శనివారం, సెప్టెంబర్ 17, 2011

GOOGLE ADSENSE

మీ బ్లాగ్, వెబ్ పుటల నుండి ఆదాయం గడించండి : గూగుల్ యాడ్‌స్‌న్స్(Google Adsense)

1.సంపాదనకు అందుబాటులో వున్న    మార్గాలు

వెబ్ (ఇంటర్నెట్ ద్వారా) ఆదాయం గడించడానికి (డబ్బులు సంపాదించడానికి) అనేక మార్గాలు వున్నాయి. ఎక్కడ చూసినా మీరు చదివేది యిదే. (ముఖ్యంగా రకరకాల డబ్బు సంపాదించి పెట్టే ప్రోగ్రాములను సిఫార్సు చేసే అనేకమైన వెబ్‌ సైట్లలో) ఇక్కడ అటువంటి ప్రోగ్రాముల గురించి రాయబోవడం లేదు. ఆచరణ యోగ్యమైన, వాస్తవికమైన హేతుబద్దమైన వాటి గురించి అవగాహన మాత్రమే కలుగ చేసే ప్రయత్నం చేస్తున్నాము.

• వస్తువు/సేవ అమ్మకం

మీరు యిప్పటికే అమ్ముతున్న వస్తువులు, అందిస్తున్న సేవల వంటివి వున్నట్లయితే, వాటిని ఇంటర్నెట్ ద్వారా అమ్మే ప్రయత్నం చేయవచ్చు. ఇంటర్నెట్ మీరు మీ వస్తువును/సేవను ప్రస్తుతం మీరున్న ప్రదేశం నుండే ప్రపంచం మొత్తం అమ్మగలగడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా (ప్రపంచంలో ఎక్కడ వున్న వారికైనా) ఆన్‌లైన్ కోచింగ్, ట్యూషన్లు, డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు, జ్యోతిష్కులు, వాస్తు శాస్త్రఙ్ఞులు, వంటవారు వంటి అనేక మంది సలహాలు, సంప్రదింపులు సేవలు అందించడానికి అవకాశం సృష్టించబడుతుంది.ఇవన్నీ అమ్మకం ద్వారా డబ్బు సంపాదించిపెట్టే మార్గాలే.

• ప్రకటనలు

వస్తువులు/సేవలు అమ్మకం ద్వారా కాక, ఇంటర్నెట్‌లో వెబ్‌-సైట్/బ్లాగ్‌ల ప్రచురణ కర్తలకు ఆదాయం సమకూర్చి పెట్టే నమ్మకమైన, కాల పరీక్ష తట్టుకుని నిలబడ్డ మార్గం ప్రకటనలు. ఈ మార్గం ద్వారా ఆదాయం గడించాలంటే, మీ వెబ్-పుటలో/బ్లాగ్‌లో కొంత జాగా ప్రకటనల కోసం కేటాయించవలసి వుంటుంది.

• అనుబంధ/సంబంధ/నివేదించే వ్యక్తి/సంస్థగా వ్యవహరించడం

Referrer అంటే నివేదించేవాడు అని అర్ధం. ఒక వెబ్‌ సైట్ ఏదన్నా వస్తువునో/సేవనో అమ్ముతున్నట్లయితే, వారికి మీరు నివేదకుడిగా (వారికి అవసరమైతే/కావాలనుకుంటే) పని చేయవచ్చు. .ఇలా పని చేసినందుకు మీకొచ్చే ఆదాయం, మీరు (మీ వెబ్‌సైట్/బ్లాగ్ ద్వారా) నివేదించిన వినియోగ దారుడికి వారు వస్తువునో/సేవనో అమ్మడం వలన వారికొచ్చే అదాయంలో కొంత భాగం. మీరు వారి వస్తువు/సేవకు ఒక ప్రకటనను మీ వెబ్‌-పుట/బ్లాగ్‌లో పొందుపరుస్తారు. మీ బ్లాగ్/వెబ్‌-సైట్ పాఠకుడు, మీరు (బ్లాగ్/వెబ్‌పుటలో) పెట్టిన ప్రకటనలో లంకె మీద క్లిక్ చేసి, ఆ వెబ్‌ సైట్‌కు వెళ్ళినట్లయితే, మీరు ఆ పాఠకుడిని, ఆ వెబ్‌ సైట్‌కు నివేదించినట్లు.
ఆ వెబ్‌ సైట్‌లో వున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ నివేదనకు సంబంధించిన వివరములను గ్రహించి భద్రపరుస్తుంది. వెబ్‌-సైట్/బ్లాగ్ నివేదించిన వినియోగదారుడు, ఆ వెబ్‌-సైట్‌లో వస్తువును/సేవను కొనుగోలు చేసిన వెంటనే, మీరు నివేదన కమీషన్ చెల్లించబడటానికి అర్హులవుతారు. మీ ఖాతాలో కమిషన్ కొంత కనీస మొత్తం పేరుకోగానే మీకు చెల్లింపు జరుగుతుంది.

• అనుబంధీకుల కార్యక్రమం

అనుబంధీకులు అంటే నేరుగా సంబంధం కలిగినవారు. మీరు ఏదన్నా సంస్థకు అనుసంబంధికులుగా అనుబంధీకులుగా వ్యవహరిస్తున్నారంటే అర్ధం, నేను ఈ సంస్థతో సంబంధం కలిగి వున్నాను, నేను వారి వస్తువును/సేవను నమ్మకంగా సిఫార్సు చేస్తున్నాను అని చెప్పడమే. నమ్మకమైన/నాణ్యమైన వస్తువు/సేవను అందిస్తున్న సంస్థల/వ్యక్తులకు అనుబంధికులుగా వ్యవహరించడంలో ఎటువంటి యిబ్బంది వుండదు. ఈ విధానం అచ్చితంగా నివేదకుల కార్యక్రమములాగా పనిచేస్తుంది. ఎక్కువగా నివేదన/అనుబంధికునిగా వ్యవహరించడం ఒకటిగానే భావిస్తాము. పదానికున్న అర్ధంలో తేడా తప్పితే ఆలోచనలో తేడా వుండదు కాబట్టి.

» ఇంతలోనే లక్షలు/కోట్లు

ఇంటర్నెట్‌లో అనేకానేక వెబ్‌ సైట్లలో ప్రకటించబడే నివేదన ప్రోగ్రాములు పెట్టే ప్రలోభాలకు లోనవ్వకండి. ఏదన్నా విలువ కల్గిన, యోగ్యమైన వస్తువు/సేవ లేనటువంటి వెబ్ సైట్‌లు అందించే నివేదన ప్రోగ్రామ్‌లకు మీరు వాటి గురించి ఆలోచన చేసే యోగ్యత కూడా వుండదు. ఈ మోసపూరిత వెబ్‌ సైట్లు మీ వద్దనుండి నివేదకుడిగా చేరడానికి కొంత రుసుము వసూలు చేస్తాయి. ఈ రుసుము ఒక్కటే వీళ్ళకున్న ఆదాయ మార్గం. మీరు నివేదించిన కొత్త వినియోగదారుడు/ఖాతాదారుడు చెల్లించే రుసుములో మీకు కొంత కమీషన్ చెల్లిస్తానంటారు.
నిజంగానే అనిపించేటువంటి మాటలతో, లక్షలు/కోట్లు అతి కొద్ది కాలంలో సంపాదించేస్తాము అని అనిపించేటంత గాఢంగా వుంటాయి. ఇది మీరు యితరులను వలలో వెయ్యడానికి అవసరమైన అనుమతి పత్రం పొందడానికి రుసుము చెల్లించినట్లే.
ఇటువంటి ప్రోగ్రాముల మీద అనవసరంగా డబ్బు, కాలం వృధా చేసుకోకండి. ఇటువంటి వాటి మీద/కోసం పనిచెయ్యడం, డబ్బు/శ్రమను యితరులను ధనవంతులను చెయ్యడానికి వుపయోగించడమే అవుతుంది.
మా అభిప్రాయాలతో మీరు ఏకీభవించాలనేమీ లేదు. ఏదయినా ప్రోగ్రాము నిజంగా మనం పాలుపంచుకోదగ్గదిగా మీకనిపిస్తే తప్పకుండా ప్రయత్నించండి.

• నివేదకుడిగా/అనుసంబంధీకుడిగా వుండటం లాభదాయకమే

వస్తువులు, సేవలను అమ్ముతూ, ప్రచురణకర్తలకు నివేదన/అనుసంబంధ కార్యక్రమాలను అందిస్తున్న వెబ్‌ సైట్లు అనేకానేకం కనపడతాయి. మీరు ఏదయినా వెబ్‌ సైట్‌కు నివేదకుడు/అనుబంధీకుడిగా వ్వవహరించదలుచుకున్నప్పుడు మీకు మీరు వేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న - ఆ వెబ్‌ సైట్ అమ్ముతున్న నిఖార్సైన వస్తువు/సేవ ఏదయినా వుందా? మీ సమాధానం వుంది అయితే, మీరు ఆ వెబ్‌ సైట్ నివేదకుడి/అనుసంబంధీకుడిగా పని చేసి సంపాదించే అవకాశం వున్నట్లే.






2.ప్రకటనల ప్రక్రియతో ఎవరికి సంబంధం వుంటుంది ?

• ప్రచురణ కర్తలు

ఇంటర్నెట్‌లోని వెబ్‌ సైట్లకు సంబంధంగా, ప్రచురణ కర్తలు అంటే, ఆ వెబ్-సైట్‌లో/బ్లాగ్‌లో పాఠం చేర్చడానికి అవకాశం వున్న నిర్వాహణ/సవరణ/యాజమాన్య హక్కులు కలిగిన వారు. వెబ్‌ సైట్లు కలిగిన వారు, బ్లాగర్లు, వీడియోలను ఎక్కించేవారు ఈ కోవలోకే వస్తారు.

• ప్రకటనదారులు

వెబ్‌ సైట్ల మీద ప్రకటలను జారీ చేయించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టే ప్రకటనదారులు, వ్యక్తులు, సంస్థలు.

• ప్రకటనలను ప్రసారం/బట్వాడా చేసే యంత్రాంగం

ప్రకటనలను బట్వాడా/ప్రసారం చేసే సంస్థ, అసలు ప్రకటలదారుల తరుపున ప్రకటనలను జారీ/బట్వాడా చేసే వెబ్‌ సైట్. ఇటువంటి యంత్రాంగాన్ని నిర్వహించే వెబ్‌ సైట్ కలవారు, అసలు ప్రకటనదారుల వద్ద నుండి ప్రకటనలు తీసుకుని వీటిని ప్రచురణ కర్తల వెబ్-సైట్‌లలోని/బ్లాగ్‌లలోని వెబ్ పుటలను ప్రసారం/బట్వాడా చేస్తారు. ప్రకటనలు తీసుకోవడం, ప్రసారం/బట్వాడా చెయ్యడం అంతా కూడా స్వయంచాలకంగా, ఇంటర్నెట్‌లోని వెబ్ పుటల ద్వారా పని చేసే కంప్యూటర్ ప్రోగ్రాముల ద్వారా జరిగిపోతుంది. ఈ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ ప్రకటనదారుడి వద్ద వసూలు చేసిన ధరలో కొంత భాగాన్ని, ప్రకటనలు ప్రచురించబడ్డ/ప్రదర్సించబడ్డ వెబ్‌ సైట్ ప్రచురణ కర్తలతో పంచుకుంటారు.
ప్రచురణ కర్తలు వారి బ్లాగ్‌లలోని/వెబ్‌సైట్లలోని పుటలలో వున్న జాగాను ప్రకటనదారులకు అమ్ముకుంటూ తిరగనక్కరలేదు. వారు చేయవలసిందల్లా వారి వెబ్‌-సైట్/బ్లాగ్‌ను యిటువంటి యంత్రాంగాన్ని నిర్వహించే వెబ్‌ సైట్ వద్ద నమోదు చేసుకుని, వారందించే ప్రోగ్రామ్ కోడ్‌ను (స్క్రిప్ట్ కోడ్) తీసుకుని, వారి వెబ్ పుటలో ఎక్కడ ప్రకటనలు కనపడాలనుకుంటారనే దానిని బట్టి, ఆ పుట యొక్క Html కోడ్‌లో భాగంగా ఈ స్క్రిప్ట్ కోడ్‌ను చేర్చడమే/అతికించడమే.
తద్వారా ఒక ప్రచురణకర్త తన వెబ్‌ పుటలను ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థతో పంచుకోవడం ద్వారా ఆదాయం గడిస్తాడు. ఎంత ఆదాయం గడిస్తారు అనేది, మీ వెబ్‌సైట్‌కు/బ్లాగ్‌కు వున్న ప్రాచుర్యము/ఆదరణ, యంత్రాంగం నిర్వహించే సంస్థ ప్రకటనదారుల వద్ద వసూలు చేసే రుసుము, ప్రకటన విధానం, మరియు వారు పంచే నిష్పత్తిమీద ఆధారపడి వుంటుంది.
3.ప్రచురణకర్తలు ఆదాయం గడించడానికి అందుబాటులో వున్న పద్దతులు

ప్రకటనదారుల వద్ద వసూలు చేయబడి ప్రచురణ కర్తలకు చెల్లించబడే ధర ఆధారంగా ప్రకటనలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

• క్లిక్‌కు యింత అని (Pay per click) [PPC]

ప్రచురణ కర్తల వెబ్‌-సైట్‌లకు/బ్లాగ్‌లకు (వాటిలోని వెబ్ పుటలకు) ప్రకటనలు జారీ/బట్వాడా చెయ్యబడతాయి (అక్షర పాఠ ప్రకటనలు, ప్రతిమల ప్రకటనలు, వీడియో ప్రకటనలు). వెబ్ పుటను వీక్షిస్తున్న పాఠకుడెవరైనా ఆ ప్రకటన మీద క్లిక్ చేసినట్లయితే స్వయంచాలకంగా ప్రకటన దారుడి వద్ద నుండి కొంత రుసుము వసూలు చేయబడి దానిలో కొంత భాగాన్ని ప్రచురణకర్తల ఖాతాకు జమ చేయబడుతుంది. సాధారణంగా ఈ రకమైన యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థలు ఏవీ కూడా వారు మీ కిచ్చే నిష్పత్తిని తెలియపరచవు. వారు మనకు యిచ్చేది సమంజసమైన వాటానే అని మనం నమ్మవలసి వుంటుంది. ఎవరన్నా ప్రకటనల మీద క్లిక్ చేస్తేనే ప్రచురణ కర్తలు ఆదాయం గడించగలుగుతారు.

• ప్రతి వెయ్యి ముద్రణలకు యింత (Cost per thousand impressions - cpm)

ఒక ముద్రణ అనగా ఒక ప్రకటన మీ బ్లాగ్/వెబ్‌-సైట్ పుటలో ఒకసారి కనబడటం. ఈ విధానంలో ప్రకటనదారుల వద్ద వసూలు చేయబడే రుసుము వారి ప్రకటన వెయిసార్లు ముద్రించబడినందుకు యింత అని వుంటుంది. ప్రకటన జారీ/బట్వాడా చేయబడ్డ ప్రతిసారి స్వయంచాలకంగా ప్రకటనదారుడి నుండి వసూలు చేయబడి (ఒక సారి ముద్రింపబడినందుకు ఆ రుసుములో వెయ్యవవంతు) దానిలో కొంత భాగం ప్రచురణ కర్తల ఖాతాకు జమ చేయబడుతుంది. ఈ విధానంలో ప్రకటనదారుల వద్ద వసూలు చేయబడే రుసుము వారి ప్రకటన ఒక సారి ముద్రించబడినందుకు యింత అని వుంటుంది. ఆ ధరను చెప్పేటప్పుడు మాత్రం ప్రతి వెయ్యిసార్లు ముద్రించబడినందుకు యింత అనే చెబుతారు. ఈ కారణంగానే యిటువంటి ప్రకటనలను CPM (cost per thousand) [M = 1000 రోమన్ అంకెలలో] అంటారు.
ప్రకటన జారీ/బట్వాడా చేయబడ్డ ప్రతిసారి స్వయంచాలకంగా ప్రకటనదారుడి ఖాతాలో రుసుము వసూలు చేయబడి దానిలో కొంత భాగం ప్రచురణ కర్త ఖాతాకు జమ చేయబడుతుంది. కాబట్టి ఒక ప్రచురణ కర్త సంపాదించే ఆదాయం ఎంత అనేది, ప్రకటన వారి వెబ్ పుటలలో ఎన్ని సార్లు ప్రదర్శించబడింది అనే దాని మీద మరియు, యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ ఎంత వసూలు చేసింది, ఎంత భాగాన్ని పంచుకుంటుంది అనే దాని మీద ఆధారపడి వుంటుంది.
ఈ విధానంలో పాఠకుడు ప్రకటనల మీద క్లిక్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ పాఠకుడు క్లిక్ చేసినా దాని వలన ప్రచురణకర్తలకు ఆదాయమేదీ చేకూరదు.

• జాగా అద్దెకివ్వడం

ఈ ప్రకటనల విధానంలో, ప్రచురణ కర్తలు వారి వెబ్‌ పుటలలో (బ్లాగ్/వెబ్‌-సైట్) జాగాను కొంత కాలానికి అద్దె కిస్తారు. ఆ అద్దె కాలానికి ఆ జాగాలో ప్రకటన ప్రదర్శించబడుతుంది. యిలా అద్దెకివ్వబడే జాగా కొంత ప్రదేశమవ్వవచ్చు లేదా ఒక అక్షర పాఠ లంకె పెట్టడానికి అవసరమైన జాగా అవ్వవచ్చు. ఇటువంటి విధానంలో, సాధారణంగా, మీరు మీ వెబ్ పుటలలో (బ్లాగ్/వెబ్‌-సైట్) జాగాకు అద్దెను ప్రచురణకర్తే నిర్ణయించుకుని దానిని ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ వెబ్‌ పుటలలో పొందుపరపస్తారు. ప్రకటనలు ప్రదర్శించబడటానికి ఆ జాగాను అద్దెకు తీసుకునేందుకు సన్నద్దమైన సంస్థలు, ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ ద్వారా ఒప్పందం చేసుకుంటాయి.
ఇటువంటి విధానంలో ప్రచురణ కర్తలు ప్రకటించిన అద్దెను, ప్రకటనదారుడి నుండి వసూలు చేసినట్లయితే, దానిలో కొంత భాగాన్ని ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ వారి వాటా ఆదాయం క్రింద అట్టిపెట్టుకుని మిగతా దానిని ప్రచురణకర్తలకు చెల్లిస్తారు. ప్రచురణకర్తలు ప్రకటించిన అద్దెకు, కొంత అదనపు రుసుము చేర్చి వసూలు చేసినట్లయితే, వారు ప్రకటించిన అద్దె వారికి చెల్లించబడుతుంది. ఆ అదనపు అద్దె, యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ ఆదాయం అవుతుంది.
ఎక్కువగా యిటువంటి విధానంలో కూడా, మీ వెబ్‌ పుటలకు వున్న పాఠకుల సంఖ్యను బట్టి స్వయంచాలకంగా ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ కంప్యూటర్లలో పనిచేసే సాఫ్ట్​వేర్, ప్రచురణకర్తల వెబ్ పుటలలో జాగాకు సమంజసమైన అద్దెను నిర్ణయిస్తుంది. ఆ అద్దె ప్రకటనదారుడి నుండి వసూలు చేయబడి అందులో కొంత భాగమే ప్రచురణకర్తలకు చెల్లించబడుతుంది.
యిటువంటి విధానంలో ఆదాయం ప్రచురణకర్తల వెబ్ పుటలు ఎంత ప్రాచుర్యం కలవి అనే దానిమీద ఆధారపడి వుంటుంది. ఎక్కువ మంది పాఠకులుండే వెబ్‌ సైట్లకు ఎక్కవగా ఆదాయం గడించే అవకాశం వుంటుంది. ఇది వార్తా పత్రికలలో కనపడే ప్రకటనల విధానం లాంటిదే.

• అనుబంధీకుల/నవేదకుల - కమీషన్

ప్రచురణకర్తలు వారు అనుబంధీకులు, నివేదకులుగా వ్యవహరిస్తున్న వెబ్‌ సైట్‌లకు ప్రకటనలు (అక్షరపాఠ/ప్రతిమ లంకెల రూపంలో) వారి వెబ్ పుటలలో పొందుపరుస్తారు. కేవలం ప్రకటన ప్రదర్శించబడటం నుండి ప్రచురణకర్తలకు ఎటువంటి ఆదాయం రాదు. ఒక పాఠకుడు ఆ లంకెలను వుపయోగించి ప్రచురణకర్త అనుబంధీకుడిగా వ్వవహరిస్తున్న లేదా నివేదిస్తున్న వెబ్‌ సైట్‌లకు వెళ్ళి అక్కడ అమ్మబడే వస్తువు/సేవ కొనుగోలు చేసినట్లయితే, ముందుగా ఒప్పందం చేసుకున్న కమీషను ప్రచురణకర్త ఖాతాకు జమ చేయబడుతుంది.
ప్రచురణకర్తలు యిటువంటి అనుబంధీకుల/నివేదకుల ప్రోగ్రాములు నిర్వహిస్తున్న వెబ్‌ సైట్లకు వెళ్ళి, వారి వద్ద నమోదు చేసుకుని ఆ కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు లేదా యిటువంటి కార్యక్రమాల యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థలతో నమోదు చేసుకుని, వారి వద్ద నమోదు చేసుకున్న యిటువంటి కార్యక్రమాలను అందించే వెబ్‌ సైట్లను ఎంచుకుని వారి ప్రోగ్రాములలో పాలు పంచుకోవచ్చు. ఆ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ, ప్రచురణ కర్తకు, అనుబంధీకుల/నివేదకుల ప్రోగ్రాములను నిర్వహించే వెబ్‌ సైట్లకు మధ్య మద్యవర్తిగా వ్వవహరిస్తుంది. ప్రచురణకర్తలకు చెల్లింపులు, యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ చేస్తుంది.
కొన్ని రకాల ప్రకటనల కార్యక్రమాలు PPC/నివేదన కమిషన్ కార్యక్రమాలను కలిపి అందించవచ్చు. ప్రచురణకర్తలు, పాఠకుడు లంకె మీద క్లిక్ చేసినందుకు కొంత, వెబ్‌ సైట్‌కు వెళ్ళి కొనుగోలు చేసినందుకు అదనపు మొత్తం గడించగలుగుతారు.
హేతుబద్దంగా వుండి సాధారణంగా ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం వున్న వస్తువులకు/సేవలకు యిటువంటి కార్యక్రమాలను వెదికి పట్టుకోగలిగితే, మీరు సంమంజసమైన ఆదాయాన్ని గడించగలుగుతారు. ఇక్కడ మనం ఆశపడే అవకాశం ఏమనగా మిగతా ఆదాయ మార్గాలతో పోలిస్తే ఒక్క వ్యవహారం నుండి గడించగలిగే ఆదాయం ఈ మార్గంలో చాలా ఎక్కువ.
ఉదాహరణకు, ఎక్కువగా విద్యార్దులు పాఠకులుగా గల వెబ్‌పుటలలో, బిన్నంగా వుండే వివిధ రకాల కలములకు ప్రకటనలు వున్నట్లయితే వాటినుండి మీరు ఆదాయం గడించడానికి చాలా అవకాశం వుంటుంది.




4.ప్రకటనలు పుటలో ఎక్కడ ప్రదర్శించబడతాయి

ప్రచురణకర్తల వెబ్‌-సైట్/బ్లాగ్‌లలోని వెబ్‌ పుటలలో ఏ స్థానాన్నయినా ప్రకటనలు ప్రదర్శించడానికి కేటాయించవచ్చు. వెబ్ పుటలలో వుండే అసలు పాఠం పూర్తిగా దృష్టిలోనుంచి పోయేటట్లు పుటలు పూర్తిగా ప్రకటనలతో నిండివుండేటట్లు రూపకల్పన చేయడం సమంజసం కాదు. వెబ్ పుటలలో ఉత్సుకత కలిగించే పాఠం లేనట్లయితే, మీ వెబ్ పుటను ఒకసారి తిలకించిన వారు మళ్ళీ మళ్ళీ రావాలని ఎందురకనుకుంటారు. కేవలం ప్రకటనలు కలిగిన పుటలపై పాఠకులకు ఆసక్తి కలుగచేయడం సాధారణంగా సాధ్యపడదు.

• ఎగసిపడే గవాక్షాలు

వున్నట్లుండి ఎక్కడినుండో ప్రత్యక్షమయ్యే లక్షణం కలిగిన గవాక్షాలను ఎగసిపడే (pop up) గవాక్షాలు అంటారు. పాఠకుడు ఒక వెబ్ పుటను అందుకున్నప్పుడు/తెరచినప్పుడు, ఆ పుటకు అనుబంధంగా ప్రకటనలు కలిగిన ఒక ఎగసిపడే గవాక్షం, స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. ఇలా ప్రదర్శితమయ్యే గవాక్షం, కొంత సమయం తరువాత స్వయంచాలకంగా మూసుకుపోవచ్చు లేదా పాఠకుడు ఆ గవాక్షాన్ని మూసి వేసే వరకు అది ప్రదర్శితమయ్యే ఏర్పాటు చేయబడి వుండవచ్చు.

• పైకి/పైన ఎగిసిపడేవి (pop up)

పాఠకుడు తెరచిన గవాక్షమునకు పైన ప్రకటనలు కలిగిన ఎగసిపడే గవాక్షము ప్రదర్శితమైనట్లయితే, దానిని పైకి/పైన ఎగసిపడే (pop up) గవాక్షము అంటాము.

• క్రింద ఎగసిపడే (pop under)

పాఠకుడు తెరచిన గవాక్షమునకు క్రింద, ప్రకటనలు కలిగిన ఎగసిపడే గవాక్షము, మసకబారి ప్రదర్శితమయితే దానిని క్రింద ఎగసిపడే గవాక్షము అంటాము. పాఠకుడు ప్రస్తుతము వీక్షిస్తున్న గవాక్షాన్ని మూసి వేసినట్లయితే, ఆ క్రింది గవాక్షము కనబడుతుంది. పైన/క్రింద ఎగసిపడే గవాక్షాలలో ప్రకటనలను పాఠకులు అమర్యాదాకరంగా చొరబడే వాటి క్రింద భావిస్తారు. అవి అసలు కనపడకుండా వుండాలని కోరుకుంటారు. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో ఎగసిపడే గవాక్షాలు ప్రదర్శించబడకుండా నిరోధించడానికి అవసరమైన సాధనాలు బ్రౌజర్లలో చేర్చబడటం చూస్తున్నాము.

• లోనికి ఎగసిపడే (pop in)

లోనికి ఎగసిపడేవి నిజంగా గవాక్షాలు కాదు. వెబ్ పుటలోని భాగం (విభాగం <div>) మాత్రమే. అయితే అవి పాఠకుడు ఒక గవాక్షాన్ని తెరచినప్పుడు పుటపై తేలుతూ పైకి ఎగసిపడే గవాక్షం లాంటి అనుభవమే కలుగచేస్తాయి. యివి కూడా స్వయంచాలకంగా కొంత సేపటికి మూసుకుపోయే వరకు లేదా పాఠకుడు మూసివేసే వరకు ప్రదర్శితమయ్యే ఏర్పాటు చేయబడి వుంటాయి.

• ఇంటర్‌స్టిటియల్స్ (సందులో) ప్రదర్శించబడేవి

ఇంటర్‌స్టిస్ అనగా నిర్మాణాత్మకంగా రెండిటి మధ్య ఏర్పడ్డ ఖాళీ/సందు. వెబ్ పుటల మధ్య మారేటప్పుడు, మధ్యలో చాలా కొద్ది సమయం ఖాళీ వుంటుంది. ఆ సమయంలో ప్రదర్శించబడే ప్రకటన అనే భావంతో సృష్టించబడ్డ ప్రకటనలివి. పాఠకుడు పుటల మధ్య మారేటప్పుడు, ప్రకటనలున్న పుట ఒకటి మధ్యలో ప్రదర్శించబడుతుంది. అంటే ముందు ప్రకటన వున్న పుట ప్రదర్శించబడి కొద్ది సమయం తరువాత స్వయంచాలకంగా లేదా పాఠకుడు అక్కడ యివ్వబడ్డ లంకె మీద క్లిక్ చేసినప్పుడు పాఠకుడు వెళ్ళదలుచుకున్న పుటకు తోడ్కొనిపోబడతాడు.

• ఫీడ్ ప్రకటనలు

ఫీడ్ XML వుపయోగించి రూపకల్పన చేయబడ్డ పాఠం. ఫీడ్ పాఠాన్ని సంభాళించడానికి ప్రత్యేకమైన ఫీడ్ రీడర్లనే ప్రోగ్రాములు కావాల్సి వుంటుంది. ఫీడ్లలో ప్రకటనలు చొప్పించడం ద్వారా ఆదాయం గడించడమనే మార్గం యిప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న ఆలోచన. ఫీడ్లలో ప్రకటనలను చొప్పించడం కూడా మామూలు వెబ్ పుటలలో ప్రకటనలు చొప్పించడం లాంటిదే. అయితే Html పుట యొక్క మూల కోడ్, xml యొక్క మూల కోడ్ చూడటానికి ఒక్కలా వుండవు. అందువలన ఫీడ్‌లలో ప్రకటనలు చేర్చడానికి xml పరిఙానం వుపయోగించవలసి వుంటుంది. బ్లాగర్ బ్లాగ్‌లలో వున్నట్లు స్వయంచాలకంగా ఫీడ్‌లు సృష్టించే ఏర్పాటు వున్నట్లయితే, xml తెలియనటువంటి వారు కూడా వాటిలో ప్రకటనలు చేర్చడానికి అవసరమైన ఏర్పాట్లు వుంటాయి.
5.ప్రకటనల మాధ్యమాలలో రకాలు

ఇంటర్నెట్‌లో యివ్వబడే ప్రకటనలలో దాదాపు ప్రతి ప్రకటనకు సంబంధంగా ఏదో ఒక వెబ్‌ సైట్ వుంటుంది. ప్రతి ప్రకటన సంబంధిత వెబ్‌ సైట్‌లోని పుటకు లంకెగా పని చేస్తుంది. రెండు రకాల లంకెలు సృష్టించవచ్చు (అక్షర పాఠ లంకెలు, ప్రతిమ లంకెలు) కాబట్టి ప్రకటనలు కూడా అక్షర పాఠంతో, ప్రతిమలతో, వీడియోలతో సృష్టించబడి వుండటాన్ని గమనించవచ్చు.

• అక్షర పాఠ ప్రకటనలు

యివి, అక్షర పాఠం వుపయోగించి సృష్టించబడే ప్రకటనలు. వీటిలో కేవలం ఒకే ఒక్క పంక్తి అక్షర పాఠం వుండి ఆ పాఠమే లంకెకు ప్రదర్శిత అక్షర పాఠంగా పని చేస్తుంది. అనేక పంక్తుల/వరుసల అక్షర పాఠం వుండి ఒక నిర్ధిష్ట విధానంలో రూపకల్పన చేయబడి వుంటుంది. (గూగుల్ ప్రకటనలలో లాగా).

• ప్రతిమ ప్రకటనలు

ప్రతిమ ప్రకటనలు ప్రతిమలతో సృష్టించబడతాయి. ప్రకటనలు సృష్టించడం కోసం వుపయోగించే ప్రతిమలు సాధారణంగా వెబ్ పుటలలో వుపయోగించే ప్రతిమ రూపాలలో (jpeg, gif, png etc) ఏదయినా అవ్వవచ్చు.

• వీడియో ప్రకటనలు

వీడియో ప్రకటన వెబ్ పుటలో అంతఃప్రతిష్టించిన వీడియో ఫైల్స్. ఇవి ఎక్కువగా ఫ్లాష్ రూపంలో కనబడతాయి. సాధారణంగా ప్రకటనగా కనపడే వీడియో ఫైల్ మొత్తం ప్రకటన వీడియోనే వుంటుంది. అయితే యిటీవల వెబ్ పుటలలో వీడియోల వాడకం బాగా ఎక్కువయిన నేపధ్యంలో అన్ని వీడియో ఫైళ్ళలో (చిత్రాలు, పాటలు మొదలగునవి) అక్కడక్కడా కొద్ది పాటి నిడివి ప్రకటనలను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.





6.ప్రకటనల జారీ యంత్రాంగ సంస్థ వద్ద వినియోగ ఖాతా పొందండి

• గూగుల్ యాడ్‌సెన్స్

ఇంటర్నెట్‌లో మనకు తారస పడే ప్రకటనల జారీ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థలు సాధారణంగా పలు రకాల ప్రకటన ఆదాయ మార్గాలను విధానాలను అందిస్తూ వుంటారు. కొన్ని సంస్థల వివరాలు క్రింద యివ్వబడి వున్నాయి.

యంత్రాంగ నిర్వాహణ సంస్థ

వారందించే ఆదాయ మార్గాలు

PPC ads, CPM ads, Referrals, Feed Ads (in beta), Search box
PPC ads, CPM ads
Text Link Ads PPC ads, SR ads, Feed ads, Referrals
PPC ads, CPM ads, Referrals
మీ బ్లాగ్‌లో/వెబ్ సైట్‌లో ప్రకటనలను ప్రదర్శించి వాటి నుంచి ఆదాయం గడించాలనుకున్నట్లయితే, మీరు కనీసం ఏదో ఒక ప్రకటనల జారీ/భట్వాడా యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థతో నమోదు చేసుకుని వారి వద్ద వినియోగ ఖాతా పొందవలసి వుంటుంది. [మీ అంతట మీరు ప్రకటనలు తెచ్చుకోగల సత్తా వుంటే తప్పితే]. మీరు గూగుల్ వారి యాడ్‌సెన్స్ కార్యక్రమములో వినియోగ ఖాతా పొందడం మెరుగైన/ఉత్తమమైన ఆలోచనగా భావిస్తున్నాము. గూగుల్ వారి ఈ కార్యక్రమము అన్నింటికంటే ఎక్కువ విశ్వశించదగినది మరియు మీ బ్లాగ్/వెబ్‌ సైట్‌లో ప్రకటనల ద్వారా ఆదాయం గడించడానికి ఉత్తమమైన అవకాశం కలుగచేస్తుంది.

• జాగ్రత్త

మీరు ఒక ప్రకటనల జారీ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థ వద్ద ఖాతా పొంది, వారి ప్రకటనలను మీ బ్లాగ్/వెబ్‌-సైట్‌లలో ప్రదర్శిస్తున్నట్లయితే మీరు వారి విధానాలకు కట్టుబడి వుండవలసి వుంటుంది. ముఖ్యంగా గూగుల్ వారి యాడ్‌సెన్స్ సంబంధ విధానాలు ప్రచురణ కర్తలు గూగుల్ వారి ప్రకటనలు ప్రదర్శించబడుతున్న పుటలలో అదే రకమైన ప్రకటనల నిధానాన్ని అవలంభించే యితర సంస్థల ప్రకటనలు ప్రదర్శించబడటాన్ని నిషేదిస్తాయి. మీరు యిది గమనించి పాటించనట్లయితే గూగుల్ వారు మీ ఖాతాను రద్దు/స్థంబింప చేయవచ్చు.

• యాడ్‌సెన్స్​తో వున్న చాలా ముఖ్యమైన వెసులుబాటు

ప్రచురణ కర్తలను గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమములోనికి చేర్చుకుని వారికి వినియోగ ఖాతా జారీ చేయడానికి, ముందుగా గూగుల్‌కు ధరఖాస్తు చేయవలసి వుంటుంది. ఈ ధరఖాస్తులో భాగంగా మీరు మీ వెబ్‌సైట్/బ్లాగ్ యొక్క వివరాలు తెలియచేయవలసి వుంటుంది. గూగుల్ వారు మీరు సమర్పించిన వెబ్‌సైట్/బ్లాగ్‌ను సందర్శించి, అది వారి విధానాలకనుగుణంగా వుంటేనే మిమ్ములను వారి కార్యక్రమములో చేర్చుకుని, వినియోగ ఖాతా జారీ చేస్తారు. మీరు గూగుల్ వారి యాడ్‌సెన్స్ కార్యక్రమమునకు నమోదు చేసుకుని, వారి వద్ద నినియోగ ఖాతా పొందిన తరువాత మీ యాడ్‌సెన్స్ కోడ్‌ను ఏ వెబ్ పుటలోనయినా చేర్చవచ్చు. మీరు ప్రకటనలు చేర్చదలుచుకున్న ప్రతి వెబ్‌-సైట్‌కు/బ్లాగ్‌కు వారి వద్ద నుండి ఆమోదము పొందవలసిన అవసరము లేదు.
7.బ్లాగర్ బ్లాగ్ ద్వారా యాడ్‌సెన్స్ ఖాతాకోసం ధరఖాస్తు చెయ్యడం

• ఇంగ్లీషులో చేసిన బ్లాగర్ బ్లాగ్ ద్వారా ధరఖాస్తు చెయ్యడం ఉత్తమం

వెబ్ పుటలు సృష్టించడం, వెబ్‌ సైట్ల గురించిన అవగాహన కలుగచేసుకోవడం యిప్పుడిప్పుడే మొదలు పెట్టిన వారికి, మీ ధరఖాస్తు ఖచ్చితంగా ఆమోదించడానికి అవసరమైన రూపంలో వెబ్‌ సైట్‌ను సృష్టించి, దాని ద్వారా గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమమునకు ధరఖాస్తు చేసుకోవడం కొంచం కష్టమైన పని. అందువలన బ్లాగర్ బ్లాగ్‌ను సృష్టించి దాని ద్వారా యాడ్‌సెన్స్ ఖాతా కోసం ధరఖాస్తు చెయ్యడం సరళతరమైన పని. బ్లాగ్‌లు సృష్టించడంలో మీరు బ్లాగ్ ఆకృతి నిర్మాణం మీద పెద్దగా శ్రమ పడనవసరం లేదు. మీరు బ్లాగ్ ద్వారా తేలికగా ఆమోదించడానికి అవకాశమున్న రూపంలో వెబ్ పుటలు పెద్దగా శ్రమపడనవసరం లేకుండానే సృష్టించవచ్చు.

మీరు చేయవలసిందల్లా
  • బ్లాగర్‌లో ఒక సరికొత్త బ్లాగ్‌ను సృష్టించండి మీరు యిప్పటికే బ్లాగ్‌లను వినియోగిస్తూ బ్లాగింగ్ గురించి నేర్చుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని బ్లాగ్‌లను సృష్టించి వుండి, అవి మీరు యాడ్‌సెన్స్ ధరఖాస్తులో నమోదు చేసిన బ్లాగ్‌ను వీక్షించే వారికి కనపడకూడదనుకున్నట్లయితే మీ వ్యక్తిగత సమాచార పుటల నుండి వాటిని అదృశ్యంగా వుండేటట్లు ఎంచుకోండి. లేదా సరికొత్త గూగుల్ ఖాతా సృష్టించుకుని దానిలో ఒక బ్లాగ్‌ను సృష్టించి, దాని ద్వారా యాడ్‌సెన్స్ కొరకు ధరఖాస్తు చెయ్యండి.
  • కొన్ని మంచి పోస్ట్​లను ప్రచురించండి (మూడు, నాలుగు పోస్ట్​లు, నాలుగైదు రోజులలో బాగా ఎక్కువ పోస్టులు అవసరం లేదు.)
  • ఆ బ్లాగ్ లోపల నుండి యాడ్‌సెన్స్ కొరకు ధరఖాస్తు చెయ్యండి
  • కనీసం మరికొన్ని రోజుల వరకు పోస్ట్​లు, రోజుకొకటి చొప్పున చేస్తూ వుండండి. (మీ ధరఖాస్తు ఆమోదించబడేవరకు).

• ధరఖాస్తు కలిగిన పుటను ప్రదర్శింపచేయండి

గూగుల్ వారి యాడ్‌సెన్స్ కార్యక్రమానికి ధరఖాస్తు పత్రాన్ని బ్లాగ్ పుట అంశాల (page elements list) జాబితా ప్రదర్శించబడే పుట నుండి అందుకోవచ్చు. ఈ జాబితా వున్న పుట ప్రదర్శించబడటానికి template విభాగములోని Page Elements ఉప విభాగపు పుటలో వున్న Add page element లంకె వుపయోగించండి.

• ధరఖాస్తు నింపి సమర్పించండి

గూగుల్ యాడ్‌సెన్స్​కు ధరఖాస్తు పత్రం ప్రదర్శించబడే పుటలో మీరు, గూగుల్ యాడ్‌సెన్స్ ఖాతాలో మీ గుర్తింపుగా వుపయోగించదలచిన ఈ-టపా గుర్తింపును నింపవలసి వుటుంది. ఇది ప్రస్తుతము మీ బ్లాగ్ కొరకు బ్లాగర్‌లో లాగిన్ అవ్వడానికి వుపయోగిస్తున్న గూగుల్ ఖాతాకు సంబంధించిన గుర్తింపే అవ్వవచ్చు. లేదా వినియోగములో వున్న ఏ యితర ఈ-టపా గుర్తింపైనా అవ్వవచ్చు. ధరఖాస్తును క్రియాశీలం చెయ్యమని గూగుల్ వారు మీకు వుపయోగించిన ఈ చిరునామాకు ఒక ఈ-టపా సందేశం పంపుతారు. మీరు పైన వుపయోగించిన చిరునామా వినియోగములో లేకపోతే ధరఖాస్తు సమర్పణ ప్రక్రియ పూర్తి చెయ్యడం కుదరదు.

• తాత్కాలిక ప్రకటన రూపాన్ని అమర్చండి

మీ ధరఖాస్తును సమర్పించిన తదుపరి, తాత్కాలికంగా మీ బ్లాగ్‌లో ప్రదర్శించబడే ఒక ప్రకటన ప్రదేశాన్ని ఎంచుకోవలసి వుంటుంది. మీరు ఆ పని పూర్తి చెయ్యడానికి, ప్రకటన రూపాన్ని ఎంచుకోవడానికి అవసరమైన అమరికలున్న పుట ప్రదర్శించబడుతుంది. మీరు ప్రకటనలు ప్రదర్శించబడే పేటిక యొక్క పరిమాణాన్ని మరియు ప్రకటనలకు సంబంధించిన వర్గ అమరికలను ఎంచుకోవచ్చు. గూగుల్ వారి యాడ్‌సెన్స్ ఖాతాకు గుర్తింపు ముందు pub అనే పదం కలిగిన ఒక 16 అంకెల సంఖ్య. మీరు బ్లాగర్ బ్లాగ్ ద్వారా ధరఖాస్తు చేసుకున్నట్లయితే, ధరఖాస్తు పత్రం సమర్పించగానే మీకు ఈ గుర్తింపు కేటాయించబడుతుంది. అయితే గూగుల్, మీ ధరఖాస్తును ఆమోదించే వరకు ఈ గుర్తింపు తాత్కాలికమయినదిగా పరిగణిస్తూ, pubకు ముందు ca అనే అక్షరాలు ప్రదర్శించబడతాయి.
మీ ఖాతా ఆమోదించబడే వరకు మీరు అమర్చిన ప్రకటనల పేటికలో ప్రజా ప్రయోజన ప్రకటనలు ప్రదర్శించబడతాయి.

• మీ ఈ-టపా చిరునామాను క్రియాశీలం చేసి యితర వివరాలు సమర్పించండి

మీరు బ్లాగర్ బ్లాగ్‌లో నుండి గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమములో ఖాతా కొరకు ధరఖాస్తు సమర్పించగానే, ఒక ధృవీకరణ సందేశం మీరు నమోదు చేసిన ఈ-టపా గుర్తింపుకు సంబంధించిన ఈ-టపా చిరునామాకు పంపబడుతుంది. మీరు ఆ సందేశంలో వుండే లంకెను క్లిక్ చేయడం ద్వారా, ధరకాస్తు ప్రక్రియలో భాగంగా మీ వ్యక్తిగత వివరాలను నింపడానికి అవసరమైన వెబ్ పత్రం కలిగిన పుటను తెరవవలసి వుంటుంది.
ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఈ వివరములను కూడా సమర్పించినట్లయితేనే మీ ధరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు.
మీరు మీ బ్లాగ్‌లో కొన్ని ఆమోద యోగ్యమయిన పోస్టులు (ఆంగ్లము లేక యితర ఆమోదించబడిన భాషలలో) చేసి, యాడ్‌సెన్స్ ఖాతా కోసం మీరు చేసుకున్న ధరఖాస్తు ఒకటి రెండు రోజులలో ఆమోదించబడటానికి అన్ని అవకాశాలు వుంటాయి. ఒక సారి గూగుల్ వారు మిమ్మల్ని యాడ్‌సెన్స్ కార్యక్రమములోనికి చేర్చుకుని, వినియోగ ఖాతా యిచ్చినట్లయితే, మీరు ఆదాయం గడించడానికి అవసరమైన ఒక గొప్పు సాధనం సమకూర్చుకున్నట్లే..

• ధరఖాస్తు ఆమోదించబడినదా/లేదా ఎట్లా తెలుస్తుంది

మీరు ధరఖాస్తులో భాగంగా సమర్పించి ఈ-టపా గుర్తింపు గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము కొరకు మీ గుర్తింపు. ధరఖాస్తులో మీరు చేర్చిన ప్రవేశ పదము, మీ యాడ్‌స్‌న్స్ ఖాతాకు ప్రవేశ పదమవుతుంది. అదే ఈ-టపా గుర్తింపుతో మీకు గూగుల్ ఖాతా వున్నట్లయితే, యాడ్‌స్‌న్స్ ఖాతా, గూగుల్ ఖాతా రెండూ వేరువేరు ఖాతాలుగా పరిగణించవలసి వుంటుంది.. ఆ గుర్తింపును సంబంధిత ప్రవేశ పదము వుపయోగించి మీరు http://google.com/adsense వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. మీ ధరఖాస్తు ఆమోదించబడే వరకు, మీ ధరఖాస్తు పరిశీలనలో వుంది అనే విషయం తెలియచేసే సందేశం గల వెబ్ పుట ప్రదర్శించబడుతుంది. ఆమోదించబడ్డ తరువాత చాలా పుటలు కనబడతాయి.
ఒకవెళ మీ ధరఖాస్తు తిరస్కరించబడినట్లయితే, దానిని తిరిగి సమర్పించడానికి వుపయోగపడే పత్రం గల పుట ప్రదర్శించబడుతుంది.మీ ధరఖాస్తు ఆమోదించబడ్డా/తిరస్కరించబడ్డా వెంటనే ఆ విషయాన్ని తెలియ చేస్తూ మీ ఈ-టపా చిరునామాకు సందేశం పంపబడుతుంది

• ఈ క్రింది భాషలలోని పాఠం గల వెబ్‌-సైట్లు/బ్లాగ్‌లు మాత్రమే పరిగణించబడతాయి

చీనీ (సరీకరించబడినది), చీనీ (సాంప్రదాయబద్దమైనది), ఇటాలియన్, క్రోయేషియన్, చెక్, డాటా, డానిష్, ఇంగ్లీషు, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, హంగేరియన్, జపనీస్, కొరియిన్, నార్వేజియన్, పోలిష్, పోర్చుగీస్, రష్యన్, స్లోవాక్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్ భాషలలో వున్న వెబ్‌ సైట్లు, బ్లాగ్‌లు మాత్రమే ఈ కార్యక్రమములోనికి చేర్చుకోబడటానికి ఆమోదయోగ్యమైనది. మీరు ఏ యితర భాషలో పాఠం కలిగిన బ్లాగ్/వెబ్‌-సైట్ ద్వారా గూగుల్‌కు ధరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ధరఖాస్తు తిరస్కరించబడినట్లు సందేశం వస్తుంది. అయితే మీరు మీ ధరఖాస్తును వేరే బ్లాగ్/వెబ్‌-సైట్ యొక్క యూఆర్‌ఎల్ వుపయోగించి తిరిగి సమర్పించడానికి అవకాశం వుంటుంది. ఆ ధరఖాస్తును మీరు పొందదలచినట్లయితే, http://www.google.com/adsense వెబ్‌ సైట్‌లోకి యాడ్‌సెన్స్ ఖాతాకు సంబంధంగా మీరు సమర్పించిన ఈ-టపా గుర్తింపు, దానికి మీ ధరఖాస్తులో మీరు జోడించిన ప్రవేశ పదము వుపయోగించి లాగిన్ అవ్వవలసి వుంటుంది.



పుట అంశాలు »  

గూగుల్ యాడ్‌సెన్స్ : ఆదాయ మార్గాలు, ప్రకటనల రకాలు

గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము ద్వారా ఆదాయం గడించడానికి వున్న మార్గాలు PPC - క్లిక్‌కు యింత అనే రకం ప్రకటనలు (2) CPM వెయ్యిసార్లు ముద్రించినందుకు యింత అనే రకం ప్రకటనలు (3) నివేదన కమీషన్ , (4) శోధన ప్రకటనలు మరియు (5) మొబైల్ ప్రకటనలు

• ప్రకటనల విభాగము

ప్రకటనలు ప్రదర్శించే దీర్ఘచతురస్త్రాకార పేటిక. యివి వివిధ పరిమాణాలలో వుంటాయి. ఇవి వెబ్ పుటలో ప్రకటనలు ప్రదర్శించబడే ప్రదేశాన్ని నిర్ధిష్టంగా గుర్తిస్తాయి. ఇందులో అన్ని రకాల (అక్షర పాఠ, ప్రతిమ, వీడియో) ప్రకటనలు ప్రదర్శించబడతాయి. అక్షర పాఠ ప్రకటనలు కాక యితర రూపాల ప్రకటనలు ఒక ప్రకటన విభాగంలో కేవలం ఒకటి మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఈ ప్రకటనల విభాగంలో ప్రదర్శించబడే ప్రకటనలు రెండు రకాలుగా వర్గీకరించబడుతాయి.

» PPC ప్రకటనలు (క్లిక్‌కు యింత అనే రకం)

గూగుల్ యాడ్‌సెన్స్ ప్రకటనల విభాగంలో ప్రదర్శించబడే ప్రకటనలు సాధారణంగా యిటువంటి లక్షణం కలిగినవే బ్లాగ్/వెబ్‌-సైట్‌లలో వున్న పుటలను వీక్షించే పాఠకుడు, ఈ ప్రకటనల మీద క్లిక్ చేసినట్లయితే ప్రచురణకర్తకు ఆదాయం సమకూరుతుంది. కొత్త ప్రచురణ కర్తలకు యిది ముఖ్యమైన ఆదాయ మార్గం. ఇవి అక్షర పాఠ ప్రకటనలు, ప్రతిమ ప్రకటనలు, వీడియో ప్రకటనలు ఏవయినా అవ్వోచ్చు.

» CPM ప్రకటనలు (వెయ్యిసార్లు ముద్రించబడినందుకు యింత అనేరకం)

మీ బ్లాగ్/వెబ్‌-సైట్‌కు తగినంతమంది పాఠకులు వుండి, ప్రకటన కర్తలు మీ వెబ్‌-సైట్/బ్లాగ్ పుటలలో ప్రకటనలు జారీ/భట్వాడా చేయబడాలని నిర్ధిష్టంగా ఎంచుకున్నట్లయితే, వారికి గూగుల్ CPM ప్రకటనల విధానాన్ని అనువర్తింప చేస్తుంది. గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమములో యిటువంటి ప్రకటనలను SITE TARGETED (సైట్లకు గురిపెట్టబడ్డ) ప్రకటనలంటారు. ప్రకటనదారులు వారి ప్రకటనలు ఏ వెబ్‌ సైట్లలో ప్రదర్శించబడాలనే దానిని ఎంచుకుంటారు.
ఇవి అక్షర పాఠ, ప్రతిమ, వీడియో ప్రకటనలు ఏదయినా అవ్వవచ్చు. సైట్‌కు గురిపెట్టబడ్డ ప్రకటనగా ఒక అక్షర పాఠ ప్రకటన వున్నట్లయితే, ఆ ప్రకటనలోని అక్షర పాఠం ప్రకటన విభాగం మొత్తం పరుచుకుని పెద్ద అక్షరాలుగా ప్రదర్శించబడుతుంది. (వీటిని గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమములో వ్యాకోచించిన ప్రకటనలుగా expanded ads సంభోధిస్తారు).
ప్రకటనలు ప్రతిమలో/వీడియోనో అయినట్లయితే వాటిని నిర్ధిష్టంగా యివి వెబ్‌ సైట్‌కు గురిపెట్టబడ్డ ప్రకటనలు, యివి PPC ప్రకటనలని గుర్తించడం కుదరదు. ఈ రకమయిన ప్రకటనలు పాఠకుడు క్లిక్ చేసినా ప్రచురణ కర్తలకు అదనపు ఆదాయం సమకూరదు.

» నివేదన ప్రకటనలు (యితరుల ప్రోడక్ట్స్)

నివేదన విభాగము, సాధారణా ప్రకటనల పేటికలకుండే రూపము, రూప కల్పన కొరకు ఐచ్ఛికలు కలిగి వుంటుంది. సాధారణా ప్రకటనల పేటికలలో ప్రదర్శించబడే ప్రకటనలను గూగుల్ సాఫ్ట్​వేర్, లేదా ప్రకటనదారుడు (సైట్‌కు గురి పెట్టబడ్డ ప్రకటనలు) నిర్ధారిస్తారు. అయితే నివేదన ప్రకటనలకు సంబంధించినంత వరకు, ప్రదర్శించబడే ప్రకటనలను ప్రచురణకర్త ఎంచుకోవచ్చు
నివేదన ప్రకటన విభాగములో ప్రదర్శించబడే ప్రతి ప్రకటనకు సంబంధంగా ఏదో ఒక క్రియ వుంటుంది. చాళా ప్రకటనల విషయంలో అది, ఒక వస్తువు/సేవ కొనుగోలు చెయ్యడంగా కనపడుతుంది. అయితే, విచారణ సభ్యత్వానికి నమోదు చేసుకోవడం, వస్తువు/సేవ గురించి విచారించడం, సాఫ్ట్​వేర్ దించుకోవడం వంటి క్రియలను కూడా మనకు తారస పడుతుంటాయి.
మీ వెబ్ సైట్ పాఠకుడు, నివేదన విభాగములోని ప్రకటనలో వున్న లంక్ వుపయోగించి, ప్రకటనదారుడి వెబ్ సైట్‌కు వెళ్ళి, నిర్దెశించిన క్రియను పూర్తిచేసినట్లయితే, గూగుల్ మీ ఖాతాలో నివేదన కమీషన్ జమ చేస్తుంది.

» నివేదన ప్రకటనలు (గూగుల్ ప్రోడక్ట్స్)

గూగుల్ వారి సాఫ్ట్‌వేర్లలో, సేవలలో కొన్నింటిని వినేదన మార్గం ద్వారా వ్యాపింప చేసే ప్రయత్నం చేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లను, సేవలను ప్రచురణ కర్తల వెబ్ పుటల (వెబ్‌సైట్లు/బ్లాగ్‌లు) ద్వారా వ్యాపింప చేసినట్లయితే దానిని గాను నివేదన కమిషన్ సంపాదించే అవకాశం వుంటుంది. మీరు నివేదించిన సాఫ్ట్‌వేర్, సేవను బట్టి నివేదన కమిషన్ రకరకాలు వుంటుంది.
గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమములో యింతకుముందెప్పుడూ నమోదు చేసుకోని ప్రచురణకర్త, మీ నివేదన ద్వారా తన ఖాతా సృష్టించుకుని
  • మొదటి 180 రోజులలో $5.00 గడించినట్లయితే, $5.00
  • మొదటి 180 రోజులలో $100 గడించి, చెల్లింపుకు అర్హత పొందినట్లయితే, అదనంగా $250 నివేదకుడి ఖాతాలో నివేదన కమీషన్‌గా జమచేయబడుతుంది.
180 రోజుల కాలంలోనయినాగాని మొదటి 180 రోజులలో $100.00 గడించి, చెల్లింపునకు అర్హత పొందిన 25 గురు ప్రచురణ కర్తలను నివేదించినట్లయితే, నివేదకుడి ఖాతాలో $2000 బోనస్ జమచేయబడుతుంది. ఒక సంవత్సర కాలంలో ఒక బోనస్‌కు మాత్రమే అర్హత కలిగి వుంటారు.

గూగుల్ యాడ్ వర్డ్స్ కార్యక్రమములో యింతకుముందెన్నడూ నమోదు చేసుకోని ప్రకటనదారుడు, మీ నివేదన ద్వారా ఖాతా సృష్టించుకుని
  • కార్యక్రమములో చేరడానికి చెల్లించే రుసుము $5 కాక మొదటి 90 రోజులలో $5 ఖర్చు చేసినట్లయితే, $5.
  • మొదటి 90 రోజులలో $100 ఖర్చుచేసినట్లయితే, అదనంగా $40 నివేదకుడి ఖాతాలో నివేదన కమీషన్ జమ చేయబడుతుంది.
180 రోజుల కాలంలోనయినాగాని, మొదటి 90 రోజులలో కనీసం $100 ఖర్చు చేసే 20 మంది ప్రకటన దారులను నివేదించినట్లయితే, నివేదకుడి ఖాతాలో $600.00 బోనస్ జమ చేయబడుతుంది. ఒక సంవత్సర కాలంలో ఒక బోనస్‌కు మాత్రమే అర్హత కలిగి వుంటారు.

• గూగుల్ పరికర పట్టితో ఫైర్‌ఫాక్స్ బ్రౌసర్

విండోస్ వినియోగదారుడు, మీ నివేదన ద్వారా, ఫైర్‌ఫాక్స్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ ప్రోగ్రామును తన (ఇంతకుముందు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ప్రోగ్రామును స్థాపించిన) కంప్యూటర్లో స్థాపించి, బ్రౌజర్‌ను తెరచినట్లయితే $1 వరకు నివేదకుడి ఖాతాలో నివేదన కమీషన్‌గా జమ చేయబడుతుంది. డౌన్ లోడ్ చేసుకున్నవారి భౌగోళిక స్థానం బట్టి కమీషన్ మారుతుంది. గరిష్టంగా $1.00 చెల్లించబడుతుంది.

• గూగుల్ ప్యాక్

గూగుల్ పుటను యింతకు ముందెప్పుడూ స్థాపించని విండోస్ వినియోగదారుడు, మీ నివేదన ద్వారా గూగుల్ ప్యాక్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తన కంప్యూటర్లో మొదటి సారి స్థాపించినట్లయితే, నివేదకుడి ఖాతాలో $2 వరకు నివేదన కమీషన్ జమచేయబడుతుంది. వినియోగదారుడి భౌగోళిక స్థానం బట్టి చెల్లించబడే కమీషన్ మారుతుంది.

• లంకె విభాగము

ప్రకటనదారులు ప్రకటన వర్గాలను తెలియచేసే పదాలను లంకెలుగా ప్రదర్శిస్తున్న ఒక ప్రత్యేక తరహా ప్రకటనల విభాగాన్ని వెబ్ పుటలలో ప్రదర్శించడం కొరకు గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము అందిస్తుంది. ఈ లంకెలలో దేని మీదయినా పాఠకుడు క్లిక్ చేసినట్లయితే, ఆ వర్గంలో వున్న ప్రకటనలు కలిగిన ఒక సరికొత్త పుట ప్రదర్శించబడుతుంది. ఈ పుటలో వున్న ప్రకటనలలో దేనిమీదయినా పాఠకుడు క్లిక్ చేసినట్లయితే, అది మీ బ్లాగ్/వెబ్‌-సైట్లలో వున్న పుటలోని ప్రకటనను క్లిక్ చేసిన దానితో సమానంగా పరిగణిస్తారు.
అందువలన ఈ పుటలో వున్న ప్రకటనలు మీ పుటలలో వున్న ప్రకటనలతో సమానమైన ఆదాయం సమకూరుస్తారు.

• శోధన పేటిక

ఆదాయం గడించడానికి వుపయోగించగలిగిన యింకొక మార్గం మీ బ్లాగ్/వెబ్‌సైట్‌లోని వెబ్ పుటలో గూగుల్ శోధన పేటిక. ఈ పేటికనుపయోగించు పాఠకుడు వెబ్ పుటలకోసం వెదికినట్లయితే (శోధించినట్లయితే), గూగుల్ శోధన ఫలితాల పుటలు ప్రదర్శించబడతాయి. ఆ పుటలలో పై భాగాన, క్రింది భాగాన ప్రకటనలు పొందుపరచబడి వుంటాయి. ఇక్కడ ప్రదర్శించబడే ప్రకటనలు PPC అక్షర పాఠ ప్రదర్శనలు మాత్రమే. పాఠకుడు ఈ ప్రకటనల మీద క్లిక్ చేసినట్లయితే, ప్రకటనదారుడి నుండి కొంత రుసుము వసూలు చేయబడుతుంది. ఆ రుసుములో కొద్ది భాగం ప్రచురణ కర్తల ఆదాయం క్రింద పంచబడుతుంది. ఇక్కడ పంచబడే ఆదాయం, ప్రచురణ కర్తల వెబ్ పుటలలో వున్న ప్రకటనలకు పంచబడే ఆదాయంకంటే చాలా తక్కువ నిష్పత్తిలో వుంటుంది.
Google
ప్రచురణ కర్త యిక్కడ గూగుల్ శోధన పుటలకు వినియోగదారుడిని నివేదించే పాత్ర పోషిస్తున్నట్లు. వినియోగదారుడు అదే పుటను గూగుల్ శోధన కోసం వాడుతున్నంతసేపు ప్రచురణ కర్త ఆదాయం గడించడానికి అవకాశం కలిగి వుంటాడు.
ప్రచురణకర్తల వెబ్ పుటలో ప్రదర్శించబడే ప్రకటన వర్గ లంకెల ద్వారా ప్రదర్శించడమే. ప్రకటనల పుట, యిది ఒకటి కాదు. అక్కడ ప్రదర్శించబడే ప్రకటనలు ప్రచురణకర్త వెబ్ పుటలలో ప్రదర్శించబడినట్లే. ఇక్కడ ప్రదర్శించబడిన ప్రకటనలు గూగుల్ శోధన పుటలలో ప్రదర్శించబడినట్లు.

» సైట్‌లో శోధన

మీ గూగుల్ యాడ్‌సెన్స్ ఖాతాలో నుండి శోధన పేటికకు కోడ్ సృష్టించుకునేటప్పుడు మూడు వెబ్‌సైట్లు యూఆర్‌యల్స్ కూడా చేర్చుకోవచ్చు. దీనివలన సృష్టించబడ్డ శోధన పేటిక ద్వారా గూగుల్ శోధనతో పాటు ఆ మూడు వెబ్‌సైట్లను కూడా శోధించవచ్చు. దీని వలన మీరు మీ వెబ్‌సైట్‌ను శోధించడానికి, గూగుల్ శోధనకు ఒక చోట సౌకర్యము కలుగచేసినట్లవుతుంది. సైట్ ఫైళ్ళకు సంబంధించిన ఫలితాలు ప్రదర్శించే పుటలలో కూడా ప్రకటనలు ప్రదర్శించబడతాయి. అయితే మీరు చెప్పిన సైట్లకు సంబంధించిన పాఠం, పుటలు గూగుల్ దత్తాంశంలో వున్నంతవరకే శోధన ఫలితాలలో ప్రదర్శించబడతాయి. కొత్త పుటలను తన దత్తాంశములో చేర్చుకొనుటకు గూగుల్‌కు నెలల కాలం పడుతుంది. ఆ కారణంగా మీరు సైట్ సెర్చ్ కోసం ఈ విధానం వినియోగించినట్లయితే, వెబ్‌సైట్‌లోని కొన్ని పుటలు శోధించే వారికి కనపడకుండా పోయే ప్రమాదం వుంది.

• ఫీడ్ల కొరకు యాడ్‌సెన్స్

ఈ మార్గం యింకా అభివృద్ది చెందుతున్న దశలోనే వుంది. ప్రస్తుతము గూగుల్ ఈ ప్రకటనలను కొత్త ప్రచురణ కర్తలకు అందుబాటులోకి తేవడం లేదు. ఈ కార్యక్రమం బీటా దశలో వుంది. ఆ దశ నుండి బయటకు రాగానే అది అందరికి అందుబాటులోకి తేబడుతుంది. గూగుల్ యిటీవల, బ్లాగ్‌లకు ఫీడ్‌లను సృష్ఠించి వాటిలో ప్రకటనలను చొప్పించే రంగంలో నైపుణ్యత కలిగి వున్న feedburner.comను కొనుగోలు చేసింది. మీ బ్లాగ్/వెబ్-సైట్‌ను వారి వద్ద నమోదు చేసుకోవలసి వుంటుంది. మీ బ్లాగ్ సందర్శకులను పర్యవేక్షించిన తరువాత, వారి ప్రకటనల కార్యక్రమములో పాలుపంచుకోవడానికి ఆహ్వానాన్ని పంపుతారు. వారు ఆహ్వానించే వరకు వారి కార్యక్రమములో చేరే అవకాశం లేదు

• మొబైల్ ప్రకటనలు


ఇది గూగుల్ యిటీవల తెరచిన ప్రకటనల ప్రవాహం. మొబైల్ సాధనాల కొరకు సృష్ఠించబడ్డ వెబ్ పుటలో ఈ ప్రకటనలను చేర్చవచ్చు ఒక మొబైల్ వెబ్ పుటలో ఒక ప్రకటనల విభాగాన్ని మాత్రమే చేర్చవచ్చు. ఒక్కొక్క ప్రకటనల విభాగము మీరు ఎంచుకున్న రూపాన్ని బట్టి ఒకటి లేక రెండు ప్రకటనలను కలిగి వుంటుంది.
మొబైల్ వెబ్ పుట రూపానికి సరితూగే విధంగా మొబైల్ ప్రకటనకు రూప కల్పన చేయవచ్చు.

» సర్వర్ స్క్రిప్ట్ అవసరమవుతుంది.

సాధారణ వెబ్ పుటలలో వున్న ప్రకటనలు, కక్షిదారు కంప్యుటర్‌లో సంకలనం చేయబడే క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ లను వుపయోగించి ప్రసారం చేయబడతాయి. మొబైల్ వెబ్ పుటలలో ప్రకటనలు మాత్రం, సర్వర్‌లొ సంకలనం చేయబడే సర్వర్ సైడ్ స్క్రిప్ట్ లను వుపయోగించి ప్రసారం చేయబడతాయి ఈ ప్రొగ్రామింగ్ భాషలు మీకు తెలియనక్కరలేదు కాని, మీరు ఏ భాష కోడ్ నయితే ప్రకటనలు జారీ చేయబడటానికి వాడుతున్నారో, ఆ భాషను సంభాళించే సత్తా మీ వెబ్ సైట్‌కు సశక్త పరచబడి వుంది అనేది, నిర్ధారించుకోవాలి. తద్వారా ప్రకటనల కోడ్ సక్రమంగా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవచ్చు. కోడ్ PHP 4.3, CGI/Perl 5.8, JSP 1.2, ASP 3.0 భాషలలో దొరుకుతుంది. నిర్దేశించబడ్డ లేక తదుపరి వెర్షన్‌లు వుండాల్సి వుంటుంది.



పుట అంశాలు »  

ఎటువంటి ప్రకటనలు జారీ చేయబడతాయి

సంబంధిత ప్రకటనలు. గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము లేక ఏ యితర ప్రకటనల నిర్వహణ సంస్థ అయినా గాని వాడే మాట యిది. ప్రచురణ కర్తల వెబ్ పుటకు జారీ/భట్వాడా చెయ్యబడే ప్రకటనలు, ఆ పుటకు సంబంధిత ప్రకటనలు. ప్రకటనల జారీ యంత్రాంగాన్ని నిర్వహించే సంస్థకు సంబంధించిన కంప్యూటర్ ప్రోగ్రాము ప్రకటనలు జారీ చేయబడే పుటలకు సంబంధించిన పాఠం మొత్తాన్ని గ్రహించి, విశ్లేషించి ఆ పుటకు సంబంధిత కీలక పదాలు యివి అని నిర్ధారిస్తాయి. కంప్యూటర్ ప్రోగ్రామ్, అంతర్గతంగా నిర్మింపబడి వున్న తర్కం వుపయోగించి, ఈ సంబంధిత కీలక పదాలను నిర్ధారించుకుంటుంది.
సంబంధిత పదాలను నిర్ధారించడంలో ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ పరిగణంలోకి తీసుకునే కొన్ని కీలకమైన అంశాలు యివి. (1) వెబ్‌-సైట్/బ్లాగ్ క్షేత్ర నామం.. (2) వెబ్ పుట యూఆర్‌ఎల్ (3) వెబ్ పుట శీర్షిక (4)) వెబ్ పుటలో వున్న అక్షర పాఠం (5) వెబ్ పుటలోని శీర్షిక అంశాలలో వున్న అక్షర పాఠం మొదలగునవి.
ప్రకటనకర్తలు, వారి ప్రకటనకు/ప్రచారానికి సంబంధించిన కీలక పదాలను ఎంచుకుంటారు. ప్రకటనల జారీ యాజమాన్య సంస్థ ప్రకటన దారులు ఎంచుకున్న సంబంధిత కీలక పదాలు కలిగిన ప్రచురణ కర్తల వెబ్ పుటలకు ప్రకటనలను జారీ/భట్వాడా చేస్తాయి.
కాబట్టి ఒక ప్రచురణకర్త వెబ్ పుట (వెబ్‌-సైట్/బ్లాగ్) gardening (తోటల పెంపకం) గురించయితే, gardening కీలక పదాన్ని సంబంధిత పదంగా ఎంచుకున్న ప్రకటన కర్తల ప్రకటనలు వారి బ్లాగ్/వెబ్‌-సైట్ యొక్క వెబ్ పుటలో ప్రదర్శించబడటానికి అవకాశం వుంటుంది.

• వెబ్‌ సైట్‌కు - గురిపెట్టబడ్డ ప్రకటనలు - CPM

వెబ్‌ సైట్‌కు గురిపెట్టబడే ప్రకటనల విషయంలో సంబంధిత పదాల పాత్ర ఏమీ వుండదు. ప్రకటనదారుడు తన ప్రకటన మీరు సృష్టించిన వెబ్‌ పుటలో (వెబ్‌-సైట్/బ్లాగ్‌లోనిది) ప్రదర్శించబడాలని ఎంచుకున్నట్లయితే, ఆ ప్రకటన మీ వెబ్ పుట యొక్క సంబంధిత పదాలకు సంబంధించినదిగా కాకున్నా ప్రదర్శించబడుతుంది. ఈ కారణంగానే గూగుల్ యిటువంటి ప్రకటనలకు CPM విధానాన్ని అనువర్తిస్తుంది.

• శోధన ప్రకటనలు - PPC

ప్రచురణకర్తలు గూగుల్ శోధనకు సంబంధంగా యాడ్‌సెన్స్ కార్యక్రమం వుపయోగిస్తున్నట్లయితే, శోధన పుటలలో ప్రదర్శించబడే ప్రకటనలు, పాఠకులు ఆ శోధన కొరకు పేటికలో చేర్చిన కీలక పదాలు సంబంధిత కీలక పదాలుగా గల ప్రకటనలు ప్రదర్శించబడతాయి.
ప్రచురణకర్తల ఆదాయం ఎంత వుటుంది : అనువర్తించబడే PPC, CPM రేట్లు

PPC రేట్లు

ఒక పదాన్ని వారి ప్రకటనలకు సంబంధ కీలక పదంగా ఎంచుకున్న ప్రకటనదారులు ఎక్కువయ్యే కొద్దీ, ఆ పదానికి కోరిక (demand) ఎక్కువయినట్లే. ఒక పదానికి కోరిక ఎక్కువయ్యే కొద్దీ, ఆ పదానికి వసూలు చేయబడే రుసుము పెరుగుతూ వుంటుంది. పదానికి వసూలు చేయబడే రుసుము పెరిగే కొద్దీ, ప్రచురణ కర్తలకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఒక క్లిక్‌కు వచ్చే ఆదాయం కనిష్టం రూ. 0.40 ($0.01) కన్నా తక్కువ నుండి 400 ($10) వరకూ వుండొచ్చు.

CPM రేట్లు

ఒక వెబ్‌ సైట్‌కు ట్రాఫిక్ ఎక్కువ వుండే కొద్దీ, దాంట్లో ప్రకటనలు జారీ చేయాలని కోరుకునేవారు ఎక్కువవుతారు. ఒక వెబ్‌ సైట్‌లో ప్రకటనలు జారీ చేయాలని కోరుకునేవారు ఎక్కువయ్యే కొద్దీ, ఆ వెబ్‌ సైట్‌కు CPM రేట్లు పెరుగుతూ వుంటాయి. ప్రకటనదారుల వద్ద వసూలు చేయబడే రుసుము ఎక్కువవుతుంది. ప్రకటనదారుల వద్ద వసూలు చేయబడే రుసుము ఎక్కువయ్యే కొద్దీ, ప్రచురణకర్తలకు వచ్చే ఆదాయం పెరుగుతూ వుంటుంది. సైట్‌కు గురి పెట్టబడ్డ ప్రకటనల నుండి వచ్చే ఆదాయం ప్రతి వెయ్యి ముద్రణలకు రూ. 10 ($0.25) నుండి 800 ($20) వరకూ వండవచ్చు.

• శోధన పుటలలో ప్రకటనలు

శోధన పుటలలో ప్రదర్శించబడే ప్రకటనలన్నీ PPC ప్రకటనలే. శోధన పుటలలో ప్రదర్శించబడ్డ ప్రకటనల నుండి వచ్చే ఆదాయం మీ వెబ్‌-సైట్/బ్లాగ్‌లో వున్న ప్రకటనల నుండి వచ్చే ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ.

• ఎందుకని తక్కువ!!

శోధన పుటలలో ప్రదర్శించబడే పాఠం గూగుల్ సృష్టించినది. ఒక రకంగా అవి గూగుల్ వెబ్‌ సైట్‌లోని పుటలు. ఆ పుటలకు సంబంధించినంత వరకూ గూగుల్ ప్రచురణ కర్త యాడ్‌సెన్స్ ప్రచురణ కర్తలకు శోధన పుటలద్వారా గడించే ఆదాయం, గూగుల్ వారి శోధన పుటలకు మీరు పాఠకులను నివేదిస్తున్నందుకు చెల్లిస్తున్న నివేదన రుసుము అనుకోవచ్చు. పైపెచ్చు వారి శోధన పుటలలో ప్రకటనలు ప్రదర్శించబడటానికి గూగుల్ ప్రకటనదారుల నుండి వసూలు చేసే రుసుము. యితర ప్రచురణ కర్తల వెబ్ పుటలలో ప్రదర్శించడానికి వసూలు చేసే రుసుము ఒకటి కాదు.
శోధన పుటలకు సంబంధించినంత వరకు గూగుల్ సొంత పుటలకు ప్రకటనలు తీసుకున్నట్లే. ఇతర వెబ్ పుటలలో ప్రదర్శించడానికి తీసుకున్న ప్రకటనల విషయంలో గూగుల్ ప్రకటనల యాజమాన్య యంత్రాంగం అవుతుంది.
అందువలన ఈ మార్గం ద్వారా ప్రచురణ కర్తలు గడించే ఆదాయం పెద్ద పరిమాణాలలో లేనప్పటికి అది విస్మరించదగినది మాత్రం కాదు.

• ఆదాయాన్ని పెంచుకోవడం

  • ప్రతి ప్రచురణకర్త వారి వెబ్ పుటలలోఅత్యధిక PPC/CPM రేట్లు వున్న ప్రకటనలు ప్రదర్శించబడాలనే కోరుకుంటారు. అత్యధిక క్లిక్ రేట్లు కలిగిన ప్రకటనలు ప్రదర్శించబడటం కోసం వెబ్ పుటలు సృష్టించడానికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కేవలం ప్రకటనలు మీ పుటలలో ప్రదర్శించబడటం వలన మీకు ఆదాయం రాదు. పాఠకులు వెబ్‌ సైట్లను వ్యర్ధాన్ని చదవడానికి, ప్రకటనలు చూడటానికి రారు. వారికి కావల్సింది వారు వుపయోగించుకోగలిగిన, వారికి ఉత్సుకత కలుగచేసే పాఠం. మీ పుటలనుండి ఆదాయం గడించడానికి మీకు కావల్సింది, పాఠకులు, మంచి పాఠం.
మీరు పెట్టే పాఠంలో నుండే మీ పుట ఎక్కువ విలువ గలిగిన దాని క్రింద పరిగణించాలంటే ఏమి చెయ్యాలి అనేది తెలుసుకోవడం అవసరమే.



పుట అంశాలు »  

ఒక పుటలో ఎన్ని ప్రకటనలు

గూగుల్ యాడ్‌స్‌న్స్​కు సంబంధించినంతవరకు, యిది ఒక పుటకు ఎన్ని ప్రకటనల విభాగాలు అని అడగడం సమంజసం. ఒక ప్రచురణ కర్త, ఒక పుటలో ఈ క్రింది విధంగా ప్రకటనల విభాగాలు పెట్టుకోవచ్చు.

రకం

ఎన్ని

ప్రకటనల విభాగాలు గరిష్టంగా మూడు ప్రకటనల విభాగాలు (అందుబాటులో వున్న పరిమాణాలలో మీరెంచుకున్న పరిమాణాలతో) మొత్తం ఎన్ని ప్రకటనలు ప్రదర్శంచబడతాయి అనేది, మీరు ఎంచుకున్న విభాగము యొక్క కొలతలు, ప్రకటన రకం (అక్షర పాఠ ప్రకటనా లేక ప్రతిమ ప్రకటనా), ప్రసారం చేయబడ్డ ప్రకటనలు ఎన్ని అనే వాటి మీద ఆధారపడి వుంటుంది.
లంకె విభాగాలు గరిష్టంగా ఒక లంకె విభాగం (అందుబాటులో వున్న పరిమాణాలలో మీరెంచుకున్న పరిమాణంతో) మొత్తం ఎన్ని లంకెలు ప్రదర్శంచబడతాయి అనేది, మీరు ఎంచుకున్నవిభాగపు కొలతలు మరియు ప్రసారం చేయబడ్డ లంకెల మీద ఆధార పడి వుంటుంది. రెండే రకాలు వున్నాయి - గరిష్టంగా. నాలుగు/ఐదు లంకెలు కలిగి వుండేవి.
నివేదన విభాగాలుగరిష్టంగా మూడు ప్రకటనల విభాగాలు (అందుబాటులో వున్న పరిమాణాలలో మీరెంచుకున్న పరిమాణాలతో) మొత్తం ఎన్ని ప్రకటనలు ప్రదర్శంచబడతాయి అనేది, మీరు ఎంచుకున్న విభాగము యొక్క కొలతలు, ప్రకటన రకం (అక్షర పాఠ ప్రకటనా లేక ప్రతిమ ప్రకటనా), ప్రసారం చేయబడ్డ ప్రకటనలు ఎన్ని అనే వాటి మీద ఆధారపడి వుంటుంది.
శోధన పేటికలు గరిష్టంగా రెండు శోధన పేటికలు
యాడ్‌సెన్స్ ప్రకటనలకు రూపకల్పన

గూగుల్ వారి యాడ్‌సెన్స్ ప్రకటనలు ప్రదర్శించడానికి పని చేసే జావాస్క్రిప్ట్ కోడ్.
<script type="text/javascript"><!--
google_ad_client = "pub-0688509358177234";
google_ad_width = 728;
google_ad_height = 90;
google_ad_format = "728x90_as";
google_ad_type = "text_image";
//2007-01-19: Blog_Middle, Ed_OC_Top
google_ad_channel = "7377913306+0820958058";
google_color_border = "FFFFFF";
google_color_bg = "FFFFEE";
google_color_link = "0066FF";
google_color_text = "003300";
google_color_url = "0066FF";
//--></script>
<script type="text/javascript"
src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
</script>
పై కోడ్‌కు వివరణ. ఇది మీ ప్రకటనలను రూపకల్పన చేయడానికి వుపయోగపడుతుంది.

యాడ్‌సెన్స్ ప్రకటనలకు జావా స్క్రిప్ట్ కోడ్ మొదలు → a <script type="text/javascript"><!--
ప్రచురణకర్త గుర్తింపు సంఖ్య → b google_ad_client = "pub-0688509358XXXXX";
ప్రచురణ విభాగపు వెడల్పు → c google_ad_width = 728;
ప్రచురణ విభాగపు ఎత్తు → d google_ad_height = 90;
ప్రచురణ విభాగపు కొలతలు → e google_ad_format = "728x90_as";
విలువ ఈ రూపం తీసుకుంటుంది.
వెడల్పుxఎత్తు_as   → ప్రకటనల విభాగము
వెడల్పుxఎత్తు_0ads_al   → గరిష్టంగా 4 లంకెలు ప్రదర్శించే లంకె విభాగాలు
వెడల్పుxఎత్తు_0ads_al_s   → గరిష్టంగా 5 లంకెలు ప్రదర్శించే లంకె విభాగాలు
ప్రదర్శించవలసిన ప్రకటనల రకాలు → f google_ad_type = "text_image";
text_image   → సాధారణ విలువ, అక్షర పాఠ, ప్రతిమ ప్రకటనలు రెండింటిని ప్రదర్శిస్తుంది.
text   → కేవలం అక్షర పాఠ ప్రకటనలు ప్రదర్శించడానికి
image   → కేవలం ప్రతిమ ప్రకటనలు ప్రదర్శించడానికి
ఛానల్ సృష్టించబడ్డ తేదీ: పేరు → g
సంఖ్యాత్మక ఛానల్ కోడ్ → h
//2007-01-18: Blog_Middle, Fact_OC_Bottom
google_ad_channel = "7377913306+6358989679";
ఒకే ప్రకటన విభాగంలో ఐదు ఛానళ్ళు వినియోగించవచ్చు. రెండు అంతకంటే ఎక్కువ ఛానళ్ళు చేర్చినట్లయితే వాటి పేర్లు, కోడ్ కామా గుర్తుతో విడదీయబడతాయి. కోడ్‌లో ఒక పంక్తి ముందు
" // " గుర్తు వుంటే అది వ్యాఖ్యలాగా వుపయోగపడుతుంది.
⇒ సృష్టించిన తేదీ, పేర్లు ఆ ఛానళ్ళును మనం గుర్తించడానికి మాత్రమే.
ప్రకటనల విభాగపు చట్రం వర్ణం → i google_color_border = "FFFFFF";
ప్రకటనల విభాగపు నేపధ్య వర్ణం → j google_color_bg = "FFFFEE";
లంకె వర్ణం (మొదటి పంక్తి అక్షర పాఠం) → k google_color_link = "0066FF";
మొదటి, చివర పంక్తుల మధ్య వున్న అక్షర పాఠం → l google_color_text = "003300";
యూఆర్‌ఎల్ వర్ణం (చివరి పంక్తి అక్షర పాఠం) → m google_color_url = "0066FF";
బదులుగా వాడే వర్ణం → n google_alternate_color = "0000FF";
బదులుగా ప్రదర్శించబడే ప్రకటనలకు యూఆర్‌ఎల్ → o google_alternate_ad_url = "http://www.theedifier.com/altd.php";
యాడ్‌సెన్స్ ప్రకటనలకు జావా స్క్రిప్ట్ కోడ్ అంతం → p //--></script>
<script type="text/javascript" src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js"> </script>
పై రూపకల్పన ఐచ్చికలను గూగుల్ సర్వర్‌కు పంపి, తదనుగుణంగా రూపకల్పన చేయబడ్డ ప్రకటనలను తీసుకొచ్చే కోడ్ కలిగిన స్ర్కిప్ట్ ఫైల్

  • కోడ్ పనిచేయడంలో ఏదన్నా సమస్య అనిపించినట్లయితే " a" లోని <!-- ను మరియు --> ను తొలగించండి.
  • "c" , " d" , " e" మీరు ఎంచుకున్న ప్రకటనల విభాగము పరిమాణమును బట్టి నిర్ధిష్టమైన విలువలు కలిగి వుంటాయి.

    పేరు

    వెడల్పు

    ఎత్తు

    కోడ్

    ప్రకటనల రకాలు

    గరిష్టంగా అక్షర
    పాఠ ప్రకటనలు

    Leader Board 728 90 728x90_as Image, Text 4
    Banner 468 60 468x60_as Image, Text 2
    Half Banner 234 60 234x60_as Text 1
    Button 125 125 125x125_as Text 1
    Small Rectangle 180 150 180x150_as Text 1
    Vertical Banner 120 240 120x240_as Text 2
    Square 250 250 250x250_as Text, Image, Video 3
    Small Square 200 200 200x200_as Text, Image, Video 2
    Medium Rectangle 300 250 300x250_as Text, Image, Video 4
    Large Rectangle 336 280 336x280_as Text, Image, Video 4
    Skyscraper 120 600 120x600_as Text, Image 4
    Wide Skyscraper 160 600 160x600_as Text, Image 5

    లంకె విభాగాలు


    వెడల్పు

    ఎత్తు

    కోడ్

    గరిష్టంగా లంకెలు

    728 15 728x15_0ads_al 4
    728 15 728x15_0ads_al_s 5
    468 15 468x15_0ads_al 4
    468 15 468x15_0ads_al_s 5
    120 90 120x90_0ads_al 4
    120 90 120x90_0ads_al_s 5
    160 90 160x90_0ads_al 4
    160 90 160x90_0ads_al_s 5
    180 90 180x90_0ads_al 4
    180 90 180x90_0ads_al_s 5
    200 90 200x90_0ads_al 4
    200 90 200x90_0ads_al_s 5

    అన్ని విభాగాల ప్రివ్యూ కొరకై యిక్కడ చూడండి.

  • f లో వున్న కోడ్ పూర్తిగా తొలగించబడినట్లయుతే, అక్షర పాఠ, ప్రతిమల ప్రకటనలు రెండూ ప్రదర్శించబడతాయి.
  • i , j, k, l, m : వీటికి సంబంధించిన విలువలు, వర్ణాన్ని సూచించే 6 అంకెల షడ్దశ (hexadecimal) సంఖ్య. ఎడమ నుండి ఒక్కొక్క జత అంకెలు, వరుసగా ఆ వర్ణాన్ని ఏర్పరచే ఎరుపు, ఆకుపచ్చ, నీలం వర్ణాల విలువలను సూచిస్తాయి.
    ప్రకటనల విభాగానికి రూపకల్పన చేయడంలో మీ సృజనాత్మకత మొత్తం, ఈ విలువలను ఎంచుకోవడంలో బయటపడుతుంది. మీరు ఆ విలువలను మార్చడం ద్వారా ప్రకటన మీ వెబ్ పుటలో కలిసి పోయేటట్లు చేయవచ్చు.
  • యాడ్‌సెన్స్ సాఫ్ట్​వేర్,, ప్రకటనదారులు యిచ్చిన ప్రకటనలలో, ఈ పుటలోని ఏదయినా ప్రకటనల విభాగానికి జారీ చేయడానికి తగ్గ ప్రకటనలు లేనట్లు పసిగట్టినట్లయితే, కొన్ని సార్లు ఆ ప్రకటనల విభాగానికి ప్రజాప్రయోజన ప్రకటనలను జారీ చేస్తుంది, కొన్ని సార్లు ఖాళీ పుటను ప్రదర్శిస్తుంది. ఖాళీ ప్రదేశము ప్రదర్శించబడటం ఎబ్బెట్టుగా కనపడవచ్చు, ముఖ్యంగా ఆ ఖాళీ పుట యొక్క నేపధ్య వర్ణం, ఆ ప్రకటనల విభాగము చుట్టు ప్రక్కల వున్న ప్రదేశము యొక్క నేపధ్య ర్ణము ఒకటి కానట్లయితే, ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి మూడు ఐచ్ఛికలున్నాయి.

    » నేపధ్య వర్ణం

    n : ఒకవేళ ఖాళీ పుట ప్రదర్శించబడాల్సి వస్తే, అప్పుడు వుపయోగించవలసిన నేపధ్య వర్ణాన్ని యాడ్ సెన్స్ కోడ్‌లో భాగంగా నిర్దేశించవచ్చు. దీని వలన ఆ ఖాళీ విభాగము, ప్రదర్శించబడుతున్న పుటలో దాని చుట్టు ప్రక్కల గల ప్రదేశముతో కలిసిపోయినట్లు కనపడుతుంది.

    » ప్రత్యామ్నాయ యూఆర్‌ఎల్

    o : ఒక ప్రకటనల విభాగములో ప్రదర్శించబడటానికి తగ్గ ప్రకటనలు లేనట్లయితే, యాడ్ సెన్స్ కోడ్‌లో, ఆ ప్రదేశములో చేర్చడానికి అవసరమైన పాఠం కోసం ఒక ఫైల్ యూఆర్‌ఎల్ నమోదు చేస్తాము. ఆ యూఆర్‌ఎల్, ఒక ప్రతిమ ఫైల్, అక్షర పాఠ ఫైల్ లేదా ప్రకటనలు జారీ కోసం గూగుల్ యాడ్ సెన్స్ స్క్రిప్ట్ లాంటి స్క్రిప్ట్ కలిగిన యితర ఫైల్‌ అవ్వొచ్చు.

    » ముడుచుకుపోయే ప్రకటనల పేటికలు

    ప్రకటనల ప్రదేశములో ప్రదర్శించడానికి సంబంధిత ప్రకటనలేమీ లేనట్లయుతే, గూగుల్ వారి google_adsense_script.html స్క్రిప్ట్ ఫైల్‌ను ను వెబ్ సైట్‌లో ఎక్కడయినా భద్రపరచి (http://www.yoursitename.com/google_adsense_script.html), ఆ ఫైల్ యొక్క యూఆర్‌ఎల్‌ను ప్రత్యామ్నాయ ప్రకటనల యూఆర్‌ఎల్ స్థానంలో చేర్చడం ద్వారా ఆ ఖాళీ ప్రదేశము ముడుచుకు పోయేటట్లు చేయవచ్చు.
  • గూగుల్ ప్రకటనల కోడ్ మొత్తం రెండు విభాగాలుగా వుంటుంది. మొదటి దాంట్లో ప్రకటన రూపకల్పనకు చేకూర్చేందుకు అవసరమైన అంశాలు వుంటాయి. రెండవ దాంట్లే వున్న కోడ్, మొదటి దాంట్లో వున్న అంశాలను చదువుకొని, ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్‌కు పంపి, ప్రకటనలు తీసుకు వచ్చేదానికి సంబంధించినది. రెండవ భాగానికి సంబంధించినంతవరకు మనం చేయవలసినది ఏమీ లేదు. అందువల్లనే ఆ కోడ్ వేరే ఫైల్‌లో పొందుపరిచి వుంది.

• మొబైల్ ప్రకటనలకు నమూనా PHP సర్వర్ సైడ్ స్క్రిప్ట్

<?php
$GLOBALS['google']['ad_type']='text';
$GLOBALS['google']['channel']='';
$GLOBALS['google']['client']='pub-0688509358XXXXX';
$GLOBALS['google']['color_border']='000000';
$GLOBALS['google']['color_bg']='F0F0F0';
$GLOBALS['google']['color_link']='0000FF';
$GLOBALS['google']['color_text']='000000';
$GLOBALS['google']['color_url']='008000';
$GLOBALS['google']['format']='mobile_double';
$GLOBALS['google']['https']=$_SERVER['HTTPS'];
$GLOBALS['google']['host']=$_SERVER['HTTP_HOST'];
$GLOBALS['google']['ip']=$_SERVER['REMOTE_ADDR'];
$GLOBALS['google']['markup']='xhtml';
$GLOBALS['google']['output']='xhtml';
$GLOBALS['google']['ref']=$_SERVER['HTTP_REFERER'];
$GLOBALS['google']['url']=$_SERVER['HTTP_HOST'] . $_SERVER['REQUEST_URI'];
$GLOBALS['google']['useragent']=$_SERVER['HTTP_USER_AGENT'];
require('http://pagead2.googlesyndication.com/pagead/show_ads.php');
?>
 



పుట అంశాలు »  

అధిక ఆదాయాన్ని చేకూర్చే ప్రకటనలు : పరిమాణాలు, రూపం, స్ధానం

ప్రచురణ కర్తలు గమనంలో వుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు వెబ్ పుటలు సృష్టించి, అందులో వున్న పాఠంలో ప్రకటనలు చేరుస్తారు. అంతేకాని, వారు ప్రకటనల పుటలు సృష్టించి వాటిలో పాఠాన్ని చేర్చడం లేదు. కేవలం ప్రకటనలు కోసం సృష్టించబడ్డ పుటలుగా కనపడితే, పాఠకుడికి దానిమీద వున్న ఆసక్తి సన్నగిల్లు పోయి, ఆ వెబ్‌-సైట్/బ్లాగ్‌కు మళ్ళీ వద్దామనే ఆలోచన చేయకుండా వుండే ప్రమాదం వుంది.
ప్రచురణ కర్త, కేవలం మొదటిసారి వచ్చే పాఠకులను మాత్రమే ఆశిస్తున్నట్లయితే, ఎటువంటి పుటలయినా ఒక్కటే.
గూగుల్ యాడ్‌సెన్స్ కార్యక్రమము లాంటి వాటి ద్వారా జారీ చేయబడి, వెబ్ పుటలలో ప్రదర్శించబడే ప్రకటనలు సాధారణంగా పుటలో వున్న పాఠానికి సంబంధించినవే అయి వుంటాయి. అందువలన అని పాఠకులకు ఆశక్తి కలుగచేసే విధంగా వుంటాయనే అనుకోవచ్చు. మీ వెబ్‌-సైట్/బ్లాగ్‌లో పుటలను వీక్షించే ప్రతి పాఠకుడు ప్రకటనలను క్లిక్ చేయాలని, ప్రతి పాఠకుడి వలన ఆదాయం రావాలని ఆశించడం సమంజసం కాదు.
ప్రచురణకర్తలకు మదిలో సాధారణంగా మెదిలాడే ప్రశ్నలు యివి:
  • ప్రకటనల ప్రదేశం పరిమాణం ఎంత వుండాలి?
  • అంచు, నేపధ్యం, లంకె, అక్షర పాఠం, యూఆర్‌ఎళ్ళకు ఏ వర్ణం వుపయోగించాలి?
  • ప్రకటనలు చేర్చడానికి వెబ్ పుటలో అత్యుత్తమ ప్రదేశాలు ఏవి?
వీటి విషయంలో మీకు యింకా ఎక్కువ వివరణ కావాలంటే, అది గూగుల్ నుండి తెలుసుకుంటే వుపయోగకరంగా వుంటుంది.

• వర్ణాలు గూగుల్ :: విజయవంతమైల వర్ణ సమ్మేళనం

వర్ణ సమ్మేళనం అనగా ప్రకటనల విభాగ అంశాలకు (అంచు, నేపధ్యం, లంకె. అక్షర పాఠం, యూఆర్‌ఎల్), ప్రకటనలకు అనువర్తించబడిన రంగులన్నీ కలిపి అని అర్ధం చేసుకోవాలి. మీ యాడ్‌సెన్స్ ఖాతా పుటలలో మీరు ఎంచుకున్న వర్ణాల సమ్మేళనానికి ఒక నిర్ధిష్టమైన గుర్తుతో భద్రపరచుకోవచ్చు. ఇటువంటి సమ్మేళనాలు 200 వరకు సృష్టించుకోవచ్చు. దీనివలన మీరు ఆ వర్ణాల సమ్మేళనాన్ని, ఆ గుర్తును అనువర్తించడం ద్వారా ఎంచుకోవచ్చు. విడివిడిగా అన్ని అంశాలకు సంబంధించిన వర్ణాలు గుర్తు పెట్టుకోవల్సిన అవసరం లేదు. ప్రకటనల విభాగ అంశాలకు మీరు ఎంచుకునే రంగులు, ప్రకటనలను వెబ్ పుటలలో కలిసిపోయేటట్లు చేయగలగాలి.
ఎక్కువగా వర్ణాలకు సంబంధించిన సిఫార్సులలో కనపడే ఆలోచనలు.
  • అంచులు లేకుండా (ఇది అంచులకు ప్రకటనల విభాగ నేపధ్య వర్ణాన్ని లేదా విభాగం ప్రదర్శించబడే వెబ్ పుట యొక్క నేపధ్య వర్ణాన్ని ఎంచుకోవడం ద్వారా సాధించవచ్చు).
  • ప్రకటనల విభాగానికి, వెబ్ పుట యొక్క నేపధ్య వర్ణాన్ని ఎంచుకోవడం ద్వారా, ప్రకటనల విభాగాన్ని వెబ్ పుటలలో భాగంగా కనపడేటట్లు చెయ్యడం.
  • లంకెలకు, అక్షర పాఠానికి, యూఆర్‌ఎల్‌కు తగ్గ వర్ణం ఎంచుకోవడం ద్వారా అవి వెబ్ పుటలలో భాగంగా కనపడేటట్లు చెయ్యడం.
ఈ విషయంలో పరిజ్ఞానం గడించి మీ బ్లాగ్/వెబ్ సైట్ యొక్క వెబ్ పుటలకు తగిన సమ్మేళనాన్ని సాధించడానికి ప్రయోగాలు చేయాల్సిందే.

• ప్రకటన పేటిక : ప్రదేశము - పరిమాణము గూగుల్ :: ఏ ప్రకటన పరిమాణాన్ని వాడాలి?

ప్రకటన పేటికలు ఎన్ని పెట్టాలి, ఏయే ప్రదేశాలలో పెట్టాలి అనే ప్రశ్నకు కూడా, అన్ని సందర్భాలకు సరితూగే సమాధానం లేదు. ఎన్ని ఎక్కువ ప్రకటనలు పెడితే అంత వుపయోగం అనే నిర్ధారణకు రాకండి. ప్రకటనల ప్రదేశము యొక్క స్థానం, పరిమాణం పాఠకుడి దృష్టిని ఆకర్షించి, వారికి దాని మీద ఉత్సుకత కలిగించే విధంగా వుండాలి. ఒకే ప్రకటన ప్రదర్శిస్తున్న పేటిక/ప్రదేశము ఐదు ప్రకటనలు ప్రదర్శిస్తున్న పేటిక కంటే ఎక్కువ ఉత్సుకత కలిగించేదిగా వుండవచ్చు.

• ప్రకటన ప్రదేశము - స్థానము గూగుల్ :: ప్రకటనలను ఎక్కడ పెట్టాలి

ఇది మీ వెబ్‌సైట్/బ్లాగ్ లోని వెబ్ పుట యొక్క రూపాన్ని బట్టి వుంటుంది.

∗ గూగుల్ :: నివేదన కమిషన్ పెంచుకోవడం

• విధి విధానాలను అతిక్రమించకండి గూగుల్ యాడ్‌సెన్స్ ప్రోగ్రాము విధి విధానాలు

ప్రచురణకర్తలు ఎల్లప్పుడూ గూగుల్ విధి విధానాలను పాటిస్తూ వుండాల్సిందే. మీకు ఆ విధి విధానాల గురించిన అవగాహన సంపూర్ణంగా కావాలంటే, పై పుటను సంపూర్తిగా చదవండి. విధి విధానాలను పాటించడంలో విఫలమైనట్లయితే, మీ గూగుల్ యాడ్‌సెన్స్ ఖాతా రద్దు చేయబడుతుంది. అప్పటివరకు మీ ఖాతాలో వున్న మొత్తం కూడా మీకు చెల్లించబడక పోవచ్చు.

త్వరలో నా బ్లాగులో పెయిడ్ రివ్యూలు

సర్ఫింగ్‌... బ్లాగింగ్‌... ఛాటింగ్‌... ఇంటర్‌నెట్‌ ద్వారా ఇంకేం చెయ్యెుచ్చు? నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు. కాసులవర్షం కాదు గానీ... కొంచెంగా సంపాదించుకోవచ్చు. ఎలాగంటే... ఇలా...
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కొన్ని ఫొటోలు... ఇంట్లో పాతసామానూ... ఎందుకూ పనికిరాని ఈ మెయిళ్లు... కాదేదీ నెట్‌ సంపాదనకనర్హం. మచ్చుకు కొన్ని మార్గాలు...
బ్లాగింగ్‌...
మీకు మంచి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంది. కంప్యూటర్‌ను సమర్థంగా పనిచేయించే టిప్స్‌, ట్రిక్స్‌ బోలెడన్ని తెలుసు. మీకు తెలిసిన దాన్ని బ్లాగులో అందరికీ అర్థమయ్యేలా రాయగలరు. కంప్యూటర్లకు సంబంధించినవే కానక్కర్లేదు. రియల్‌ఎస్టేట్‌ మీదయినా... వెబ్‌సైట్ల మీదయినా... బాగా రాయగలగడవెుక్కటే అర్హత. ఈ క్వాలిఫికేషన్‌ చాలు!
మిమ్మల్నీ మీ బ్లాగునూ అద్దెకు తీసుకునేందుకు చాలా కంపెనీలే సిద్ధమవుతాయి.
ఉదాహరణకు www.payu2blog.com, payperpost.com, blogs“ertise.com, blogiti“e.com... పేమెంట్‌ అంతా అమెరికన్‌ డాలర్లలోనే. దీన్ని 'పెయిడ్‌ బ్లాగింగ్‌ (paid blogging) అంటారు.
కాకపోతే ఒకచిక్కు. ఒకసారి దీనికి కమిటైతే ఆ తర్వాత సైట్‌ నిర్వాహకులు కోరే అంశాల మీదే బ్లాగ్‌ పోస్టులు రాయాల్సి ఉంటుంది. మనసుకు తృప్తినివ్వని ఇలాంటి పన్లన్నీ ఎందుకంటారా... అయితే ఇంకో చిట్కా. మీ బ్లాగులో యాడ్స్‌ ఉంచటానికి అనుమతిస్తే చాలు. ఎవరైనా ఆ లింకును క్లిక్‌చేసిన ప్రతిసారీ మీ అకౌంట్లో సొమ్ము జమ అవుతుంటుంది. ఎవరో యాడ్‌ ఇస్తారు... ఇంకెవరో దాన్ని క్లిక్‌ చేస్తారు... సొమ్ము మాత్రం మీకు! బాగుంది కదూ!
చెత్తనుంచి... 
మనకు పనికిరాని వస్తువు ఈ భూప్రపంచమ్మీద ఇంకెవరికీ పనికిరాదనుకోవడం అమాయకత్వం. ఉదాహరణకు... ఇంట్లో తాతలనాటి వస్తువులు కొన్నుంటాయి. వాటివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అలాంటివాటిని స్టోర్‌రూముల్లో మగ్గబెట్టే బదులు ఎంచక్కా ఓ ఫొటో తీసి www.ebay.inవంటి సైట్లలో పెట్టండి. ఆ వస్తువు కావలసిన వాళ్లు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కళ్లకద్దుకొని మరీ కొనుక్కుంటారు.

క్లిక్‌టుడే
చేతిలో డిజిటల్‌ కెమెరా ఉందా... బుర్రలో సృజనాత్మకత ఉందా! అయితే చలో, మీ ఫొటోను కొనుక్కునే సైట్లు చాలానే ఉన్నాయి. www.istock.com, dreamstime.com, shutterstock.com
లాంటి మైక్రోస్టాక్‌ ఫొటోసైట్లతో పాటు ఇంకా చాలా సైట్లు మీ ఫొటోలకు ధరచెల్లించి కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
టాలెంట్‌...
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, అక్కౌంటెన్సీ... ఏ రంగమన్నది కాదు ప్రశ్న. అందులో మీరెంత నిష్ణాతులన్నదే పాయింటు. మీరు ఫ్రీలాన్సింగ్‌ చేయడానికి సిద్ధమైతే చాలు. మీ సేవలను వినియోగించుకోవడానికి చాలా కంపెనీలే ఉన్నాయి. అలాంటి ఫ్రీలాన్సర్లనూ కంపెనీలనూ కలిపే ప్లాట్‌ఫాం లాంటి www.guru.com
'సదా మీ సేవలో' అంటున్నాయి.

'సర్వే'ధనా...
'ఫలానా సర్వేలో ఇలా తేలింది...
ఇంకో సర్వేలో అలా తేలింది' అని వార్తలొస్తుంటాయి కానీ ఎక్కడ జరిగాయో చాలాసందర్భాల్లో తెలీదు. ఆ తరహా సైకాలజీ, మార్కెటింగ్‌ తదితర సర్వేల్లో మీరూ పాల్గొనవచ్చు. వాళ్లడిగే సుత్తిప్రశ్నలకు సమాధానాలిస్తే చాలు. ఒక్కో సర్వే పూర్తవడానికి పావుగంట ఇరవై నిమిషాలు పడుతుందంతే! www.treasuretrooper.com, acop.com... వంటి సైట్ల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి మరి.

చదివినంతనే...
ఈ మెయిల్స్‌ చదివితే చాలు, మీ ఖాతాలో డాలర్లు పోగేస్తామంటాయి కొన్ని సైట్లు. అవన్నీ వాణిజ్యప్రకటనలకు సంబంధించిన మెయిళ్లు మరి. ఉదాహరణకు www.e-mailpaysu.com, cashread.com... ఒక్కో మెయిల్‌ చదివి అందులో ఉండే లింకును క్లిక్‌చేసి సంబంధిత సైట్‌ను చూస్తే చాలు, చదివింపులు అందజేసే కంపెనీలున్నాయి. కాకపోతే ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక మెయిల్‌ ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. స్పామ్‌ ఫిల్టర్లని తీసేసి అన్ని మెయిళ్లనూ ఆహ్వానించాల్సి ఉంటుంది.

వాడండి... చెప్పండి...
మార్కెట్లోకి కొత్తగా ఏదైనా ఉత్పత్తి రాగానే వెబ్‌సైట్ల నిండా సమీక్షలు వెల్లువెత్తుతాయి. బాగుందనో బాగాలేదనో అస్సలు ఉపయోగంలేదనో అట్టర్‌ఫెయిల్యూరనో... ఎవరు రాస్తారు వాటిని? ఎవరు రాస్తే ఏంటి... అయినా ఎవరో రాసింది ఎందుకు చదవాలి... www.reviewstream.com లాంటి సైట్లు మనకు బంగారం లాంటి అవకాశాన్ని కల్పిస్తుండగా..! మనమే సమీక్ష రాస్తే పోలా?మన రివ్యూ ప్రచురితమైందా... ఎంతోకొంత జేబులో పడ్డట్టే.
లలలాం... లలలాం... లక్కీచాన్సు కదా!
...ఇంతేనా, అన్న నుంచుంటే మాస్‌
అన్న కూచుంటే మాస్‌ అన్నట్టు, మీరు నెట్‌లో ఆట ఆడినా డబ్బులే అందమైన బొమ్మగీసినా డబ్బులే! పదండి మరి నెట్‌ప్రపంచంలో విహరించండి. 'సమ్‌'పాదన వెుదలెట్టండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి