మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

TOP 10 BROWSERS

(Internet Browsers) -- Top 10 2011 Internet Browser Softwares


బ్రౌజరు గురించి క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పమంటే! ఇంటర్నెట్‌లో ఉన్న కోట్లాది వెబ్‌ పేజీలను మన కంప్యూటర్‌ ద్వారా చూడగలిగే సౌకర్యం కల్పించే సాఫ్ట్‌వేరే బ్రౌజర్‌. బ్రౌజర్‌ అంటే వెబ్‌పేజి కాదు! శోధన యంత్రం (సెర్చ్‌ ఇంజన్‌) కాదు! శోధన యంత్రం కూడా ఒక వెబ్‌ పేజీనే. వెబ్‌ బ్రౌజర్‌ అంటే ఒకప్పుడు కేవలం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మాత్రమే. ఓపెన్‌సోర్స్‌ ఉద్యమం మొదలైన తర్వాత ఉచిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్థి చెందడంతో ఇటీవల కాలంలో అనేక సాఫ్ట్‌వ్తేర్లు వాడుకలోకి వచ్చాయి. అనేక సంస్థలు బ్రౌజర్‌ సాఫ్ట్‌వేర్లను ఉచితంగానే అందిస్తున్నాయి. ముందు వరుసలో వున్న 10 బ్రౌజర్లేవంటే... ఫైర్‌ఫాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌... వంటివి. ఇవన్నీ తెలుగులో కూడా లభ్యమవుతున్నాయి వాటి వివరాలు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

 1.ఫైర్‌ఫాక్స్‌: మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కన్నా స్థిరంగా పనిచేస్తుండడం వల్ల ఎక్కువమంది నెటిజన్లు దీన్నే ఉపయోగిస్తున్నారు. తక్కువ మెమరీ తీసుకుంటుంది. వేగంగా పనిచేస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ను మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్‌ చేసుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. ముఖ్యంగా బ్రౌజర్‌ ద్వారానే అనేక పనులు చేసుకోవడానికి వీలుగా ఉచిత యాడ్‌ ఆన్స్‌లు లభిస్తున్నాయి.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

2.క్రోమ్‌: బ్రౌజర్ల ప్రపంచంలో ఇప్పటివరకూ ఫైర్‌ఫాక్స్‌ -ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ఇప్పుడు గూగుల్‌ వారి క్రోమ్‌ బ్రౌజర్‌ కూడా ప్రవేశించింది. ఫైర్‌ఫాక్స్‌లో వున్నన్ని ఫీచర్లు దీనిలో లేకపోయినా గూగుల్‌ సంస్థ అందిస్తున్న ఈ బ్రౌజర్‌ చాలా తేలికగా పనిచేస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ మాదిరిగానే వేగంగా పేజీలను ఓపెన్‌ చేయాలంటే గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఫైర్‌ఫాక్స్‌లో వున్న కొన్ని బ్రౌజర్‌ ఫీచర్స్‌ ఇందులో లేవు. ఈ బ్రౌజర్‌లో తెలుగుకి మంచి మద్దతు వుంది. ప్రధాన భాషగా తెలుగుని పెట్టుకోవచ్చు. తెలుగు యూనికోడ్‌ని కూడా బాగానే చూపుతుంది. అయితే బరహా, అక్షరమాల యూనికోడ్‌ టైపింగ్‌ టూల్స్‌ దీనిలో సరిగా పనిచెయ్యట్లేదు. ఫైర్‌ఫాక్స్‌లో మాదిరిగా పద్మ, ఇండిక్‌ ఇన్‌పుట్‌ ఎక్స్‌టెన్షన్‌ వంటి యాడాన్స్‌ సదుపాయం కూడా లేదు. దీన్ని www.google.com/chrome నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

3.ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌: ఒకప్పుడు ఇంటర్నెట్‌కు మారుపేరుగా నిల్చిన మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఇప్పుడు గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. అదేవిధంగా సాఫ్ట్‌వేర్‌ తయారీలో నెంబర్‌వన్‌గా వున్న మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ తయారీలోనూ వెనకబడివుంది. ఇంటర్నెట్‌సర్వీస్‌ల విషయంలో కూడా గూగుల్‌, యాహూ, తర్వాతనే మైక్రోసాఫ్ట్‌ స్థానం. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 9 బీటా వెర్షన్‌ అందుబాటులో వుంది. అత్యంత అధునాతన ఫీచర్లతో తయారైన ఐఇ9 వెర్షన్‌ విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో పనిచేయకపోవడం విశేషం. ఈ బ్రౌజర్‌ విండోస్‌ విస్టా, విండోస్‌7లలో మాత్రమే పనిచేస్తుంది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


4.ఒపెరా: ఒపెరా సంస్థ అందిస్తున్న ఈ బ్రౌజర్‌ చాలా వేగంగా పనిచేస్తుంది. మన దేశంలో చాలా తక్కువ శాతం మంది ఈ బ్రౌజర్‌ను ఉపయోగిస్తారు. అయితే వెబ్‌పేజీలను డౌన్‌లోడ్‌ చేయడంలోను బ్రౌజింగ్‌కు కావాల్సిన హంగులను అందించడంలోను ఈ బ్రౌజర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రౌజర్‌ తెలుగు వెర్షన్‌ కూడా లభ్యమవుతోంది. దీన్ని షషష.శీజూవతీa.షశీఎ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
*********************************************************************************

5.సఫారీ: ఆపిల్‌ సంస్థ విడుదల చేసిన ఈ బ్రౌజర్‌ కూడా ప్రాచుర్యాన్ని పొందింది. అయితే ఈబ్రౌజర్‌ కూడా వెబ్‌ పేజీలను డౌన్‌లోడ్‌ చేయడంలో చాలా స్లోగా పనిచేస్తుంది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఫైర్‌ఫాక్స్‌ మాదిరిగానే అనేక ఫీచర్లు దీనిలో వున్నాయి. దీన్ని www.apple.com/safari నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

6.మ్యాక్స్‌థాన్‌ : ఈ బ్రౌజర్‌ ఇటీవలి కాలంలో వాడుకలోకి వచ్చింది. సులువుగా, వేగంగా పనిచేసే ఈ బ్రౌజర్‌పట్ల అనేకమంది నెటిజన్లు మక్కువ చూపుతున్నారు. ఇది చైనాలో తయారైన బ్రౌజర్‌. ఈ బ్రౌజర్‌ అన్ని విషయాలలోనూ తేడాలతో ఉంటుంది. గూగుల్‌ వారి క్రోం లో కంటే ఈ బ్రౌజర్‌ లోని ఇంటెర్‌ ఫేస్‌ లో కూడా ఇంటెర్‌ ఫేస్‌ ని మార్చుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. కీ బోర్డ్‌ మూలంగా ఈ బ్రౌజర్ని వాడుకునే అవకాశంతో పాటు మరెన్నో సదుపాయాలున్నాయి. దీన్ని http://maxthon.com/ వెబ్‌సైట్‌ నుండి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


7.ఫ్లాక్‌ : ఈ బ్రౌజర్‌ కూడా క్రోమ్‌, మాక్స్‌థాన్‌ బ్రౌజర్ల మాదిరిగానే తక్కువ ఫీచర్లని కలిగివుంది. ఉచితంగా లభించే ఈ బ్రౌజర్లు మున్ముందు మరిన్ని ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయి. వెర్షన్‌ 3.5.0 ప్రస్తుతం అందుబాటులో వుంది. ఇది ఒక సోషల్‌ వెబ్‌ బ్రౌజర్‌. ఒక పక్క బ్రౌజ్‌ చేస్తూనే మరోవైపు నేస్తాలతో చాట్‌ చేసే సౌకర్యం వుంది. అలాగే సోషల్‌ నెట్వర్క్‌లను కూడా చూసుకోవచ్చు. ఫోటో అప్‌లోడ్‌, ఎడిట్‌, వాటిని మన కంప్యూటర్లో నుండి పికాసా, ఫొటో బకెట్‌, టైనీపిక్‌లకు సౌలభ్యం కూడా వుంది. బ్లాగ్‌ పోస్టులను ఈ బ్రౌజర్‌లోని బ్లాగ్‌ ఎడిటర్‌ నుంచి పోస్టు చేయవచుÛ్చ. ఇంకా అనేక సౌకర్యాలున్న ఈ బ్రౌజర్‌ చాల సులువుగా వాడుకోవచ్చు. దీన్ని http://flock.com/ నుండి డోన్లోడ్‌ చేసుకోవచ్చు.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

8.అవాంట్‌ బ్రౌజర్‌ : ఈ బ్రౌజర్‌ని కూడా అనేకమంది నెటిజన్లు ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్‌ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి పలు బ్రౌజర్లని టెస్ట్‌ చేసి ఉత్తమమైన వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లేదా ప్రత్యేకంగా వాటిని సేకరించి పెట్టుకోవాలి. ఉపయోగించే బ్రౌజర్‌ కొంత సమయం సతాయిస్తుంటే ఈ కొత్త బ్రౌజర్లని ఇన్‌స్టాల్‌ చేసుకునే వీలుంది. దీన్ని షషష.aఙaఅ్‌bతీశీషరవతీ.షశీఎ వెబ్‌సైట్‌ నుండి డౌన్లోడ్‌ చేసుకోవాలి.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
9.డీప్ నెట్  ఎక్స్‌ప్లోరర్ : దీనిని  కూడా అనేకమంది నెటిజన్లు ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్‌ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి పలు బ్రౌజర్లని టెస్ట్‌ చేసి ఉత్తమమైన వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))


10. ఫేజౌట్ బ్రౌజర్‌ :ఈ బ్రౌజర్‌ కూడా తక్కువ ఫీచర్లని కలిగివుంది. ఉచితంగా లభించే ఈ బ్రౌజర్లు మున్ముందు మరిన్ని ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయి.

నోట్: బ్రౌజర్లు అనేకం అందుబాటులో వున్నప్పటికీ వాడుకలో వున్నవి మాత్రం ఫైర్‌ఫాక్స్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, సఫారీ, క్రోమ్‌, ఒపెరా వంటివి బాగా వాడుకలో వున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి