మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

Game సిడి/డివిడిలు పాడవకుండా

game-jackal_2

భారీ స్థాయి గ్రాఫిక్స్ తో కూడిన గేమ్స్ ఆడేవారు ఆయా గేమ్ సిడి, డివిడిలను పలుమార్లు డ్రైవ్ లో పెట్టి తీస్తుండడం వల్ల, గేమ్ ఆడే సమయంలో సిడి నుండి డేటా స్ట్రీమ్ అవుతుండడం వల్ల ఆయా సిడి/డివిడిల జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది . అలాగే అలా గంటల తరబడి సిడి నుండి డేటా రీడ్ చెయ్యబడుతూ ఉండడం వల్ల డ్రైవ్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో Game Jackal Pro అనే ప్రోగ్రామ్ లో లభించే Image mode మనం డ్రైవ్ లో ఇన్ సర్ట్ చేసిన గేమ్ ని ఒక image రూపంలో హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసి ప్రతీసారీ ఆ సిడి/డివిడి ఇన్ సర్ట్ చెయ్యవలసిన అవసరం లేకుండా ఆ గేమ్ ని నేరుగా హార్డ్ డిస్క్ నుండి ప్లే చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. అదీగాక ఇందులో ప్రతీ గేమ్ ని మన ఇష్టాఇష్టాలను బట్టి profiles క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గేమ్ లోని కొన్ని సదుపాయాలను మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా ఈ profiles లో సెట్టింగులు చేసుకోవచ్చు. గంటల తరబడి గేమ్స్ పై గడిపే పిల్లలున్న ఇళ్లలో పిల్లలకు కొన్ని సదుపాయాల వరకూ పరిమితం చేసేలా ఈ సెట్టింగ్ ఉపయోగపడుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి