గురువారం, సెప్టెంబర్ 15, 2011

COMPUTER TIPS

మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?


ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో చాలా వరకు స్కోప్ వీడియోలను అలాగే కన్వర్ట్ చేస్తాయి. అలా కాకుండా ఫుల్ స్క్రీన్ లో కనిపించాలంటే ఆ వీడియోని 4:3 గా క్రాప్ చెయ్యాలి.
వీటికోసం నేను ప్రయత్నించిన అన్ని సాఫ్ట్ వేర్ ల లోను మంచి సాఫ్ట్ వేర్ అనిపించిన దాని గురించి మీకు తెలియ చెయ్యాలని దాని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. మీరు కూడ ప్రయత్నించండి
http://www.4videosoft.com/
దీనిలో మీకు కావలిసిన వీడియోని యాడ్ ఫైల్ (Add File) ద్వారా Add చేసి, Trim ఆప్షన్ ద్వారా వీడియోని కావలినంత వరకూ కట్ చేయవచ్చును. Crop ఆప్షన్ ద్వారా Zoom Mode 4:3కి సెట్ చేసి వాల్యుం పూర్తిగా సెలక్ట్ చేసి OK చెయ్యాలి. ప్రొఫైల్ లో మీ మొబైల్ కి తగినట్లుగా సెలెక్ట్ చేసి స్టార్ట్ పై క్లిక్ చెయ్యడం ద్వార కన్వర్ట్ చెయ్య వచ్చు.

మైక్రోసాఫ్ట్ వర్డ్ లో A to Z షార్ట్ కట్స్

                   ఆఫీసు పనుల నిర్వహణ  నిమిత్తం తయారు చేయబడిన సాఫ్ట్ వేర్లను ఆఫీసు సూట్ అని అంటారు. మన ఆఫీసు పనులకోసం ఎన్నో రకాల సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికీ, వాటన్నిటిలోనూ మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన ఎం.ఎస్.ఆఫీస్ ను మాత్రమే ఎక్కువ శాతం ప్రజలు ఉపయోగిస్తున్నారు. ప్రతీ ఆఫీసు సూట్ కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్లు కలిగివుంటాయి. ఉదాహరణకి ఎం.ఎస్. వర్డ్, ఎం.ఎస్.ఎక్సల్, ఎం.ఎస్. పవర్ పాయింట్ మరియు ఎం.ఎస్. యాక్సస్ వంటివి.
                వీటిలో మైక్రోసాఫ్ట్ వర్డ్ టైపు మెషీన్ తో చేసే పని అంతటినీ కంప్యూటర్ ద్వారా చేయడానికి మరియు ఇంకా ఎంతో అందముగా, ఆకర్షణీయముగా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే   మైక్రోసాఫ్ట్ వర్డ్ కి  ఎం.ఎస్.ఆఫీసు లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి వర్డ్ లో మన పని సులభముగా చేయడానికి ఎన్నో రకాల షార్ట్ కట్ కీస్ రూపోందించబడ్డాయి.
               షార్ట్ కట్ కీస్ అంటే మెనూస్ మరియు టూల్ బార్స్ లో వుండే కమాండ్ లను మౌస్ ఉపయోగించి సెలక్ట్ చేయవలసిన అవసరం లేకుండా కీబోర్డ్ ద్వారా సింపుల్ గా  చేయడానికి ఉపయోగించే  బటన్స్ అని అర్ధం. వీటిని కంట్రోల్, ఆల్ట్, షిఫ్ట్ కాంబినేషన్లో ఉపయోగిస్తారు. 

              వీటిలో ముఖ్యమైన కొన్ని షార్ట్ కట్ కీస్. 
Ctrl+A -  Select All -డాక్యుమెంట్ లో ఉన్న సమాచారం మొత్తం సెలక్ట్ అవ్వాలంటే 
Ctrl+B -Bold - సెలక్ట్ చేసిన సమాచారము అంతా డార్క్ గా మారాలంటే  
Ctrl+C - Copy - సెలక్ట్ చేసిన సమాచారమును క్లిప్ బోర్డ్ లోనికి కాపి చేస్తుంది
Ctrl+D - Font - ఫార్మట్ మెనూ లోని ఫాంట్ కమాండ్ ఓపెన్ చేయాలంటే, దీని ద్వారా ఫాంట్, సైజ్, స్టయిల్, కలర్, అండర్ లైన్, స్పేసింగ్ మరియు ఎఫెక్ట్ లను సెలెక్ట్ చేసుకునే అవకాశం కలదు.
Ctrl+E - Center Alignment - సెలక్ట్ చేసిన పేరాగ్రాఫ్ లను రూలర్ కి మధ్యలోనికి తీసుకుని రావాలంటే
Ctrl+F - Find - డాక్యుమెంట్ లో కావలసిన పదాన్ని వెదకడానికి
Ctrl+G - Goto - డాక్యుమెంట్ లో కావలసిన లైన్ లేదా పేజ్ లేదా సెక్షన్ లేదా బుక్ మార్క్ వద్దకు కర్సర్ తీసుకు వెళ్ళాలంటే
Ctrl+H - Replace - డాక్యుమెంట్ లో కావలసిన పదాన్ని వెదకి దాని స్థానములో వేరొక పదాన్ని ఉంచడానికి
Ctrl+I - Italic - సెలక్ట్ చేసిన సమాచారము ఇటాలిక్  స్టయిల్ లోనికి మారాలంటే 
Ctrl+J - Justify - సెలక్ట్ చేసిన పేరాగ్రాఫ్ లను రూలర్ కి అనుగుణముగా సెట్ చేయాలంటే. లెటర్స్ టైప్ చేసేటప్పుడు తప్పనిసరిగా జస్టిఫై చేస్తే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.    
Ctrl+K- Hyperlink - ప్రస్తుత డాక్యుమెంట్ లో వేరొక ఫైల్ ని లింక్ చేయడానికి. ఈ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ ఫైల్ ని ఓపెన్ చేయవచ్చు.
Ctrl+L - Left Alignment - సెలక్ట్ చేసిన పేరాగ్రాఫ్ లను రూలర్ కి ఎడమ వైపుకి తీసుకుని రావాలంటే
Ctrl+M - Indent - సెలక్ట్ చేసిన పేరాగ్రాఫ్ మొత్తం ముందుకు జరగాలంటే.
Ctrl+N - New - కొత్త ఫైల్ తయారు చేయాలంటే
Ctrl+O - Open - కంప్యూటర్లో స్టోర్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయాలంటే.
Ctrl+P - Print - ప్రస్తుతం చేస్తున్న డాక్యుమెంట్ ని పేపర్ పై ప్రింట్ చేయాలంటే
Ctrl+Q - Reset Para - మార్పు చేసిన పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ అన్ని పోయి, యధావిధిగా రావాలంటే  
Ctrl+R - Right Alignment - సెలక్ట్ చేసిన పేరాగ్రాఫ్ లను పేజ్ కి కుడి వైపుకి తీసుకుని రావాలంటే 
Ctrl+S - Save - క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ను కంప్యూటర్ లో స్టోర్ చేయాలంటే  
Ctrl+ T - Hanging Indent - పాయింట్  వైజ్ గా సమాచారం టైప్ చేసేటప్పుడు ఈ హేంగింగ్ ఇండెంట్ సెట్ చేస్తే అందంగా వుంటుంది. 
Ctrl+U - Underline -  సెలక్ట్ చేసిన సమాచారమునకు అండర్ లైన్ ఇవ్వాలంటే  
Ctrl+V - Paste - కట్ చేసిన లేదా కాపి చేసిన సమాచారమును (క్లిప్ బోర్డ్ లో ఉన్నది) కావలసిన చోట ఇన్ సర్ట్ చేయాలంటే  
Ctrl+W - Document Close - ప్రస్తుతం చేస్తున్న డాక్యుమెంట్ ను క్లోజ్ చేయాలంటే
Ctrl+ X - Cut - సెలక్ట్ చేసిన సమాచారమును అక్కడినుండి తీసివేసి క్లిప్ బోర్డ్ లో స్టోర్ చేయడానికి
Ctrl+ Y - Redo - అన్ డూ చేసిన మార్పులను కేన్సిల్ చేయాలంటే  
Ctrl+ Z - Undo - మనం చేసిన వర్క్ ఒక్కొక్కటిగా కేన్సిల్ చేయాలంటే  
F7 - Spelling and Grammar Check  - డాక్యుమెంట్లో మనం చేసిన స్పెల్లింగ్ మరియు గ్రామ్మర్ తప్పులను కరెక్ట్ చేయడానికి
Ctrl+[or] - సెలక్ట్ చేసిన సమాచారము యొక్క సైజ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా
వీటిని ఉపయోగించి మీ డాక్యుమెంట్లను మరింత అందముగా తయారు చేసుకోండి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి