీరు కింది ఇమేజ్ లో లాగా మీ ట్రాఫిక్ సోర్సు , ఇంకా గూగుల్ నుండి యే పదాలు నొక్కి మీ బ్లాగునకు వస్తున్నారు అనే వివరాలు తెల్సుకోవచ్చు.

పై వివరాలు ఒక్క జులై ఐదవ తారీఖు నాటివే.

గమనిక : ఇమేజ్ ని పెద్దదిగా చూడడానికి ఇమేజ్ మీద క్లిక్ చేయండి :)

రెండవ పద్దతి.
http://draft.blogger.com నొక్కండి మీ గూగుల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో కింది ఇమేజ్ లో చూపినట్టిగా మీ బ్లాగు చివర stats అని వస్తుంది అదే కాకుండా పైభాగాన Make Blogger in Draft my default dashboard అని వస్తుంది. అక్కడ టిక్ పెట్టి ... stats నొక్కండి . సులభంగా మీ బ్లాగు ట్రాఫిక్ రిపోర్ట్ ఎప్పటికి అప్పుడు చూడండి.




రెండవ పద్దతి చాలా సులువు సుమా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి