మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

RSM/ATOM FEEDS

RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?

లక్ష్యం: 
రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. ‌RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
ఉదాహరణకి ఈ సైటునే తీసుకుందాం. ఫీడు లంకెలు ఎక్కడున్నవి, ఎన్నున్నవనే విషయాలు రెండు విధాలుగా తెలసుకోవచ్చు. మీ విహారిణిలో చిరునామా పెట్టె(అడ్రస్ బార్)లో కుడిచేతి వైపు నారింజ రంగులో ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది నొక్కితే ఆ సైటుకి ఎన్ని ఫీడ్లు లభ్యత ఉంటే అన్నీ చూపిస్తుంది. లేదా ఆ సైటు వారే సైటులో ఏదో ఒక చోట ఫీడులంకెలు ఉంచుతారు. టెక్‌సేతుకి మూడు రకాల ఫీడ్లు ఉన్నాయి. మీ విహారిణి చూపించే నారింజరంగు ఫీడు ఐకాన్ మీద నొక్కితే ఆ మూడూ కనిపిస్తాయి. సైటులో పైన ఉన్న పట్టీలో కూడా(కుడివైపు ఉన్న నారింజరంగు బొమ్మ) ఫీడు లంకె ఉంచాము, అయితే లో ్లేి్గా సరిపోక ఒక్క ఫీడు మాత్రమే పెట్టడం జరిగింది. దాని మీద నొక్కినా సరే మీకు ఫీడు లంకె దొరికినట్టే.
ఈ ఫీడ్లు అనేక రకాలుగా చదువుకోవచ్చు. సరాసరి విహరినిలోనే వాటిని భద్రపరుచుకొని అప్పుడప్పుడు నొక్కి కొత్తగా ఎమొచ్చిందో తెలుసుకోవచ్చు. లేదా, గూగుల్ ఫీడు రీడర్ లాంటి ఉపకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి. ఫీడు లంకె మీద నొక్కినపుడు, ఆ ఫీడు చదవడానికి గాను, విహారిణి మీకు వివిధరకాల ఆప్షన్లు చూపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి అందులోనించి ఒకటి ఎంచుకోండి. ఇక ఏ చింతా లేకుండా సంతోషంగా బోల్డన్ని సైట్లు అందించే సమాచారాన్ని సునాయాసంగా చదువుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి