మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

ప్రింటర్ రిజల్యూషన్ గురించి తెలియని విషయాలు

ప్రింటర్ యొక్క ప్రింటింగ్ నాణ్యతను రిజల్యూషన్ రూపంలో అంచనా వేస్తారని చెప్పుకుంటుంటాం. కానీ ఎప్పుడైనా ప్రింటర్ రిజల్యూషన్ గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించారా? 600, 1200 dpiల ప్రమాణంలో మనం చెప్పుకునే రిజల్యూషన్ ఒక చదరపు అంగుళంలో ఎన్ని చుక్కలు ముద్రించబడతాయన్నది తెలియజేస్తుంది. ఉదా.కు.. 600 dpiనే తీసుకుంటే పేపర్ పై ఒక చదరపు అంగుళానికి 600×600 (అంటే 3,60,000) చుక్కలను ప్రింటర్ ప్రింట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. పాతతరం ప్రింటర్లలో ప్రింట్ చేసిన పేపర్ ని నిశితంగా పరిశీలించినట్లయితే అక్షరాలకు అంచుల వద్ద ఎగుడుదిడుగులు కన్పిస్తుంటాయి. దీనికి కారణం అప్పటి ప్రింటర్లన్నీ చుక్కలను ప్రింట్ చేసేటప్పుడు ఒక క్రమపద్ధతిని అనుసరించేవి. దాంతో అక్షరాల అంచులు కొట్టేసినట్లు ప్రింట్ అయ్యేవి. ఈ లోపాన్ని అధిగమిస్తూ HP సంస్థ Resolution Enhancement అనే పద్ధతిని అభివృద్ధి చేసింది. దీనివల్ల ఇంక్ జెట్, లేజర్ జెట్ ప్రింటర్ల ద్వారా ప్రింట్ తీసుకునేటప్పుడు అక్షరాల అంచుల వద్ద ఏమైనా ఖాళీ స్థలాలు, ఎగుడుదిగుడులు కన్పించినట్లయితే ఆటోమేటిక్ గా ప్రింటర్ ఆయా ప్రదేశాల్లో చిన్న చిన్న చుక్కలను ప్రింట్ చేస్తుంది. దీంతో అక్షరాలు స్మూత్ గా ఉన్నట్లు కన్పిస్తాయి. ఇతర ప్రింటర్ తయారీ సంస్థలూ Edge Enhancement వంటి ఇతర పేర్లతో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి