బుధవారం, సెప్టెంబర్ 14, 2011

G,2G,3G,4G

1G,2GG, 3GGG .......Next 4G గురించి ,

వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మించిన దానిని 'ఫోర్త్ జనరేషన్'(4జి)గా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా వ్యవస్థలో సమాచార వేగమే అత్యంత ప్రధానమైనది. వాయిస్, డేటా, మల్టీమీడియా.. ఏ రూపంలో ఉన్న సమాచారమైనా.. అత్యంత వేగంగా ఎప్పుడైనా, ఎక్కడైనా బదిలీ చేయగలగడం 4జి సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత. ఇది పూర్తిగా ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది.

ఈ రకం వ్యవస్థలో వైరుతో కూడిన, వైరు రహిత సాంకేతిక పరిజ్ఞానం రెండూ కలిసిపోయి ఉంటాయి. ఈ 4జి సాంకేతిక పరిజ్ఞానం గనక మనకు అందుబాటులోకి వస్తే ఇంట్లో లేదా ఆఫీసులో సెకనుకు 100 మెగా బైట్లు, అదే బయటి ప్రదేశాలలో అయితే సెకనుకు 1 గిగాబైట్ వరకు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్, మల్టీమీడియా మెసేజింగ్ సర్వీస్, వీడియో చాట్, మొబైల్ టివి, హై డెఫినిషన్ టివి వంటి సదుపాయాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకోవచ్చు. వీడియో పాటలే కాదు అధిక జిబి ఉన్న సినిమాలను సైతం క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంత వేగం(స్పీడ్)?
ప్రస్తుతం అమలులో ఉన్న 2జి మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సెకనుకు 9.6 కిలోబైట్ల సమాచారాన్ని, 3జి మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సెకనుకు 200 కిలోబైట్ల సమాచారాన్ని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలం. ఎప్పుడైనా నెట్‌వర్క్‌ల మధ్య లోడ్ పెరిగినా, ఏదైనా ఒక ప్రదేశంలో అధిక సంఖ్యలో మొబైల్స్ ఒకేసారి డేటాను డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు ఈ స్పీడు కొంత వరకు తగ్గవచ్చు. అయితే 2జి కంటే 200 రెట్లు అధిక వేగంతో, 3జి కంటే పది రెట్లు అధిక వేగంతో 4జి సాంకేతిక పరిజ్ఞానంలో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 4జిలో సెకనుకు 20 మెగాబైట్ల చొప్పున సమాచారాన్ని అప్‌లింక్ చేయవచ్చు. ప్రస్తుతమున్న సాధారణ ఎసిమెట్రిక్ డిజిటల్ సబ్‌స్క్రయిబర్ లైన్ ద్వారా అప్‌లింక్ అయ్యే సమాచారంతో పోల్చుకుంటే ఇది 10-20 రెట్లు అధికం.

ప్రాచుర్యంలోకి 'మొబైల్ విఓఐపి'..(MOBILE వోఇప్)
లండన్ కేంద్రంగా పరిశోధనలు జరుపుతున్న ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.. 2012 ఏడాది ఆఖరుకల్లా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో మొబైల్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఎంవిఓఐపి) ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రపంచవ్యాప్తంగా వాయిస్ ఓవర్ 3జి వైర్‌లెస్ వినియోగించే వారి సంఖ్య శరవేగంగా పెరుగుతుండడం, ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్‌వర్క్‌లతో పోల్చుకుంటే చౌక ధరలో ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సేవలు లభించడమే దీనికి కారణం.

దీనిని బట్టి భవిష్యత్తులో మొబైల్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సదుపాయం మరింత ప్రాచుర్యంలోకి వస్తుందని టెలికాం నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే స్కైప్, ట్రు ఫోన్, ఫ్రింగ్ వంటివి 3జి మొబైల్ హ్యాండ్‌సెట్స్, 3జి సౌకర్యం కలిగి ఉన్న ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్ ద్వారా విఓఐపి సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న మొబైల్ కాల్ రేట్ల కంటే కూడా మరింత చౌక ధరలకు ఈ విఓఐపి సేవలు లభించడం వల్ల భవిష్యత్తులో మొబైల్ వినియోగదారులకు ఈ రకం సేవలు ఒక వరమే!

'హెచ్ఎస్‌డిపిఎ'తో అధిక వేగం, సామర్థ్యం
ఇక హైస్పీడ్ డౌన్‌లింక్ పాకెట్ యాక్సెస్(హెచ్ఎస్‌డిపిఎ) అనేది థర్డ్ జనరేషన్ మొబైల్ టెలిఫోన్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ప్రొటోకాల్. యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ సిస్టం(యుఎంటిఎస్) కింద ఏర్పడే నెట్‌వర్క్‌ల మధ్య అత్యంత వేగంతో అధిక సామర్థ్యం కలిగిన డేటా ట్రాన్స్‌ఫర్ అవడం ఈ సదుపాయం ద్వారా సాధ్యమవుతుంది. అంటే.. 3జి హ్యాండ్‌సెట్లలో మాత్రమే ఈ రకమైన సౌకర్యం ఉంటుంది. 2జి హ్యాండ్‌సెట్లు కలిగి ఉండే మొబైల్ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోలేరు. ఈ సదుపాయం ద్వారా ప్రస్తుతం సెకనుకు 1.8, 3.6, 7.2, 14.4 మెగాబైట్స్ వరకు సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ వేగం, సామర్థ్యం మరింత పెరుగుతాయని విశ్లేషకుల అంచనా.

- వాయిస్, డేటా, మల్టీమీడియా.. ఏ రూపంలో ఉన్న సమాచారమైనా.. అత్యంత వేగంగా ఎప్పుడైనా, ఎక్కడైనా బదిలీ చేయగలగడం 4జి సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత.

- ఈ 4జి సాంకేతిక పరిజ్ఞానం గనక మనకు అందుబాటులోకి వస్తే ఇంట్లో లేదా ఆఫీసులో సెకనుకు 100 మెగా బైట్లు, అదే బయటి ప్రదేశాలలో అయితే సెకనుకు 1 గిగాబైట్ వరకు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు.

- వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్, మల్టీమీడియా మెసేజింగ్ సర్వీస్, వీడియో చాట్, మొబైల్ టివి, హై డెఫినిషన్ టివి వంటి సదుపాయాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకోవచ్చు.

- వీడియో పాటలే కాదు అధిక జిబి ఉన్న సినిమాలను సైతం క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విస్తరిస్తున్న 'వైఫై'వి-ఫై'!
వైర్‌లెస్ ఫిడిలిటీని సంక్షిప్తంగా 'వైఫై'గా పిలుస్తారు. ఈ అప్లికేషన్ ఇన్‌బిల్ట్‌గా ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు వైరు లేకుండానే ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోగలుగుతాయి. అయితే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలాకాలం వరకు మొబైల్ హ్యాండ్‌సెట్ కంపెనీలు దీనికి దూరంగా ఉన్నాయి. ఎప్పుడైతే యాపిల్ ఐఫోన్ వైఫై సదుపాయంతో మార్కెట్‌లోకి వచ్చిందో అప్పట్నించి ఇతర కంపెనీలన్నీ ఈ పరిజ్ఞానం వైపు దృష్టి సారించాయి.

ఎలక్ట్రానిక్ డివైజెస్ మధ్యన వైర్‌లెస్ కమ్యూనికేషన్ కోసం అంతకుముందు బ్లూటూత్ పరిజ్ఞానాన్ని ఉపయోగించే వారు. అయితే దీని పరిధి చాలా తక్కువ. అదే వైఫై పరిజ్ఞానం ద్వారా అయితే వంద మీటర్ల పరిధిలో వైఫై సదుపాయంతో కూడిన అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవడానికి వీలవుతుంది. దీని ఉపయోగం తెలిసిరావడంతో ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న హైఎండ్ మొబైల్స్ అన్నిటిలోనూ వైఫై సదుపాయం ఇన్‌బిల్ట్‌గా అమర్చుతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి