మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

POCKETMONEY THROUGH INTERNET

ఇంటర్నెట్ ద్వారా పాకెట్‌ మనీ(Pocket Money) సంపాదన -Slow and Steady Wins the Race


పాశ్చాత్య దేశాల్లో పట్టుమని పదేళ్లు నిండని కుర్రాళ్లు సైతం -పాకెట్‌మనీ ని ఎడంచేత్తో సంపాదిస్తారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది.కాదు, ఇంటర్నెట్టే కాలాన్ని మార్చేసింది. ఇప్పటి జనరేషన్‌కు ఇంటర్నెట్ -పాలిచ్చే ఆవులాంటిది. ఎంత పాటు కు అన్ని పాలు పిండుకోవచ్చని -నెట్టింటి సంపాదనకు అలవాటుపడిన ఎవ్వర్నడిగినా చెప్తారు.

అయితే, ఇంటర్నెట్‌లోకి ఎంటరై -ఆన్‌లైన్(Online) సంపాదన ఎలా? నెట్టింట్లో కూర్చునే ఎలా సంపాదించుకోవచ్చు? -లాంటి ఆర్టికల్స్(Articles) చదివేవాళ్లు అక్కడే ఆగిపోతారు. ఆఫర్ల(Offer) భ్రమలను వదులుకుని, సంపాదనకు ఉన్న మార్గాలను అనే్వషించిన వాళ్లు మాత్రం సొంత ప్రయత్నంతో సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు.

అందుకే ఇంట్లో వాళ్ళకి చేయూతగా ఉంటూ తమ పాకెట్‌మనీ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. నెలకు రూ. 1000.00 నుంచి 10000.00 కు పైగా సంపాదిస్తున్నారు...మనసుంటే మార్గాలు అనేకం ఉంటాయి. మన హాబీలతో, మనకున్న తెలివితేటలతో సులభంగా Pocket Money నే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా మీవంతు సాయంగా అందించవచ్చు. ఈ-తరం యువతరానికి చెప్పలేనన్ని, చెప్పకూడనన్ని ఖర్చులు. అలాంటి పరిస్థితుల్లో -ప్రతి రూపాయి కోసం అమ్మానాన్నల మీద ఆధారపడేకంటే ‘సంపాదన మార్గాల’పై దృష్టి పెట్టడం సరైన విధానం. ఇలాంటి ప్రయత్నం కుర్రకారులో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు, నలుగురిలో గౌరవాన్ని పెంచుతుంది. సంపాదన ప్రయత్నానికి ఇ  మార్గాలు.  ఎంచుకుని -పాకెట్‌మనీ పికప్ చేసుకోండి.

1.బ్లాగింగ్: యువతరానికి బ్లాగులు కొత్తకాదు. బ్లాగంటే తెలియని వాళ్లు, వాటిని సృష్టించడం రాదనే వాళ్లు బహుశ అరుదు. దీనికి ఎలాగూ పెట్టుబడి అవసరం లేదు కనుక, సొంతంగా బ్లాగ్ సృష్టించి అందులో సృజనాత్మక ఆలోచనలు, కవితాత్మక మూడ్స్ పొందుపర్చండి. అలా పేర్చిన ఒక్కో అక్షరం -ఏదోకనాటికి వటవృక్షమై కాపుకొస్తుంది. మీ బ్లాగు చూసేవాళ్ల సంఖ్య ఒకట్లు, పదుల నుంచి ఆరంభమై లక్షలకు చేరుతుంది. అలా పాపులరైన బ్లాగుకు -వ్యాపార ప్రకటనలు రావచ్చు. ఇతరుల ఉత్పత్తుల ప్రమోటింగ్, పెయిడ్ రివ్యూల రాయడం ద్వారా రాబడి పెరగొచ్చు. కావాల్సిందల్లా -ఆచరణ మాత్రమే.
                       బ్లాగ్‌ అనగా మనసులోని భావ వ్యక్తీకరణకు, వాటిపై జరిగే చర్చకు ఓ వేదిక మాత్రమే కాదు. డబ్బు సంపాదించే మార్గం కూడా. బ్లాగింగ్‌లను డబ్బు సం పాదించే ప్రక్రియగా మార్చుకోండి. మీ బ్లాగు లో వాణిజ్య ప్రకటనల కోసం గూగుల్‌ యాడ్‌సెన్స్‌, చిటికా తదితర ప్రకటన దారులతో భాగస్వామి కావ చ్చు. బ్లాగానుకూల ప్రకటనలు సంబంధిత కంపెనీ లు మీకు పంపుతాయి. క్లిక్‌ వంతునో, స్పందనను బట్టో డబ్బులు చెల్లిస్తాయి. ఖాళీ సమయాల్లో ఇలాం టివి చేయడం ద్వారా నెలకు రూ. 5,000లకు పైనే సంపాదించవచ్చు. ఒక్క రూపాయి దానం చేయడం నేర్పించేకన్నా రూపాయి సంపాదించడం నేర్పించ మన్నారు పెద్దలు. మీరు కూడా ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, మహానగరాలకు వచ్చి చదుకునే టప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా మీ పాకెట్‌ మనీని సమకూర్చుకోవచ్చు. 
Top 10 websites with which you can create a blog for free:

2.పెయిడ్ రైటింగ్: బ్లాగు నిర్వహణ కష్టమైతే -ఇతర బ్లాగులకు మీ రచనలు అందించండి. వెబ్‌లాగ్స్, హీలియం(http://www.helium.com), పే పర్ పోస్టు(payperpost.com)లాంటి బ్లాగులు ఎన్నో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఈ-బుక్(http://www.earn-from-ebooks.com/),సాఫ్ట్వేర్  జడ్గే (http://www.softwarejudge.com/users/syedrafiq)   రాసే ఆలోచనకు పదును పెట్టండి. భాషా నైపుణ్యం ఉన్న వాళ్లయితే కాపీ ఎడిటర్‌గానూ అవకాశాలు వెతుక్కోవచ్చు. అలాంటి సేవలకు వెబ్‌మాస్టర్లు నజరానాలు అందిస్తారు.

3.ఈ-ట్యూషన్లు:(http://www.2tion.net/)ఇంటర్‌నెట్‌లో పాఠాలు, సమాచార విప్లవం పతాకస్థాయికి చేరుకున్న రోజులివి. ఈ-ట్యూషన్లకు డిమాండ్ పెరిగింది. పాకెట్ మనీ సంపాదనకు ఈ-టీచింగ్ గొప్ప మార్గం. అనుభవం ఉన్న సబ్జెక్టులో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమన్న మాట. ట్యూటర్ విస్టా(www.tutorvista.com), ఈ-ట్యూటర్(www.e-tutor.com), స్మార్ట్ థింకింగ్(www.smarthinking.com), ట్యూటర్.కామ్(www.tutor.com)‌ లాంటి సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-టీచింగ్‌తో పేరు ప్రతిష్టలే కాదు, ఆదాయ మార్గాలకూ కొదవుండదు.ఈ రోజుల్లో ఇంటర్‌నెట్‌ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్‌ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్‌, కార్పోరేట్‌ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్‌ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి. .

4.మార్కెటింగ్ ఇన్‌కమ్:మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే చాలు -ఆన్‌లైన్ ఆదాయానికి అంతే ఉండదు. వివిధ కంపెనీల ఉత్పత్తులు వెబ్‌సైట్‌లోనో, ఈ-బే(www.ebay.in) ద్వారానో ప్రమోట్ చేస్తూ సాగించే అమ్మకాలకు భారీగానే కమిషన్లు అందుతున్నాయి. కమిషన్ జంక్షన్(www.cj.com), క్లిక్ బ్యాంక్(www.clickbank.com) లాంటి సైట్లు ఒక్కసారి చూసే సరి.

5.ఈ-వేలం ద్వారా(ఆన్‌లైన్‌లో అమ్మకాలు.): వివిధ కంపెనీల ఉత్పత్తులను ఈ-వేలంలో కొనుగోలు చేసి, వాటిని సరైన ధరకు అమ్మడం కూడా లాభసాటి వ్యాపారమే. రూపాయి పెట్టుబడి లేకుండా -‘ఈ’ తరహా వ్యాపారానికి ఇంటర్నెట్‌లో ఎన్నో మార్గాలు. ఇదే ఆదాయమార్గంగా మలచుకున్న వాళ్లూ ‘ఈ’రంగంలో ఎక్కువే. సెడూ.కో.యుకె, ఆఫ్టర్నిక్.కామ్,(www.afternic.com) ఈబే.కామ్ ‌లాంటి సైట్లను తరచూ చూస్తే విషయం మీకే అర్థమవుతుంది
                     ఇది కొంచెం టెక్నిక్‌ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్‌ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్‌ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్‌ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్‌, ఐఆఫర్‌(www.ioffer.com), అమె జాన్‌, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్‌ అనే ఆన్‌లైన్‌ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి.. 
Caution: కాకపోతే, ఈవిధమైన వ్యాపారానికి సరైన సైట్ ఎంచుకోకుంటే ఇబ్బందులు లేకపోలేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. జాగ్రత్త!

6.స్వేచ్ఛా వ్యాపారం: వృత్తిపరమైన నిపుణులకు స్వేచ్చా వ్యాపారం గొప్ప అవకాశం. అనేకానేక కంపెనీలు వినియోగదారులకు అర్థమయ్యేరీతిన వాటి ఉత్పత్తుల గుణగణాలు వివరించి, విశే్లషించేందుకు ఆన్‌లైన్‌లో మార్గాలు చూపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపార ప్రతిపాదనలు, ఆలోచనలు, ప్రతిపాదనలు.. ఇలా వేటినైనా అందించొచ్చు. ఎలాన్స్‌లాంటి వెబ్‌సైట్లు ఇటువంటి అంశాలను కవర్ చేస్తోంది. అలాగే, రెంట్‌ఎకోడర్(www.rent-acoder.com) లాంటి సంస్థలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ కు అవకాశం కల్పిస్తోంది.

7.ప్రకటనలు: మీకంటూ సొంతంగా వెబ్‌సైట్ ఉంటే, అందులోని కొంత స్థలాన్ని ప్రకటనలకు అమ్మేసుకోవచ్చు. మీ సైట్ విజిటర్లు ప్రకటనలను ఎన్నిసార్లు క్లిక్‌చేస్తే మీకు అంత రేటింగ్. రేటింగ్‌ను బట్టి ఆదాయం. గూగుల్ యాడ్‌సెన్స్(https://www.google.com/adsense/), బిడ్‌వెర్టిసెర్(www.bidvertiser.com), టెక్స్ట్ లింక్ యాడ్స్,(www.text-link-ads.com), బ్లాగడ్స్‌(www.blogads.com) లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి ఆదాయ మార్గాలు చూపుతున్నాయి.

8.జిపిటి వెబ్‌సైట్లు:(Get Paid To Websites) కుర్రకారు చూపిస్తున్న ఆసక్తితో గెట్ పెయిడ్ వెబ్‌సైట్లూ పెరుగుతున్నాయి. ఫ్రీ వెబ్‌సైట్, న్యూస్‌లెటర్, ప్లేయింగ్ గేమ్స్, ఆన్‌లైన్‌లో సర్వే(www.surveyclub.com) పత్రాలు నింపటంలాంటి అంశాలు ఈకోవలోనివే. నెట్‌పై అనుభవం లేనివాళ్లకూ జిపిటి వెబ్‌సైట్లు ఆదాయ మార్గాలు చూపుతున్నాయి.

9.సెర్చి ఇంజిన్ మార్కెటింగ్(SEM): కార్పొరేట్ సెక్టార్‌లోని ఎంఎన్‌ఎస్ వెబ్‌సైట్లను మార్కెట్ చేయాలంటే -సెర్చి ఇంజిన్ నిపుణలు అవసరం. ఆర్టికల్స్ రూపంలోనో, పత్రికలకు సమాచారం ఇవ్వడం, ఫోరం పోస్టింగ్, బ్లాగ్ పోస్టింగ్, సోషల్ బుక్ మార్కెట్ లాంటి అవసరాలు తీర్చే నిపుణులూ కావాలి. ఈ రంగంలో అనుభవం ఉంటే, సంపాదనే సంపాదన.

10.మార్కెటింగ్ ఆలోచనలు: ఆన్‌లైన్ అంశాల మీద ఆసక్తి పెరిగిన తరువాత -వెబ్‌సైట్ టెంప్లెట్,(www.onlineearning.org/) వర్డ్‌ప్రెస్ (బ్లాగ్) థీమ్స్‌కు క్రేజ్ పెరిగింది. వెబ్ డిజైనింగ్‌లో మంచి అనుభవముంటే, వెబ్ థీమ్స్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లోనే అమ్ముకోవచ్చు. టెంప్లెట్ మాన్‌స్టర్(www.templatemonster.com), థీమ్‌ఫారెస్ట్(themeforest.net)‌ లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అవకాశాలు అందిస్తున్నాయి.

11.ఫొటోల అమ్మకం: ఫొటోగ్రఫీ మీద ఆసక్తి కూడా -ఆన్‌లైన్‌లో ఆదాయమార్గమే. సృజనాత్మక చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముకోవడం ఇప్పుడొక ఫ్యాషన్ కూడా. ఫొటోలియా(us.fotolia.com), డ్రీమ్స్‌టైమ్(www.dreamstime.com), షట్టర్‌స్టాక్‌(www.shutterstock.com) లాంటి ఏజెన్సీలు -క్రియేటివ్ ఫొటోలను కొనుగోలు చేస్తున్నాయి.

12.పెట్టుబడులపై నిఘా: మీకు స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్‌ మ్యాజిక్‌ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి


 సపోర్టు సర్వీసింగ్, స్టాక్ ట్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌తో బ్రాండ్ క్రియేషన్, వర్ట్యువల్ అసిస్టెంట్లు, ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్లు, యుట్యూబ్, అప్లికేషన్ బిల్డింగ్.. ఇలా ఒకటేమిటి? కాస్త టైం కేటాయించాలే గానీ, పావలా పెట్టుబడి లేకుండా పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇంటర్నెట్ నిండా అవకాశాలే. కుర్రాళ్లూ.. నెట్టింట కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయకుండా, కాస్త పనికొచ్చే పాకెట్ మనీమీద దృష్టిపెట్టండి. ఆల్ ద బెస్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి