మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

ఫెయిలైన సిడి ఇక పనికిరాదా?

సిడి రైటర్ ద్వారా ఒక సిడిని రైట్ చేసేటప్పుడు పలు దశల్లో సిడి ఫెయిలయ్యే అవకాశముంది. సిడి రికార్డింగ్ ప్రారంభమయ్యే సమయంలో సిడి initialize అయ్యేటప్పుడు ఫెయిలైనట్లయితే ఆ సిడి ఇకపై పనికిరానట్లే లెక్క. Sony కంపెనీకి చెందిన కొన్ని రైటర్లు Repair disc అనే సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. సిడి మొత్తం రికార్డ్ చెయ్యబడి సెషన్ మాత్రం క్లోజ్ అవకుండా సిడి ఫెయిలైనట్లు చూపిస్తున్నట్లయితే ఈ repair disc సదుపాయం క్లోజ్ అవకుండా సిడి ఫెయిలైనట్లు చూపిస్తున్న సెషన్ ని బలవంతంగా క్లోజ్ చేసేస్తుంది. Repair disc ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఇప్పటికే సిడిలో ఉన్న సెషన్ లో ఏమైనా డేటా ఉంటే అది పూర్తిగా నిరుపయోగంగా మారిపోతుంది. అయితే దానికి బదులు ఖాళీగా ఉన్న ప్రదేశంలో అదనంగా మరో సెషన్ ఓపెన్ చెయ్యబడుతుంది. సిడి ఫైనలైజ్ అయ్యే సమయంలో ఏర్పడే వైఫల్యాలను సరిదిద్దే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాల్లో TOC (Table Of Contents) సిడి ఫెయిలైపోవడానికి ముందే సిడిలోకి రాయబడుతుంది. అలాంటప్పుడు సిడి రికార్డింగ్ సాఫ్ట్ వేర్ లోని Finalise disc లేదా close session వంటి ఆప్షన్లని ఉపయోగించి ఫెయిలైన సిడిని సరిదిద్దవచ్చు. సిడి రైటింగ్ సగంలో ఉండగా ఫెయిల్యూర్ మెసేజ్ దర్శనమిచ్చినట్లయితే.. అప్పటివరకూ రికార్డ్ అయిన సమాచారం మాత్రమే సిడిలో మిగిలి ఉంటుంది. ఇకపోతే Disc-at-once మోడ్ లో రికార్డ్ చేస్తున్న సిడిలు రైటింగ్ జరుగుతుండగా అర్థాంతరంగా ఫెయిలైనట్లయితే అప్పటివరకూ రైట్ చెయ్యబడిన పాటలు ఏ ఇబ్బందీ లేకుండా మామూలు ఆడియో సిడి ప్లేయర్లలో ప్లే అవుతాయి. ఎందుకంటే Disc-at-once మోడ్ లో TOC రికార్డింగ్ ప్రారంభంలోనే సిడిపై సృష్టించబడుతుంది. ఫెయిలయ్యేసరికి రికార్డ్ చెయ్యబడకుండా మిగిలి ఉన్న సాంగ్స్ మాత్రం సిడిలో స్థానం పొందలేవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి