మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

This copy of Windows is not Genuine సమస్యకి మరో పరిష్కారం

తమ కంప్యూటర్లో This copy of Windows is not genuine.. You may be a victim of software counterfeitng.. అనే వార్నింగ్ మెసేజ్ వస్తోందని ఇటీవలి కాలంలో చాలామంది చెబుతున్నారు. ఈ అంశంపై చిన్న చిట్కాని రాద్దామని అనుకుంటూ కొంతకాలంగా వాయిదా వేస్తూ వస్తున్నాను. ఈ నేపధ్యంలో “కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం” మిత్రులు మహేష్ రెడ్డి గారు ఈ పోస్టులో ఈ అంశం గురించి ఒక మార్గం చెప్పారు. అదీ ఫాలో అవ్వొచ్చు. లేదా థర్డ్ పార్టీ టూల్ ఏదీ డౌన్ లోడ్ చేసుకోకుండా ఆ వార్నింగ్ మెసేజ్ ని అధిగమించాలంటే ఇప్పుడు చెప్పినట్లు చేయండి.

1. My Computer>Tools>Folder Options లోకి వెళ్లండి. అందులో View అనే విభాగంలో Hide extensions for known file types అనే ఆప్షన్ ని టిక్ తీసేసి Apply ఆ తర్వాత OK కొట్టండి.
2. ఇప్పుడు My Computer ద్వారా C:\Windows\System32 ఫోల్డర్ లోకి వెళ్లండి. అందులో wgatray.exe అనే ఫైల్ ని వెదికి పట్టుకుని .exe అని చివర్న ఉన్న తోకను కాస్తా old గా మార్చండి. అంటే wgatray.exe పేరు wgatray.oldగా మారిపోవాలన్నమాట.
3. అదే మాదిరిగా Windows>System32 ఫోల్డర్ లోనే ఉన్న wgalogon.dll అనే ఫైల్ ని wgalogon.oldగా మార్చాలి. అంటే ఫైల్ పేరుని మార్చిన తర్వాత దాని పేరు wgalogon.old అనే మాదిరిగా ఉండాలన్నమాట.

అంతే సిస్టమ్ ని రీస్టార్ట్ చెయ్యండి. ఇకపై ఇప్పటివరకూ మీకు చికాకు పెడుతున్న వార్నింగ్ మెసేజ్ లు రావు.

వివరణ: విండోస్ జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడని కంప్యూటర్లలో ఈ మెసేజ్ కన్పిస్తుంది. Windows Update ఎనేబుల్ చెయ్యబడి నెట్ కి కనెక్ట్ అయినప్పుడు Automatic updates ద్వారా Windows Genuine Advantage Validation అనే చిన్న ప్రోగ్రామ్ మైక్రోసాఫ్ట్ సైట్ నుండి మీ కంప్యూటర్లోకి డౌన్ లోడ్ చెయ్యబడి మీ సిస్టమ్ లో ఉన్న Windows కాపీ అసలైనదో, నకిలీదో తనిఖీ చేసి, నకిలీదని తేలినట్లయితే ఇలా వార్నింగ్ చూపిస్తుంది. అయితే ఇక్కడ పైన చెప్పిన పద్ధతి ద్వారా ఈ వార్నింగ్ కన్పించకుండా చేయగలుగుతున్నాం తప్ప వార్నింగ్ మాయమైనంత మాత్రాన మనం వాడుతున్న వెర్షన్ జెన్యూన్ అయిపోయినట్లు కాదని గ్రహించగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి