మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా బూటింగ్ లో OS ఎంచుకునే మెనూ వస్తుంటే..

మీ కంప్యూటర్లో XPని ఏ కారణం చేతైనా రీ ఇన్ స్టాల్ చేసిన తర్వాత.. మీ సిస్టమ్ లో కేవలం పనిచేసేది ఒకే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ.. కంప్యూటర్ ని ఆన్ చేసిన తర్వాత బూట్ మెనూలో రెండు ఎంట్రీలు చూపించబడుతూ ఏదో ఒక దాన్ని ఎంచుకోవలసి వస్తున్నట్లయితే రీ ఇన్ స్టాల్ చెయ్యకముందు మీ సిస్టమ్ లో ఉన్న XP ఎంట్రీ కూడా అలాగే ఉండిపోయిందని భావించాలి. అది పనిచెయ్యకపోయినా దాని ఆప్షన్ మాత్రం బూటింగ్ సమయంలో చూపించబడుతూ ఉంటోంది. సో ఆ invalid (పనిచెయ్యని) ఎంట్రీని తొలగించడానికి క్రింది విధంగా చేయండి.

ఈ స్టెప్ లు ఫాలో అవండి:

1. Start>Run కమాండ్ బాక్స్ లో msconfig అని టైప్ చెయ్యండి.
2. వెంటనే స్క్రీన్ పై System Configuration Utility అనే విండో ఓపెన్ అవుతుంది.
3. అందులో BOOT.INI అనే విభాగంలోకి వెళ్లి Check All Boot Paths అనే బటన్ ని క్లిక్ చేయండి.
4. వెంటనే పై చిత్రంలో విధంగా ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమై invalid ఆపరేటింగ్ సిస్టమ్ పాత్ ని చూపిస్తుంది.
5. ఆ ఎంట్రీని రిమూవ్ చెయ్యడానికి కన్ఫర్మేషన్ తెలియజేసిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చెయ్యండి.

దీంతో ఇకపై boot menu చూపించబడకుండానే ఉన్నది ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేరుగా ఆ OSలోకి బూటింగ్ జరుపబడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి