మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

ONLINE DATING

ఈ-స్నేహాలు (Online Dating)

ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. నెట్‌తో అనేక పనులు వేగంగా అవుతున్నాయి. అందులో చాటింగ్‌ (నెట్‌ సహాయంతో త్వరగా సందేశాన్ని పంపించడం) ఒకటి. ఈ చాటింగ్‌ వల్ల ఆప్తమిత్రులుగా మారినవారు ఎందరో ఉన్నారు.అదే విధంగా కులాలు, మతాలు, దేశ సరి‘హద్దు’లు దాటి పెళ్లి చేసుకున్న వారున్నారు.
 
 
2. చాటింగ్‌, ఆన్‌లైన్‌ డేటింగ్::‌ పేరుతో కొన్ని వెబ్‌ సైట్లు యువత సొమ్ముకి వల వేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి భవితకు బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత ఈ మత్తులో పడి చిత్తవుతున్నారు. ఇలాంటి సైట్లకు బానిసలుగా మారుతున్నారు. ఇలా మోసపోయే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అందువల్ల నెట్‌ స్నేహాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు
 
3.ఫ్రెండ్‌షిప్‌, డేటింగ్‌, పేర్లతో ఇంటర్నెట్‌ ఈ - వేశ్యాగృహాలకు వేదికగా మారుతోంది. యువతలోని మానసిక బలహీనతలను సొమ్ము చేసుకుం టున్న సైట్లు, సంస్థలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరిట వస్తున్న వెబ్‌ సైట్లు, ఫోన్‌లో స్నేహం పేరుతో వచ్చే ప్రకటనలు యువతను నమ్మించి మోసం చేస్తున్నాయి. వేల మంది ఇలాంటిి వాటి బారిన పడి మోస పోతున్నారు. జేబులు ఖాళీ అవ్వడం ఒక ఎత్తయితే, ఆ ధ్యాసలో పడ్డవారు తేరుకోవడానికి మానసిక నిపుణుల చుట్టూ తిరగవలసి వస్తోంది.
4.స్నేహాన్వేషణ పేరుతో...::వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజలు మన రాష్ట్రంలో ప్రత్యక్షమవుతున్నారు. వారితో డేటింగ్‌ చేయడానికి మన కుర్రకారు కొంతమంది ఆసక్తి చూపిస్తారు. దీనిని ఆసరాగా తీసుకుని వెబ్‌సైట్లు వల పన్నుతున్నాయి.స్నేహాన్వేషణ పేరుతో వస్తున్న వెబ్‌సైట్లు మొదట్లో ఉచిత సభ్యత్వమంటూ మోసపూరిత ప్రకటనలిస్తున్నా యి. ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే కోరిన నగరంలో కావాల్సిన వయోపరిమి తిలో జంటను వెతికే సదుపాయం కల్పిస్తామని తెలియజేస్తారు. తరువాత సద రు అమ్మాయికి మెయిల్‌ పంపే సమయంలో మెంబర్‌షిప్‌నకు రుసుం చెల్లించా లని సభ్యత్వం తీసుకున్న వారికి సందేశాలు ప్రత్యక్షమవుతున్నాయి. మీ ప్రొఫైల్‌ పట్ల మీ పరిసరాల్లోని 50 మంది ఆమ్మాయిలు ఆకర్షితులయ్యారు.ఎదురు చూస్తున్నారు అంటూ ఈ - మెయిళ్ల పరంపర కొనసాగుతుంది.

5.వీఐపీ, గోల్డ్‌, సిల్వర్‌, స్టాండర్డ్‌ పేర్లతో ::ఉన్న సభ్యత్వాల్లో తక్కువ రుసుంతో దొరికే దానికి క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బు చెల్లిస్తారు. అప్పుడు వారికి చుక్కెదు రవుతుంది. మీరు చేరిన సభ్యత్వాలు సరిపోవు... పై స్థాయి సభ్యత్వాలు తీసుకోవాలనే మెయిల్స్‌ వస్తాయి. ఇటువంటి మెయిల్స్‌ రావడం కొందరికి జరుగుతాయి. మరికొంత మంది సభ్యులకు ఎటువంటి మెయిల్స్‌ రావు. అందుకు సభ్యులు పిచ్చిగా అమ్మాయిల కోసం సెర్చింగ్‌ చేయడం తప్పితే ఎలాంటి ఫలితం ఉండదు. సదరు సభ్యుడికి చివరకు మిగిలేది క్రెడిట్‌ కార్డు బిల్లు, విలువైన సమ యం వృథా తప్పితే ఒరిగేదేమీ ఉండదు. ఇలా పలు ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లలో వేలాది మంది యువకులు ఆర్షితులవుతున్నారు.

                      ‘ఆరు నెలల క్రితం ఓ సైట్‌లో సభ్యత్వం తీసుకున్నాను. తీరిక సమ యాల్లో సైట్‌లోకి వెళ్లి చూస్తుండేవాడిని. అందులో అమ్మాయిలతో స్నేహం చేయిస్తామని చూసి క్రెడిట్‌ కార్డు ద్వారా కొంత చెల్లిం చాను. ఒకసారి డబ్బులు అందగానే సైట్‌ వారు పలు రకాలుగా ఊరించడంతో మరికొంత డబ్బు చెల్లించాను. డబ్బు ఖర్చు అయ్యిందే తప్ప ఎటువంటి ఫలితం లభించకపోవడంతో చివరికి నేను మోస పోయానని తెలుసుకున్నాను

7.పట్టించుకోవడం లేదు...కొద్ది రోజుల క్రితం నాకు ఓ మెయిల్‌ వచ్చింది. అందులో తమ వెబ్‌సైట్‌లో ఉచిత సభ్యత్వం తీసుకున్నవారికి ఫ్రెండ్స్‌ను వెతికి పెడతామని పేర్కొన్నారు. సరదాగా ఉంటుందని ఆ సైట్‌లో సభ్య త్వం తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రతి రోజు కనీసం పది మెయిల్స్‌ ఆ సైట్‌ నుంచి వస్తున్నాయి.పలువురు అమ్మాయిల ఫొటోలను చూపిస్తూ మీతో స్నేహం చేసేందుకు వీరంతా ఎదురు చూస్తున్నారనీ అందులో పేర్కొన్నారు. కానీ వారితో ఛాటింగ్‌ చే యాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత నా ఫ్రెండ్‌కు ఈ విషయం గురించి చెబితే ఆ సైట్లు యువకుల నుంచి డబ్బులు లాగేందుకు ఇలా చేస్తుంటా యని వాటిని పట్టించుకోవద్దని చెప్పాడు. అప్పటి నుంచి నాకు వస్తున్న మెయిల్స్‌ను పట్టించుకోవడం లేదు’
8.ఫ్యామిలీ మహిళలని...::: కొన్ని ఆంగ్ల పత్రికల్లో ఫ్రెండ్‌షిప్‌ పేరిట ప్రకటనలూ ఈ తరహా మోసగించేవే. మొదట సదరు ఫోన్‌ నంబరు (ముంబై, ఢిల్లీకి చెం దినవి)కు ఫోన్‌ చేస్తే, ఏ ప్రాంతంలో ఉంటారు? తదితర వివరాలు తీసుకుని, ఓ కోడ్‌ నెంబరు ఇస్తారు. ఒక అకౌంట్‌ నెంబరు ఇచ్చి, దాంట్లో రూ. 5 వేల నుంచి రూ. 10 వేలవరకు జమచేయాలని సూచిస్తారు. డబ్బు జమచేయగానే, క్లాస్‌ ఫ్యామిలీలకు చెందిన మహిళలవంటూ స్థానిక సెల్‌ నెంబర్లు (ఒకటి, రెండు) ఇస్తారు. వాటిని సంప్రదించిన వారికి ఆ తర్వాత గానీ అవి సెక్స్‌ వర్కర్లవని తెలియదు.
 
9.ఆశ్లీల సాహిత్య పంపిణీ... :::ఆన్‌లైన్‌లో ఆర్కూట్‌, బ్లాగ్‌స్పాట్‌ వంటి సైట్లు యూజర్లకు కమ్యూనిటీలు, బ్లాగ్‌లు ఏర్పాటు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ కమ్యూనిటీలు, బ్లాగ్‌లు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు రీసెర్చ్‌ స్కాలర్లను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి జ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదపడుతున్నాయి. ఇలా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి ఇవి. కానీ కొన్ని ఇటువంటి వెబ్‌సెట్లు అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ - వేశ్యాగృహాల నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం విజ్ఞానం విషయాన్ని పక్కన పెడితే, చాలా సైట్లలోని బ్లాగ్‌లు, కమ్యూనిటీల్లో అశ్లీలం విచ్చలవిడిగా ప్రచార మవుతోంది.

10.ఉన్నత చదువులు చదివి భవితకు బంగారు::: బాటలు వేసుకోవాల్సిన యువత ఈ మత్తులో పడి చిత్తవుతున్నారు. ఇలాంటి సైట్లకు బానిసలుగా మారుతున్నారు. మోసపోయినవారు బయటి చెప్పు కోలేకపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయినా ఇబ్బందిలేదు కాని మానసికంగా కృంగిపోవడంతో యువత జీవితాలు దెబ్బతింటున్నాయి. ఈ సైట్లను తిలకించే వ్యసనానికి గురవుతున్న యువకులు కలల లోకంలో విహరిస్తున్నారు. మసిపూసి మారెడు కాయ చేస్తున్న వెబ్‌సైట్ల మూలంగా యువకులు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద లోకాల్లో విహరించాలని ఇలాంటి వెబ్‌సైట్లను, ఇతరుల మాటలను నమ్మవద్దని యువతకు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి